
సాక్షి, కర్నూలు: కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటుకు మంత్రి ఫరూక్ తీర్మానం ప్రవేశం పెట్టారు. ఈ సందర్భంగా హైకోర్టు ఏర్పాటుపై శాసన మండలిలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాట్లాడుతూ, శ్రీబాగ్ ఒప్పందంలో ఏముందో మంత్రి భరత్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కర్నూలులో హైకోర్టు బెంచ్ కాకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని.. గతంలో బీజేపీ కూడా డిక్లరేషన్ చేసిందని ఆయన గుర్తు చేశారు.
హైకోర్టును కర్నూలులో పెట్టాలని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో పెట్టిందని.. ఇప్పుడు హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, కర్నూలులో న్యాయ రాజధాని రాకుండా గతంలో కూటమి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. కర్నూల్‌లో హైకోర్టు పెట్టాలని బీజేపీ గతంలో డిక్లరేషన్ చేసిందన్నారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించిందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment