
సంతాన సాఫల్య చికిత్సల ద్వారా జన్మించే శిశువుల్లో గుండె లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. స్వీడిష్ కార్డియాలజిస్ట్ డాక్టర్ యు.బి.వెనర్‌హోమ్ ఈ అంశాన్ని తన అధ్యయనం ద్వారా వెల్లడించారు.
ఐవీఎఫ్ సహా వివిధ రకాల కృత్రిమ పద్ధతుల ద్వారా జన్మించిన శిశువుల్లో సహజంగా జన్మించిన శిశువుల్లో కంటే జన్యు సమస్యల వల్ల గుండె లోపాలు తలెత్తే అవకాశాలు 36 శాతం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్ వెనర్‌హోమ్ గుర్తించారు. ఆయన నేతృత్వంలోని వైద్యుల బృందం డెన్మార్క్, ఫిన్లండ్, స్విట్జర్లండ్, నార్వే దేశాల్లో కృత్రిమ పద్ధతుల ద్వారా 1990–2015 మధ్య కాలంలో జన్మించిన సుమారు 1.71 లక్షల శిశువుల ఆరోగ్య వివరాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసింది.
సహజంగా జన్మించిన శిశువుల కంటే, కృత్రిమ పద్ధతుల ద్వారా పుట్టిన శిశువుల్లోనే తర్వాతి కాలంలో గుండె లోపాలు ఎక్కువగా బయటపడినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన సారాంశాన్ని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ ఇటీవల ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment