
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలుకు సర్వం సిద్ధం చేసామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. జిల్లాలో 3.50 లక్షల మంది రైతుల జాబితా సిద్ధం చేసామని తెలిపారు. ఆధార్ సమస్య ఉన్న వారి రికార్డులను సరిచేసి..రెండో విడత జాబితా సిద్ధం చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. కౌలు రైతులు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో రైతు భరోసా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారని వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాల్లో పథకం అమలవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.