నకిలీ విత్తనాల చలామణీపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకడుగు వేయొద్దన్నారు. దీనిపై నూతన విత్తన చట్టం తేవాలని వైఎస్ జగన్‌కు అధికారులు సూచించారు. అవసరమైతే అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని వైఎస్ జగన్ అన్నారు.