
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఖరీఫ్, రబీ బీమా క్లెయిమ్స్ సొమ్మును రైతులకు ఈ నెలాఖరులోగా అందజేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. సోమవారం ఆయన బీమా కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. క్లెయిమ్స్ చెల్లింపుల విషయమై బీమా కంపెనీల జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017–18 రబీకి సంబంధించి బీమా కంపెనీల ప్రతినిధుల నియామకాలు, వివరాలు అందజేయాలన్నారు.