ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ప్రశ్నించారు. రైతులకు అండగా నిలిచేందుకే రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటిస్తున్నారని ఆయన చెప్పారు. బుధవారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.