ఇంటింటి అభివృద్ధి కొనసాగిద్దాం.. | YS Jaganmohan Reddy to the people of the state | Sakshi
Sakshi News home page

ఇంటింటి అభివృద్ధి కొనసాగిద్దాం..

Published Sun, May 12 2024 5:51 AM | Last Updated on Wed, May 15 2024 12:00 PM

YS Jaganmohan Reddy to the people of the state

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

మనం నొక్కిన బటన్లు 130.. చేతికే ఇచ్చిన డబ్బులు రూ.2.70 లక్షల కోట్లు.. మీ అందరికీ సంతోషాలను పంచిన మీప్రభుత్వాన్ని మరోసారి దీవించండి 

పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే 

ఇది చరిత్ర చెబుతున్న సత్యం.. ఆయన చెప్పేవన్నీ సాధ్యం కాని హామీలే 

మళ్లీ మన ఇంటికే అన్నీ రావాలంటే.. మీ బిడ్డ ప్రభుత్వమే మళ్లీ రావాలి  

ఈ మంచిని కొనసాగిద్దాం..
మీ బిడ్డ ఐదేళ్ల పాలనలో కేలండర్‌ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకాన్ని అందిస్తామో మీకు ముందుగానే చెప్పాడు. రైతుభరోసా, అమ్మఒడి, చేయూత.. ఇలా ఫలానా పథకాన్ని ఫలానా నెలలో ఇస్తామని చెప్పి ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్లలో మీ అందరికీ మేలు చేశాడు. ప్రతి ఇంటికి మంచి చేశాడు.

మన ఇంటికి జరుగుతున్న ఈ మంచిని పొరపాటున చంద్రబాబు ప్రలోభాలతో మోసపోయి పోగొట్టుకోవద్దని ప్రతి ఒక్కరికీ విన్నవించుకుంటున్నా. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో మీరంతా చూశారు – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి ప్రతినిధి, కాకినాడ: మీ జగన్‌కు మీరు వేసే ఓటు.. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొన­సాగింపు అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు విన్న­వించారు. మీ అందరికీ మంచి చేస్తూ, సంతో­షా­లను పంచుతూ 130 సార్లు బటన్లు నొక్కి రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా నేరుగా మీ చేతికే అందించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వ­దించాలని కోరారు. గత ఐదేళ్లుగా చేసినమంచి­ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. శని­వారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. 

నిర్ణయాత్మక ఎన్నికలివి..
మరో 36గంటల్లో ఎన్నికల సమరం జరగనుంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. రాబోయే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నిక­లివి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవ­డమే. ఆయన్ను నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. సాధ్యం కాని హామీలతో చంద్ర­బాబు ఇచ్చిన మేనిఫెస్టోకి అర్థం ఇదే.

 గత 59 నెలలుగా మీ బిడ్డ ఎప్పుడూ చూడని విధంగా పాలనలో మార్పులు తెచ్చాడు. 130సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్క­చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశాడు. గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కి మంచి చేసిన ప్రభుత్వాలు ఉన్నాయా? 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఏ ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా? రాష్ట్రంలో గతంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా ఇచ్చాడు.

నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే 1.35 లక్షల మంది మన సచివాల­యా­ల్లోనే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తున్నారు. మేని­ఫె­స్టో­ను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేసి విశ్వసనీయతను చాటుకున్నాం. గడప గడపకూ మన మేనిఫెస్టోను పంపించి మీరే టిక్‌ పెట్టాలని అక్కచెల్లెమ్మలను కోరాం. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలను మచ్చుకు కొన్ని గడగడా చెబుతా.

విద్యా విప్లవాలు..
నాడు–నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు బడులు, ఇంగ్లిష్‌ మీడియం, 6వ తరగతి నుంచే ఐఎఫ్‌పీలతో డిజిటల్‌ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్టు టీచర్లతో పాటు సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్, బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, ఉన్నత చదువులు అభ్యసించే 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజుల చెల్లింపు, అంతర్జా­తీయ యూనివర్సిటీలతో మన కాలేజీల అనుసంధానం, ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కోర్సులు, తప్పనిసరి 
ఇంటర్న్‌­షిప్‌ లాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? 

అక్కచెల్లెమ్మలకు అండగా..
అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూ­త, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వారి పేరిటే 31లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌరసేవలు, రేషన్, పథకాలు, రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, నష్టపోతే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటిపూటే 9గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలను చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకేలు లాంటి విప్లవా­త్మక పథకాలు, కార్యక్రమాలను గతంలో ఎప్పుడైనా చూశారా?

 స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలు గతంలో ఉన్నాయా? వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. కోలుకునే సమయంలో ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, టెస్టులు చేసి మందులు కూడా ఇచ్చేలా ఆరోగ్య సురక్ష తెచ్చాం.  ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాలను గతంలో చూశారా?

గ్రామ స్వరాజ్యం..
ఏ గ్రామాన్ని చూసినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయాలు, ప్రతి 60 – 70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వలంటీర్లు, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, ఫైబర్‌ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం  మహిళా పోలీసులు, ఆపదలో ఆదుకునే దిశ యాప్‌ లాంటివి మీ బిడ్డ పాలనలో సాకారం చేశాడు. 

మళ్లీ ఇంటికే అన్నీ రావాలంటే..
పేదల తలరాతలు మారాలంటే ఫ్యాను గుర్తుకే ఓటే­యాలి. వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, అవ్వా­తాతల పెన్షన్‌ మళ్లీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్లీ నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా, పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదు­వులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆసుపత్రులు మెరుగుపడాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. మంచి చేసిన ఫ్యాన్‌ ఇంట్లోనే ఉండాలి.చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి.

2014 బాబు విఫల హామీలు
»  రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? 
»   రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ  చేశాడా? 
»    ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్‌ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా?
»   ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ లెక్కన ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? 
»   అర్హులందరికీ 3సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తా­మ­న్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా?  
» రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ హామీ అమలైందా?
»  ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా?
»   సింగపూర్‌ని మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మాణం జరిగిందా? చిలకలూరిపేట, కైకలూరు,  పిఠాపురంలో ఎవరికై నా కనిపిస్తున్నాయా?
» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. 
 »అదే ముగ్గురు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంటూ నమ్మబలుకుతున్నారు.

దీవించండి..
నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌ కుమార్‌ యాదవ్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.

కొల్లేరు మిగులు భూముల పంపిణీ..!
కొల్లేరు సమస్య పరిష్కారం కావాలంటే మళ్లీ మీ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి. నేను ఇచ్చిన మాట ప్రకారం జయమంగళ వెంకటరమణ అన్నను ఎమ్మెల్సీగా చేశా. కొల్లేరు ప్రాంతంలో సర్వే దాదాపుగా పూర్తైంది. రిపోర్టు కూడా సిద్ధమైన వెంటనే మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తాం. మీ బిడ్డే మీ దగ్గరకు వచ్చి ఆ పంపిణీ కార్యక్రమం చేస్తాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement