ఎన్నికల నిర్వహిణపై, ఈసీపై చంద్రబాబు ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు గెలిచిన తరువాత ఎప్పుడూ ఈవీఎంల గురించి మాట్లాడలేదని.. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.