డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పదే పదే నొక్కి చెప్పేవారు. కానీ మోతాదుకి మించొద్దు అని సూచించేవారు. అయితే ఇది నిజంగా ఆరోగ్యానికి మంచిదా..? అనే విషయంపై పరిశోధనలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా హార్వర్డ్‌కి చెందిన యూఎస్, చైనీస్ శాస్త్రవేత్తలు అది నిజమేనని నిర్థారించారు.
మిల్క్ చాక్లెట్లు తిన్న వారికంటే డార్క్ చాక్లెట్లు తిన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువని తేల్చి చెప్పారు. అలాగే ఈ చాక్లెట్లు తినడం వల్ల బరువుపై ప్రభావం చూపదని కూడా నిర్థారించారు. అందుకోసం మహిళా నర్సులపై పరిశోధన చేశారు.
దాదాపు 1986-2018 వరకు వారి హెల్త్ డాటాను ట్రాక్ చేశారు. అలాగే పురుష ఆరోగ్య నిపుణలపై కూడా 1986 నుంచి 2020 వరకు హెల్త్ డేటాను పరిశీలించారు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలున్న వారిని మినహా మిగతా అందరి జీవనశైలి వారి తీసుకునే డార్క్ చాక్లెట్ మోతాదుని పరిశీలించారు. వీరిలో మిల్క్ చాక్లెట్ తిన్న వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు, రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నాయన్నారు.
అయితే కేవలం డార్క్ చాక్లెట్‌ని తిన్న వారిలో కోకో ఉత్పత్తులు జీవక్రియను మెరుగుపరిచిందన్నారు. ఇది రక్తపోటులో గణనీయమైన తగ్గుదల తోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచిందని వెల్లడించారు. అంతేగాదు అధిక బరువు, ఊబకాయం ఉన్న వ్యక్తులలో కూడా ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరిచిందన్నారు.
డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనోల్స్, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ మెరుగైన గుండె ఆరోగ్యానికి దోహదపడేలా టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని 21% మేర తగ్గిస్తుందని నిర్ధారించారు పరిశోధకులు. ఒత్తిడిని కూడా నివారిస్తుందని చెప్పారు. అయితే ఈ సత్ఫలితాలు ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేని వారు త్వరితగతిన పొందగలరని అన్నారు. మిగతా వారికి నెమ్మదిగా మార్పులు కనిపించడం మొదలవ్వుతుందని అన్నారు.
(చదవండి: కూర్చోవడం ధూమపానం లాంటిదా? కేన్సర్‌కి దారితీస్తుందా..?)
Comments
Please login to add a commentAdd a comment