మహబూబ్‌నగర్ టౌన్: జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారధి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోలుపై తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయూలన్నారు.
అక్టోబర్ 1 నుంచి ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ధాన్యాన్ని సేకరించేందుకు అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏటా గన్నీ బ్యాగుల సమస్య కారణఃగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. రైతుల నుండి కొనుగోలు ధాన్యాన్ని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించేందుకు అవరసమైన వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతులకు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాలని, చెల్లింపులో జాప్యం జరగకుండా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో 176 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు 176 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో నవంబర్ రెండవ వారంలో ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు. కొనుగోలు చేసి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు రవాణా సదుపాయాలు సిద్ధం చేశామన్నారు.
ధాన్యం సేకరణకు 9,75లక్షల గోనె సంచులను అందుబాటులో ఉంచామని, మరో 9, 75 లక్షల సంచులు అవసరం ఉందన్నారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకన్నట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జా యింట్ కలెక్టర్ ఎల్.శర్మన్, జిల్లా పౌర స రఫరాల మేనేజర్ ప్రసాద్‌రావు, డీఎస్‌ఓ మహమ్మద్ యాసిన్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జెడీ భగవత్ స్వరూప్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
Published Tue, Sep 23 2014 2:46 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement