farmers insurance
-
రామోజీ అర్ధసత్యాల ‘బీమా’ కలాపం
అసలు చంద్రబాబునాయుడి హయాంలో మొత్తం ఐదేళ్లలో పంట నష్టపోయినందుకు ఎంతమంది రైతులకు బీమా ఇచ్చారో తెలుసా? కేవలం 30.85 లక్షల మందికి!. మరి వారికిచ్చిన మొత్తమెంతో తెలుసా? కేవలం 3,411.20 కోట్లు!. అది కూడా... ఐదేళ్లూ కరువుతో అల్లాడిన రాష్ట్రంలో. నిజానికి కరువు పరిస్థితులున్నపుడు దెబ్బతినే పంట ఎక్కువుంటుంది. అయినా సరే.. బాబు రైతులకిచ్చిన పరిహారం ఇంతే!!. ఈ ప్రభుత్వ పనితీరును పోల్చాలంటే గత ప్రభుత్వంతోనే కదా? అంతకన్నా మెరుగ్గా చేశారా లేదా అన్నదే కదా ప్రామాణికం. ఎందుకంటే వై.ఎస్.జగన్ సర్కారు బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచీ చక్కని వర్షాలు పడ్డాయి. పంటలూ విరగపండాయి. మునుపటితో పోలిస్తే నష్టం తక్కువ జరిగినా... ప్రతి ఎకరాన్నీ పరిగణనలోకి తీసుకోవటంతో... గడిచిన మూడున్నర ఏళ్లలో ఏకంగా 44.66 లక్షల మందికి బీమా పరిహారమిచ్చింది ఈ సర్కారు. వారికి చెల్లించిన మొత్తం ఏకంగా రూ.6684.84 కోట్లు. ఈ రెండింటికీ అసలు ఏ కొంచమైనా పోలిక ఉందా? మరి గతంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి కూడా బీమా పరిహారం చెల్లించలేదని రైతుల తరఫున ఒక్క అక్షరమైనా ‘ఈనాడు’ రాసిందా? ఎందుకు పెన్నెత్తలేదు రామోజీ? ఇప్పుడెందుకు ఇంత మేలు చేస్తున్న ప్రభుత్వంపై అదేపనిగా బురద జల్లుతున్నారు? ‘బీమా ఆశలపై నీళ్లు’ అంటూ సోమవారం పతాక శీర్షికల్లో అచ్చేసిన కథనం దేనికి చిహ్నం? గత ప్రభుత్వం కన్నా ఎందులోనైనా వెనకబడితే అడిగినా తప్పులేదు!. కానీ పోలికే లేని విధంగా మూడున్నరేళ్లలో నాటి ప్రభుత్వం ఐదేళ్లలో చెల్లించిన బీమా మొత్తానికి దాదాపుగా రెట్టింపు పరిహారం చెల్లించిన ఈ ప్రభుత్వాన్ని విమర్శించటం తగునా రామోజీ? అసలు ‘ఈనాడు’ రాసిన రాతల్లో ఏది నిజం? నాడు... రైతులే బీమా ప్రీమియం చెల్లించాలి విశేషమేంటంటే చంద్రబాబునాయుడి హయాంలో రైతులే బీమా ప్రీమియం చెల్లించాలి. చెల్లించినా కూడా వారికి పరిహారం వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే దిగిపోతూ దిగిపోతూ రైతులకిచ్చే పరిహారంలో ఏకంగా రూ.715 కోట్ల బకాయిలు పెట్టి మరీ దిగిపోయిన చరిత్ర చంద్రబాబుది. దాన్నికూడా ఏనాడూ ‘ఈనాడు’ ప్రశి్నంచలేదు. అప్పట్లో చాలామంది రైతులు ప్రీమియం చెల్లించలేకుంటే వారిని నారా వారు పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క రైతూ నష్టపోకూడదనే ఈ–క్రాప్ వ్యవస్థను తెచ్చింది. ఈ–క్రాప్‌లో నమోదైన నోటిఫైడ్ పంటలు ప్రతి ఎకరాకీ ఆటోమేటిగ్గా బీమా అమలవుతుంది. ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. పైపెచ్చు ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్లో భాగంగా ఆర్బీకేల్లో పేర్లు ప్రదర్శించటం... పేర్ల నమోదులో తేడాలుంటే సరిదిద్దటం చిత్తశుద్ధితో చేస్తోంది. అందుకే రైతుల్లో ఆ సంతృప్తి!. దాన్ని అసంతృప్తిగా చిత్రీకరించడానికి రామోజీ చేస్తున్న అక్షర విధ్వంసంలో భాగమే తాజా కథనం. రబీలో పంటనష్టం తక్కువని తెలియదా? రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని పరిశీలిస్తే రబీలో ప్రకృతి వైపరీత్యాలు అత్యంత అరుదు. మంచు లేదా బోర్లమీదో.. లేకుంటే పక్కా నీటి సరఫరా ఉంటేనే ఈ సీజన్లో పంటలు సాగవుతాయి. వైపరీత్యాలు అత్యంత అరుదు కాబట్టి, పంటల బీమా పరిస్థితులూ సహజంగా రావు. రబీ పంట ఫిబ్రవరి– మార్చి నెలల్లో వస్తుంది కాబట్టి... అప్పటికి వర్షాల సీజన్ కూడా మొదలు కాదు కాబట్టి నష్టమూ తక్కువే. ఒక్క ఖరీఫ్ సీజన్లోనే అత్యధిక వర్షపాతం వల్లో... అత్యల్ప వర్షపాతం వల్లో పంటలు దెబ్బతిని బీమా చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఖరీఫ్‌లో తెగుళ్లు, ఇతర వ్యాధులు ప్రబలి పంటలు నష్టపోయిన పరిస్థితులు కూడా ఎక్కువే. బాబు హయాంలో ఖరీఫ్‌లోనే పంటల బీమా. రబీలో బీమాయే లేదు. ఈ విషయం ఇటు రామోజీరావుకు గానీ... అటు చంద్రబాబు నాయుడికి గానీ తెలియంది కాదు. అయినా పంట నష్టం జరిగి పరిహారమివ్వకపోతే ప్రశ్నించినా తప్పు లేదు. కానీ బీమా చెల్లించలేదంటూ నిందలేల? రాష్ట్ర ప్రభుత్వమే బీమా కంపెనీని నిర్వహిస్తోంది. నష్టపోయి పరిహారం క్లెయిమ్ చేసిన రైతులకు తనే పరిహారం చెల్లిస్తుంది. మరి ఇందులో బీమా ప్రీమియం అంశం ఎక్కడుంది? ప్రభుత్వమే బీమా కంపెనీ నిర్వహిస్తున్నపుడు రబీ ప్రీమియం గురించి రామోజీకెందుకు అంత ఉలికిపాటు? కేంద్రం అభ్యర్ధించటంతో... రాష్ట్ర ప్రభుత్వమే బీమా కంపెనీ పెట్టి... శెహబాష్ అనిపించుకునే రీతిలో నడుపుతూ ఏ ఒక్క రైతుకూ నష్టం జరగకుండా చూడటంతో కేంద్రం దిగి వచ్చిందనే చెప్పాలి. కొన్నాళ్ల కిందట కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఫసల్ బీమా యోజనలో భాగస్వామి కావాలంటూ ఆయనే అభ్యర్ధించారు. దాన్లో ఉన్న ఇబ్బందులను, చేయాల్సిన మార్పులను ముఖ్యమంత్రి పూర్తిగా వివరించటంతో... కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. ఇక్కడ అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అధ్యయనం చేసింది. నోటిఫైడ్ పంటలు సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకూ ఆటోమేటిగ్గా బీమా వర్తింప చేసేలా ఫసల్ బీమా యోజనలో కొన్ని మార్పులను సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఆయన సూచనల మేరకు రైతులందరినీ బీమా పరిధిలోకి తీసుకొస్తామని, అందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తామని కేంద్రం మాట ఇచ్చింది. ఈ–క్రాప్ డేటా ఆధారంగా ఏపీలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుండగా... ఇదే డేటాను తామూ ప్రామాణికంగా తీసుకుంటామని, నోటిఫైడ్ పంటలు సాగుచేసే రైతులందరికీ వర్తింప చేసేలా ఫసల్ బీమా యోజనలో మార్పులు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చి రాష్ట్రానికి రెడ్ కార్పెట్ వేసింది. దీంతో మళ్లీ కేంద్ర పథకంలో చేరడానికి రాష్ట్రం సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఈలోగా తాము ఏర్పాటు చేసిన బీమా కంపెనీకి రెగ్యులేటరీ లైసెన్సు కోసం ప్రయత్నాలను మాత్రం మానలేదు. ఇది కేంద్ర పరిధిలోని అంశం కావటంతో దీనికోసం లేఖలు రాయటంతో పాటు నేరుగా అభ్యర్థిçస్తూ ఆ ప్రయత్నాలనూ కొనసాగిస్తూనే ఉంది. ‘ఈనాడు’కు మాత్రం ఇవేవీ పట్టవు. కేంద్ర పథకం నుంచి రాష్ట్రం బయటకు వచ్చినపుడు కూడా రామోజీరావు అడ్డగోలు రాతలే రాశారు. ఆ తరవాత మళ్లీ కేంద్ర పథకంలో రాష్ట్రం చేరుతున్నపుడు కూడా అడ్డుకోవటానికి శతథా ప్రయతి్నస్తూ విమర్శలే చేశారు. తాజా సీజన్‌కు రాష్ట్రమే ప్రీమియం, పరిహారం చెల్లిస్తుండగా... దానిపైనా అవాస్తవాలకే పట్టం గడుతున్నారు. బాబు హయాంలో అడిగితే ఒట్టు? అసలు కేంద్ర పథకంలో లోపాలున్న విషయాన్ని చంద్రబాబు హయాంలో ఒక్కనాడు కూడా రామోజీ ప్రస్తావించలేదు. రాష్ట్రమే నేరుగా అమలు చేయొచ్చుననే ఆలోచన కూడా ఈ గురుశిష్యులకు రాలేదు. అసలు ఖరీఫ్ సీజన్లో జరిగిన నష్టాన్ని మళ్లీ ఖరీఫ్ మొదలు కాకముందే ఇవ్వటమనేది మీ జన్మలో చూశారా రామోజీ? అలాంటి ఆలోచనైనా మీ చంద్రబాబుకు వచ్చిందా? ఇప్పుడెందుకు పనిచేస్తున్న ఈ ప్రభుత్వంపై పసలేని విమర్శలు? రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వైఎస్సార్ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నందుకు ఒక్కనాడైనా ప్రశంసిస్తూ ఒక్క అక్షరమైనా రాశారా? జగన్ ప్రభుత్వం చేసే మంచిని చూడకుండా... లేనిపోని విమర్శలకే పరిమితమవుతున్నారెందుకు? మీది ప్రతిపక్ష పాత్రా? లేకపోతే ప్రతినాయకుడి పక్షం వహించే పాత్రా? మీదిప్పుడు రాసే పాత్ర కాబట్టి పాఠకులతో సహా ఎవ్వరికీ సమాధానం ఇవ్వక్కర్లేదనుకోవచ్చు. కానీ మీకు మీరైనా జవాబు చెప్పుకోవాలి కదా? అనుమానాస్పద ఖాతాలు పరిశీలించొద్దా? కొన్ని ఖాతాలు అనుమానాస్పదంగా ఉండటంతో వాటిపై పరిశీలన జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదిగో... అలాంటి వారికే రూ.67 కోట్లు ఇవ్వలేదనేది ‘ఈనాడు’ ఆరోపణ. పత్రికా ముఖంగా ఒక ప్రభుత్వంపై ఆరోపణ చేసేటపుడు అధికారులను అడిగైనా నిజాలు తెలుసుకోవాలి కదా రామోజీ? అనుమానాస్పద ఖాతాలను పరిశీలించాలని అనుకోవటం తప్పా? ఆ పరిశీలన పూర్తయ్యింది. సోషల్ ఆడిట్‌కూడా పూర్తయ్యింది. ఈనెల 29న ఈ డబ్బు ఇవ్వబోతున్నామని స్వయంగా అధికారుల సమీక్షా సమావేశంలోనే ముఖ్యమంత్రి ఇటీవల చెప్పారు. కానీ ఈ విషయం ప్రస్తావించకుండా... పచ్చి అబద్ధాలను వండేశారు రామోజీరావు. రామోజీ, ‘ఈనాడు’ది జీవితం అంతా ఇదే బతుకా? కౌలు రైతుల మేలు కోసం సీసీఆర్సీ కార్డులను తీసుకువచ్చిన ప్రభుత్వమిది. గ్రామ సచివాలయాల్లోనే దరఖాస్తు నింపి అన్ని ప్రభుత్వ పథకాలను, సహాయాలను పొందే అవకాశాన్ని వారికి కలిగించిన ప్రభుత్వమిది. అంతేకాదు! ఎక్కువ మంది రైతులు వీటిని వినియోగించుకునేలా అవగాహన కలిగిస్తున్న ప్రభుత్వమిది. టీడీపీ హయాంలో జరిగింది ఇదీ... చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో సగటున ఏడాదికి 20.28 లక్షల మంది రైతులు, 23.57 లక్షల హెక్టార్లకు మాత్రమే బీమా చేయించుకోగలిగారు. 2014–16 మధ్య వ్యవసాయ బీమా పథకం కింద 5.38 లక్షల మందికి రూ.471.94 కోట్లు, 2016–19 మధ్య పీఎంఎఫ్‌బీవై కింద 25.47 లక్షల మందికి రూ.2939.26 కోట్ల బీమా మొత్తాన్ని అందించారు. మొత్తంగా ఐదేళ్లలో కేంద్ర బీమా పథకాల ద్వారా రూ.3,411.20 కోట్ల పరిహారాన్ని అందించారు. నాటి ‘ప్రధాని ఫసల్ బీమా యోజన’లో పంటను బట్టి ప్రీమియాన్ని నిర్ణయించాక... దాన్లో 2 శాతాన్ని రైతులే చెల్లించేవారు. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకులే ఈ మొత్తాన్ని మినహాయించేసి బీమా చేయించేవి. మిగిలిన రైతులకు బీమా గురించి తెలిసేదే కాదు. ప్రకృతి వైపరీత్యాలతో వారి పంట దెబ్బతింటే... వారికి బీమాయే లేదు కాబట్టి ప్రభుత్వం చేతులెత్తేసేది. బీమా ఉన్నవారికి కూడా ఒక సీజన్లో నష్టం జరిగితే రెండు మూడు సీజన్లు గడిచాక పరిహారం వచ్చేది. కేంద్ర పథకంలోని పరిమితులతో రైతులు నష్టపోతున్నారని భావించిన వై.ఎస్.జగన్ సర్కారు.. నోటిఫైడ్ పంటలు వేసే రైతులందరికీ బీమా వర్తింప చేయాలని డిమాండ్ చేసింది. ప్రీమియం చెల్లించిన వారికేనని కేంద్రం చెప్పడంతో ఆ పథకం నుంచి బయటికొచ్చేసింది. 2019 జూలై 8న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని తెస్తూ బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్నారు వైఎస్ జగన్. ఈ–క్రాప్‌ను సమర్థంగా అమలు చేస్తూ... పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతుకూ బీమా వర్తించేలా... ఆర్బీకేల్లోనే రసీదు ఇస్తున్నారు. ఆ రసీదు.. ఈ–క్రాప్‌లో నమోదు చేసినట్లు రైతుకిచ్చే అధికారిక గుర్తింపు. దాని ఆధారంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ నేరుగా సీజన్ తిరిగి రాకముందే పరిహారం అందుతోంది. ఇందులో రైతు వాటాతో పాటు కేంద్రం వాటానూ రాష్ట్రమే భరిస్తోంది. ఇక ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో నష్టం జరిగితే.. ఆ సీజన్లోనే చెల్లిస్తున్నారు. ఇలాంటి ప్రక్రియను చరిత్రలో తొలిసారిగా అమలు చేయటంతో పాటు... ఏటా క్యాలెండర్ పెట్టుకుని మరీ రైతులకు డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి పంపిస్తున్నారు కనకే చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే పంటల బీమా పరిధిలోకి వచ్చే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్యకూడా 3 రెట్లు పెరిగి... ఇది రైతు ప్రభుత్వమయ్యింది. -
రైతుల్ని ఆదుకుంటే సహించలేని ఈనాడు
మైలవరం (జమ్మలమడుగు రూరల్): అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండుకళ్లుగా జనరంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ఏదో ఒకరకంగా రోజూ బురద చల్లాలనే కార్యక్రమానికి పూనుకున్న ఈనాడు పత్రిక.. వాస్తవాలను మరుగుపరిచి వార్తలు వండివారుస్తోంది. వైఎస్సార్ జిల్లాలో రైతులకు పంటల బీమా అందటం పైనా పరిహారం.. పరిహాసం! పేరిట ఒక కథనాన్ని వండింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉన్న ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోయిన అన్నదాతల్ని ఆదుకోవడమే తప్పన్నట్లుగా అచ్చేసింది. సాగుచేస్తే.. ఈ–క్రాప్ నమోదు ఈ–క్రాప్ నమోదుకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్వోపీ) ఉంది. దీని ప్రకారం రైతు తనకు చెందిన పొలం కాకపోయినా.. అది ఎలాంటి పొలమైనా అందులో పంట వేస్తే చాలు వాటిని ఈ–క్రాప్ చేయవచ్చు. తద్వారా పంట నష్టపోతే రైతుకు బీమా పరిహారం అందించవచ్చు. ఏం జరిగిందంటే.. మైలవరం మండలంలోని ఆరు గ్రామాల్లో ఏసీసీ యాజమాన్యం గతంలో మూడువేల ఎకరాల భూమి కొనుగోలు చేసింది. ఏసీసీ యాజమాన్యం ఇక్కడ సిమెంటు ఫ్యాక్టరీ నిర్మించకపోవడంతో అందులో 2,700 ఎకరాల భూమిని గత పదేళ్లుగా స్థానిక రైతులే సాగుచేసుకుంటున్నారు. 14 సర్వే నంబర్లలోని 54.26 ఎకరాల్లో ఆరుగురు రైతులు 2021 ఖరీఫ్‌లో పత్తి, వేరుశనగ పంటలు సాగుచేశారు. బెస్తవేముల సచివాలయంలోని హార్టికల్చర్ అసిస్టెంట్ ఈ–క్రాప్ చేశారు. ఈ 54.26 ఎకరాలకు దాదాపు రూ.10 లక్షల పంటల బీమా మంజూరైంది. అన్నదాతల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. రైతులకు పరిహారం ఇవ్వడమే తప్పన్నట్లుగా ఈనాడు శివాలెత్తింది. అక్రమాలు జరిగిపోతున్నాయంటూ కథనం రాసేసింది. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారించారు. అక్కడ పంటలు వేసింది నిజమేనని, ఆమేరకు ఈ–క్రాప్ చేశారని నిర్ధారించి కలెక్టర్‌కు నివేదిక పంపారు. ఇదిలా ఉండగా.. కలెక్టర్ నిర్ణయం మేరకు ఈ రైతులకు బీమా పరిహారం అందనుంది. -
‘ఫసల్ బీమా’ ఇక స్వచ్ఛందమే
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రైతు బీమా పథకం ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)’లో కేంద్రం కీలక మార్పు చేసింది. ఆ పథకంలో చేరడం తప్పనిసరి కాదని, రైతులు ఇకపై అందులో చేరడం స్వచ్ఛందమేనని కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. పంట రుణాలు తీసుకున్న రైతులు కచ్చితంగా చేరాలన్న నిబంధన ఇప్పటివరకూ ఉండేది. తాజా నిర్ణయంతో, రుణాలు తీసుకున్న రైతులు కానీ, తీసుకోవాలనుకుంటున్న రైతులు కానీ ఈ బీమా పథకంలో అవసరమనుకుంటేనే చేరొచ్చు. రైతు సంఘాలు, పలు రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, కేంద్ర కేబినెట్ బుధవారం దీనికి ఆమోదం తెలిపినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. పీఎంఎఫ్‌బీవైతో పాటు రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకంలోనూ తదనుగుణంగా మార్పులు చేశామని అందులో పేర్కొన్నారు. నిరోధించలేని ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, పండ్ల తోటలు, వ్యాపార పంటలకు 5% ప్రీమియంతో సమగ్రంగా బీమా సౌకర్యం కల్పించేలా పీఎంఎఫ్‌బీవైని రూపొందించారు. పీఎంఎఫ్‌బీవైపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ బుధవారం తెలిపారు. కేబినెట్ భేటీలో ఆమోదించిన ఇతర నిర్ణయాలు.. ► కృత్రిమ గర్భధారణ, ఇతర పునరుత్పత్తికి సంబంధించిన రంగంలోని వైద్య నిపుణులు, క్లినిక్‌లను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా నేషనల్ రిజిస్ట్రీని, రిజిస్ట్రేషన్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ‘అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(నియంత్రణ) బిల్’కు కేబెనెట్ ఆమోదం తెలిపింది. గర్భంలోని శిశువు లింగ నిర్ధారణకు, పిండం(ఎంబ్రియొ), బీజకణం(గామెట్) అమ్మకానికి కఠిన శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. వీటి అక్రమ వినియోగానికి, అమ్మకానికి మొదటి సారైతే రూ. 10 లక్షలు, మరో సారి అదే నేరానికి పాల్పడితే 12 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో పేర్కొన్నారు. కృత్రిమ గర్భధారణ కోరుకుంటున్న దంపతులు, అందుకు సహకరిస్తున్న మహిళ కుటుంబం వివరాలను రహస్యంగా ఉంచాలనే, వారి పునరుత్పత్తి హక్కులను రక్షించాలనే ప్రతిపాదనలను కూడా ఈ బిల్లులో పొందుపర్చారు. ► క్లిష్టమైన అంశాల్లో ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు ఉద్దేశించిన 22వ న్యాయ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడేళ్ల కాల వ్యవధితో కొత్త కమిషన్‌ను న్యాయ శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్‌లో ఒక చైర్పర్సన్, నలుగురు పూర్తిస్థాయి సభ్యులు(సభ్య కార్యదర్శి సహా), ఐదుగురికి మించకుండా తాత్కాలిక సభ్యులు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. ► పాడి రైతులకు ప్రయోజనం కలిగేలా రూ. 4,558 కోట్లతో రూపొందించిన పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. పాడి రైతుల రుణాలకు కల్పించే వడ్డీ రాయితీని 2% నుంచి 2.5శాతానికి పెంచే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపిందన్నారు. ► స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ) రెండో దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 52,497 కోట్ల అంచనా బడ్జెట్‌తో(కేంద్రం, రాష్ట్రాలు కలిసి) 2020–21 నుంచి 2024–25 మధ్య ఈ రెండో దశను అమలు చేస్తారు. అధికారిక లెక్కల ప్రకారం, 2019, అక్టోబర్ 2 నాటికి, అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహితం(ఓడీఎఫ్) అయ్యాయి. ► రూ. 4,496 కోట్ల బడ్జెట్‌తో 2024 నాటికి కొత్తగా 10 వేల ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే, 2024 నుంచి 2028 వరకు వీటి నిర్వహణ కోసం రూ. 2,369 కోట్లకు కేటాయించింది. రైతుల ఆదాయ పెంపు, దిగుబడి ఖర్చు తగ్గింపు లక్ష్యంగా ఇవి పనిచేయనున్నాయి. -
‘వైఎస్సార్ రైతు భరోసా’కు సర్వం సిద్ధం
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలుకు సర్వం సిద్ధం చేసామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. జిల్లాలో 3.50 లక్షల మంది రైతుల జాబితా సిద్ధం చేసామని తెలిపారు. ఆధార్ సమస్య ఉన్న వారి రికార్డులను సరిచేసి..రెండో విడత జాబితా సిద్ధం చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. కౌలు రైతులు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో రైతు భరోసా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారని వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాల్లో పథకం అమలవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. -
15న నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభం
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో ‘రైతు భరోసా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ..అర్హులైన రైతులందరూ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ లింక్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు. రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తెలుగు గంగ అధికారులతో చర్చించి.. తెలుగు గంగ పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. -
ప్రవాసీలను ఆదుకోని రైతు బీమా
ఎస్.వేణుగోపాలచారి–కామారెడ్డి, నాగమళ్ల శ్రీకర్–రాయికల్,జవ్వాడి చంద్రశేఖర్–మల్యాల : వాతావరణ పరిస్థితులు అనుకూలించక.. పండించిన కొద్దిపాటి పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడంతో సొంత ఊరిని వదిలి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన రైతులకు ‘రైతు బీమా’ పథకం వర్తించడం లేదు. ఉపాధి కోసం గల్ఫ్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లిన వారిలో భూమి ఉన్న వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు ఉంటారని అంచనా. వీరికి రైతు బీమా పథకం అందకుండా పోతోంది. దీంతో పొట్ట చేతపట్టుకుని విదేశాలకు వెళ్లిన రైతులకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకం ద్వారా భూ యజమానులకు కొత్త పట్టా పాస్‌పుస్తకాలు, ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంతో పాటు రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించింది. అయితే, స్వయంగా భూ యజమాని వచ్చి తమ పేరిట ఉన్న పాసు పుస్తకాన్ని, రైతు బంధు చెక్కు అందుకోవాలని, బీమా ఫారంపై సంతకం చేయాలనే నిబంధనలు వలస రైతుల పాలిట శాపంగా మారాయి. రైతు బీమా, రైతు బంధు పథకం వర్తించడానికి విదేశం నుంచి స్వదేశానికి రావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన మొదట్లో విదేశాల్లో ఉన్నవారికి రైతుబంధు ప్రయోజనాలను వర్తింపజేయకపోవడం వల్ల ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో రైతుబంధు పథకాన్ని గల్ఫ్‌లో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు వర్తింపజేయాలని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం(ప్రవాసీ సంక్షేమ వేదిక) ఆధ్వర్యంలో ప్రవాసులు వారి కుటుంబ సభ్యులు సైతం పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది జూలై 7న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతి పత్రం సమర్పించారు. అయినా, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ అధ్యక్షుడు మంద భీంరెడ్డి, మాజీ భారత రాయబారి బి.ఎం.వినోద్‌కుమార్‌లు ప్రవాసంలో ఉన్న తెలంగాణ రైతుల పక్షాన ఉమ్మడి హైకోర్టులో గతేడాది జూలై 20న ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున ప్రముఖ న్యాయవాది బొల్లు రచనారెడ్డి వాదించారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని, రెండు నెలల్లో గల్ఫ్‌లోని ప్రవాసీలకు ‘రైతుబంధు’ వర్తింపును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని గతేడాది జూలై 24న ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఎన్నారై కుటుంబ సభ్యులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేయాలని అప్పట్లో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, రూ.5లక్ష బీమా వర్తింపు విషయంలో ఇప్పటివరకు సానకూల నిర్ణయం తీసుకోకపోవడంతో వలస రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిబంధనలను సడలించి వలస వెళ్లిన ప్రవాసీ రైతులకు రైతుబీమా వర్తింపజేయాలని వారి కుటుంబీకులు కోరుతున్నారు. విదేశాలకు వెళ్లిన రైతులను కూడా ఆదుకోవాలి విదేశాల్లో ఉన్న రైతులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రైతులకు బీమా పథకాన్ని వర్తింజేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. స్వదేశంలో ఉన్న రైతులతో సమానంగా విదేశాలలో ఉన్న రైతులకు ఎల్ఐసీ వారి రూ.5లక్షల గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (బృంద జీవిత బీమా)ను మెయిల్ ఆర్డర్ బిజినెస్ పద్ధతిలో వర్తింపజేయాలని కోరాం. విదేశాల్లో తెలంగాణ రైతులకు కూడా అన్ని రకాల ‘రైతు బంధు’ ప్రయోజనాలను కల్పించడానికి ఒక సిస్టమ్‌ను రూపొందించాలి. ఎన్నారై రైతుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. –మంద భీంరెడ్డి, ప్రవాసీ కార్మికుల హక్కుల కార్యకర్త వ్యవసాయం సరిగా లేకనే గల్ఫ్‌కు.. నా భర్త అయిత భూమయ్య పేరిట కట్కాపూర్ గ్రామంలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇక్కడ వ్యవసాయం సరిగా లేకనే ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లాడు. యూఏఈలోని పుజీరాలో ఓ కంపెనీలో పనికి కుదిరాడు. అయితే, కంపెనీ యాజమాన్యం కొన్నేళ్లు జీతం ఇవ్వకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై తన రూమ్‌లో ఉరివేసుకొని మృతిచెందాడు. నా కొడుకు శశికుమార్ బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కూతురు ప్రవళిక డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి చదువుల కోసం మా ఆయన ఎంతో కష్టపడేవారు. ఇక్కడ సరైన నీటి సదుపాయం లేకపోవడంతో ఉన్న రెండున్నర ఎకరాల భూమిని ఏదో విధంగా సాగుచేశాం. అయినా, పంటలు సరిగా పండలేదు. పంటకు చేసిన అప్పుల గురించి, పిల్లల పోషణ గురించి భూమయ్య ఎప్పుడూ ఆలోచించేవాడు. ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని గల్ఫ్‌కు వెళ్లిన వారికి కూడా వర్తింపజేస్తే మాలాంటి నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుంది. – సునీత, కట్కాపూర్, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా పెట్టుబడి సాయం అందినా.. బీమా రాలేదు నా భర్త రవీందర్ పేరిట 21గుంటల భూమి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కింద రెండు పర్యాయాలు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కూడా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. కానీ, స్థానికంగా లేడని.. రైతు బీమా బాండు ఇవ్వలేదు. ఉపాధి కోసం నా భర్త సౌదీ అరేబియాకు వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మాకు రైతు బీమా వర్తించకపోవడంతో నష్టపోయాం. ఆపద్బంధుకు దరఖాస్తు చేసుకోలేదు.–నల్లపు మణెమ్మ, సర్వాపూర్, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా -
నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరించాలి
-
నకిలీ విత్తనాల చలామణీపై వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, అమరావతి : నకిలీ విత్తనాల చలామణీపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకడుగు వేయొద్దన్నారు. దీనిపై నూతన విత్తన చట్టం తేవాలని వైఎస్ జగన్‌కు అధికారులు సూచించారు. అవసరమైతే అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని వైఎస్ జగన్ అన్నారు. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలను, వ్యవసాయ రంగం అవసరాలకు ప్రధాన కేంద్రంగా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో వినియోగించే విత్తనాలు, ఎరువులు, మందుల పంపిణీ గ్రామ సచివాలయాల ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవలసిందిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. 'ప్రభుత్వం సేవలు అందించిందీ అంటే దానికో ప్రత్యేక బ్రాండ్ పడాలి. రైతులకు ప్రభుత్వ సేవలపై విశ్వసనీయత పెంచాలి. నాణ్యమైన విత్తనాలు గ్రామ సచివాలయాల ద్వారా రైతులకు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలి. అవినీతి జరిగిందంటే ఎవరు క్షమించలేని చర్యలు తీసుకుంటాం. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి. ఉత్తమమైన సలహాలు ఇస్తే చాలా సంతోషిస్తాను. అటువంటి వారికి సన్మానం చేస్తాం. రైతులకు బీమా సౌకర్యం సక్రమంగా అందించే పూర్తి బాధ్యత ఇక ప్రభుత్వానిదే. ప్రీమియం కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. పరిష్కారాలు వంద శాతం ఉండాలి. రైతులకు ప్రయోజనాలు అందకపోతే ప్రభుత్వాలెందుకు. 62 శాతం రైతులపైనే ఆధారపడుతుంటే వారికి కావలసినవి ఏమీ చేయకపోతే ఉపయోగం ఏమిటి? రైతు సంతృప్తి చెందకపోతే ఎంత చేసినా వృధానే' అని వైఎస్ జగన్ అన్నారు. -
‘బీమా’ బాసట
సాక్షి, హైదరాబాద్: వివిధ కారణాలతో అకాల మరణం పొందే రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతుబీమా’ పథకం ఇప్పటివరకు పది వేలకు పైగా కుటుంబాలకు భరోసా కల్పించింది. బీమా పథకం కింద లబ్ది పొందిన వారిలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 10,012 కుటుంబాలకు రైతు బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరగా, క్లెయిమ్‌ల రూపంలో 500.60 కోట్లు నామినీల ఖాతాలకు జమ చేశారు. రైతు బీమా పథకం కింద లబ్ధిపొందిన రైతు కుటుంబాల్లో 91శాతం మేర కేవలం ఐదు ఎకరాలలోపు భూ విస్తీర్ణం కలిగినవారే ఉండటం గమనార్హం. లబ్ధిపొందిన కుటుంబాల్లో అత్యధికంగా బీసీలు 51శాతం మంది ఉన్నారు. దళారీల ప్రమేయం లేకుండా బీమా పరిహారంకోసం దరఖాస్తు చేయడం మొదలుకుని, బీమా సొమ్మును నేరుగా నామినీ ఖాతాకు ఆన్లైన్ విధానంలో బదిలీ చేస్తున్నారు. రైతు బీమా సొమ్మును బాధిత కుటుంబాలు భవిష్యత్తు అవసరాలు, జీవనోపాధి కోసం వినియోగించుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. 29.58 లక్షల కుటుంబాలకు బీమా రాష్ట్రంలో 90 శాతానికి పైగా రైతులకు ఐదు ఎకరాలలోపు భూ విస్తీర్ణం ఉండగా, వీరికి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. ప్రమాదవశాత్తూ లేదా అనారోగ్యంతో రైతు మరణిస్తే.. అతనిపై ఆధారపడిన కుటుంబం రోజువారీ జీవనానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 29.58 లక్షల మంది 18–59 సంవత్సరాల వయసు కలిగిన రైతుల కోసం ప్రభుత్వం ‘రైతు బీమా’ పథకాన్ని 2018 ఆగస్టులో ప్రారంభించింది. ఈ పథకం అమలుకోసం ఒక్కో రైతుకు రూ.2,271.50 చొప్పున రూ.672 కోట్ల ప్రీమియంను జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారాన్ని చెల్లిస్తోంది. -
అకాల వర్షాలకు అన్నదాత కుదేలు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలకు అన్నదాత కుదేలయ్యాడు. ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ సోమవారం ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నెల 3 నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో 20 జిల్లాల్లోని 108 మండలాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. మెదక్, నిర్మల్, జనగాం, నల్లగొండ, యాదాద్రి, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్బన్, మేడ్చల్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, కొమురంభీం, భూపాలపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఆ జిల్లాల్లో 61,079 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదిక తెలిపింది. అందులో అత్యధికంగా 59,113 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. పెసర, సజ్జ, మొక్కజొన్న పంటలకు కూడా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 12,222 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదిక వెల్లడించింది. మొత్తంగా 34,347 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని లెక్క తేల్చింది. ఉద్యాన పంటలు దాదాపు 40 వేల ఎకరాల్లో నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. పంట నష్టం జరిగిన రైతులు బీమా కంపెనీల దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. వడగండ్ల వానలు.. సోమవారం ఈదురుగాలులు, వడగండ్ల వానలకు జనగామ జిల్లా రైతులు అతలాకుతలమయ్యారు. పొలంలోనే వరిచేను నేలకొరి ధా న్యం రాలిపోయింది. అమ్ముకోవడానికి కొను గోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. 1,500 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఎండపల్లిలో సుమారుగా 250 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క ఎండపల్లి గ్రామంలోనే సుమారు 250 ఎకరాల పంటకు నష్టం చేకూరింది. కొద్ది రోజుల్లో కోతకు వచ్చే దశలో వడగళ్ల ధాటికి గింజలు పూర్తిగా నేల రాలిపోయాయి. నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారి అనూష పంట పొలాల్లో రైతులతో కలిసి పరిశీలించి వివరాలు సేకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో సోమవారం ఈదురు గాలులు భీభత్సాన్ని సృష్టించాయి. వరి పంట నేలరాలింది. మామిడికాయలు రాలిపోయా యి. పంట నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. పెద్దపల్లి జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. గత బుధవారమే భారీ ఈదురుగాలు లు, రాళ్ల వానలతో అతలాకుతలమై పంట పొలాలు నేలవారగా, మామిడి కాయలు రాలిపోయాయి. మళ్లీ సోమవారం అకాల వర్షం కురవడంతో మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం, మిగిలిన వరిపొలాలు, కల్లాల్లో ధాన్యం తడిసింది. రాఘవపూర్, గుర్రాంపల్లి, మారేడుగొండ, రాంపల్లి, హన్మంతునిపేట, నిట్టూరు గ్రామాలతో సుల్తానాబాద్ మండలం లో వర్షాలతో పంట దిగుబడులు నష్టపోయా యి. పెద్దపల్లి మండలం ముత్తారం, అప్పన్నపేట, గౌరెడ్డిపేట, రాఘవపూర్ల్లో మామిడితోటల కాయలు రాలిపోయాయి. -
జైకిసాన్ నినాదాన్ని ఆచరణలో చూపాం
సిరిసిల్ల: జై కిసాన్.. కాంగ్రెస్, బీజేపీల నినాదమని.. కానీ దానిని ఆచరించి చూపింది కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రంలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని రైతు బంధుద్వారా అందించామని, అలాగే రైతులకు రైతు బీమా పథకం ద్వారా భరోసా కల్పించామని వివరించారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలను ప్రధానమంత్రి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ పేరుతో అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ విధానాలు దేశానికి ఆదర్శమయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. రైతులు ఏ విధంగా మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందిస్తున్న ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. రాష్ట్రంలో మరోసారి రైతులకు రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు రూ.24 వేల కోట్లతో ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనికో సం బడ్జెట్లోనూ నిధులను కేటాయించామని స్పష్టం చేశారు. రైతుబంధు పథకం కింద ఇప్పుడు ఏటా ఇ స్తున్న రూ.8 వేలు కాకుండా.. ముందు ముందు ఎకరానికి ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’ అనేది కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. ఇంకా అప్పటి నినాదమేనా? 40 ఏళ్ల కిందటే గరిబీ హఠావో అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అదే నినాదాన్ని ఇస్తోందని, ‘నాయనమ్మ, తాత, ముత్తాత’ పాలన చూశామని, 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎక్కువకాలం పాలించిందని, అయితే కాంగ్రెస్, తర్వాత బీజేపీల పాలన బాగుంటే ఇంకా దేశం అభివృద్ధి చెందని దేశంగా ఎందుకుం ద ని ప్రశ్నించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్, బీజేపీకి ఓటువేస్తే ఆగం అవుతారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, ఇంకొకరికి ఓట్లు వేసి ఆగం కావద్దని ప్రజలను కోరా రు. ‘టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుంది. మిషన్ భగీరథకు నిధులొస్తాయి. మిషన్ కాకతీయకు గ్రాంటు వస్తుంది’ అని కేటీఆర్ వివరించారు. కేంద్రంలో పనిచేసే నీతి ఆయోగ్ సంస్థ సిఫార్సులను కేంద్రం అమ లు చేయలేదని, రూ.24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని ఆ సంస్థ సిఫార్సు చేస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. రేపు గులాబీ సైనికులు ఢిల్లీలో ఉంటే తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమన్నారు. గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని కేటీఆర్ అన్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి 16 మంది ఎంపీలు గెలిస్తేనే ఇది సాధ్యమన్నారు. నరేంద్ర మోదీ ఏం మాట్లాడుతున్నారు? ‘తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడుతున్నారు..? కేసీఆర్‌ను తిడుతున్నారు. తెలంగాణ ప్రజానీకం ఓట్లు వేసి గెలిపిస్తేనే కేసీఆర్ సీఎం అయ్యారు. అలాంటి దమ్మున్న నాయకుడిని తిడితే ఓట్లు వస్తయా..? ఐదేళ్లు ఏం చేశారో చెప్పాలే. మరోసారి అవకాశం ఇస్తే ఏం చేస్తారో చెప్పాలే.. కానీ కేసీఆర్‌ను తిట్టిపోయిండు. ఈ చౌకీదార్.. ఈ టేకేదార్లు మనకు వద్దు. జిమ్మేదార్... ఇమాన్దార్.. నాయకుడు కేసీఆర్ వంటివారు మనకు కావాలి’అని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని స్పష్టంచేశారు. కాగా, మైనార్టీల సంక్షేమంలో భాగంగా 120 గురుకులాలు ప్రారంభిం చి నాణ్యమైన విద్యను తెలంగాణ ప్రభుత్వం అంది స్తోందని ఆయన ఉర్దూలో ప్రసంగించారు. ఈ సభలో కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ నాయకులు బసవరాజు సారయ్య, భానుప్రసాదరావు, గూడూరి ప్రవీణ్, గడ్డం నర్సయ్య, ఆకునూరి శంకరయ్య, దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఏ గట్టునుంటారో తేల్చుకోవాలి పరిగి/చేవెళ్ల/మొయినాబాద్: ‘ఈ గట్టున కారు... ఆ గట్టున బేకార్‌గాళ్లు.. ఏ గట్టునుంటారో.. ఎవరి కి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో ఓటర్లే తేల్చుకోవాలి’ అని కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పరిగి, చేవెళ్లలో రోడ్‌షో నిర్వహించారు. చేవెళ్ల రోడ్‌షోలో ఆయన మాట్లాడుతుండగా వర్షం కురవడంతో ఈ వాన మనకు ఆశీర్వాదమని.. విజయానికి సూచన అని అభివర్ణించారు. ఆయా రోడ్‌షోల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం.. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభం.. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మొత్తం తెలంగాణ ప్రజలకు లాభమన్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీళ్లివ్వాలని పరిగిలో పాదయాత్ర డ్రామా ఆడుతున్న కాంగ్రెస్ నాయకులు.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రాకుండా కోర్టుకు ఎక్కలేదా? అని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల నీళ్లు రానీయకుండా పరిగి ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. రెండేళ్లలో పాలమూరు నీళ్లు తెస్తామని హామీనిచ్చారు. కరెం టు అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్‌కు.. అడగకుండానే 24 గంటలు కరెంటు ఇచ్చిన టీఆర్ఎస్కు మధ్య పోటీ జరుగుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు 100 సీట్లు, బీజేపీకి 150 సీట్లు దాటవన్నారు. పాలమూరులో మీటింగ్ పెట్టిన ప్రధాని మోదీకి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు 16 మంది ఎంపీలనిస్తే దేశ రాజకీయాలను శాసిస్తారన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ నేత హరీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు అనే నేను ...
రైతును రాజుగా చూడాలనేది తన ఆశ అని తరచూ చెబుతుండే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఆ వైపుగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు బంజరు భూముల్లో సిరులు పండించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతూనే.. మరోవైపు నుంచి సాగులోకి వచ్చే భూముల్లో ఎలాంటి పంటలు పండుతాయో వ్యవసాయ శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పంట కాలనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై వారితో చర్చించారు. ఈ క్రమంలో రైతుల వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరచనున్నారు. మొత్తం 30 అంశాల మీద రైతు సర్వే జరగనుంది. సర్వే తర్వాత వచ్చిన రిపోర్టు ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలో మెజారిటీ భాగం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనంసాగిస్తారు. వర్షాలు కురిస్తేనే పంటలు పండే పరిస్థితి. పంటలు పండిస్తేనే చాలా మందికి కూలీ దొరికేంది. లేదంటే ఉపాధి కోసం పరాయి రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వలసపోవడం తప్ప మరో దారిలేదు. తెలంగాణలో ఇలాంటి దుస్థితిని లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చాలనే కసితో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. బంజరు భూములను సాగులోకి తేవడం తెచ్చి వ్యవసాయాన్ని పండగ చేయాలని తపన పడుతున్నారు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ తీరు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అందుకోసం రైతుల పూర్తి వివరాలు ఆన్లైన్లో పొందు పరచాలని, భూసారం, నీటివనరులు, పంటల సాగు, మార్కెటింగ్ వివరాలు మొత్తం అందుబాటులోకి వస్తాయని, తద్వారా ద్వారా అసలు రైతులకు ఏం అవసరమో తేలిపోతుందనే ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే ఈనెల 23 రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతోపాటు, డీఆర్డీఏ, సెర్ప్, పరిశ్రమలు, మార్కెటింగ్ అధికారులతోపాటు అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించి రైతు సమగ్ర సర్వే అవసరం, ఆవశ్యకతను వివరించారు. ఇందుకుసంబంధించిన ప్రొఫార్మను తయారు చేసి అందచేశారు. 30 అంశాలపై సమాచార సేకరణ రైతు పేరు నుంచి మొదలుకొని మొత్తం 30 అంశాల ద్వారా రైతు పూర్తి సమాచారం తీసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు. రైతు పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్, రైతు పేరు, ఆధార్ నెంబర్, తండ్రి లేదా భర్త వివరాలు, జండర్, ధరణీ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలు, పుట్టిన తేదీ, సెల్ నెంబర్‌తోపాటు బ్యాంకు వివరాలు సర్వే ద్వారా సేకరిస్తారు. అదేవిధంగా కులం, భూమి వివరాలు సర్వే నెంబర్లతో సహా, ఇందులో సాగుకు అనుకూలంగా ఉన్న భూమి, లేని భూమి వివరాలు పొందుపరుస్తారు. ఆయా పంటల సాగుకు అందుబాటులో ఉన్న ప్రధాన నీటి వనరులైన బావులు, బోర్లు, చెరువు, కాల్వలు, వర్షాధారం ఇలా మొత్తం వనరుల వివరాలు తీసుకుంటారు. అదేవిధంగా సూక్ష్మ, బిందు, తుంపర సేద్యం మొదలైన వివరాలు, భూసార పరీక్షల కార్డు నెంబర్ వంటి వివరాలతోపాటు భూమి రకం నల్లరేగడి, ఎర్ర నేలలు మొదలైన నేలల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదుచేస్తారు. వీటితోపాటు గత ఖరీఫ్‌లో సాగు చేసిన పంట వివరాలు, దిగుబడి, అదేవిధంగా రబీ పంట సాగు, దిగుబడి వివరాలు పొందుపరుస్తారు. ఇవే కాకుండా పండ్లు, కూరగాయలు, మల్బరీ మొదలైన పంటలు సాగు చేస్తే వాటి వివరాలు నమోదు చేస్తారు. వచ్చే వానాకాలం, యాసంగిలో ఏం పంటలు వేస్తారో వివరాలు తెలుసుకుంటారు. అదేవిధంగా వ్యవసాయ పరికరాల వినియోగం, క్రాప్‌లోన్ వివరాలు, పంటల బీమా, పండిన పంటలను విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యం, విత్తనాల ఉత్పత్తి మొదలైన వివరాలు సేకరిస్తారు. వీటితోపాటు ఇప్పటికే మీ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉంటే వాటి వివరాలు, అదేవిధంగా రైతు స్మార్ట్ ఫోన్ వాడితే అందులో వ్యవసాయ సమాచారం కోసం ఏం యాప్ వినియోగిస్తారో కూడా సర్వే సందర్భంగా నమోదు చేస్తారు. ఫిబ్రవరి ఒకటి నుంచి సర్వే మొదలు ఈ వివరాలు సేకరిస్తే కానీ ఏ ప్రాంతంలో రైతులు ఏ పంటలు పండిస్తారు. నీటి వసతి, మార్కెటింగ్ మొదలైన వివరాలు రావు. దీంతోనే పంటల కాలనీ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయవచ్చు. అందుకోసం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మార్చి నెల చివరి వరకు ప్రతీ రైతు చిట్టాను సేకరించాలి. జిల్లా వ్యాప్తంగా 5.66 లక్షల ఎకరాల భూమిని సాగుచేసే 2.6లక్షల రైతుల వివరాలు సేకరించాలి. ఇందుకోసం ఇప్పటికే జిల్లా స్థాయిలో మండల వ్యవసాయ అధికారులకు, మండల, డివిజన్ స్థాయిల్లో వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వచ్చే వ్యవసాయ సీజన్ జూన్ నాటికి రైతుల వివరాలు, పంటల కాలనీ మొదలైన సమాచారంతో నూతన వ్యవసాయా పద్ధతికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. -
రైతుల తరపున ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుంది
-
బీమా కంపెనీలకే లాభాల ‘పంట’
సాక్షి, హైదరాబాద్: పంటల బీమా పథకాల ద్వారా రైతులు బాగుపడుతున్నారా... లేదంటే బీమా కంపెనీలు బాగుపడుతున్నాయా... అంటే కంపెనీలే బాగుపడుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదికే అందుకు నిలువెత్తు సాక్ష్యం. 2016–17 ఖరీఫ్, రబీల్లో కంపెనీలకు రైతులవాటా, రైతుల తరఫున ప్రభుత్వం చెల్లించిన వాటా కలిపి మొత్తం ప్రీమియం సొమ్ము రూ.22,345 కోట్లు. కానీ, బీమా కంపెనీలు ఆ ఏడాది రైతులకు చెల్లించిన పరిహారం రూ.16,279 కోట్లు మాత్రమే. అంటే, ఆ ఒక్క ఏడాదిలోనే బీమా కంపెనీలు రూ.6,066 కోట్ల లాభం పొందాయి. 2017–18 ఖరీఫ్‌లో రైతుల, ప్రభుత్వం వాటా కలిపి బీమా కంపెనీలకు చెల్లించిన ప్రీమియం రూ.19,767 కోట్లు, కాగా కంపెనీలు రైతులకు చెల్లించిన పరిహారం రూ.16,967 కోట్లే. ఒక్క ఖరీఫ్ సీజన్లో కంపెనీల లాభం రూ.2,799 కోట్లు అన్నమాట. ఈ 3 సీజన్లలో బీమా కంపెనీలు రైతులు, ప్రభుత్వం నుంచి వసూలు చేసిన ప్రీమియం సొమ్ము రూ.42,112 కోట్లు కాగా, రైతులకు ఆ కంపెనీలు చెల్లించిన ప్రీమియం రూ.33,247 కోట్లు మాత్రమే. ఆయా కంపెనీలు చేసిన దోపిడీ రూ.8,865 కోట్లు కావడం గమనార్హం. ఒకవైపు అప్పులు పెరిగి దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరోవైపు కంపెనీలు వారి ప్రీమియంతో కోట్లు కూడబెట్టుకుంటున్నాయి. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి... ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్ బీవై), పునర్నిర్మిత వాతావరణ ఆధారిత పంటల బీమా(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) పథకాలను కేంద్రం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ 2 పథకాలను 2016–17 నుంచి అమలు చేస్తోంది. అంతకుముందు కేంద్రమే మరోపేరుతో పంటల బీమా పథకాలను అమలుచేసింది. అంతకుముందు ప్రభుత్వ బీమా కంపెనీయే పంటలబీమాను అమలు చేయగా, ఈ 2 పథకాలను ప్రవేశపెట్టాక ప్రైవేటుబీమా కంపెనీలకూ చోటు కల్పించారు. మొత్తంగా రాష్ట్రంలోనూ గత కొన్నేళ్లుగా కంపెనీ లే భారీ లాభాలు గడించాయి. కొన్నేళ్లు 2 రెట్లయితే, ఒకసారైతే ఏకంగా 3 రెట్లు లాభాలు గడిం చడం గమనార్హం. లాభాలు గణనీయంగా ఉన్నా బీమాకంపెనీలు ఏడాదికేడాదికి ప్రీమియం రేట్లను భారీగా పెంచుతున్నాయి. 2013–14లో రాష్ట్రంలో రైతులు, ప్రభుత్వం కలిపి పంటల ప్రీమియంగా రూ.137.60 కోట్లు చెల్లిస్తే, రైతు లకు క్లెయిమ్స్ కింద అందింది రూ. 56.39 కోట్లే. ఆ ఏడాది 8.52 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లిస్తే 1.18 లక్షలమంది రైతులే లబ్ధిపొందారు. 2014–15 వ్యవసాయ సీజన్లో 10 లక్షలమంది రైతులు రూ.145.97 కోట్లు ప్రీమియం చెల్లిస్తే, 1.80 లక్షలమంది రైతులు రూ. 78.86 కోట్ల పరిహారం మాత్రమే అందుకున్నారు. 2015–16 లో 7.73 లక్షలమంది రైతులు రూ.145.71 కోట్ల ప్రీమియం చెల్లిస్తే, రూ.441.79 కోట్లు పరిహారంగా వచ్చిందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 2016–17 లో 9.75 లక్షలమంది రైతులు రూ. 294.29 కోట్లు చెల్లిస్తే, 2.35 లక్షలమంది రైతులకు రూ. 178.49 కోట్లు పరిహారం గా దక్కాయి. కంపెనీలు మాత్రం నానా కొర్రీలు పెడుతూ పరిహారం ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నాయి. 2014–15 వ్యవసాయ సీజన్లో 10 లక్షలమంది రైతులు రూ. 145.97 కోట్ల ప్రీమియం చెల్లిస్తే, 1.80 లక్షల మంది రైతులకు రూ.78.86 కోట్ల పరిహారం అందింది. -
పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ రబీ నుంచి బ్యాంకు రుణాలు తీసుకునే రైతులెవరైనా బీమా ప్రీమియం చెల్లింపు నుంచి మినహాయింపు పొందే అవకాశం లేకుండా నిబంధనలు తీసుకొస్తూ శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రైతులు తీసుకునే రుణం నుంచే బ్యాంకులు ప్రీమియాన్ని కంపెనీలకు చెల్లిస్తాయి. అనేకమంది రైతులు కోర్టుకు వెళ్లి ప్రీమియం చెల్లించకుండా మినహాయింపు పొందుతున్నారు. ఈ రబీ నుంచి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినా దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేకుండా తాజా మార్గదర్శకాల్లో కఠిన నిబంధన తయారు చేశారు. బీమా పరిహారం ఆలస్యం చేస్తే జరిమానా... బీమా క్లెయిమ్స్ సెటిల్ చేయకుండా ఆలస్యం చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలకు జరిమానా విధించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. సెటిల్మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితికి 2 నెలలు దాటితే 12 వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలను ఆదేశించింది. బీమా సేవలు అందించడంలో విఫలమయ్యే కంపెనీలను రద్దు చేయనుంది. వరికి డిసెంబర్ 31 గడువు తేదీ... రబీలో వరి, జొన్న, మినుములు, పొద్దు తిరుగుడు, పెసర, వేరుశనగ, ఎర్ర మిరప, నువ్వులు, ఉల్లి పంటలకు రైతులు ప్రీమియం చెల్లించే గడువును డిసెంబర్ 31గా నిర్ధారించారు. ఒకవేళ వాతావరణం బాగోలేక కరువు పరిస్థితులు వంటివి ఏర్పడి ఆయా పంటల సాగు ఆలస్యమైతే వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ వరకు ఈ పంటలకు ప్రీమియం చెల్లించే అవకాశం కల్పిస్తారు. ఇక మొక్కజొన్నకు డిసెంబర్ 15ను ప్రీమియం చెల్లించేందుకు గడువు తేదీ ఖరారు చేశారు. ఈ పంట వాతావరణ పరిస్థితుల్లో తేడా వస్తే డిసెంబర్ 31 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. శనగకు నవంబర్ 30వ తేదీ నాటికి ప్రీమియం చెల్లించేందుకు గడువిచ్చారు. వాతావరణం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో డిసెంబర్ 15వ తేదీ నాటి వరకు గడువిచ్చారు. -
రైతులకు ఇన్సూరెన్స్ ఇప్పించాలి
కడప కార్పొరేషన్ : 2012 రబీకి సంబంధించి 21,250 మంది రైతులకు పెండింగ్‌లో ఉన్న ఇన్సూరెన్స్‌ను వెంటనే ఇప్పించాలని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. ఆయన జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వేముల, ముద్దనూరు, కొండాపురం రైతులతో కలసి జేసీ–2 శివారెడ్డిని శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ 2014 రబీలో బుడ్డశనగ పంటకు బ్యాంకులో రెన్యువల్ æచేసిన వారికి చెల్లించారని, మిగిలిన వారికి, ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కట్టిన వారికి ఇవ్వలేదన్నారు. వేముల, ముద్దనూరు, కొండాపురం మండలాల రైతులకు ఈ ఇన్సూరెన్స్ రాలేదన్నారు. అలాగే 2013–14లో లింగాల, వేముల మండలాల్లో బుడ్డశనగ, ఉద్యాన పంటలు వేసిన రైతులు అకాల వర్షాల వల్ల పంట పూర్తిగా నష్టపోయారన్నారు. జిల్లా వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యాన శాఖల అధికారులు వచ్చి పంటను సర్వే చేసి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. 2015 ఇన్పుట్ సబ్సిడీ ఇంకా కొందరికి రాలేదన్నారు. 2014–15 రబీ బుడ్డశనగకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నారని, దీనికి కూడా ఇన్సూరెన్స్ రాలేదన్నారు. 2016 బుడ్డశనగ ఇన్సూరెన్స్ కూడా పెండింగ్‌లోనే ఉందన్నారు. 2017లో ప్రతి పంటకు ఇన్సూరెన్స్ బ్యాంకులకు పంపారని, కానీ ఇంత వరకూ రైతుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. 2013–14లో లింగాల, తొండూరు, పులివెందుల, సింహాద్రిపురం మండలాల్లో వర్షాభావం వల్ల ఉద్యాన పంటలు ఎండిపోతుంటే అధికారులు వచ్చి.. మీరు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలుకోండి, డబ్బులిస్తామని రైతులకు చెప్పారని, ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. 2015–16 కరువు నిధులు 30 శాతం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ 20 శాతం పెండింగ్‌లో ఉందని, దీనివల్ల బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఈ ఏడాది అరకొర వర్షం పడటం వల్ల కొందరు రైతులు విత్తనం విత్తినారని, వర్షం పడక పైరు ఎండిపోయిందన్నారు. 80 శాతం మంది రైతులు విత్తనమే వేయలేదన్నారు. రైతుల జీవన పరిస్థితి దుర్భరంగా ఉందని, వారికి పెట్టుబడి రాయితీ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ–2ను కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రైతులు విజయశంకర్, మోహన్, ప్రహ్లాదుడు, రజనీకాంత్‌రెడ్డి, శివశంకర్, చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రైతుకే పిల్లనిచ్చే రోజులొస్తాయి
సాక్షి, సిద్దిపేట/నంగునూరు: ‘పూర్వం నాలుగు చెక్కల భూమి ఉంటేనే ఆడపిల్లను ఇచ్చేవారు.. కానీ రాష్ట్రంలో పరిస్థితులు తారుమారయ్యాయి. పాలకుల పుణ్యమా అని అన్నదాత అప్పులపాలవుతూ వస్తున్నాడు. దీంతో చిన్నపాటి అటెండర్ ఉద్యోగం ఉన్న వారికైనా తమ బిడ్డను ఇస్తున్నారే తప్ప.. రైతుకు పిల్లనిచ్చే రోజులు పోయాయి.. కాళేశ్వరం పూర్తయితే సాగునీటి కష్టాలు తీరుతాయి. దీంతో పిల్లను ఇస్తే రైతులకే ఇవ్వాలి అనే రోజులు మళ్లీ వస్తాయి’అని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటలో ఏర్పాటు చేసిన రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్న, కందులు, పత్తికి మద్దతు ధరపెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. గతేడాది క్వింటాల్‌కు రూ. 5,400 పెట్టి రూ. 1,400 కోట్లు వెచ్చించి ప్రభుత్వం కందులు కొనుగోలు చేసిందని వెల్లడించారు. తీరా వీటిని అమ్మేందుకు టెండర్లు పిలువగా రూ.600 కోట్లకు మించి రావడంలేదన్నారు. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ.800 కోట్లు నష్టం వస్తుందని చెప్పారు. అదేవిధంగా మొక్కజొన్నలు క్వింటాకు రూ.1600 పెట్టి కొనుగోలు చేశామని ఇప్పుడు వాటిని రూ.400 నష్టంతో అమ్ముతున్నామని మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఇదంతా రైతుల క్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న పనిగా పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఇతర సంక్షేమ పథకాలు ఒకట్రెండు సంవత్సరాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం తమది కాదని.. అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వడగండ్ల వాన, అనావృష్టితో దెబ్బతిన్న పంటలకు బీమా వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. ఇందులో భాగంగానే గత ఏడాదికి సంబంధించిన పంటలకు రూ.700 కోట్లు బీమా డబ్బులు విడుదలయ్యాయని, ఇందులో రూ. 275 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉందని చెప్పారు. గోదావరి నుంచి సముద్రంలో వృథాగా కలుస్తున్న 500 టీఎంసీల నీటిని తెలంగాణ బీళ్లకు మళ్లించే కాలం దగ్గరలోనే ఉందన్నారు. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద నీరడిగా ఉంటూ ప్రాజెక్టు త్వరితగతిన నిర్మించేలా పనిచేస్తున్నారని అన్నారు. హరీశ్‌రావు వస్తుంటే గోదావరి జలాలు పారినట్లే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సారయ్య, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు. 34 మంది పిల్లలకు 8 మంది టీచర్లా? పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇంత అధ్వానంగా ఉంటే మీరేం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 34 మంది విద్యార్థులకు 8 మంది టీచర్లు అవసరమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దన్నపేటలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి గ్రామం లోని ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఎంతమంది విద్యార్థులున్నారని ఇన్చార్జి హెచ్ఎం రాంప్రభాకర్ను అడిగారు. 34 మంది అని సమాధానం చెప్పడంతో మంత్రి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఎని మిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలుసుకొని వారికి నెలకు ఎంత మేరకు వేతనాలు చెల్లిస్తున్నారని పక్కనే ఉన్న ఎంఈవోని ప్రశ్నించారు. సుమారు నాలుగు లక్షలు ఉంటుందని ఆయన సమాధానం ఇవ్వడంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గితే ఉపాధ్యాయులు మీరేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు విద్యార్థులు రాకుంటే బడి నడపడం ఎందుకని, ఇక్కడి వారిని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నంగునూరు హైస్కూల్లో చేర్పించి రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. మండలంలో ఇంకా ఇటువంటి స్కూళ్లు ఎన్ని ఉన్నాయో తనకు చెప్పాలని ఆదేశించారు. -
రైతు కుటుంబాలకు అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. రైతు బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు బీమా ప్రపంచంలోనే అతిపెద్ద జీవిత బీమా పథకమని, ఇది తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే భరోసా అని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి మొదలుకానున్న ప్రతిష్టాత్మక రైతు బీమా పథకంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో శుక్రవారం సమీక్షించారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నీతూప్రసాద్, సీఎంవో అధికారి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రైతు బీమా పథకంలో ఇంకా పేరు నమోదుకాని అర్హులైన రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని... వారికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఎల్ఐసీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి పది రోజుల్లోగా రూ. 5 లక్షల బీమా చెక్కు అందించాల్సిందేనని చెప్పారు. ఈ చెక్కును రైతు కుటుంబ సభ్యులకు చేరేలా యంత్రాంగాన్ని నియమించి పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీమా మొత్తం బాధ్యులకు చేరే క్రమంలో తలెత్తే ఇబ్బందులు, నిబంధనల సమస్యలను పరిష్కరించి అర్హులకు బీమా చెక్కులను అందించే బాధ్యత స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ కార్యదర్శులదేనని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ కార్యదర్శి సమన్వయంతో పని చేయాలని సూచించారు. కాలధర్మం చేసిన అర్హుడైన/అర్హురాలైన రైతుకు 48 గంటల కాలపరిమితిలో మరణ ధ్రువీకరణ పత్రాన్ని అందచేయాల్సిన బాధ్యత స్థానిక గ్రామ కార్యదర్శిదేనన్నారు. అధికారులు చేపట్టాల్సిన చర్యలపై... రైతుకు బీమా అందే క్రమంలో దశలవారిగా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేసుకోవాల్సిన యంత్రాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. రైతు మరణించిన వెంటనే సమాచారాన్ని ఎవరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది? ఆ సమాచారాన్ని ముందుగా ఎవరికి చేరవేయాలి? ఈ సమాచారం జీవిత బీమా సంస్థ అధికారులకు ఎలా తెలియజేయాలి? ప్రభుత్వం, బీమా సంస్థతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నియమ నిబంధనల్లో వ్యవసాయ విస్తరణ అధికారి పాత్ర, గ్రామ కార్యదర్శి పాత్ర, రైతు సమన్వయ సమితి సభ్యుల పాత్ర ఎలా ఉండాలో సూచించారు. బాధలో ఉన్న రైతు కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి పది రోజుల్లోగా వారికి బీమా చెక్కు అందేందుకు తీసుకోవాల్సిన చర్యలను పంచాయితీరాజ్, వ్యవసాయ అధికారులకు వివరించారు. 28 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ. 636 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద జీవిత బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచే ఈ పథకం అమలులోకి రానుందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయిలో అర్హులైన రైతుల పేర్లను, ఇతర‡ వివరాలను వ్యవసాయ విస్తరణాధికారి నమోదు చేసుకోవాలన్నారు. -
14 నుంచే ‘రైతుబీమా’ అమలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14 నాటికే రైతుబీమా పూర్తిస్థాయిలో అమల్లోకి రానుందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. ఈ నెల 6 నుంచి 14నాటి కి రైతులకు బీమాపత్రాలు ఇస్తామన్నారు. 14 నుంచి సంబంధిత రైతు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 10 రోజుల్లో రూ.5 లక్షలు క్లెయిమ్ అందుతుందన్నారు. దీన్ని ఎల్ఐసీకి తెలియజేశామని పేర్కొన్నారు. రైతుబీమా పత్రాల పంపిణీ కార్యక్రమా న్ని గ్రామసభల్లో అందజేయాలని నిర్ణయించామని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనాల ని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. 6న ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నా ప్రత్యేకంగా ప్రారంభం అంటూ హడావుడి చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. బీమా పాలసీకి ప్రారంభ ఉత్సవం చేయడమంటే సెంటిమెంట్‌గా మంచిది కాదని సర్కారు భావించినట్లు సమాచారం. -
‘రైతు బీమా నమోదులో అలసత్వం వద్దు’
సాక్షి, హైదరాబాద్ : రైతు బీమా నమోదులో ఎలాంటి అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో రైతు బీమా నమోదు కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. బీమా నమోదు 73 శాతం (35,65,611 మంది) పూర్తయిందని, మిగతా నమోదును నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఇచ్చే నామినేషన్ ఫారాల తనిఖీని మండల వ్యవసాయ అధికారులు పూర్తి చేసి, వివరాలను భారత జీవిత బీమా సంస్థకు అందజేయాలని సూచించారు. బీమా సంస్ధకు సమాచారం తొందరగా ఇస్తేనే ఆగష్టు 15వ తేదీన రైతులకు బీమా సర్టిíఫికెట్లను అందించడం వీలవుతుందన్నారు. రైతు బీమాలో నమోదు కాని రైతుల వివరాలను జిల్లా, గ్రామాల వారీగా ఎంఐఎస్ పోర్టల్‌లో పొందుపర్చామని, వాటిని గ్రామ పంచాయితీ ల్లోని నోటీసు బోర్డుల్లో అంటించాలన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో రైతుల వివరాలను కచ్చితంగా నమోదు చేయించాలని పార్థసారథి అధికారులకు సూచించారు. -
రైతులందరికీ బీమా వర్తింపజేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు జీవిత బీమాను వర్తింపజేసేందుకు వ్యవసాయ అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామిని దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం కొనసాగించాలని సూచించారు. ఇప్పటివరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులను సవరించడం, పేరు మార్పిడి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. రైతు బీమా పథకం, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘రైతు బీమా పథకం కోసం రైతులందరి పేర్లు నమోదు చేయాలి. రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా, ఎన్ని ఖాతాలున్నా ఒక రైతుకు ఒక పాలసీ మాత్రమే వర్తిస్తుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న ప్రతి రైతు పేరునూ నమోదు చేయాలి. నామినీ దరఖాస్తు ఫారాలు త్వరగా ఇచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలి. ఇప్పటివరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి అందిస్తే మొదటి విడత బీమా ప్రీమియం సొమ్ము చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన జరిగిన తర్వాత కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చాం. రైతు బంధు పథకం కింద చెక్కులు ఇచ్చాం. కొందరు రైతులకు ఇంకా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదు. కొన్ని పాస్‌పుస్తకాల్లో తప్పులు సవరించాల్సి ఉంది. పేరు మార్పిడి ప్రక్రియలో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేశాం. అనుకున్నంత వేగంగా పని జరగడం లేదు. వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ముందు రికార్డులన్నింటినీ మ్యాన్యువల్‌గా సరి చేసుకోవాలి’’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, లోక్‌సభ సభ్యుడు వినోద్ కుమార్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, శాంతకుమారి, సీఎంవో అధికారులు స్మిత సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంకా వర్గీస్, వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్ పాల్గొన్నారు. 2.13 లక్షల మందికి సబ్సిడీ బర్రెలు... పాడిపరిశ్రమ సంఘాల సభ్యులకు సబ్సిడీ పై బర్రెలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ సొసైటీలకు చెందిన 2.13 లక్షల మంది పాడి రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. ఒక్కో యూనిట్‌కు రూ. 80 వేలు కేటాయించాలని, రూ. 5 వేల వరకు అదనంగా రవాణా ఖర్చుల కోసం ఇవ్వాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, ఇ తరులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఎక్కడి నుంచైనా, ఎవరి నుంచైనా పశువులను కొనుక్కునే అవకాశం రైతులకు కల్పించాలని సూచించారు. -
‘రైతు బీమా’ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
-
‘రైతు బీమా’ మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: రైతు శ్రేయస్తే తమ ధ్యేయమంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు బీమా’ పథకం మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. ‘రైతు బంధు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్’ పేరుతో పథకం అమలు చేయనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి అమలు కానున్న రైతు బీమా పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. జీఎస్టీతో కలిపి ఏడాదికి 2,271 రూపాయలను రైతుల పేరిట ప్రభుత్వం జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)కి చెల్లిస్తుంది. రైతు చనిపోతే నష్టపరిహారంగా 5 లక్షల రూపాయలను బీమా సంస్థ బాధిత కుటుంబానికి అందిస్తుంది. -
89 శాతం రైతులు సంతోషంగా ఉన్నారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తమది రైతుపక్షపాత ప్రభుత్వమని, రాష్ట్రంలో అమలవుతోన్న రైతుబంధు పథకం ద్వారా 89 శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రతిష్టాత్మక రైతుబీమా పథకం ఆగస్టు 15 నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం-లైఫ్ ఇన్సురెన్స కార్పొరేషన్(ఎల్ఐసీ)లు అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. సోమవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ తదితరులు పాల్గొన్నారు. రైతుబీమా విధివిధానాలు: ఎల్ఐసీతో ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రైతుబీమా పథకం విధివిధానాలను క్లుప్తంగా వివరించారు. ►2018 ఆగస్టు 15 నుంచి రైతుబీమా అమలవుతుంది. ►18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న రైతులందరూ ఈ పథకానికి అర్హులే. ►రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే 10 రోజుల్లో పాలసీ క్లెయిమ్ అవుతుంది. ►ఆగస్టు 15లోపు సంబంధిత పత్రాలన్నీ నింపి ఎల్ఐసీకి అందజేయాలి. ►రైతుల బీమా పత్రాలను వ్యవసాయ అధికారులు మాత్రమే పూర్తిచేయాల్సిఉంటుంది. ►నామినీ వివరాలను రైతులు చెప్పిన ప్రకారమే నింపాలి. ►ఇందుకోసం ఏవోలకు ఐప్యాడ్లు అందజేస్తామని, రైతులందరి పేర్లు అందులో నమోదై ఉండాలని సీఎం చెప్పారు. రైతుబంధు వదులుకున్నా.. రైతుబీమా మాత్రం తీసుకుంటా: ‘‘బాగా సంపాదించే రైతులు రైతుబంధు పథకం కింద వచ్చే డబ్బును తీసుకోవద్దని ముఖ్యమంత్రిగా నేను కోరాను. ఆ మేరకు నాతోపాటు చాలా మంది చెక్కులు తీసుకోలేదు. అయితే ఇప్పటి రైతుబీమా పథకంలో మాత్రం నా పేరు కూడా నమోదు చేయించుకుంటా’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుబీమా పథకానికి సంబంధించి తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఎల్ఐసీకి గర్వకారణమని ఆ సంస్థ చైర్మన్ వీకే శర్మ అన్నారు. -
70 ఏళ్ల వరకు రైతు బీమా!
సాక్షి, హైదరాబాద్: రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు బీమా’కు వయో పరిమితి 70 ఏళ్ల వరకు నిర్ణయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సాధారణంగా బీమా వయోపరిమితి 55 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది. కానీ రైతుల కోసం ఈ వయోపరిమితిని 70 ఏళ్ల వరకు పెంచేలా సర్కారు ఎల్ఐసీ వర్గాలతో సమాలోచనలు చేస్తోంది. రాష్ట్రావతరణ దినోత్సవం రోజున రైతు బీమాను ప్రారంభించాలన్న యోచన మేరకు.. వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని వ్యవసాయశాఖను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు వెంటనే సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. ప్రీమియం ఎక్కువైనా సరే.. రైతు బీమా కోసం ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ బీమా కింద రైతులు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది. సాధారణ మరణం పొందినా, ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదంలో చనిపోయినా ఆయా రైతుల కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందజేస్తారు. సాధారణంగా బీమా వయో పరిమితి 55 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ ‘రైతు బీమా’కింద ప్రత్యేకంగా రైతులకు 70 ఏళ్ల వరకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఎల్ఐసీని కోరనున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ప్రీమియం అధికమైనా సరే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎల్ఐసీకి సూచించనున్నారు. రైతు బీమా అంశంపై ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో ఇదే విషయంపై చర్చ జరిగినట్టు తెలిసింది. రైతు బీమా ప్రీమియం సగటున రూ.800 నుంచి రూ.1,100 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 58 లక్షల మందికి ప్రయోజనం భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులు ఉన్నట్టు సర్కారు గుర్తించింది. ఆ ప్రకారమే ప్రస్తుతం ‘రైతు బంధు’ పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందజేస్తోంది. ఆ రైతులందరినీ బీమా పరిధిలోకి తీసుకొస్తారు. ఒకవేళ ఎవరైనా రైతులు ఇప్పటికే బీమా సదుపాయం కలిగి ఉంటే, వ్యవసాయ భూమి ఉన్న ఉద్యోగులు బీమా కలిగి ఉంటే.. వారిని ఈ పథకం పరిధిలోంచి మినహాయిస్తారు. ఇక పట్టాదారు పాస్ పుస్తకమున్న 18 ఏళ్లలోపు మైనర్లకు బీమా కల్పించాలా వద్దా అన్న విషయంపై వ్యవసాయశాఖ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఇక 70 ఏళ్లు పైబడిన వారు ఉంటే.. వారికి రైతు బీమా వర్తించదు. ఇప్పుడున్న లెక్క ప్రకారం 58.33 లక్షల మందిలో 58 లక్షల మందికి బీమా ప్రయోజనం అందుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కొక్కరికి సగటున రూ.వెయ్యి ప్రీమియంగా లెక్కిస్తే.. ప్రభుత్వం ఏటా ఎల్ఐసీకి ఏటా రూ.580 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే అర్హుల జాబితా తయారయ్యాక రైతుల సంఖ్య మారే అవకాశముందని చెబుతున్నారు. కాగా ఆత్మహత్య, సాధారణ మరణం ఏదైనా కూడా రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల మేర బీమా పరిహారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితా తయారు చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. కౌలు రైతులకు బీమా ఉండదు రాష్ట్రంలో భూమిలేని కౌలు రైతులు 15 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబీమాను వర్తింపజేస్తున్నందున కౌలు రైతులను ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే రైతుబంధు పథకం కింద కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. దీనితోపాటు రైతు బీమా కూడా అందకుంటే విమర్శలు వచ్చే అవకాశముందన్న చర్చ కూడా జరుగుతోంది.