ముంబై: ప్రతి ఏటా దేశంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభంగా జరుగుతుంటాయి. ఈ సారి సెప్టెంబర్ 7 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే సెప్టెంబర్ 17 న గణేష్ నిమజ్జనం జరగనుంది. మహారాష్ట్రలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి.
ముంబైలోని ఏర్పాటు చేసే ప్రతి గణపతి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముంబైలోని జీఎస్‌బీ సేవా మండలి ప్రతిష్ఠించే గణపతి విగ్రహం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. ఈ మండలి వడాలాలోని కింగ్స్ సర్కిల్ సమీపంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహానికి 69 కిలోల బంగారు నగలను ధరింపజేయనున్నారు. అలాగే రూ. 400 కోట్ల బీమా కూడా చేయించనున్నారు. మహారాష్ట్ర సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ నిత్యం పూజలు, అర్చనలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment