gas cilinder
-
బీపీఎల్ కుటుంబాలకే ‘మహాలక్ష్మి’ వర్తింపు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా ‘రూ.500కు వంటగ్యాస్’ ఆశ నిరాశగా తయారైంది. ప్రభుత్వం ఈ నెల 28 నుంచి నిర్వహించతలపెట్టిన ప్రజాపాలనలో గ్యారంటీ పథకాల కింద దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సబ్సిడీ వంట గ్యాస్‌పై ఆశలు చిగురిస్తున్నా.. రేషన్‌కార్డుతో మెలిక ఆందోళన కలిగిస్తోంది. ఆరు గ్యారంటీ పథకాల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువనున్న (రేషన్ కార్డు) కలిగిన నిరపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం గ్యారంటీ పథకాల దరఖాస్తులకు తెల్ల రేషన్ కార్డులతో ముడి పెట్టింది. మహానగర పరిధిలోని గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్‌దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరు పడగా, మరోవైపు కొత్త రేషన్ కార్డు మంజూరు మొక్కుబడిగా పరిమితం కావడం రేషన్ కార్డులు లేని కుటుంబాలు సంఖ్య బాగా పెరిగింది. అది కాస్తా సబ్సిడీ వంట గ్యాస్‌కు సమస్యగా తయారు కానుంది. ఆ కుటుంబాల మాటేమిటో..? గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు 30 లక్షల పైనే వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు చమురు సంస్థల అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం వలస వచ్చిన కుటుంబాలతో మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు 17.21 లక్షలు ఉన్నాయి. మిగిలిన కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. ఇందులో దారిద్య్ర రేఖకు దిగవనున్న (బీపీఎల్) కుటుంబాలు మరో పది లక్షల వరకు ఉండవచ్చని అంచనా. మిగిలినవి దారిద్య్ర రేఖకు ఎగువనున్న (ఏపీఎల్) కుటుంబాల కనెక్షన్లు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం రేషన్ కార్డులు లేని కుటుంబాలు సబ్సిడీ వంట గ్యాస్‌కు అర్హత పొందే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.955 ప్రస్తుతం చమురు సంస్థల అధీకృత డీలర్ల ద్వారా సరఫరా అవుతున్న 14.5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.955 పలుకుతోంది. గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సిలిండర్ ధర ఎంత పలికినా.. రాయితీ మాత్రం రూ. 40.71కు పరిమితం చేసి నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో జమ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ పథకమైన మహాలక్ష్మి కింద అర్హత పొందితే కేవలం రూ.500కే సిలిండర్ వర్తించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఈ– కేవైసీ మరోవైపు వంటగ్యాస్ కనెక్షన్లకు ఈ–కేవైసీ అనుసంధానం ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. పదిహేను రోజులుగా వంట గ్యాస్ వినియోగదారులు ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. ఈ–కేవైసీ పూర్తి చేసుకోకపోతే సబ్సిడీ సిలిండర్ రాదన్న వదంతులతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో గ్యాస్ ఏజెన్సీల ముందు భారీగా క్యూ కడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు మాత్రం కేవలం ఈ–కేవైసీ పూర్తి కాని వారికి మాత్రమే చేస్తున్నామని పేర్కొంటున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు.. కూలిన ఇల్లు
ఆదిలాబాద్ : గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మీసాల కిషన్ సోమవారం సాయంత్రం ఇంటి వద్ద వంట గ్యాస్ మరమ్మతు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ లీకై ంది. దీని తీవ్రతకు ఇల్లు కూలిపోయింది. కిషన్‌కు తీవ్రంగా, అతనితో ఉన్న ప్రసాద్‌కు స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని గ్రామస్తులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. సిలిండర్ పేలి మంటలు సంభవిస్తే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. -
Dhoolpet : సిలిండర్ రీఫిల్లింగ్ సెంటర్లో ప్రమాదం... ఇద్దరు మృతి
-
గ్యాస్ ‘ఫిల్లింగ్’.. కిల్లింగ్
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లతో తెరచాటున ‘రీ ఫిల్లింగ్’ దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. ‘లైట్ హౌస్’ల పేరుతో గోప్యంగా అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం జనవాసాల మధ్యే సాగడంతో జిల్లాలో ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు జరిగాయి. వాటిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినా అధికారులు షరా ‘మామూలు’గానే తీసుకుంటున్నారని మంగళవారం నందిపేటలో జరిగిన సంఘటన నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కమర్షియల్ సిలిండర్లను కొనుగోలు చేసి దాంట్లో నుంచి చిన్న సిలిండర్లలో గ్యాస్‌ని నింపి విక్రయించేందుకు నిర్వాహకులు లైట్‌హౌస్‌ల పేరిట వ్యాపారం చేయాలి. ఈ వ్యాపారం కూడా జనవాసాల మధ్య చేయకూడదని అగ్నిమాపక శాఖ నిబంధనలున్నాయి. అయినా వాటిని తుంగలో తొక్కుతున్నారు. దర్జాగా జనావాసాల మధ్య, వ్యాపార సముదాయాల మధ్య బహిరంగ వ్యాపారం చేస్తున్నారు. అనుమతుల విషయంలో కూడా తమకెవరికీ సంబంధం లేదని పౌర సరఫరాలశాఖ అధికారులు అంటున్నారు. జీపీలు, మున్సిపాల్టీల వారే అనుమతులు ఇస్తారని చెప్తున్నారు. ఇంతకూ లైట్హౌస్లు ఎవరి పరిధిలోకి వస్తాయో అనేది కూడా స్పష్టత లేదు. అయితే తమకు సంబంధం లేదంటున్న సివిల్ సప్లయి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రం తరచుగా లైట్‌హౌస్‌లను తనిఖీలు చేస్తుండడం, గృహావసర సిలిండర్లతో అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తుండగా చాలా సిలిండర్లను పట్టుకుని కేసులు సైతం నమోదు చేయడం మాత్రం గమనించాల్సిన విషయమే. సమాచారం వస్తే తప్ప.. తరచుగా లైట్‌హౌస్‌లను తనిఖీ చేసిన సందర్భాలు ఒక్కటీ లేవు. దీంతో అధికారుల పనితీరు ఏంటో అద్దం పడుతోంది. ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపు లేదు.. జిల్లాలో గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్లు పేలి చాలా ప్రమాదాలు జరిగాయి. కేవలం చిన్న సిలిండర్లకు మరమ్మతులు చేస్తున్నామని చెప్పి సాహసం చేసి దర్జాగా దుకాణాల్లోనే గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్నారు. మంటలు చెలరేగితే వెంటనే ఆర్పేందుకు కావాల్సిన స్ప్రేలు, సౌకర్యాలు అందుబాటులో కూడా ఉండవు. దీంతో సిలిండర్లు లీకై లేదా పేలి పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. లైట్‌హౌస్ దుకాణమే కాకుండా పక్కనున్న ఇతర వ్యాపారా సముదాయాలకు మంటలు వ్యాపించి భారీ ఆస్తి నష్టం వాటిల్లుతోంది. నందిపేట మండలంలో మంగళవారం జరిగిన సలిండర్ పేలుళ్లలో కూడా ఇలాంటిదే జరిగింది. నాలుగు దుకాణాలు పూర్తిగా కాలిపోయి దాదాపు రూ.50లక్షల వరకు ఆస్తినష్టం వాటిళ్లింది. లైట్ హౌస్ జనాసాలు, వ్యాపార సముదాయాల మధ్య ఉండడంతో తీవ్ర నష్టం జరిగింది. ఆర్నెళ్ల క్రితమే డిచ్పల్లిలోని ఓ లైట్‌హౌస్‌లో గ్యాస్ రీ ఫిల్లింగ్ చే స్తుండగా సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో గ్యా స్ నింపుతున్న వ్యక్తితోపాటు మరో వ్యక్తి తీవ్ర గా యాలై చికిత్స పొందుతూ మర ణించారు. ఆర్నెళ్ల వ్యవధిలోనే రెండు పెద్ద సంఘటనలు జరిగినా అధికారుల్లో మాత్రం చల నం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. సంఘటనలు జరిగితే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం వరకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు మా పరిధిలో లేదు లైట్‌హౌస్‌ల అనుమతులు సివిల్ సప్లయి శాఖ పరిధిలోకి రావు. గ్రామ పంచాయతీలు, ము న్సిపాల్టీల పరిధిలోకి వస్తాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుం డా, వాటిని రీ ఫిల్లింగ్ చేయకుండా చర్యలు తీ సు కునేందుకు లైట్‌హౌస్‌లపై తనిఖీలు చేస్తాం. –కృష్ణప్రసాద్, డీఎస్ఓ -
అక్కాచెల్లెళ్ల సజీవదహనం
ఆ దీనుల ఆర్తి ఏ దూరతీరాలకూ చేరలేదు. వారి ఆవేదన ఏ భగవంతుని దరికీ చేరలేదు. వారి పేదరికం ఏ అధికారీ, ప్రజాప్రతినిధి మనస్సులనూ కరిగించలేదు. ఆ కుటుంబం నిర్భాగ్యమే మగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు మాడి మసైపోయేలా చేసింది. తండ్రి పోయాక తమకు ఇంక దిక్కెవరని మధనపడుతున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు గ్యాస్ లీకై జరిగిన ప్రమాదంలో బుధవారం సజీవ దహనమయ్యారు. అయితే అది ప్రమాదం కాదని వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. మల్కన్‌గిరి : జిల్లా కేంద్రంలోని జగన్నాథ మందిరం వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు అక్కాచెల్లెళ్లు బుధవారం ఉదయం సజీవదహనమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన కె.గణపతి రావు, లక్ష్మి దంపతులు. వారికి ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు సంతానం. అమ్మాయిల్లో మంగ(40), మేనక(36), రేణుక(25)లు ఇంట్లో కష్టపడి చేగోడీలు, చుప్పులు తదితర వస్తువులు తయారు చేసి ఇస్తే తండ్రి, అన్నదమ్ములు మార్కెట్లో విక్రయిస్తూ కుటుంబాన్ని గుట్టుగా వెళ్లదీస్తున్నారు. ఈ కుటుంబంలో 8 సంవత్సరాల క్రితం తల్లి లక్ష్మి మృతిచెందగా తాజాగా తండ్రి గణపతిరావు ఈ నెల 7వ తేదీన మృతిచెందాడు. తండ్రి దశదిన కర్మలు పూర్తి చేసిన తరువాత అస్థికలు కలిపేందుకు అన్నదమ్ములు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి బుధవారం వెళ్లారు. ఆ సమయంలో అక్కాచెల్లెళ్లు ఇంట్లో ఉన్నారు. ఇంతలో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దం విన్న చుట్టుపక్కల వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారంఅందజేయగా సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కాచెల్లెళ్లు ముగ్గురూ మాడి మసైపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాలను మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేదరికమే శాపమైంది: ఎస్పీ జోగ్గామోహన్ మిన్నా మల్కన్‌గిరిలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన సంఘటన ప్రమాదం కాదని, వారివి ఆత్మహత్యలని ఎస్పీ జోగ్గామోహన్ మిన్నా అన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. తండ్రి మరణించి 12 రోజులు పూర్తి కావడంతో అస్థికలు కలిపేందుకు ఇద్దరు అన్నదమ్ములు రాజమండ్రి వెళ్లారు. ఇప్పటికే కష్టంగా ఉన్న తమ బతుకులు తండ్రి లేకపోవడంతో మరింత దుర్భరమవుతాయని భావించిన అక్కాచెల్లెళ్లు చిన్న తమ్ముడ్ని మార్కెట్‌కు పంపి, ఇంటి తలుపులు వేసి వంటిపై కిరోసిన్ పోసుకుని గ్యాస్ లీక్ చేసి వెలిగించి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. వారి ఆర్తనాదాలు కూడా చుట్టుపక్కల వారికి వినిపించలేదని ఎస్పీ వివరించారు. పేదరికమే వారి పాలిట శాపమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
వృద్ధురాలి సజీవ దహనం
కొరాపుట్ : వంట గ్యాస్ మంటల్లో ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. స్థానిక పండా కాలనీలో గల పి.జగన్నాథ్ ఘడయ్ ఇంట్లో శుక్రవారం సాయంత్రం గ్యాస్ స్టౌ నుంచి వెలువడుతున్న మంటలను అదుపుచేయడం కోసం వచ్చిన మెకానిక్ డి. మణిపాత్రో చెక్ చేస్తుండగా మంటలు గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించి భారీగా అగ్ని ప్రమాదం వాటిల్లింది. ఆ మంటలకు ఇంట్లో ఉన్న జగన్నాథ్ తల్లి పి.సాయిబాని 90 శాతం మేర ఆహుతై ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు జగన్నాథ్ ఘడయ్ శరీర భాగాలు కూడా చాలా చోట్ల కాలిపోయాయి. ప్రస్తుతం ఆయన కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెకానిక్ మణిపాత్రో కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. -
గ్యాస్ సిలిండర్ పేలి పెంకుటిల్లు దగ్ధం
ములుగు : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి పెంకుటిల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని మహ్మద్‌గౌస్‌పల్లిలో శుక్రవారం రాత్రి చో టుచేసుకుంది. దండబోయిన కుమారస్వామి మహ్మద్‌గౌస్‌పల్లిలో క్రషర్లో ఆపరేటర్‌గా పనిచేస్తూ గ్రామంలోఓ కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భార్య, కూతురు ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో గ్యాస్‌లీకేజీ వాసన వచ్చి ఒక్క సారిగా మంటలు వచ్చాయి. ఇది గమనించి వారు బయటికి పరుగుతీశారు. క్షణాల సమయంలోనే ఇంట్లో మంటలు వ్యాపించి కూలిపోయింది. రూ.1.25 లక్షలతో పాటు ఇంట్లో ఉన్న కుట్టు మిషన్, ఫర్నిచర్, బియ్యం, ఇతర సామాగ్రి దగ ్ధమైంది. విషయం తెలుసుకున్న సర్పంచ్ పాలెపు సరళశ్రీనివాస్ రూ.3వేల విలువ గల బియ్యం, ఇతర సామాగ్రిని ఎస్సై మల్లేశ్‌యాదవ్ చేతుల మీదు గా ఆర్ధిక సహాయంగా అందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన కుమారస్వామిని దాతలు ఆదుకోవాలని సర్పంచ్ కోరారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క కుమారస్వామి కుటుంబానికి రూ.2వేల ఆర్థిక సాయం అందించారు. ఆమె వెంట మండల అ««దl్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, నాయకులు ఎర్రబెల్లి సదానందం, తిప్పారపు కిషన్, వడ్లకొండ శ్రీను, వంగ రవియాదవ్, కోట శివయ్య, దేవేందర్, బొమ్మకంటి రమేశ్ ఉన్నారు.