మనం ఎకో ఫ్రెండ్లీ పేరుతో అందరూ మట్టి గణపతినే పెట్టుకుని పూజించేలా ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాం. మరికొందరు అందులో భాగంగా ఉచితంగా మట్టి గణపతులను వితరణ చేసి పర్యావరణ స్ప్రుహను చాటుతున్నారు. కానీ మహారాష్ట్రకి చెందిన 32 ఏళ్ల బేకర్ వారందరికంటే ఇంకాస్త ముందుడుగు వేసి పర్యావరణం తోపాటు సమాజ హితంగా గణపతిని రూపొందించి శెభాష్ అని ప్రశంసలందుకుంటోంది. ఎవరామె అంటే..
ఆమె పేరు రింటు రాథోడ్. ముంబైకి చెందిన రింటు ప్రతి ఏడాది ప్రత్యేకంగా రూపొందించిన గణపతి విగ్రహాలను తమ కమ్యూనిటీలోనూ ఇంటిలోనూ ప్రదర్శిస్తుంది. ఆమె 14 ఏళ్లుగా ఈవిధమైన ఆచారాన్ని పాటిస్తుండటం విశేషం. ఈసారి ఆమె చాక్లెట్‌లతో విలక్షణమైన వినాయకుడుని రూపొందించింది. స్త్రీ, పురుషుల ఐక్యతను చాటి చెప్పేలా అర్థనారీ రూపంలో గపతిని రూపొందించింది. సమాజంలో మహిళలపై పెరుగుతున్న నేరాల రేటు దృష్ట్యాజజ నేటి కాలంలో ఇలాంటి సందేశాత్మకమైన గణపతి విగ్రహాలు అవసరమని అంటోంది రింటూ.
ఈ విలక్షణమైన గణపతి విశ్వంలో సామరస్యతకు, సమతుల్యతకు చిహ్నమని అంటోంది రింటు. అంతేగాదు ఈ ప్రకృతిలో స్త్రీ పురుషులిరువురు సమానం అనే విషయాన్ని ఈ గణపతి రూపం ఎలుగెత్తి చాటుతుంది. అయితే అర్థనారీశ్రుడు అనగానే శివపార్వతులే గుర్తుకొస్తారు. మరి గణపతిని ఇలా రూపొందిచాలని ఆలోచన రింటుకి ఎలా వచ్చిందంటే..గణపతికి సంబంధించి పలు వర్ణనలు, వివరణలు ఉన్నాయి. అయితే 11వ శతాబ్దానికి చెందిన హలాయుధ స్తోత్రం గణేశుడి అర్థనారీ రూపాన్ని ప్రస్తావిస్తుంది.
అలాగే రాయ్‌గఢ్(మహారాష్ట్ర)లోని గోరేగావ్‌లో 800 ఏళ్ల పురాతన ఆలయంలో సగం పురుషుడు, సగం స్త్రీతో ఉన్న వినాయకుడి విగ్రహం ప్రతిష్టించారు. ఈ వినాయకుడుని చాలా మహిమాన్వితమైన దైవంగా ప్రజలు భావిస్తారు. అవన్నీ పరిగణలోని తీసుకుని తాను ఇలా వినూత్న రీతిలో గణపతిని రూపొందించినట్లు వివరణ ఇచ్చింది రింటు. ఇక రింటు వృత్తి రీత్యా కమర్షియల్ డిజైనర్ అయితే తన పిల్లలకు తల్లిగా పూర్తిగా సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో బేకరి వైపుకి అడుగులే వేసింది. ఆమె త్రీ డెమన్షియల్ ఎగ్‌లెస్ కేక్‌లు తయారు చేయడంలో స్పెషలిస్ట్.
నిమజ్జనం మరీ స్పెషల్..
ఇక రింటూ అర్థనారీ రూపు గణపతిని 30 కిలోల డార్క్ చాక్లెట్‌తో సుమారు 25 అంగుళాలు గణపతిని రూపొందించింది. ఈ విగ్రహానికి మొత్తం ఆహార రంగులతోనే పెయింట్ చేసింది. ఈ గణపతిని అనంత చతుర్దశి రోజున పాలలో గణపతిని నిజ్జనం చేస్తుంది. అలాగే ఆ గణనాథుడి ఆశీర్వాదాలు తనపై ఉండేలా నిమజ్జనం చేసిన చాక్లెట్ పాలను నిరుపేద పిల్లలకు పంచిపెడతుందట రింటు.
గతేడాది ఆమె 40 కిలోల చాక్లెట్ మిల్లెట్ గణపతిని తయారు చేసి అందరిచేత శెభాష అనిపించుకుంది. అంతేగాదు సమాజానికి ఉపయోగపడేల నిరుపేదలకు, కేన్సర్‌తో పోరాడుతున్న పిల్లల కోసం వివిధ ఎన్జీవోల కలిసి పనిచేస్తోంది కూడా.
(చదవండి: ఎకో ఫ్రెండ్లీ జర్నీ'! 27 దేశాలు చుట్టొచ్చిన ఇద్దరు మిత్రులు..!)
Comments
Please login to add a commentAdd a comment