
పల్లి... గుండె పాలిటి తల్లి!
ఆహారం విషయంలో చాలామందికి ఒక నమ్మకం ఉంది. ఏ అవయవాన్ని పోలిన ఆహారపదార్థం తింటే... అది ఆ అవయవానికి ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. ఉదాహరణకు క్యారట్‌ను అడ్డంగా కోస్తే కనబడే ఆకృతి అచ్చం కంటి నల్లగుడ్డులోని కనుపాపను చూస్తున్నట్టే ఉంటుంది. అలాగే టమాటాను అడ్డంగా కోస్తే అవి గుండె గదుల్లాగే అనిపిస్తాయి. అందుకే క్యారట్ కంటికి మంచిది. టమాటా గుండెకు మేలు.
టమాటాకు తోడుగా ఇప్పుడు పల్లీ కూడా గుండె పాలిట తల్లి కాగలదని పేర్కొంటోంది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రచురించే ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్. పన్నెండేళ్లపాటు సాగిన ఈ అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ పల్లీలు(వేరుశనగలు) తినేవారికి గుండెజబ్బులు వచ్చే రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. ఈ పరిశోధనలో అమెరికన్లు, చైనీయులు పాల్గొన్నారు.గుండెజబ్బుల నివారణ కోసం ఇది అత్యంత చవకైన, తేలికైన, రుచికరమైన, ఉత్తమమైన మార్గమని ఈ అధ్యయనం తేల్చింది. పరిశీలనగా చూస్తే... రెండు గింజల పల్లీ ఆకృతి దాదాపుగా గుండె పైగదీ, కింది గదులను పోలి ఉంటుంది. శాస్త్రీయంగా రుజువు కాకపోయినా, ఆహార పదార్థంతో శరీర అవయవం ఆకృతికీ కొంత మేర సంబంధం ఉన్నట్లే కనబడుతోంది!
దేశం పరిశోధనలో పాల్గొన్న గుండె జబ్బుల రిస్క్
వారి సంఖ్య తగ్గిన శాతం
అమెరికన్లు 71,764 21%
చైనీయులు 1,34,265 17%