ఇంత చేతగాని సర్కారు ఎక్కడా చూడలేదు | tdp government is so inefficient, says parthasarathi | Sakshi
Sakshi News home page

ఇంత చేతగాని సర్కారు ఎక్కడా చూడలేదు

Published Fri, Aug 8 2014 3:24 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

ఇంత చేతగాని సర్కారు ఎక్కడా చూడలేదు - Sakshi

ఇంత చేతగాని సర్కారు ఎక్కడా చూడలేదు

అసలు ఇంత చేతకాని ఆంధ్రప్రదేశ్ సర్కారును ఎక్కడా చూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి అన్నారు. బాబు ఈజ్ బ్యాక్ అంటే ఆయన 9 ఏళ్ల పాలనాకాలంలో వచ్చిన కరువు మళ్లీ మొదలైందనిపిస్తోందని ఎద్దేవా చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికల్లో నినాదాలు ఇచ్చారని, కానీ ఇప్పుడు మాత్రం బాబు వచ్చాడని తెలిసి రుతుపవనాలు పారిపోతున్నాయని ఆయన అన్నారు.

కార్యకర్తలు ఏం చేసినా చూసీచూడనట్లు ఉండాలని కలెక్టర్లకు చెప్పడానికే చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసినట్టున్నారని పార్థసారథి విమర్శించారు. ఈ రెండు నెలల్లో టీడీపీ నేతల దుబారా ఖర్చుకు కొంత జోడిస్తే  క్యాంప్ కార్యాలయం, మంత్రుల ఆఫీసులు ఏర్పాటు చేయొచ్చని ఆయన అన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ చేతగానితనం వల్లే కృష్ణా డెల్టా రైతులకు కష్టాలు వచ్చాయని పార్థసారధి మండిపడ్డారు. ఇక తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులకు ఏపీ సర్కార్‌ ఫీజు రీయింబర్స్‌మెంటుపై భరోసా ఇవ్వాలని పార్థసారధి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement