గ్యాస్‌ ‘ఫిల్లింగ్‌’.. కిల్లింగ్‌ | Illegal Gas Filling Lighthouses Increasing In Telangana | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ‘ఫిల్లింగ్‌’.. కిల్లింగ్‌

Published Sat, Sep 8 2018 2:17 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Illegal Gas Filling Lighthouses Increasing In Telangana - Sakshi

నిజామాబాద్‌ నగరంలోని వీక్లి మార్కెట్‌లో జనావాసాల మధ్యనున్న లైట్‌హౌస్, నందిపేటలో సిలిండర్‌ పేలుడుతో కాలుతున్న దుకాణాలు(ఫైల్‌)

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌లతో తెరచాటున ‘రీ ఫిల్లింగ్‌’ దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. ‘లైట్‌ హౌస్‌’ల పేరుతో గోప్యంగా అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం జనవాసాల మధ్యే సాగడంతో జిల్లాలో ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు జరిగాయి. వాటిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినా అధికారులు షరా ‘మామూలు’గానే తీసుకుంటున్నారని మంగళవారం నందిపేటలో జరిగిన సంఘటన నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కమర్షియల్‌ సిలిండర్‌లను కొనుగోలు చేసి దాంట్లో నుంచి చిన్న సిలిండర్‌లలో గ్యాస్‌ని నింపి విక్రయించేందుకు నిర్వాహకులు లైట్‌హౌస్‌ల పేరిట వ్యాపారం చేయాలి. ఈ వ్యాపారం కూడా జనవాసాల మధ్య చేయకూడదని అగ్నిమాపక శాఖ నిబంధనలున్నాయి.

అయినా వాటిని తుంగలో తొక్కుతున్నారు. దర్జాగా జనావాసాల మధ్య, వ్యాపార సముదాయాల మధ్య బహిరంగ వ్యాపారం చేస్తున్నారు. అనుమతుల విషయంలో కూడా తమకెవరికీ సంబంధం లేదని పౌర సరఫరాలశాఖ అధికారులు అంటున్నారు. జీపీలు, మున్సిపాల్టీల వారే అనుమతులు ఇస్తారని చెప్తున్నారు. ఇంతకూ లైట్‌హౌస్‌లు ఎవరి పరిధిలోకి వస్తాయో అనేది కూడా స్పష్టత లేదు. అయితే తమకు సంబంధం లేదంటున్న సివిల్‌ సప్లయి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మాత్రం తరచుగా లైట్‌హౌస్‌లను తనిఖీలు చేస్తుండడం, గృహావసర సిలిండర్‌లతో అక్రమంగా రీఫిల్లింగ్‌ చేస్తుండగా చాలా సిలిండర్‌లను పట్టుకుని కేసులు సైతం నమోదు చేయడం మాత్రం గమనించాల్సిన విషయమే. సమాచారం వస్తే తప్ప.. తరచుగా లైట్‌హౌస్‌లను తనిఖీ చేసిన సందర్భాలు ఒక్కటీ లేవు. దీంతో అధికారుల పనితీరు ఏంటో అద్దం పడుతోంది.  
ప్రమాదాలు జరుగుతున్నా

పట్టింపు లేదు..
జిల్లాలో గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ చేస్తుండగా సిలిండర్‌లు పేలి చాలా ప్రమాదాలు జరిగాయి. కేవలం చిన్న సిలిండర్‌లకు మరమ్మతులు చేస్తున్నామని చెప్పి సాహసం చేసి దర్జాగా దుకాణాల్లోనే గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ చేస్తున్నారు. మంటలు చెలరేగితే వెంటనే ఆర్పేందుకు కావాల్సిన స్ప్రేలు, సౌకర్యాలు అందుబాటులో కూడా ఉండవు. దీంతో సిలిండర్‌లు లీకై లేదా పేలి పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. లైట్‌హౌస్‌ దుకాణమే కాకుండా పక్కనున్న ఇతర వ్యాపారా సముదాయాలకు మంటలు వ్యాపించి భారీ ఆస్తి నష్టం వాటిల్లుతోంది. నందిపేట మండలంలో మంగళవారం జరిగిన సలిండర్‌ పేలుళ్లలో కూడా ఇలాంటిదే జరిగింది.

నాలుగు దుకాణాలు పూర్తిగా కాలిపోయి దాదాపు రూ.50లక్షల వరకు ఆస్తినష్టం వాటిళ్లింది. లైట్‌ హౌస్‌ జనాసాలు, వ్యాపార సముదాయాల మధ్య ఉండడంతో తీవ్ర నష్టం జరిగింది. ఆర్నెళ్ల క్రితమే డిచ్‌పల్లిలోని ఓ లైట్‌హౌస్‌లో గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ చే స్తుండగా సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో గ్యా స్‌ నింపుతున్న వ్యక్తితోపాటు మరో వ్యక్తి తీవ్ర గా యాలై చికిత్స పొందుతూ మర ణించారు. ఆర్నెళ్ల వ్యవధిలోనే రెండు పెద్ద సంఘటనలు జరిగినా అధికారుల్లో మాత్రం చల నం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. సంఘటనలు జరిగితే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం వరకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.                       

అనుమతులు మా పరిధిలో లేదు
లైట్‌హౌస్‌ల అనుమతులు సివిల్‌ సప్లయి శాఖ పరిధిలోకి రావు. గ్రామ పంచాయతీలు, ము న్సిపాల్టీల పరిధిలోకి వస్తాయి. అయితే డొమెస్టిక్‌ సిలిండర్‌లు దుర్వినియోగం కాకుం డా, వాటిని రీ ఫిల్లింగ్‌ చేయకుండా చర్యలు తీ సు కునేందుకు లైట్‌హౌస్‌లపై తనిఖీలు చేస్తాం.  
–కృష్ణప్రసాద్, డీఎస్‌ఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement