insurance amount
-
ఆ గణపతికి 69 కిలోల బంగారు నగలు.. రూ. 400 కోట్ల బీమా
ముంబై: ప్రతి ఏటా దేశంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభంగా జరుగుతుంటాయి. ఈ సారి సెప్టెంబర్ 7 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే సెప్టెంబర్ 17 న గణేష్ నిమజ్జనం జరగనుంది. మహారాష్ట్రలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి.ముంబైలోని ఏర్పాటు చేసే ప్రతి గణపతి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముంబైలోని జీఎస్బీ సేవా మండలి ప్రతిష్ఠించే గణపతి విగ్రహం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. ఈ మండలి వడాలాలోని కింగ్స్ సర్కిల్ సమీపంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహానికి 69 కిలోల బంగారు నగలను ధరింపజేయనున్నారు. అలాగే రూ. 400 కోట్ల బీమా కూడా చేయించనున్నారు. మహారాష్ట్ర సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ నిత్యం పూజలు, అర్చనలు నిర్వహించనున్నారు. -
రైతులకు ఇన్సూరెన్సు తగ్గించిన సహకార బ్యాంకు!
సాక్షి, కామారెడ్డి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలనుంచి రుణం పొందిన రైతుల పేరిట యునైటెడ్ ఇండియా కంపెనీ ద్వారా యాక్సిడెంటల్ (ప్రమాద) బీమా చేయిస్తారు. రైతులు పొలం పనులకు వెళ్లినప్పుడు పాము కాటుకు గురయ్యో.. కరెంటు షాక్‌తోనో.. ఇతర ప్రమాదాలతోనో ప్రాణాలు కోల్పోతే బాధిత కుటుంబానికి ఎంతోకొంత ధీమా కల్పించేందుకు దీనిని అమలుచేస్తున్నారు. అయితే ఈ బీమా మొత్తాన్ని ఇటీవల రూ. 2.50 లక్షలనుంచి లక్ష రూపాయలకు తగ్గించారు. దీంతో బాధిత కుటుంబాలకు అన్యాయం జరుగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి 144 సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 2 లక్షల మంది రైతులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) ద్వారా రుణాలు పొందారు. వారిలో చాలా మంది రుణాలను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటుంటారు. రైతులకు ఎక్కువగా పంట రుణాలతో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను కూడా డీసీసీబీయే అందిస్తుంది. రుణం తీసుకున్న రైతు ఏదేని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తూ చనిపోయినపుడు ఆ కుటుంబానికి ఆసరా కల్పించేందుకు గాను బ్యాంకు నుంచి ఇన్సూరెన్సు చేసేవారు. ప్రీమియం మొత్తాన్ని బ్యాంకే చెల్లించేది. ఒక్కో రైతుకు రూ. 2.50 లక్షల ఇన్సూరెన్సు నిమిత్తం డీసీసీబీ ద్వారా ఇన్సూరెన్సు కంపెనీకి ప్రీమియం మొత్తం ఒకేసారి చెల్లించేవారు. ప్రమాదవశాత్తూ ఎక్కడ రైతు చనిపోయినా ఇన్సూరెన్సు సొమ్ము ఆ రైతు నామినీకి అందజేసేవారు. బీమా సొమ్ము ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అయ్యేది. అయితే ఈ ఆర్థి క సంవత్సరం నుంచి ఇన్సూరెన్సు మొత్తాన్ని రూ. లక్షకు కుదించారు. దీని మూలంగా చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టం జరగనుంది. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, వర్షాభావ పరిస్థితులు, బోర్ల తవ్వకం, పంటలు ఎండిపోవడం వంటి అనేక కష్టాల నడుమ రైతులకు పంటల సాగులో పెద్దగా మేలు కలుగడం లేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు అందించే ఇన్సూరెన్సు కూడా తగ్గించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాను అమలు చేస్తున్న నేపథ్యంలో సహకార బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్సు మొత్తాన్ని తగ్గించి ఉంటారని భావిస్తున్నారు. ఇన్సూరెన్సును గతంలోలాగే రూ.2.50 లక్షలకు పెంచాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ డీసీసీబీ సీఈవో అనుపమను వివరణ కోరగా ఇన్సూరెన్సు తగ్గిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామన్నారు. -
ఇన్సూరెన్స్ డబ్బు కోసం పాలేరు హత్య
కర్నూలు (టౌన్): ఇరవై ఏళ్లుగా నమ్మకంగా ఇంట్లో పనిచేస్తున్న పాలేరును బీమా సొమ్ము కోసం ఇంటి యజమాని, మరికొందరు కలసి హతమార్చిన ఘటనలో నిందితులను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కర్నూలు జిల్లా అవుకు మండలం మెట్టుపల్లెకు చెందిన టీడీపీ మద్దతుదారుడు సీజే భాస్కర్‌రెడ్డి ఇంట్లో ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామానికి చెందిన వడ్డే సుబ్బరాయుడు పాలేరుగా పనిచేస్తుండేవాడు. ఇతను దివ్యాంగుడు. పైగా అనాథ. దీంతో అతని ప్రాణాలను ఫణంగా పెట్టి డబ్బు సంపాదించాలని భాస్కర్‌రెడ్డికి దుర్భుద్ధి పుట్టింది. నంద్యాలకు చెందిన న్యాయవాది మహేశ్వరరెడ్డి, అవుకు గ్రామానికి చెందిన షేక్షావలి, హోటల్ రమణ అనే వ్యక్తులతో కలసి పథకం రచించారు. 2015 నవంబర్‌లో హైదరాబాదుకు చెందిన న్యూ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు మల్లేష్, శర్మలను సంప్రదించి సుబ్బరాయుడు పేరు మీద రూ. లక్షకు ఒక పాలసీ, రూ. 15 లక్షలకు మరొక పాలసీ చేయించారు. పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే డబుల్ పరిహారం లభించే పాలసీలివి. ఆ తర్వాత భాస్కరరెడ్డి 2015 డిసెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున పొలానికి వెళ్దామంటూ సుబ్బరాయుడును తీసుకెళ్లి మార్గమధ్యంలో మరికొందరితో కలసి గొంతు నులిమి చంపాడు. ఎవరికీ అనుమానం రాకుండా సుబ్బరాయుడు తలపై ట్రాక్టర్‌ను ఎక్కించి ప్రమాదంగా చిత్రీకరించారు. ఆ తర్వాత భాస్కర్‌రెడ్డి.. ‘వడ్డే భాస్కర్’గా బోగస్ ఓటర్ కార్డు పొందాడు. సుబ్బరాయుడు తన తమ్ముడని, నామినీగా ఉన్నానంటూ బీమా కంపెనీ ప్రతినిధులను నమ్మించి.. రూ. 32 లక్షల పరిహారాన్ని కాజేశాడు. ఈ డబ్బును నిందితులందరూ పంచుకున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఇటీవల ఎస్పీ ఫక్కీరప్ప దృష్టికి రావడంతో సీసీఎస్ పోలీసులతో దర్యాప్తు చేయించారు. ప్రధాన నిందితుడు భాస్కరరెడ్డి నేరాన్ని అంగీకరించడంతో అతనితో పాటు హత్యకు సహకరించిన షేక్షావలి, జీనుగ వెంకటకృష్ణ, జీనుగ శివశంకర్‌ను శనివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. హత్యలో పాత్ర ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి, హోటల్ రమణ, లాయర్ మహేశ్వర్‌రెడ్డితో పాటు ఇన్సూరెన్స్ ఏజెంట్లు మల్లేష్, శర్మ పరారీలో ఉన్నారని, వీరిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. -
అడ్డంగా దొరికిపోయిన దంపతులు..
బంజారాహిల్స్: బతికున్న భార్యను బీమా డబ్బు కోసం చనిపోయినట్లు ధృవపత్రాలు సృష్టించాడో ప్రబుద్దుడు. ఇన్సూరెన్స్ సంస్థ సిబ్బంది పత్రాలను విచారించే క్రమంలో అసలు విషయం బయటపడింది. బంజారాహిల్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు ఇన్సూరెన్స్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు శనివారం నిందితురాలు నాజియా షకిల్ ఆలంను(37)ను అరెస్ట్ చేశారు. ఎస్ఐ భరత్ భూషణ్ తెలిపిన మేరకు.. యాకు త్పుర, డబీర్‌పురకు చెందిన సయ్యద్ షకిల్ ఆలం, నాజియాషకిల్ ఆలం బార్యా భర్తలు. చనిపోయిన మరో మహిళ పేరుతో ఉన్న పత్రాలను తీసుకొని ఆ పేర్లపై తన భార్య నాజియా షకీల్ ఆలం పేరును జతపరిచి డాక్యు మెంట్లన్నీ పక్కాగా సృష్టించాడు. తన భార్య చనిపోయిం దని ఏకంగా శ్మశాన వాటిక రశీదును కూడా తయారు చేశాడు. రూ. కోటి బీమా మొత్తాన్ని క్లైమ్ చేస్తూ ఐసీఐసీఐ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవలనే బీమా సంస్థ సిబ్బంది ఈ పత్రాలను తనిఖీ చేస్తుండగా అనుమానాలు తలెత్తాయి. లోతుగా విచారిస్తే షకిల్ఆలం చనిపోలేదని తేలింది. వేరే మహిళ పత్రాలను ఫోర్జరీ చేసి తన భార్య పేరును తగిలించి బీమా మొత్తాన్ని దొంగదారిలో పొందేందుకు ఎత్తుగడ వేసిన విషయాన్ని తెలుసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ చేసిన దంపతులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. మహిళను అరెస్ట్‌చేశారు. ఆమె భర్త కోసం గాలింపు చేపట్టారు. -
బీమా సొమ్ము చెల్లించండి: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఖరీఫ్, రబీ బీమా క్లెయిమ్స్ సొమ్మును రైతులకు ఈ నెలాఖరులోగా అందజేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. సోమవారం ఆయన బీమా కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. క్లెయిమ్స్ చెల్లింపుల విషయమై బీమా కంపెనీల జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017–18 రబీకి సంబంధించి బీమా కంపెనీల ప్రతినిధుల నియామకాలు, వివరాలు అందజేయాలన్నారు. -
భర్తలను చంపి.. రూ.53 కోట్లు వెనకేసింది!
వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ భర్తలను హతమార్చి, వారి పేరుమీద ఉన్న బీమా సొమ్మును తీసుకోవడం అలవాటుగా మార్చుకుందో మహిళామణి. సమాగమం తర్వాత తన మగ భాగస్వామిని చంపేసే అలవాటుండే సాలీడు పేరుమీద ఇలాంటి వాళ్లను 'బ్లాక్ విడో'లుగా పిలుస్తారు. చిసాకో కకెహి (67) అనే ఈ మహిళ ఇప్పటివరకు ఆరుగురు భర్తలను ఇలా చంపింది. తాజాగా 2013 డిసెంబర్ నెలలో 75 ఏళ్ల భర్తకు విషమిచ్చి చంపింది. ఇప్పటివరకు ఇలా బీమా రూపంలో గత పదేళ్లలో ఆమె సుమారు 53 కోట్ల రూపాయలు వెనకేసుకుంది. ఇప్పుడు మరో ముసలి, బాగా డబ్బున్న వ్యక్తి ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తోంది. తాను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ముసలివాడై ఉండాలని, ఒక్కడే నివసిస్తుండాలని కూడా మ్యారేజి బ్యూరోలకు చెబుతోంది. అతడు ఏదైనా వ్యాధితో బాధపడేవాడైతే మరింత మంచిదని కూడా చెప్పిందట. పశ్చిమ జపాన్‌లో వేర్వేరు పేర్లతో ఆమె పలు మ్యారేజి బ్యూరోలలో పేర్లు నమోదు చేయించుకుంది. క్యోటోలోని ఆమె ఇంట్లో పోలీసులు గురువారం సోదాలు చేసినప్పుడు అక్కడ సైనైడ్ ఆనవాళ్లు కనిపించాయి. తన భర్తలను చంపిన విషయాన్ని ఆమె అంగీకరించడంలేదు. జపాన్‌లో చాలా కాలంగా బ్లాక్విడోలు ఉన్నట్లు చరిత్ర ఉంది. ఇటీవలే కనే కిజిర్నా అనే మధ్య వయసు మహిళ ఒకరు తన ముగ్గురు భర్తలను చంపి వాళ్ల ఆస్తులు చేజిక్కించుకుంది.