
కడప వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్ బాబు (ఫైల్ ఫొటో)
సాక్షి, వైఎస్సార్ జిల్లా : చంద్రబాబు నాయుడు సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని కడప వైఎస్సార్సీపీ పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు ఆరోపించారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో సంసారం చేసి ఆ పార్టీ నుంచి లక్షల కోట్లు తెచ్చుకున్న చంద్రబాబు, లోకేష్.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. దమ్ముంటే చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. చంద్రబాబు అలా చేస్తే బీజేపీ ఎందుకు దిగిరాదో చూద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు.
జిల్లాలో టీడీపీ ఉండదు..
ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చని తెలుగుదేశం పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని లేదని సురేష్ బాబు వ్యాఖ్యానించారు. ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన జగన్‌తో ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారని.. బాబుకు బుద్ది చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లాలో జరిగిన మినీ మహానాడులో అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటికే జిల్లాలో కొన ఊపిరితో పోరాడుతున్న టీడీపీ కనుమరుగవడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment