జగన్‌తో చర్చకు చంద్రబాబు సిద్ధమా? | YSRCP dares chandra babu to come for discussion with ys jagan mohan reddy over special status | Sakshi
Sakshi News home page

జగన్‌తో చర్చకు చంద్రబాబు సిద్ధమా?

Published Sun, Sep 25 2016 4:09 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

జగన్‌తో చర్చకు చంద్రబాబు సిద్ధమా? - Sakshi

జగన్‌తో చర్చకు చంద్రబాబు సిద్ధమా?

రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్‌సీపీ సవాలు విసిరింది. ఈ అంశంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ముఖాముఖి చర్చించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా అని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు వస్తానంటే.. తాము విజయవాడలోనైనా, కుప్పంలోనైనా చర్చకు సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు.

వైఎస్ జగన్ నిర్వహిస్తున్న యువభేరి కార్యక్రమాలతో చంద్రబాబు గూబ గుయ్యిమందని, విద్యార్థులంతా చంద్రబాబును ఛీకొడుతున్నారని పార్థసారథి చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్యాకేజిని స్వాగతించడం, ఉద్యోగావకాశాలు కల్పించకపోగా నిరుద్యోగ భృతి విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం వంటి అంశాలపై యువభేరి కార్యక్రమాలలో విద్యార్థులు గట్టిగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబుకు, కాంట్రాక్టర్లకు మధ్య బ్రోకర్‌లా నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తయారయ్యారని పార్థసారథి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement