partha sarathi
-
400 మంది టీడీపీ కార్యకర్తలు రాజీనామా
-
TS: ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం పొడిగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీఎస్ఎఫ్సీ పార్థసారథి పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
చంద్రబాబు కుట్రపై విచారణ జరిపించాలి : పార్థసారథి
-
టీడీపీ నేతల వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు
-
‘గ్రేటర్’ పోరు: స్థానికేతరులు వెళ్లిపోవాలి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసినందున స్థానికేతరులు, జీహెచ్ఎంసీలో ఓటు లేనివారు, నగరం విడిచి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ప్రచారానికి వచ్చినవారిని పార్టీలు, అభ్యర్థులు స్వచ్ఛందంగా నగరం బయటికి పంపించి సహక రించాలని కోరింది. ఎన్నికల ప్రచార సమయం ముగిశాక ఆదివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గడువు దాటాక కూడా ప్రచారం నిర్వహించే వారిపై కేసులు పెడతామని, రెండేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా పడుతుందన్నారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసేవరకు జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందన్నారు. డిసెంబర్ ఒకటిన జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. కోవిడ్ జాగ్రత్తలతో.. కోవిడ్–19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని శానిటైజేషన్ చేసి ఏర్పాట్లు చేసినందున ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా వచ్చి ఓటేయాలని పార్థసారధి కోరారు. అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు 19 మందిని నోడల్ ఆఫీసర్లుగా నియమించి, వారి పర్యవేక్షణలో జాగ్రత్తలు చేపడుతున్నట్టు తెలిపారు. ఓటర్లు మాస్క్ ధరించాలని, క్యూలలో సామాజిక దూరం పాటించాలని కోరారు. చదవండి: హైదరాబాద్ పేరు మార్చేస్తే... బంగారం వస్తదా? -
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ సి.పార్థసారథిని నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీచేశారు. మంగళవారం ఆయన్ను కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు కమిషనర్‌గా ఉన్న వి.నాగిరెడ్డి ఏప్రిల్‌లోనే పదవీ విరమణ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచిమూడేళ్లపాటు పార్థసారథి ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన బుధవారం బాధ్యతలు చేపడుతున్నట్టుగా అధికారవర్గాల సమాచారం. కమిషనర్‌గా నియమితులైన పార్థసారథి మంగళవారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన వెంట సీఎస్ సోమేశ్‌కుమార్ ఉన్నారు. ఇదీ పార్థసారథి ప్రస్థానం... 1993 సర్వీస్ కేడర్ ఐఏఎస్ అధికారి పార్థసారథి బీఎస్సీ (అగ్రికల్చర్), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)–ఆగ్రోనమి డిస్టింక్షన్లో పూర్తిచేశారు. 1988 డిసెంబర్ 4న విజయనగరం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. ఐఏఎస్‌గా ఆదిలాబాద్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతల నిర్వహణ మొదలుపెట్టారు. అనంతరం అనంతపురం, వరంగల్ జిల్లాల జేసీగా విధులు నిర్వహించారు. 2004 జూన్ 19న కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, 2006 జూన్ 6న మార్క్‌ఫెడ్ ఎండీగా, ఆ తర్వాత ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌గా, 2011 జూన్ 18న ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీగా బాధ్యతలు నిర్వహించారు. 2014 జూన్ 2న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, 2015 ఏప్రిల్ 15న వ్యవసాయశాఖ కమిషనర్‌గా, ఆ తర్వాత ముఖ్యకార్యదర్శిగా పదోన్నతి పొంది ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ వరకు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా బదిలీపై వెళ్లి, ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు.. నాగిరెడ్డి కమిషనర్‌గా ఉండగానే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మినహా మిగతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన మెజారిటీ ఎన్నికలు ఇప్పటికే పూర్తయినందున, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి, కార్పొరేటర్ల కాలపరిమితి వచ్చే ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. దీంతో పాటు మార్చినెలలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల కాలపరిమితి కూడా ముగియనుంది. సిద్దిపేట మున్సిపాలిటీకి వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, నకిరేకల్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఇప్పటికే మారగా, ఈ పంచాయతీ కాలపరిమితి త్వరలో ముగియగానే ఆ మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో దాని కాలపరిమితి ముగిసే వరకు వేచి చూస్తారా లేక 2,3నెలలు ముందుగానే ఆ ఎన్నికలు నిర్వహిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. జీహెచ్ఎంసీ కాలపరిమితి ముగియడానికి మూడునెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు చట్టంలో వెసులుబాటు ఉండడంతో ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. -
‘అందుకే చంద్రబాబు ఓటమి పాలయ్యాడు’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వంలోని దుర్గగుడి పాలకమండలి అవినీతి అక్రమాలతో భక్తులు విసుగెత్తిపోయారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన సోమవారం దుర్గగుడి నూతన పాలకమండలి, చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రానికి హాజరయ్యారు. దుర్గగుడి ఈఓ సురేష్‌బాబు 16 మంది సభ్యుల చేత ప్రమాణం చేయించారు. దుర్గగుడి పాలక మండిలి చైర్మన్‌గా పైలా సోమినాయుడు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న పాలక మండలి అభివృద్ధిని వదిలేసిందన్నారు. అమ్మవారికి వచ్చే ఆదాయాన్ని సైతం కాజేశారని ఆయన మండిపడ్డారు. చివరికి అమ్మవారికి సమర్పించే చీరలను సైతం వదల్లేదన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఓటమిపాలయ్యాడని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. దేవస్థానం అభివృద్ధిలో సభ్యులు కీలక పాత్ర పోషించాలని వెల్లంపల్లి పాలక మండలికి సూచించారు. సభ్యులు చిత్తశుద్ధితో పనిచేసి మంచి పేరు తీసుకురావాలన్నారు. చీరలు దోచేసిన చరిత్ర గత పాలకమండలిదని.. అమ్మవారి ఆదాయాన్ని దోచుకోవడానికే గత ప్రభుత్వం, పాలకమండలి పాకులేడేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీసీని పాలకమండలి చైర్మన్‌గా చేశారని వెల్లంపల్లి కొనియాడారు. జగన్ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం పాలకమండలిలో సగం మంది మహిళలకు అవకాశం కల్పించారన తెలిపారు. నూతన కమిటీ భక్తుల మన్ననలు పొందే విధంగా దుర్గగుడిని అభివృద్ధి చేయాలన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు సజావుగా దర్శనం చేసుకునే విధంగా చొరవ చూసుకోవాలని మండలి సభ్యులకు వెల్లంపల్లి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. బలహీన వర్గానికి చెందిన సోమినాయుడుని దుర్గ గుడి చైర్మన్‌గా నియమించడం ఆనందించ దగ్గ విషయమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ పాలకమండలి ఏర్పాటు అయ్యిందని ఆయన తెలిపారు. గత పాలకమండలి అక్రమాలు చేయటానికి మాత్రమే ఉండేదన్నారు. తమ పాలకమండలి సభ్యులు భక్తుల సౌకర్యాలుకి పెద్ద పీట వేస్తారని తెలిపారు. 50 శాతం మహిళలకు పాలకమండలి సభ్యులుగా సీఎం జగన్ అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. -
చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేశారు
-
‘ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరం’
సాక్షి, విజయవాడ : ఎన్నికల నిర్వహిణపై, ఈసీపై చంద్రబాబు ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు గెలిచిన తరువాత ఎప్పుడూ ఈవీఎంల గురించి మాట్లాడలేదని.. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో కూడా ఈవీఎంలు అలాగే జరిగాయా అని నిలదీశారు. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకి ఈవీఎంలపై అనుమానాలు ఉంటే హరిప్రసాద్‌బదులు వేరే వారిని పంపించవచ్చు కదా అని ప్రశ్నించారు. తన ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పే ప్రయత్నంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా.. వైఎస్ జగన్‌ను సీఎం కాకుండా ఆపలేరని హెచ్చరించారు. -
‘ఆదరణ పేరుతో చంద్రబాబు కొత్త నాటకం’
సాక్షి, విజయవాడ : బీసీలను మరోసారి మోసం చేయడానికి ‘ఆదరణ’ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు కొత్త నాటకానికి తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబుకు సరిగ్గా ఎన్నికల ముందే బీసీలు గుర్తుకు వస్తారన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోసమే టీడీపీ రాజమండ్రిలో జయహో బీసీ సభ నిర్వహిస్తుందని, ఈ సభకు రాకుంటే నగదు ఇవ్వమని డ్వాక్రా మహిళలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలన పుణ్యమా.. బీసీలు తమ కులవృత్తులు చేసుకోలేక దుర్భర జీవితాన్ని సాగిస్తున్నారని, జన్మభూమి కమిటీల వద్ద బీసీలను బానిసలుగా మార్చింది టీడీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. బీసీ వర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చమని సీఎం చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. బీసీలు టీడీపీకీ కేవలం ఓటు బ్యాంకుగానే కనిపిస్తున్నారని, చంద్రబాబు మాయలో బీసీ సోదరులు పడవద్దని పార్థసారథి ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే బీసీ సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు. -
కేంద్రం పరిమితులతోనే రైతులకు ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: పంటల ధర విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మార్కెటింగ్ ఈ–సర్వీసెస్‌ను ప్రారంభించారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ.. కేంద్రం మద్దతు ధర పెంచిందని, అయితే కొనుగోళ్ల విషయంలో పరిమితులు విధిస్తోందని.. దీనివల్లే రైతులకు సమస్య ఎదురవుతోందని చెప్పారు. రెండేళ్ల నుంచి రికార్డు స్థాయిలో ప్రభుత్వం తరఫున కొంటున్నామన్నారు. కేంద్రం పరిమితి విధించడానికి ఎగుమతి దిగుమతి విధానాలు తదితర అంతర్జాతీయ కారణాలున్నాయన్నారు. అయితే ఇవి రైతులకు సంబంధం లేనివి అయినప్పటికీ వారిపైనే ప్రభావం పడుతోందని తెలిపారు. ఈ విషయాలు రైతులకు అధికారులు వివరించాలన్నారు. మార్కెటింగ్‌శాఖ ఆందుకు సిద్ధంగా ఉండాలని, ధరల విషయంలో ముందుగానే అంచనాలు వేయాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకుని కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీసారి సమీక్షించుకోవాలి.. వ్యవసాయ ఉత్పత్తులన్నీ వినియోగదారులకు చేరుతాయని, వాటి ధరలో రైతు వాటా ఏడాదికేడాది ఎంత పెరుగుతుందనేది ముఖ్యమని పార్థసారథి చెప్పారు. ప్రతిసారీ దీన్ని సమీక్షించుకుని రైతులకు గిట్టుబాటు కల్పిస్తున్నామా లేదా చూసుకోవాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రైతులు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం తరఫున సాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. మార్కెట్లలో గత నాలుగేళ్లలో రూ.370 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఈ సర్వీసెస్ ఉపయోగపడుతోందన్నారు. అన్నీ ఆన్లైన్లో చూసుకోవచ్చని చెప్పారు. అయితే ఈ–నామ్లో రాజకీయ ఒత్తిడులు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా మోడల్ యాక్ట్ విషయంలో జవాబుదారీతనం ఉండాలని వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, పద్మహర్ష తదితరులు పాల్గొన్నారు. -
అంచనాలను మించిన వరి సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో వరి అంచనాలకు మించి సాగైంది. గత నెల విస్తారంగా వర్షాలు పడటంతో వరి విస్తీర్ణం 107 శాతానికి చేరుకుంది. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 25.44 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఇంకా వరి నాట్లు పడే అవకాశముం దని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్ని రకాల పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికే 1.03 కోట్ల ఎకరాల్లో సాగవుతున్నట్లు ఆ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి ఉధృతి మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు 17 జిల్లాలకు అది వ్యాపించింది. పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి చేస్తుంది. 12 జిల్లాల్లో పత్తికి గులాబీ రంగు పురుగు సోకిందని నివేదికలో తెలిపారు. ఇక కంది, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్ పంటలు పూత దశలో ఉన్నాయి. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం.. గత నెల విస్తారంగా వర్షాలు కురిసినా 12 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ, నల్లగొండ, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయినట్లు ఆశాఖ తెలిపింది. ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సీజన్ మొత్తం మీద సాధారణ వర్షపాతం రికార్డవ్వగా, నెలల వారీగా చూస్తే జూన్, ఆగస్టుల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో 30%లోటు వర్షపా తం రికార్డయింది. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు 75% లోటుతో తీవ్ర వర్షాభావం నెలకొందని పేర్కొంది. రబీ ‘రైతుబంధు’కు సన్నద్ధం బ్యాంకులతో వ్యవసాయశాఖ సమావేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే రబీలో సరఫరా చేయాల్సి న రైతుబంధు పెట్టుబడి కోసం సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖరీఫ్‌లో 8 బ్యాంకులు పెట్టుబడి చెక్కులను రైతులకు సరఫరా చేశాయని, ఈసారి మరిన్ని బ్యాంకులు ఇందులో పాల్గొనాలని కోరారు. అందుకు ఇతర బ్యాంకుల జాబితాను పంపాలన్నారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు పంట రుణాలు ఏమేరకు ఇచ్చారో సమీక్షించారు. జిల్లా వ్యవసాయాధికారులతోనూ పార్థసారధి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాలు, పంటల పరిస్థితులు, పంట నష్టం, ఎరువులు, రైతు బంధు, రైతుబీమా పైనా జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సీజన్లో ఎంత మేర పంట నష్టం జరిగిందో నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పథకంలో పంపిణీ చేసిన, చేయని చెక్కులను, ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేసి, సంబంధిత నమూనా పత్రాలలో నమోదు చేసి చెక్కుల పరిశీలనకు రావల్సిందిగా సూచించారు. ఆయా జిల్లాల్లో పంటల విస్తీర్ణం, దానికి అనుగుణంగా ఎరువులను సమకూర్చుకోవాలని సూచించా రు. సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్, జాయింట్ డైరెక్టర్ విజయగౌరి పాల్గొన్నారు. -
25 వేల మంది రైతులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా గతంలో రుణమాఫీకి నోచుకోని అర్హులైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం రద్దు కావడంతో ఉత్తర్వు లను బయటకు వెల్లడించకుండా.. అంతర్గతంగా మాత్రమే ఆదేశాలు జారీ చేశారు. దీంతో 25 వేల మందికిపైగా రైతులకు రూ.160 కోట్ల మేర రుణమాఫీ కానున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలి పాయి. సర్కారు రద్దుకు ముందే వ్యవసాయ శాఖ సంబంధిత ఫైలును సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే సీఎం సంతకం చేసినా ఉత్తర్వులు వెలువడటానికి ఇన్నాళ్లు పట్టిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష రూపాయల్లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 35.33 లక్షల మంది రైతుల రుణమాఫీ కోసం రూ. 16,124 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. రుణమాఫీ అర్హులను గుర్తించే క్రమంలో బ్యాంకులు కొందరు రైతుల వివరాల జాబితాను సర్కారుకు పంపించలేదు. దీంతో 25 వేల మందికి పైగా రైతులు అర్హులై ఉండి రుణమాఫీకి నోచుకోలేకపోయారు. ఈ క్రమంలో అర్హులైన రైతులు ఉన్నందున మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వీరికి రుణ మాఫీ చేయాలని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలోనూ దీనిపై పలుమార్లు చర్చ జరిగింది. కానీ వీరికి రుణమాఫీ అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. -
14 నుంచే ‘రైతుబీమా’ అమలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14 నాటికే రైతుబీమా పూర్తిస్థాయిలో అమల్లోకి రానుందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. ఈ నెల 6 నుంచి 14నాటి కి రైతులకు బీమాపత్రాలు ఇస్తామన్నారు. 14 నుంచి సంబంధిత రైతు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 10 రోజుల్లో రూ.5 లక్షలు క్లెయిమ్ అందుతుందన్నారు. దీన్ని ఎల్ఐసీకి తెలియజేశామని పేర్కొన్నారు. రైతుబీమా పత్రాల పంపిణీ కార్యక్రమా న్ని గ్రామసభల్లో అందజేయాలని నిర్ణయించామని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనాల ని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. 6న ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నా ప్రత్యేకంగా ప్రారంభం అంటూ హడావుడి చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. బీమా పాలసీకి ప్రారంభ ఉత్సవం చేయడమంటే సెంటిమెంట్‌గా మంచిది కాదని సర్కారు భావించినట్లు సమాచారం. -
రైతుబంధు’లందరూ బీమాకు అర్హులే
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు చెక్కులు తీసుకున్న రైతులందరూ రైతుబీమాకు అర్హులేనని వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. ఈ పథకం కింద రైతుల నమోదు పురోగతి గురించి శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. పార్థసారథి మాట్లాడుతూ రైతు జీవితబీమా పథకంలో ఇప్పటివరకు 30 లక్షల మంది రైతులపేర్లు నమోదయ్యాయని తెలిపారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాసుబుక్ లేకున్నా రైతుబంధు చెక్కులను అందజేశామని, వారూ రైతుబీమా చేయించుకోవాలని పేర్కొన్నారు. కొంద రు రైతులు రైతుబంధు చెక్కులు తీసుకోకపోవడంతో అవి తహసీల్దార్ వద్దనే ఉన్నాయని, అలాంటి రైతు లు తప్పనిసరిగా ఆ చెక్కులు తీసుకుని, రైతుబీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు కుటుంబాలకు భరోసా కలిగించడానికే రైతుబీమా పథకమని.. ప్రతీ రైతు కూడా రైతుబీమా పథకంలో నమోదు కావాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకం కలిగిన 18 నుంచి 59 సంవత్సరాల (1959 ఆగస్టు 14 నుండి 2000 ఆగస్టు 15 మధ్య పుట్టినవారు) వయసు కలిగిన రైతులు జీవిత బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. జీవితబీమా పథకంలో ప్రతీ పట్టాదారు రైతు నమోదయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జూలై 15, 2018 నాటికి నమోదు వివరాలు అందించాలి కాబట్టి త్వరితగతిన నమోదు, అప్ లోడింగ్ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
ఒంటరిగా వస్తా.. మీకు దమ్ముందా..!
ఉయ్యూరు: పేదలకు కట్టించి ఇచ్చే జీ+3 ఇళ్ల నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వ అవినీతిపై చర్చించేందుకు తాను ఒక్కడినే వస్తా.. దమ్ముంటే టీడీపీ నేతలు తనతో చర్చకు రావాలని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు. ఉయ్యూరు పట్టణంలో బుధవారం సాయంత్రం పార్థసారథి అఖిలపక్షంతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జీ+3 ఇళ్ల పేరిట టీడీపీ చేపట్టిన నిర్మాణంలో పేదలకు లబ్ధి కన్నా కాంట్రాక్టర్ లబ్ధికే పెద్దపీట వేశారన్నారు. పేదలకు పెనమలూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని చెప్పారు. తన హయాంలో ఉయ్యూరు పట్టణంలో బహిరంగంగా సుమారు వెయ్యి మందికి పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. తాము పంపిణీ చేసిన లబ్ధిదారుల్లో అనర్హులు ఎవ్వరైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే అది పరిశీలించి వాటిని రద్దు చేస్తామని బహిరంగంగా అందరికీ తెలిపానన్నారు. పేదల నుంచి స్థలాలు లాక్కున్నది మీరుకాదా? పేదలందరికీ సుమారు 72 గజాల స్థలాన్ని ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చామని, వారికి తాము పట్టాలు అందించామని చెప్పారు. నాడు మేము స్థల సేకరణ జరిపి పేదలకు పట్టాలు పంచిన తరువాత పట్టాలు పొందిన వారి కనీస అనుమతి కూడా తీసుకోకుండా వారికి కేటాయించిన స్థలాలను బలవంతంగా టీడీపీ నేతలు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉయ్యూరులో ఇళ్ల అవసరం ఉన్న పేదలు తమ ప్రభుత్వం తరువాత పెరిగి ఉండి ఉంటారని, అయితే అప్పటికే కేటాయించిన స్థలాలను లాక్కుని అందరికీ న్యాయం అంటూ చెప్పే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదన్నారు. టీడీపీ నేతలు వారిష్టమొచ్చిన రీతిలో ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టును అవినీతి కంపు కొట్టించారని మండిపడ్డారు. లబ్ధిదారులు ఈ అంశంపై కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తీసుకువస్తే మీరు ఎందుకు కోర్టుకు వెళ్లి ఆ స్టేటస్ కోని వెకేట్ చేయించకుండా ఎలా నిర్మాణాలు చేపడుతున్నారో వివరించాలన్నారు. ట్యాక్సీ నడుపుకునేవారు పేదలు కాదా ? కుటుంబ పోషణ కోసం ట్యాక్సీకి ఓనర్ అయితే ఇళ్ల స్థలం పొందేందుకు అర్హుడు కాడా అని పార్థసారథి మండిపడ్డారు. పట్టణంలో కొంత మంది ట్యాక్సీ డ్రైవర్లు ట్యాక్సీ నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. వాళ్లకు కారు ఉందనే కారణంతో ఇళ్ల స్థలాలు కేటాయించడం కుదరదు అని చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. మీరు కట్టమనగానే రూ.25 వేలు, రూ.50 వేలు డబ్బులు కట్టేవాళ్లు మీ దృష్టిలో నిజమైన పేదలు, కుటుంబాన్ని పోషించేందుకు రూ.40 వేలు కూడా విలువ చేయని ట్యాక్సీలు ఉన్న వాళ్లు పేదలు కాదా అని ధ్వజమెత్తారు. రూ.2.50 లక్షలు అయ్యేదానికి రూ.6.50 లక్షలు దేనికి? ప్రభుత్వం ప్రకటించిన కేటగిరీలలో ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు కేవలం రూ.2.50 లక్షలు అని అన్నారు. ఇళ్ల స్థలాల నిర్మాణంలో ప్రభుత్వం కేటాయించిన కేటగిరీలో 300 చదరపు అడుగుకు రూ.2,166లు, 365కు రూ.2000, 435కి రూ.1900లు ఖర్చుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఉయ్యూరు పట్టణంలో అనేకమంది బిల్డర్లు చదరపు అడుగు భూమి విలువతో కలుపుకుని రూ.1,200లకే విక్రయాలు జరుపుతున్నారన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం జర్మన్ టెక్నాలజీ అని, షేర్ వాల్ టెక్నాలజీ అని, అధునాత టెక్నాలజీ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ రూ.2 వేలకుపైగా ఇళ్ల నిర్మాణానికి వసూలు చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఒక బిల్డర్ ఈ ఇళ్లను కేవలం రూ.1100లకే చదరపు అడుగుకు నిర్మాణం పూర్తి చేయగలడని చెప్పారు. చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతిని నిరూపించేందుకు చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, టీడీపీ నేతలు సిద్ధంగా ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. లా అండ్ ఆర్డర్‌కు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మీకు ఇష్టం వచ్చిన చోట, మీరు ఎంత మంది వచ్చినా సరే పోలీసులు, విలేకరుల ఎదుట తాను ఒక్కడినే వచ్చి మీ అవినీతిని బయటపెడతానని ఛాలెంజ్ చేశారు. తాను చేస్తున్న సవాల్‌ను దమ్ముంటే స్వీకరించాలని కోరారు.సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ ఉయ్యూరు పట్టణ, మండల అధ్యక్షులు జంపాన కొండలరావు, దాసే రవి, మహిళా విభాగం నాయకులు తెనాలి పద్మావతి, దిరిశం ఇందిర ప్రియదర్శిని, నాయకులు నిడుమోలు పూర్ణ, చింతల అప్పారావు, అబ్దుల్ సద్దాం, సీఐటీయూ పెనమలూరు డివిజన్ అధ్యక్షులు కోసూరి శివనాగేంద్రం, నాయకుడు కేవైకే రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు కోట్ల ఆంధ్రులను నట్టేట ముంచాయి
-
ఆయనకు ఇంగిత జ్ఞానం లేదు..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని చెప్పిన టీడీపీ మాట మార్చి తామే అవిశ్వాసాన్ని ప్రవేశపెడతామంటోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రత్యేక హోదా అంశంపై ఇతర పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఎందుకు పోరాటం చేయలేదని చంద్రబాబును నిలదీశారు. అవిశ్వాసంపై జాతీయస్థాయిలో వైఎస్సార్సీపీకి వస్తున్న మద్దతు చూసి చంద్రబాబు ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మానవహారాలు నిర్వహిస్తాం.. పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సోమవారం మానవహారాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అభద్రతాభావంతో టీడీపీ వైసీపీపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు జగన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం.. ఆయనకు ఇంగిత జ్ఞానం లేదనే విషయం తెలుపుతుందన్నారు. మోదీ సమాధానం చెప్పాలి.. కోర్టులకు హాజరు కాకుండా స్టేలు తెచ్చుకునే రాజకీయ నేరగాడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకుడిని ప్రధాని మోదీ ఎందుకు పక్కన సహించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘దళిత మహిళను వివస్త్రను చేసిన నీ పాలనలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయ’ని పార్థసారథి ప్రశ్నించారు. దోపీడీలు, మట్టి, ఇసుక అక్రమ రవాణా, కాంట్రాక్టుల్లో అవినీతితో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారని మండిపడ్డారు. నాడు కేంద్రం ప్యాకేజీపై పొగడ్తలు గుప్పించి.. ఇప్పుడు అసెంబ్లీలో కేంద్రం సహాయం చేయడం లేదంటూ మొసలికన్నీరు కార్చడం చంద్రబాబుకే సాధ్యం అని అన్నారు. ఎన్టీఆర్‌ను ముంచాడు..మామను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, అధికారాన్ని, గుర్తుని, నిధులను లాక్కున్న చంద్రబాబుది దొంగల పార్టీ అని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు తరిమికొడతారన్న భయంతో ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చిందని అన్నారు. -
రాజధాని పేరుతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు
-
రెండో హరిత విప్లవం లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఇందులో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, శాఖ కమిషనర్ జగన్మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయిలను డైరెక్టర్లుగా నియమించింది. కార్పొరేషన్‌కు రూ.200 కోట్లతో మూలధన నిధిని ఏర్పాటు చేసింది. ఇందులో గవర్నర్ పేరుతో రూ.199,99,99,300ను, మిగతా మొత్తాన్ని బోర్డు డైరెక్టర్ల పేరిట కేటాయించింది. అయితే కార్పొరేషన్‌కు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం.. చైర్మన్ పోస్టును ప్రస్తుతానికి ఖాళీగా ఉంచింది. చైర్మన్ నియామకంతోపాటు పలువురు జిల్లా సమన్వయ సమితి సభ్యులను డైరెక్టర్లుగా నియమించనున్నారు. ఈ పేర్లను తరువాత ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతు సమన్వయ సమితి ఎండీగా వ్యవసాయ శాఖ కమిషనర్ కొనసాగనున్నారు. ఇవీ ప్రధాన మార్గదర్శకాలు.. ♦ రాష్ట్రంలో ప్రధానమైన వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు అనుగుణంగా పంట కాలనీలను ఏర్పాటు చేయాలి. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలి. ♦ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పండించిన ఆహార పదార్థాల సరఫరా. ♦ రైతు సమితుల సభ్యులకు శిక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటు చేయడం. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు పంపడం. ♦ సన్న, చిన్నకారు రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి సాగు ఖర్చు తగ్గించడం. ♦ వ్యవసాయాభివృద్ధిలో సహకారం కోసం జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఐకార్ వంటి సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవడం. ఎప్పటికప్పుడు వారి సలహాలతో ముందుకు సాగడం. ♦ జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, ఉద్యాన సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం. ♦ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం. ♦ సహకార సంఘాలను, రైతు శిక్షణ సంస్థలను/కేంద్రాలను బలోపేతం చేయడం. ♦ రాష్ట్ర గణాంక శాఖ/వ్యవసాయ, ఉద్యా నవర్సిటీల సహకారంతో ఏటా పంటల ఉత్పత్తిని అంచనా వేసి.. పంటల కొనుగోలుకు ఏర్పాట్లు చేయడం. ♦ రైతుల ఆదాయం పెంచేందుకు పంట కోతల అనంతర నష్టాలు తగ్గేలా చర్యలు చేపట్టడం. ఇందుకోసం ప్రాసెసింగ్, అదనపు విలువ జోడింపు వంటివి చేపట్టడం. స్థానిక అవసరాలకు అనుగుణంగా దిగుబడి సాధించడం. ♦ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు. ♦ ప్రైవేటు పరిశ్రమలతో కలసి పీపీపీ పద్ధతిలో పనిచేయడం. వ్యాపారులు, ఇతర సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం. ♦ ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కృషి. 30 జిల్లాలకు సంబంధించి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలకు సంబంధించి జిల్లా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఆయా జిల్లాల జాబితాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించిన అనంతరం.. ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కార్పొరేషన్ లక్ష్యాలు, ఉద్దేశాలివీ.. ♦ వ్యవసాయ రంగాన్ని వేగంగా అభివృద్ధిపర్చడం ♦ వివిధ పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం ♦ రాష్ట్రంలో రెండో హరిత విప్లవం తరహాలో కీలక అడుగు వేయడం ♦ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం ♦ కేంద్ర సంస్థలతో కలిసి ఆయా పంటలను కొనుగోలు చేయడం ♦ మార్కెట్లో మద్దతు ధర లభించనపుడు జోక్యం చేసుకుని మంచి ధర అందేలా చూడడం ♦ ఆహార పంటల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ చేపట్టడం ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించడం ♦ నాణ్యమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం ♦ అవసరమైతే సొంత ఔట్లెట్లను ఏర్పాటు చేయడం ♦ వ్యవసాయ, దాని అనుబంధ శాఖలతో కలసి పనిచేయడం -
రైతు సదస్సులకు ప్రజాప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, కరీంనగర్‌లలో 25, 26 తేదీల్లో నిర్వహించే ప్రాంతీయ రైతు సమన్వయ సదస్సులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, డీసీసీబీ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లను పిలువనున్నారు. మంగళవారం ఈ మేరకు సదస్సుల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సదస్సుల సందర్భంగా ఒక ప్రత్యేక కరపత్రం రూపొందిస్తున్నట్లు తెలిపారు. మండల, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారని చెప్పారు. 13 జిల్లాల ప్రాంతీయ రైతు సదస్సు హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో, మిగతా 17 జిల్లాలకు కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం ప్రసంగం..మధ్యాహ్నం సభ్యులతో సంభాషణ రైతులకు గుర్తింపు కార్డులు, ప్రతి బస్సుకు బ్యానర్ ఎక్కడికక్కడ వ్యవసాయ అధికారులే ఏర్పాట్లు చేసుకోవాలని పార్థసారథి సూచించారు. సదస్సు రోజు ఉదయం 9.30 గంటలకు ముందే అధికారులు, జిల్లా, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు రైతులకు ఒక గ్రీన్ ఫోల్డర్ నోట్ బుక్, రెండు పెన్నులు, ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో రెండు పేపర్లు అందజేయనున్నట్లు చెప్పారు. రైతులు తమ సలహాలను ఆకుపచ్చ కాగితంపైన, తమ ప్రశ్నలను గులాబీ రంగు కాగితంపైన రాసి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. వాటిని వ్యవసాయ అధికారులు క్రోడీకరించి అందజేయాలని, వాటిపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందిస్తారని తెలిపారు. ఉదయం సమావేశంలో సీఎం ప్రసంగిస్తారని, మధ్యాహ్న సమావేశంలో సీఎం రైతు సమితి సభ్యులతో సంభాషిస్తారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం.జగన్మోహన్, ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, అదనపు వ్యవసాయ సంచాలకులు కె.విజయకుమార్, ఆర్టీసీ ముఖ్య మేనేజర్ మునిశేఖర్ పాల్గొన్నారు. -
అధిక ధరలకు ఎరువులమ్మితే లైసెన్సు రద్దు
సాక్షి, హైదరాబాద్: ఎరువులను అధిక ధరలకు విక్రయించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్లకు లేఖ రాశారు. ఎరువుల కొరతేమీలేదని పేర్కొన్నారు. ఎరువులను గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ) కంటే ఎక్కువ ధరకు ఎక్కడైనా విక్రయించినట్లు తేలితే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. డీఏపీ సహా ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచిన నేపథ్యంలో పాతస్టాక్‌ను పాత ధరల్లోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత ఎరువులను విక్రయించిన తర్వాతే కొత్తవాటిని రైతులకు విక్రయించాలని పేర్కొన్నారు. ఈ మేరకు విక్రయాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే పెరిగిన ధరలు అమలులోకి వచ్చినందున పీవోఎస్ యంత్రాల ద్వారా విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎరువుల డీలర్లు పాత, కొత్త స్టాకు ధరలను దుకాణాల ముందు రైతులకు కనిపించేలా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఎరువుల దుకాణాలను పర్యవేక్షించేలా మండల వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీచేయాలన్నారు. దుకాణాల రికార్డు బుక్కుల్లో పాత, కొత్త స్టాకు వివరాలు సరిగా ఉన్నాయో... లేవో పరిశీలించాలని సూచించారు. -
దీర్ఘకాలిక రుణాలకు ప్రాధాన్యం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలతో పాటు రైతులకు దీర్ఘకాలిక రుణాలివ్వడంలో బ్యాంకులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దీర్ఘకాలిక రుణ లక్ష్య సాధన చాలా తక్కువగా ఉందన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఎక్కడ అవకాశం ఉందో కనిపెట్టి దానికి తగినట్టు ప్రణాళికలు వేసుకోవాలని కోరారు. జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశం వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. -
సాగు కాని భూములు గుర్తించండి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల వారీగా తనిఖీలు చేసి సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ, ఉద్యాన, పట్టు విభాగం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ రెవెన్యూ శాఖతో సంప్రదించి భూ ప్రక్షాళన వివరాల ఆధారంగా గ్రామాల వారీగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆ వివరాల ఆధారంగానే రాబోయే వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే ఈ సమాచారం ఆధారంగానే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా సాగుకు యోగ్యం కాని భూముల లెక్కలను సరిచూసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు పరస్పర సంప్రదింపులతో ఖచ్చితమైన డేటాను అందుబాటులోకి తేవాలన్నారు. గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణాధికారులు తమ పరిధిలో 2017–18 ఖరీఫ్, యాసంగి పంటల విస్తీర్ణాన్ని ఉద్యాన పంటలతో కలిపి క్రోడీకరించి వెంటనే పంపించాలని ఆయన ఆదేశించారు. ఆ వివరాలను కేబినెట్ సబ్‌కమిటీకి అందజేయాల్సి ఉందని చెప్పారు. రాబోయే బడ్జెట్లో ముఖ్యమంత్రి వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నందున రెవెన్యూ గ్రామం వారీగా వ్యవసాయ పరికరాల లభ్యత వివరాలను క్రోడీకరించి ఈనెల 12 కల్లా పంపించాలని ఆదేశించారు. 15 రోజుల కార్యక్రమం... భూ ప్రక్షాళన రికార్డుల్లో పొందుపరిచిన వ్యవసాయ పట్టా భూముల వివరాలను రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్న తర్వాత గ్రామాల్లో సాగుకు యోగ్యంకాని భూముల గుర్తింపు కార్యక్రమం ప్రారంభం అవుతుందని పార్థసారధి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి రెవెన్యూ శాఖ నుంచి సమాచారం వచ్చే అవకాశముందన్నారు. అక్కడి నుంచి సమాచారం రాగానే గ్రామాల్లో తనిఖీలు చేపడతామన్నారు. సాగుకు యోగ్యంకాని భూముల గుర్తింపు ప్రక్రియ దాదాపు 15 రోజులపాటు జరిగే అవకాశముందన్నారు. మూల విత్తనంపై దృష్టిపెట్టాలి సోయాబీన్, శనగ, వేరుశనగలో నాణ్యమైన విత్తనోత్పత్తికి సరిపడా మూలవిత్తనాన్ని సరఫరా చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ, విత్తన ధృవీకరణ సంస్థ, విత్తనాభివృద్ధి సంస్థల అధికారులతోపాటు రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ, జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ దేశీయ విత్తన భాండాగారం నుంచి ప్రపంచ భాండాగారం దిశగా, విత్తనోత్పత్తిలో నూతన విధానాలను అవలంభిస్తూ అడుగులు వేస్తున్నామన్నారు. విత్తనోత్పత్తిలో ఉన్న లోటుపాట్లను చక్కదిద్ది నాణ్యమైన విత్తనోత్పత్తి జరగాలన్నారు. అందుకే మూల విత్తనంపై దృష్టిపెట్టాలన్నారు. ఆదిలాబాద్, ముథోల్, రుద్రూరు వ్యవసాయ పరిశోధన స్థానాల్లో వెయ్యి క్వింటాళ్ల సోయాబీన్ మూల విత్తనోత్పత్తి చేపట్టాలన్నారు. గతంలోలా కాకుండా 500 క్వింటాళ్ల శనగ మూల విత్తనోత్పత్తిని రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ చేపట్టాలన్నారు. -
పంట కొనుగోళ్లకు తక్షణమే చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: కంది పంటను కొనుగోలు చేసిన తక్షణమే రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కందితో పాటు ఇతర పంటల కనీస మద్దతు ధరకు కొనుగోలుపై మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, హాకా, నాఫెడ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు పరిశీలించిన తర్వాతే కొనుగోళ్లు జరపాలని సూచించారు. ఇప్పటివరకు రైతుల నుంచి సుమారు 9.87 లక్షల క్వింటాళ్ల కందిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి రూ.21 కోట్లు వెంటనే విడుదల చేయాలని నాఫెడ్‌ను ఆదేశించారు.