పార్థసారథికి పౌరసరఫరాలు
తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన శాఖలలో 39 మంది ఏఎఎస్ అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చారు. అందులో పార్థసారథికి పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నియమించారు. చిన్ననాటి నుంచి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో విద్యను కొనసాగించిన పార్థసారథికి మొదట ఆర్డీఓగా ఉద్యోగం సాధించారు. తన లక్ష్యమైన ఐఏఎస్‌ను పదోన్నతిపై పొందవచ్చని ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తన పనితీరుతో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా, డీఆర్వోగా, పీడీగా పని చేశారు. యూపీఎస్‌సీ ప్రొసిజర్ ఆధారంగా 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. సంయుక్త కలెక్టర్‌గా, కలెక్టర్‌గా, మార్క్‌ఫెడ్ ఎండీగా, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా, చలనచిత్ర, టీవీ, నాటక రంగ సంస్థ ఎండీగా పలు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు.
కలిసి వచ్చిన సాన్నిహిత్యం
పార్థసారథి కరీంనగర్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజవకర్గం నుంచి కేసీఆర్ ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గం సమస్యల పరిష్కారంలో కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం పార్థసారథికి కలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంచాలకులుగా పని చేస్తున్న ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆర్మూర్ పట్టణంలోని ఆయన బంధువులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆర్మూర్‌వాసి కీలకమైన బాధ్యతలు నిర్వహించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగదీశ్వర్‌కు విద్యాశాఖ
గ్రామీణ నేపథ్యం నుం చి ఐఏఎస్ స్థాయికి ఎదిగిన జగదీశ్వర్‌కు నూతన రాష్ట్రంలో కీలకమైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా బాధ్యతలతో పాటు అదనంగా రవా ణాశాఖను అప్పగించారు. బీ ర్కూర్‌కు చెందిన మునిగెల విశ్వనాథం-ప్రేమల దంపతు ల కుమారుడైన జగదీశ్వర్ పదోతరగతి వరకు బీర్కూర్ లో చదివారు. ఇంటర్ బోధన్‌లోని మధుమలాంచ, డిగ్రీ నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలల్లో పూర్తిచేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంకామ్ పూర్తిచేసి, గోల్డ్‌మెడల్ సాధించారు.
తొలి ప్రయత్నంలో
జగదీశ్వర్ చదువు పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే 1983లో హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగాన్ని సంపాదించారు. 1987లో గ్రూప్-1లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలను తీసుకున్నారు. వివిధ శాఖల్లో పనిచేస్తూ ఐఏఎస్ స్థాయికి ఎదిగారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జగదీశ్వర్‌ను మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియమించారు. అనంతరం హైదరాబాద్ జలమండలి, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా విధులు నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఆయనను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా నియమిస్తూ.. అదనంగా రవాణా శాఖను సైతం అప్పగించా రు. ఉన్నత స్థానాలకు ఎదిగినా జగదీశ్వర్ కన్నఊరిని మరిచిపోకుండా బీర్కూర్‌కు సేవలందిస్తున్నారు. తనకు జన్మనిచ్చిన ఊరికి మరిన్న సేవలందిస్తానని ‘న్యూస్‌లైన్’తో జగదీశ్వర్ పేర్కొన్నారు.
జిల్లావాసులకు కీలక బాధ్యతలు
Published Wed, Jun 4 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement