
సాక్షి, విజయవాడ: వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని.. వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, జోగి రమేష్, మహిళ కమిషనర్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీ ఎస్‌ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బొప్పన భవ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. రాష్ట్రంలో 10,850 ఆర్బీఐ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించలేదన్నారు. రైతు భరోసా కేంద్రాలను మార్కెట్ కేంద్రాలుగా మార్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని మంత్రి కన్నబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment