వేరు‘శని’గ.. | ground nut | Sakshi
Sakshi News home page

వేరు‘శని’గ..

Published Wed, Sep 7 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

వేరు‘శని’గ..

వేరు‘శని’గ..

దేవనకొండ మండలంలోని లక్కందిన్నె గ్రామానికి చెందిన రైతు మల్లేష్‌ ఈ ఏడాది తనకున్న ఐదెకరాల్లో వేరుశనగ సాగు చేపట్టాడు. వర్షాభావంతో పంట ఎండిపోగా మంగళవారం సాగు చేసిన చేతులతోనే దున్నేశాడు.
 
ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ముందస్తు వర్షాలకు 22,236 హెక్టార్లలో వేరుశనగ పంట సాగయింది. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో రైతుల కంట్లో కన్నీటి సుడి తిరిగింది. ఈ రోజు.. రేపు.. అని ఎదురుచూడటంతోనే పంటంతా ఎండిపోయింది. ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వం రెయిన్‌గన్ల పేరిట హడావుడి చేయడం తప్పిస్తే.. ఒక్క ఎకరానూ తడపలేకపోయింది. చేసేది లేక దాదాపు 836 హెక్టార్లలో పంటను దున్నేశారు. కనీసం పశువులకు మేతగానైనా ఉపయోగపడుతుందనే ఆశతో ఆశలను వదిలేసుకుంటున్నారు.
– దేవనకొండ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement