సీఎం వైఎస్ జగన్‌తో రుహుల్లా
సాక్షి, అమరావతి/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఇటీవల హఠాన్మరణం చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా కుమారుడు మహ్మద్ రుహుల్లాకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ విషయాన్ని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసు వద్ద మీడియాకు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న రుహుల్లా కుటుంబసభ్యులను పిలిపించుకుని ముఖ్యమంత్రి మాట్లాడారని వెలంపల్లి చెప్పారు.
రుహుల్లాకు టికెట్ ఇవ్వాలన్న నిర్ణయం.. ముఖ్యమంత్రికి మైనార్టీలపై ఉన్న ప్రేమను తెలుపుతోందని పేర్కొన్నారు. ఎండీ కరీమున్నీసా, ఎండీ సలీమ్‌ల కుమారుడైన రుహుల్లా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయన అభిమానిగా రాజకీయాల్లో ఉండేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా ఉన్న ఆయన ప్రస్తుతం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment