
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలతో పాటు రైతులకు దీర్ఘకాలిక రుణాలివ్వడంలో బ్యాంకులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దీర్ఘకాలిక రుణ లక్ష్య సాధన చాలా తక్కువగా ఉందన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఎక్కడ అవకాశం ఉందో కనిపెట్టి దానికి తగినట్టు ప్రణాళికలు వేసుకోవాలని కోరారు. జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశం వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు.