
పి. సాయిబాని మృతదేహం
కొరాపుట్ : వంట గ్యాస్ మంటల్లో ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. స్థానిక పండా కాలనీలో గల పి.జగన్నాథ్ ఘడయ్ ఇంట్లో శుక్రవారం సాయంత్రం గ్యాస్ స్టౌ నుంచి వెలువడుతున్న మంటలను అదుపుచేయడం కోసం వచ్చిన మెకానిక్ డి. మణిపాత్రో చెక్ చేస్తుండగా మంటలు గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించి భారీగా అగ్ని ప్రమాదం వాటిల్లింది. ఆ మంటలకు ఇంట్లో ఉన్న జగన్నాథ్ తల్లి పి.సాయిబాని 90 శాతం మేర ఆహుతై ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు జగన్నాథ్ ఘడయ్ శరీర భాగాలు కూడా చాలా చోట్ల కాలిపోయాయి. ప్రస్తుతం ఆయన కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెకానిక్ మణిపాత్రో కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు.