'రాహుల్.. ఇప్పుడే నిద్రలేచి వచ్చినట్లున్నారు' | it seems rahul gandhi just woke up and came to ap, says partha sarathi | Sakshi
Sakshi News home page

'రాహుల్.. ఇప్పుడే నిద్రలేచి వచ్చినట్లున్నారు'

Published Fri, Jul 24 2015 3:01 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

'రాహుల్.. ఇప్పుడే నిద్రలేచి వచ్చినట్లున్నారు' - Sakshi

'రాహుల్.. ఇప్పుడే నిద్రలేచి వచ్చినట్లున్నారు'

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడే నిద్ర లేచి వచ్చినట్లున్నారని, ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాన్ని విమర్శించే అర్హత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలుసు పార్థసారథి అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వార్థంతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన రాహుల్ గాంధీ మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు పట్టించుకోడానికి రాహుల్ గాంధీకి 14 నెలల సమయం పట్టిందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు కోసమే, చంద్రబాబు వల్లే, చంద్రబాబు డైరెక్షన్లోనే రాహుల్ పాదయాత్ర సాగుతోందని చెప్పారు. పట్టిసీమపై రాహుల్ ఎందుకు మాట్లాడలేదని పార్థసారథి ప్రశ్నించారు. ఓటుకు కోట్లు, ఎర్రచందనం కూలీల బూటకపు ఎన్కౌంటర్, పుష్కరాల తొక్కిసలాట.. ఇలాంటి ముఖ్యమైన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించడానికి మీకు సమయం లేదా అంటూ నిలదీశారు. రాహుల్ గాంధీతో పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని పార్థసారథి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement