15న నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభం | CM YS Jagan To Launch Rythu Bharosa Scheme Oct 15th In Nellore District | Sakshi
Sakshi News home page

15న నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభం

Published Thu, Oct 10 2019 5:23 PM | Last Updated on Thu, Oct 10 2019 8:37 PM

CM YS Jagan To Launch Rythu Bharosa Scheme Oct 15th In Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో ‘రైతు భరోసా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ..అర్హులైన రైతులందరూ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌ తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు. రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తెలుగు గంగ అధికారులతో చర్చించి.. తెలుగు గంగ పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement