14 నుంచే ‘రైతుబీమా’ అమలు | 'Farmer Insurance' implementation from 14 | Sakshi
Sakshi News home page

14 నుంచే ‘రైతుబీమా’ అమలు

Published Sun, Aug 5 2018 1:58 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

'Farmer Insurance' implementation from 14 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 14 నాటికే రైతుబీమా పూర్తిస్థాయిలో అమల్లోకి రానుందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. ఈ నెల 6 నుంచి 14నాటి కి రైతులకు బీమాపత్రాలు ఇస్తామన్నారు. 14 నుంచి సంబంధిత రైతు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 10 రోజుల్లో రూ.5 లక్షలు క్లెయిమ్‌ అందుతుందన్నారు. దీన్ని ఎల్‌ఐసీకి  తెలియజేశామని పేర్కొన్నారు.

రైతుబీమా పత్రాల పంపిణీ కార్యక్రమా న్ని గ్రామసభల్లో అందజేయాలని నిర్ణయించామని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనాల ని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. 6న ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నా ప్రత్యేకంగా ప్రారంభం అంటూ హడావుడి చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. బీమా పాలసీకి ప్రారంభ ఉత్సవం చేయడమంటే సెంటిమెంట్‌గా మంచిది కాదని సర్కారు భావించినట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement