‘కాంగ్రెస్‌ పార్టీలోనే దొంగిలించిన పార్టీ విలీనం’ | Vijayasai Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 22 2018 9:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Vijayasai Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘యూ - టర్న్‌’ అంకుల్‌ చంద్రబాబు నాయుడు మరో చారిత్రక యూ టర్న్‌కు సిద్ధపడిపోయారంటూ  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ - టీడీపీ దోస్తిని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

‘చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి సరెండర్‌ అయిపోయారు. బాబు రాహుల్‌ పాదాల దగ్గర వాలిన తీరు చూస్తుంటే ఈ యూ - టర్న్‌ అంకుల్‌ మరో చారిత్రక యూ టర్న్‌కు సిద్ధపడిపోయినట్లు తెలుస్తోందంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్‌ పార్టీలో.. తను దొంగిలించిన టీడీపీ పార్టీని విలీనం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయం’టూ విజయసాయి రెడ్డి ఆరోపించారు.

దేశాన్ని రక్షించాలి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రచారం చేస్తున్నది ఎవరంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల పాటు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుని.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అరవీర సూడో మీడియా ప్రజాస్వామ‍్యవాది చంద్రబాబు అంటూ ఆయన మండి పడ్డారు. అన్నింటా ఏపీ నం.1. జల హారతులు, బోట్‌ రేసులతో రాష్ట్ర ప్రతిష్ట ఎవరెస్ట్‌కి చేరింది. ప్రపంచపటంలో అమరావతికి సింగపూర్‌ పక్కనే చోటు. సంతృప్తస్థాయి 100% దాటేసింది. ఆనంద ఆంధ్రను చూసి అమెరికా, చైనా, రష్యా కుళ్ళిపోతున్నాయంటూ...చంద్రబాబు ఊదరగొడుతున్నారన్నారు. ఈ ప్రేలాపనలతో చంద్రబాబుకు ఏం జబ్బో తెలియక డాక్టర్లు బిత్తరపోయారట అంటూ విజయసాయి రెడ్డి ఎద్దెవా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement