
సాక్షి, విజయవాడ : బీసీలను మరోసారి మోసం చేయడానికి ‘ఆదరణ’ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు కొత్త నాటకానికి తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబుకు సరిగ్గా ఎన్నికల ముందే బీసీలు గుర్తుకు వస్తారన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోసమే టీడీపీ రాజమండ్రిలో జయహో బీసీ సభ నిర్వహిస్తుందని, ఈ సభకు రాకుంటే నగదు ఇవ్వమని డ్వాక్రా మహిళలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలన పుణ్యమా.. బీసీలు తమ కులవృత్తులు చేసుకోలేక దుర్భర జీవితాన్ని సాగిస్తున్నారని, జన్మభూమి కమిటీల వద్ద బీసీలను బానిసలుగా మార్చింది టీడీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. బీసీ వర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చమని సీఎం చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. బీసీలు టీడీపీకీ కేవలం ఓటు బ్యాంకుగానే కనిపిస్తున్నారని, చంద్రబాబు మాయలో బీసీ సోదరులు పడవద్దని పార్థసారథి ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే బీసీ సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment