: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి ప్రజలు మోసపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి ప్రజలు మోసపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. విజయవాడలో శనివారం వైఎస్ఆర్ సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
పార్థసారథి మాట్లాడుతూ.. రుణ మాఫీ చేస్తానన్న చంద్రబాబు ప్రజలను వంచించారని విమర్శించారు. చంద్రబాబు సర్కార్ చేసిన మోసాన్ని బట్టబయలు చేసేందుకు వచ్చే నెల 5న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపడుతామని చెప్పారు. రేషన్ కార్డులు, పెన్షన్లలో కోత, రుణమాఫీ వంటి అంశాలపై ప్రభుత్వ విధానాలను ప్రజల ఎదుటే ఎండగడతామని పార్థసారథి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కమిటీలు, అనుబంధ సంఘాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని పార్థసారథి కోరారు.