Dark chocolate
-
డార్క్ చాక్లెట్ టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పదే పదే నొక్కి చెప్పేవారు. కానీ మోతాదుకి మించొద్దు అని సూచించేవారు. అయితే ఇది నిజంగా ఆరోగ్యానికి మంచిదా..? అనే విషయంపై పరిశోధనలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా హార్వర్డ్‌కి చెందిన యూఎస్, చైనీస్ శాస్త్రవేత్తలు అది నిజమేనని నిర్థారించారు. మిల్క్ చాక్లెట్లు తిన్న వారికంటే డార్క్ చాక్లెట్లు తిన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువని తేల్చి చెప్పారు. అలాగే ఈ చాక్లెట్లు తినడం వల్ల బరువుపై ప్రభావం చూపదని కూడా నిర్థారించారు. అందుకోసం మహిళా నర్సులపై పరిశోధన చేశారు.దాదాపు 1986-2018 వరకు వారి హెల్త్ డాటాను ట్రాక్ చేశారు. అలాగే పురుష ఆరోగ్య నిపుణలపై కూడా 1986 నుంచి 2020 వరకు హెల్త్ డేటాను పరిశీలించారు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలున్న వారిని మినహా మిగతా అందరి జీవనశైలి వారి తీసుకునే డార్క్ చాక్లెట్ మోతాదుని పరిశీలించారు. వీరిలో మిల్క్ చాక్లెట్ తిన్న వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు, రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నాయన్నారు. అయితే కేవలం డార్క్ చాక్లెట్‌ని తిన్న వారిలో కోకో ఉత్పత్తులు జీవక్రియను మెరుగుపరిచిందన్నారు. ఇది రక్తపోటులో గణనీయమైన తగ్గుదల తోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచిందని వెల్లడించారు. అంతేగాదు అధిక బరువు, ఊబకాయం ఉన్న వ్యక్తులలో కూడా ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరిచిందన్నారు. డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లేవనోల్స్, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ మెరుగైన గుండె ఆరోగ్యానికి దోహదపడేలా టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని 21% మేర తగ్గిస్తుందని నిర్ధారించారు పరిశోధకులు. ఒత్తిడిని కూడా నివారిస్తుందని చెప్పారు. అయితే ఈ సత్ఫలితాలు ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేని వారు త్వరితగతిన పొందగలరని అన్నారు. మిగతా వారికి నెమ్మదిగా మార్పులు కనిపించడం మొదలవ్వుతుందని అన్నారు.(చదవండి: కూర్చోవడం ధూమపానం లాంటిదా? కేన్సర్‌కి దారితీస్తుందా..?) -
డార్క్ చాక్లెట్స్‌తో గుడ్ మూడ్స్... గుడ్ హెల్త్!
డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయనేది ఇప్పటికే పలు పరిశోధనల్లో తెలింది. అదే విషయం దక్షిణ–కొరియన్ పరిశోధనల్లో మరోసారి వెల్లడైంది. చాక్లెట్స్లోని కొన్ని పోషకాలు గట్ బ్యాక్టీరియా / గట్ మైక్రోబియమ్ పెంచడం వల్ల మంచి వ్యాధి నిరోధకత పెరుగుతుందనీ, అలాగే... తక్కువ మోతాదులో చక్కెర ఉండే డార్క్ చాక్లెట్స్ తినేవారిలో వాటిలో ఉండే ఫైబర్, ఐరన్‌తో పాటు ఫైటోకెమికల్స్ వల్ల కొన్ని రకాల కేన్సర్లు, మతిమరపు (డిమెన్షియా), ఆర్థరైటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి అనేక ఆరోగ్య సమస్యల నివారణ జరుగుతుందంటూ దక్షిణకొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీలోని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగం నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు... డార్క్ చాక్లెట్లు మూడ్స్‌ను బాగుపరచి తినేవారు ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంచేందుకు సహయపడతాయని తేలింది. ఇక డార్క్చాక్లెట్స్ తినేవారి మల పరీక్షల్లో తేలిన విషయం ఏమిటంటే... వాళ్ల పేగుల్లో ‘బ్లావుషియా’ అనే ప్రోబయాటిక్ బాక్టీరియా కారణంగానే కడుపు ఆరోగ్యం బాగుండటంతో పాటు వాళ్ల మూడ్స్ మరింత మెరుగయ్యాయని తేలింది. ఈ ఫలితాలన్నీ ‘‘ద జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ’’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. (చదవండి: అలియా లాంటి ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం..!) -
30 కిలోల చాక్లెట్‌తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!
మనం ఎకో ఫ్రెండ్లీ పేరుతో అందరూ మట్టి గణపతినే పెట్టుకుని పూజించేలా ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాం. మరికొందరు అందులో భాగంగా ఉచితంగా మట్టి గణపతులను వితరణ చేసి పర్యావరణ స్ప్రుహను చాటుతున్నారు. కానీ మహారాష్ట్రకి చెందిన 32 ఏళ్ల బేకర్ వారందరికంటే ఇంకాస్త ముందుడుగు వేసి పర్యావరణం తోపాటు సమాజ హితంగా గణపతిని రూపొందించి శెభాష్ అని ప్రశంసలందుకుంటోంది. ఎవరామె అంటే..ఆమె పేరు రింటు రాథోడ్. ముంబైకి చెందిన రింటు ప్రతి ఏడాది ప్రత్యేకంగా రూపొందించిన గణపతి విగ్రహాలను తమ కమ్యూనిటీలోనూ ఇంటిలోనూ ప్రదర్శిస్తుంది. ఆమె 14 ఏళ్లుగా ఈవిధమైన ఆచారాన్ని పాటిస్తుండటం విశేషం. ఈసారి ఆమె చాక్లెట్లతో విలక్షణమైన వినాయకుడుని రూపొందించింది. స్త్రీ, పురుషుల ఐక్యతను చాటి చెప్పేలా అర్థనారీ రూపంలో గపతిని రూపొందించింది. సమాజంలో మహిళలపై పెరుగుతున్న నేరాల రేటు దృష్ట్యాజజ నేటి కాలంలో ఇలాంటి సందేశాత్మకమైన గణపతి విగ్రహాలు అవసరమని అంటోంది రింటూ. ఈ విలక్షణమైన గణపతి విశ్వంలో సామరస్యతకు, సమతుల్యతకు చిహ్నమని అంటోంది రింటు. అంతేగాదు ఈ ప్రకృతిలో స్త్రీ పురుషులిరువురు సమానం అనే విషయాన్ని ఈ గణపతి రూపం ఎలుగెత్తి చాటుతుంది. అయితే అర్థనారీశ్రుడు అనగానే శివపార్వతులే గుర్తుకొస్తారు. మరి గణపతిని ఇలా రూపొందిచాలని ఆలోచన రింటుకి ఎలా వచ్చిందంటే..గణపతికి సంబంధించి పలు వర్ణనలు, వివరణలు ఉన్నాయి. అయితే 11వ శతాబ్దానికి చెందిన హలాయుధ స్తోత్రం గణేశుడి అర్థనారీ రూపాన్ని ప్రస్తావిస్తుంది. అలాగే రాయ్‌గఢ్(మహారాష్ట్ర)లోని గోరేగావ్‌లో 800 ఏళ్ల పురాతన ఆలయంలో సగం పురుషుడు, సగం స్త్రీతో ఉన్న వినాయకుడి విగ్రహం ప్రతిష్టించారు. ఈ వినాయకుడుని చాలా మహిమాన్వితమైన దైవంగా ప్రజలు భావిస్తారు. అవన్నీ పరిగణలోని తీసుకుని తాను ఇలా వినూత్న రీతిలో గణపతిని రూపొందించినట్లు వివరణ ఇచ్చింది రింటు. ఇక రింటు వృత్తి రీత్యా కమర్షియల్ డిజైనర్ అయితే తన పిల్లలకు తల్లిగా పూర్తిగా సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో బేకరి వైపుకి అడుగులే వేసింది. ఆమె త్రీ డెమన్షియల్ ఎగ్‌లెస్ కేక్‌లు తయారు చేయడంలో స్పెషలిస్ట్. నిమజ్జనం మరీ స్పెషల్..ఇక రింటూ అర్థనారీ రూపు గణపతిని 30 కిలోల డార్క్ చాక్లెట్‌తో సుమారు 25 అంగుళాలు గణపతిని రూపొందించింది. ఈ విగ్రహానికి మొత్తం ఆహార రంగులతోనే పెయింట్ చేసింది. ఈ గణపతిని అనంత చతుర్దశి రోజున పాలలో గణపతిని నిజ్జనం చేస్తుంది. అలాగే ఆ గణనాథుడి ఆశీర్వాదాలు తనపై ఉండేలా నిమజ్జనం చేసిన చాక్లెట్ పాలను నిరుపేద పిల్లలకు పంచిపెడతుందట రింటు. గతేడాది ఆమె 40 కిలోల చాక్లెట్ మిల్లెట్ గణపతిని తయారు చేసి అందరిచేత శెభాష అనిపించుకుంది. అంతేగాదు సమాజానికి ఉపయోగపడేల నిరుపేదలకు, కేన్సర్‌తో పోరాడుతున్న పిల్లల కోసం వివిధ ఎన్జీవోల కలిసి పనిచేస్తోంది కూడా. View this post on Instagram A post shared by Rintu Kalyani Rathod (@rinturathod) (చదవండి: ఎకో ఫ్రెండ్లీ జర్నీ'! 27 దేశాలు చుట్టొచ్చిన ఇద్దరు మిత్రులు..!) -
అందానికి తెలుపు అవసరం లేదు
‘మనలో చాలా మందికి తెల్లగా ఉంటేనే అందం అని మైండ్‌లో ఫిక్సయి ఉంటుంది. కానీ నలుపు అందానికి నేనే అసలు సిసలు ఉదాహరణ’ అంటూ తన గురించి గొప్పగా చెప్పుకుంటుంది ఈ సౌందర్యరాశి. ప్రపంచం అంతటా తెలుపు– నలుపు వర్ణం గురించి రకరకాల అభిప్రాయాలున్నాయి. తెల్లగా ఉన్నవారికే అన్నింటా అవకాశాలు అనేవారూ ఉన్నారు. కాస్త రంగు తక్కువైనా ‘నేను అందంగా లేను’ అని బాధపడే అమ్మాయిల సంఖ్య తక్కువేమీ కాదు. ఫెయిర్‌గా కనిపించడానికి రకరకాల సౌందర్య చికిత్సలు తీసుకునేవారి శాతమే ఎక్కువ. కానీ, సుడానీస్ సంతతికిS చెందిన అమెరికన్ ఆఫ్రికన్ మోడల్ ‘న్యాకిమ్ గాట్వేచ్’కు నల్లగా ఉన్నందువల్లే అందగత్తెను అనిపించుకోవడం ఇష్టం. నల్లగా ఉండటం వల్లే అభిమానులు గాట్వెచ్ను మురిపెంగా ‘చీకటి రాణి’ అని పిలుస్తుంటారు. రోజు రోజుకు పెరుగుతున్న అభిమానుల సంఖ్యతో ఆమె తన డార్క్ స్కిన్ టోన్‌ను చూసుకొని మరింతగా గర్వపడుతుంటుంది. ‘నిన్ను ఎవరైనా నల్లగా ఉన్నావంటే ఏ మాత్రం సిగ్గు పడవద్దు’ అని మరీ కఠువుగా చెబుతుంది గాట్వెచ్. డార్క్ చాక్లెట్ జీవితంలో చీకట్లను తొలగించుకోవడానికి ప్రయత్నించండి. కాని చీకటితో పోటీ పడుతుందని నలుపురంగు మేనిని చూసుకొని భయపడకండని చెబుతున్న ఈ ఆఫ్రికన్ అమెరికన్ మోడల్‌ను కలుసుకుంటే నలుపు మీద ఏళ్లుగా మనలో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా మోడలింగ్ రంగంలో సాంప్రదాయక తెలుపు రంగు మేని ఉంటేనే రాణిస్తారు. కానీ, గాట్వెచ్ ఆ అడ్డంకులను అడ్డంగా కూలదోస్తోంది. మిన్నెసోటాలో నివసిస్తున్న ఈ పాతికేళ్ల అమెరికన్ ఆఫ్రికన్ ఫ్యాషన్ పరిశ్రమంలో వైవిధ్యం కోరుకునే స్త్రీ గానే కాదు న్యాయవాదిగా ప్రపంచవ్యాప్తంగా నల్లజాతీయుల హక్కుల కోసం నినదించే ఒక గొంతుక కూడా. బ్లీచ్ చేయించుకోమని సలహా..! నల్లగా ఉన్నవారి చర్మాన్ని తెలుపుగా మార్చుకోమని చెప్పేవారి సౌందర్య సలహాలకు కొదవే ఉండదు. అంటూ తనకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది గాట్వెచ్. ‘అందంగా కనిపించడానికి అందగత్తెనే కానవసరం లేదు. నలుపు అనేది ఓ ధైర్యం. నలుపు బంగారం. నలుపు అందం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను రకరకాల క్యాప్షన్లతో పోస్ట్ చేస్తుంది గాట్వెచ్. ‘అభిమానులు నా ఫొటోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చే యడం నాకు అమితమైన ఆనందాన్నిచ్చింది. రెండేళ్ల కిందట నేను నిరుద్యోగిని. నా స్నేహితుల్లో కొంతమందితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేసేదాన్ని. ఆ సమయంలోనే ఓ ఇంటర్వూ్యకి వెళ్లాల్సి వచ్చింది. క్యాబ్ బుక్ చేసుకున్నాను. నన్ను చూసిన ఆ క్యాబ్ డ్రైవర్ హావభావాలు నన్ను అమితమైన ఆశ్చర్యానికి లోను చేశాయి. నేను క్యాబ్ దిగేముందు ‘మీరు బ్లీచ్ చేయించుకుంటే పదివేల డాలర్లు ఇస్తాను’ అని చెప్పాడు. ఎందుకు నేను బ్లీచ్ చేయించుకోవాలి? అని ఎదురు ప్రశ్నించాను. ‘మీ రంగును చూసి నేనే భయపడ్డాను. ఉద్యోగానికి వెళుతున్నారు. ఇలా ఉంటే మిమ్మల్ని ఎవరూ జాబ్‌లోకి తీసుకోరు’ అన్నాడు. ‘నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఉద్యోగం ఇచ్చేవారు నా అర్హతను చూడాలి. రంగు కాదు. అందం కోసం మీరు చెప్పిన పనులు ఎప్పుడూ చేయను’ అంటూ దిగిపోయాను..’ అంటూ తెలిపింది గాట్వెచ్. గ్లామర్ ప్రపంచమైన ఫ్యాషన్, మోడల్ రంగాల్లో నలుపు ప్రత్యేకతను చాటుతున్న గాట్వెచ్ ఈ తరానికి అసలు సిసలైన ప్రతినిధి. -
అధిక బరువుతో బాధపడుతున్నారా..
అధిక బరువు.. అనేక మందిని పట్టి పీడిస్తున్న ఓ పెద్ద సమస్య. చాలమంది బరువు తగ్గడానికి నానా తాంటాలు పడుతుంటారు. వెయిట్ లాస్ సెంటర్లు, జిమ్‌లు, వ్యాయాయం, డైట్ వంటి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే బరువు తగ్గడానికి సరైన వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమై ఆహార నియమాలకు కూడా అవసరం. పెరిగిన బరువు నుంచి తిరిగి మామూలు స్థితికి రావడానికి శ్రద్ధ, ఓపిక, అంకితభావం అవసరం. ఎంతో మందికి ఇష్టమైన ఆహరం తినాలని ఉంటుంది. అలాగే బరువు కూడా తగ్గాలని ఉంటుంది. తగ్గడం అనేది చాలా కష్టంలో కూడుకున్న విషయం. అనేక మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గడం కోసం తమకు ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉంటారు. అయితే చాలా రకాల డైట్లను పాటిస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఓ ఆహార పదార్థం మీకు చాలా ఇష్టం.. అలాగే దానితో బరువు కూడా తగ్గవచ్చు. ఈ సారి మీ డైట్లో డార్క్ చాక్లెట్‌ను చేర్చండి. ఇది బరువు తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ వల్ల కలిగే లాభాలు. చాక్లెట్.. ఈ పేరు వినగానే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తింటారు, చాక్లెట్ రుచి చూడటానికి వయసుతో సంబంధం లేదు. అయితే వాటిని ఎక్కువగా తినడం వల్ల పళ్లు పుచ్చిపోతాయని చాలావరకు తల్లిదండ్రులు వద్దంటారు. కానీ అదే చాక్లెట్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా. కొంతమందికి ఇది తింటే ఆకలిని తగ్గిస్తుందని తెలుసు. కానీ చాక్లెట్‌తో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. మరి ఆ ప్రయోజనాలెంటో తెలుసుకోవాలనుకుంటున్నారా. చాక్లెట్లలో చాలా రకాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ను తింటే తప్పకుండా బరువు తగ్గవచ్చని అంటున్నారు వైద్యులు, డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఆరోగ్య లాభాలు మెండుగా ఉంటాయి. బరువు తగ్గడంతో పాటు.. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తోంది. అదే విధంగా జీవక్రియను మెరుగు పరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది :డార్క్ చాక్లెట్ ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. కేలరీలు త్వరగా కరిగించి శక్తిగా మార్చడానికి దోహదపడుతుంది. షుగర్ లెవల్స్ పెరగకుండా తగ్గిస్తుంది: బ్లడ్ షుగర్ స్పైక్ అంటే శరీరంలో కొవ్వును కరిగించే వ్యవస్థ వృధాగా ఉండటం వల్ల త్వరగా ఆకలితో బాధపడతారు. డార్క్ చాక్లెట్ ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది, ఇది రక్త ప్రవాహంలోకి షుగర్ రిలీజ్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెరగకుండా ఉండేందుకు సహాకరిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది : చాక్లెట్ తినడం వల్ల ఆకలిని తగ్గించవచ్చు. ఆకలి వేసినప్పుడు 20 నిమిషాల ముదు చాక్లెట్ తినడం వల్ల కొన్ని గంటలపాటు ఆకలిని నిరోధించవచ్చు. అంతేగాక మెదడులోని హర్మొన్లను ప్రేరేపిస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది : డార్క్ చాక్లెట్ నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. నెలసరి సమయంలో డార్క్ చాక్లెట్‌ను తీసుకోవడం వల్ల మంట, నొప్పిని తగ్గించవచ్చు. దీనిని డాక్టర్లు కూడా సిఫారసు చేస్తారు. వ్యాయామం స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా ముఖ్యమైనది. జంక్‌ఫుడ్ అలవాటును తగ్గిస్తుంది : పిజ్జా, బర్గర్, వేపుడు వంటి వాటిని తినాలన్న ఆసక్తినిన డార్క్ చాక్లెట్ తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్‌ను దాదాపు ప్రతిరోజూ తినవచ్చు. జంక్‌ఫుడ్‌ను తగ్గించి నోటికి తాళం వేస్తుంది. అనవసరపు ఆహారాన్ని తినాలన్న కోరికలను అరికడుతుంది : ఆహారంలో చేయవలసిన కష్టతరమైన విషయాలలో ఒకటి పిచ్చి తిండికి దూరంగా ఉండటం. ప్రతి ఒక్కరు నచ్చిన వన్నింటని తినాలని అనకుంటారు. ఇష్టమైన ఆహారాన్ని అధికంగా తీసుకొని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి అలాంటి కోరికలను డార్క్ చాక్లెట్ అరికట్టుతుంది. -
నిద్ర బాగా పట్టాలంటే..
ఎండలు మండిపోతున్నాయి.. రాత్రి పూట కూడా ఏమాత్రం చల్లగా ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిద్ర బాగా పట్టాలంటే ఏం చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివాళ్ల కోసం శాస్త్రవేత్తలు సరికొత్త పరిష్కారాలు చూపిస్తున్నారు. డార్క్ చాక్లెట్ తింటే.. బాగా నిద్రపడుతుందని సరికొత్త పరిశోధలలో వెల్లడైంది. ఇందులో మెగ్నీషియం బాగా ఉంటుందని, దానివల్ల బాడీక్లాక్ సరైన సమయానికి సరిగ్గా తిరుగుతుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల మీకు రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే పడుకునే ముందు డార్క్ చాక్లెట్ తినాలని సూచిస్తున్నారు. అయితే, మెగ్నీషియం కేవలం డార్క్ చాక్లెట్లోనే కాదు.. మంచి తాజా ఆకు కూరలు, పప్పులు, విత్తనాలు, చేపలు, బీన్స్, తృణధాన్యాలు, అవకాడోలు, పెరుగు, అరటిపళ్లు, ఎండుచేపలలో కూడా బాగుంటుందని అంటున్నారు. శరీరంలో మెగ్నీషియం తగినంతగా ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కొన్నిరకాల కేన్సర్లను అరికట్టొచ్చని, గుండెపోటు వచ్చే ముప్పును కూడా తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. శరీరంలోని కణాలు పగలు, రాత్రి సహజ వాతావరణానికి అలవాటు పడి, సమయానికి తగినట్లుగా స్పందించడానికి కూడా మెగ్నీషియం ఉపయోగపడుతుందని ఎడిన్బర్గ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలలో జరిగిన పరిశోధనలలో వెల్లడైంది. శరీరంలో మెగ్నీషియం స్థాయి పెంచుకోడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నా.. ఆహారం ద్వారా వస్తేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. -
త్వరలో షీనా బోరాపై సినిమా విడుదల!
ముంబై: షీనాబోరా హత్య ఆధారంగా నిర్మిస్తున్న బెంగాలీ చిత్రం 'డార్క్ చాక్లెట్' విడుదలపై బొంబాయి హైకోర్టు స్టేను తిరస్కరించింది. ఈ చిత్రానికి సంబంధించి కోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లపై కోర్టుకు నమ్మకం ఉందని.. ఈ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలలించిన మీదటే విడుదలకు సర్టిఫిట్ ను ఇస్తారని అంది. త్వరలో రానున్న చిత్ర విడుదలను సవాలు చేస్తూ షీనా పిన తండ్రి పీటర్ ముఖర్జీయా వేసిన పిటీషన్‌ను డివిజన్ బెంచ్ సిట్టింగ్ జడ్జీ ఎస్సీ ధర్మధికారీ గురువారం విచారించారు. ఈ సినిమా విడుదలయితే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని పీటర్ కోర్టుకు తెలిపారు. సినిమాను విడుదల చేయడానికంటే ముందే తనను వీక్షించేందుకు అనుమతించాలని, ఆమేరకు వారికి ఆదేశించాలని కోర్టును కోరారు. సినిమా ఇంకా పూర్తి కాలేదని నిర్మాణానంతరం సీబీఎఫ్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఏవైనా అనుమానాలు ఉంటే మరలా కోర్టుకు రావొచ్చని ధర్మాసనం తెలిపింది. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ప్రజావాణీలో ఈ కేసు గురించి వినిపించిన కథనే తాము తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. చిత్ర దర్శకుడు అగ్నిదేవ్ ఛటర్జీ, నిర్మాతలు మాట్లాడుతూ న్యాయస్థానాలపై వారికి పూర్తి నమ్మకం ఉందని అన్నారు. త్వరలో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసి సెన్సార్ బోర్డుకు పంపుతామని చెప్పారు. ఈ చిత్రంలో మహిమా చౌదరి, రియా సేన్లు ఇంద్రాణీ ముఖర్జీయా, షీనాబోరా పాత్రల్లో కనిపించనున్నారు.