Ganpati
-
30 కిలోల చాక్లెట్‌తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!
మనం ఎకో ఫ్రెండ్లీ పేరుతో అందరూ మట్టి గణపతినే పెట్టుకుని పూజించేలా ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాం. మరికొందరు అందులో భాగంగా ఉచితంగా మట్టి గణపతులను వితరణ చేసి పర్యావరణ స్ప్రుహను చాటుతున్నారు. కానీ మహారాష్ట్రకి చెందిన 32 ఏళ్ల బేకర్ వారందరికంటే ఇంకాస్త ముందుడుగు వేసి పర్యావరణం తోపాటు సమాజ హితంగా గణపతిని రూపొందించి శెభాష్ అని ప్రశంసలందుకుంటోంది. ఎవరామె అంటే..ఆమె పేరు రింటు రాథోడ్. ముంబైకి చెందిన రింటు ప్రతి ఏడాది ప్రత్యేకంగా రూపొందించిన గణపతి విగ్రహాలను తమ కమ్యూనిటీలోనూ ఇంటిలోనూ ప్రదర్శిస్తుంది. ఆమె 14 ఏళ్లుగా ఈవిధమైన ఆచారాన్ని పాటిస్తుండటం విశేషం. ఈసారి ఆమె చాక్లెట్లతో విలక్షణమైన వినాయకుడుని రూపొందించింది. స్త్రీ, పురుషుల ఐక్యతను చాటి చెప్పేలా అర్థనారీ రూపంలో గపతిని రూపొందించింది. సమాజంలో మహిళలపై పెరుగుతున్న నేరాల రేటు దృష్ట్యాజజ నేటి కాలంలో ఇలాంటి సందేశాత్మకమైన గణపతి విగ్రహాలు అవసరమని అంటోంది రింటూ. ఈ విలక్షణమైన గణపతి విశ్వంలో సామరస్యతకు, సమతుల్యతకు చిహ్నమని అంటోంది రింటు. అంతేగాదు ఈ ప్రకృతిలో స్త్రీ పురుషులిరువురు సమానం అనే విషయాన్ని ఈ గణపతి రూపం ఎలుగెత్తి చాటుతుంది. అయితే అర్థనారీశ్రుడు అనగానే శివపార్వతులే గుర్తుకొస్తారు. మరి గణపతిని ఇలా రూపొందిచాలని ఆలోచన రింటుకి ఎలా వచ్చిందంటే..గణపతికి సంబంధించి పలు వర్ణనలు, వివరణలు ఉన్నాయి. అయితే 11వ శతాబ్దానికి చెందిన హలాయుధ స్తోత్రం గణేశుడి అర్థనారీ రూపాన్ని ప్రస్తావిస్తుంది. అలాగే రాయ్‌గఢ్(మహారాష్ట్ర)లోని గోరేగావ్‌లో 800 ఏళ్ల పురాతన ఆలయంలో సగం పురుషుడు, సగం స్త్రీతో ఉన్న వినాయకుడి విగ్రహం ప్రతిష్టించారు. ఈ వినాయకుడుని చాలా మహిమాన్వితమైన దైవంగా ప్రజలు భావిస్తారు. అవన్నీ పరిగణలోని తీసుకుని తాను ఇలా వినూత్న రీతిలో గణపతిని రూపొందించినట్లు వివరణ ఇచ్చింది రింటు. ఇక రింటు వృత్తి రీత్యా కమర్షియల్ డిజైనర్ అయితే తన పిల్లలకు తల్లిగా పూర్తిగా సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో బేకరి వైపుకి అడుగులే వేసింది. ఆమె త్రీ డెమన్షియల్ ఎగ్‌లెస్ కేక్‌లు తయారు చేయడంలో స్పెషలిస్ట్. నిమజ్జనం మరీ స్పెషల్..ఇక రింటూ అర్థనారీ రూపు గణపతిని 30 కిలోల డార్క్ చాక్లెట్‌తో సుమారు 25 అంగుళాలు గణపతిని రూపొందించింది. ఈ విగ్రహానికి మొత్తం ఆహార రంగులతోనే పెయింట్ చేసింది. ఈ గణపతిని అనంత చతుర్దశి రోజున పాలలో గణపతిని నిజ్జనం చేస్తుంది. అలాగే ఆ గణనాథుడి ఆశీర్వాదాలు తనపై ఉండేలా నిమజ్జనం చేసిన చాక్లెట్ పాలను నిరుపేద పిల్లలకు పంచిపెడతుందట రింటు. గతేడాది ఆమె 40 కిలోల చాక్లెట్ మిల్లెట్ గణపతిని తయారు చేసి అందరిచేత శెభాష అనిపించుకుంది. అంతేగాదు సమాజానికి ఉపయోగపడేల నిరుపేదలకు, కేన్సర్‌తో పోరాడుతున్న పిల్లల కోసం వివిధ ఎన్జీవోల కలిసి పనిచేస్తోంది కూడా. View this post on Instagram A post shared by Rintu Kalyani Rathod (@rinturathod) (చదవండి: ఎకో ఫ్రెండ్లీ జర్నీ'! 27 దేశాలు చుట్టొచ్చిన ఇద్దరు మిత్రులు..!) -
ముకేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు.. హాజరైన సినీతారలు
-
ఆ గణపతికి 69 కిలోల బంగారు నగలు.. రూ. 400 కోట్ల బీమా
ముంబై: ప్రతి ఏటా దేశంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభంగా జరుగుతుంటాయి. ఈ సారి సెప్టెంబర్ 7 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే సెప్టెంబర్ 17 న గణేష్ నిమజ్జనం జరగనుంది. మహారాష్ట్రలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి.ముంబైలోని ఏర్పాటు చేసే ప్రతి గణపతి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముంబైలోని జీఎస్బీ సేవా మండలి ప్రతిష్ఠించే గణపతి విగ్రహం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. ఈ మండలి వడాలాలోని కింగ్స్ సర్కిల్ సమీపంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహానికి 69 కిలోల బంగారు నగలను ధరింపజేయనున్నారు. అలాగే రూ. 400 కోట్ల బీమా కూడా చేయించనున్నారు. మహారాష్ట్ర సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ నిత్యం పూజలు, అర్చనలు నిర్వహించనున్నారు. -
'జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్లి..'
-
'జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్లి..'
ముంబయి: గణేశ్ శోభాయాత్ర కార్యక్రమం ఓ మహిళకు చేదు జ్ఞాపకంగా మిగిలింది. ముంబయి పోలీసులు ఆమె చుట్టూ మూగి తమ చేతులకు పనిచెప్పారు. తీవ్రంగా కొడుతూ జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు. ఇంతకీ ఆమె చేసిన తప్పేమిటని అనుకుంటున్నారా.. గణపతి మందిరాన్ని దర్శించేందుకు వీఐపీ గేట్ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించడమే. దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిమజ్జనానికి ముందు జరిగే శోభాయాత్రకు కొంత సమయానికి ముందు ముంబయి నగరంలోని ఓ వీధిలో పెట్టిన గణేశ్ ప్రతిమను దర్శించుకునేందుకు ఓ మహిళ వచ్చింది. ఆమెకు తెలియక పొరపాటున వీఐపీ గేట్ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమె చెప్పే సమాధానం కూడా వినకుండా తీవ్రంగా కొట్టి ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో పలు చానెళ్లలో హల్ చల్ చేస్తోంది. పోలీసుల తీరుపై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బొజ్జగణపయ్యకు ‘బీమా’
సాక్షి, ముంబై: నగరంలో ప్రతిష్ఠించనున్న గణేశ్ విగ్రహాలకు బీమా సౌకర్యం కల్పించడానికి నిర్వాహకులు ఉత్సాహం చూపుతున్నారు. వినాయక చతుర్థిని పురస్కరించుకొని తొమ్మిది రోజులు పూజలు అందుకోనున్న వినాయకుడికి కోట్ల రూపాయల బీమా చేయడానికి ఉత్సవ మండళ్లు మందుకొచ్చాయి. నగరంలోనే అత్యంత సంపన్నమైన కింగ్స్‌సర్కిల్‌లోని జీఎస్బీ వినాయకుడికి బీమా సౌకర్యం కల్పించారు. గణేశ్ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో రూ.259 కోట్ల బీమా చేశారు. ఈ వినాయకుడికి వేసే ఆభరణాల విలువ సుమారు రూ.22 కోట్లు. నగరంలోని ఇతర మండళ్లతో పోల్చితే అత్యధికం. నగరంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన లాల్బాగ్చా రాజాకు కేవలం రూ.51 కోట్ల బీమా చేశారు. కింగ్స్‌సర్కిల్‌లోని మండపంలో ఐదు రోజులు మాత్రమే ప్రతిష్టించనున్న వినాయకుడి విగ్రహానికి రోజుకు రూ.51.7 కోట్లు బీమా వర్తిస్తోంది. వినాయకుడి విగ్రహాలకు బీమా సౌకర్యం కల్పించడానికి నేష్నలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకొచ్చింది. లాల్బాగ్చా రాజా రూ.51 కోట్ల బీమా కోసం రూ.12 లక్షల ప్రీమియంను చెల్లిస్తుంది. జీఎస్బీ మండల్ కూడా కనీసం రూ.50 లక్షల ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ పాలసీకాదు.. బీమా కంపెనీ సీనియర్ మేనేజర్ మాట్లాడుతూ.. సాధారణ పాలసీ మాదిరిగా గణేశ్ మండళ్ల వారు బీమాను లెక్కించ వద్దని అన్నారు. మామూలు పాలసీలు రూ.2 కోట్ల వరకు ఉంటాయి. ప్రీమియం రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. కానీ మండళ్ల వారు వేరే విధంగా బీమా చేసుకుంటారు. అగ్ని ప్రమాదం, ఉగ్రవాద చర్యలు, భక్తుల సంఖ్య, ఇతరాత్ర వాటి కోసం బీమా చేస్తారు. ఈ మండలి 1.75 లక్షల కొబ్బరి కాయలను కొనుగోలు చేయడం కోసం టెండర్లను వేసింది. రూ.31.5 లక్షలకు నిర్ణయించారు. ఒక్కో కొబ్బరి కాయ ధర రూ.18 చొప్పున ధర పలకింది. బయటి మార్కెట్లో వీటి ధర రూ.18.20 వరకు ఉంది. బీమా వర్తింపు ఇలా.. విగ్రహం, బంగారం, మండపం, భక్తులకు అగ్ని ప్రమాదం, ఉగ్రవాదుల దాడులు, అల్లర్ల కారణం నష్టం జరిగినా బీమా వర్తిస్తోంది. చతుర్థి మొదటి రోజే ఈ బీమా ప్రారంభం అవుతోంది. చివరి రోజైన ఐదవ రోజు విగ్రహానికి చెందిన బంగారు అభరణాలను ట్రస్టీలు జాగ్రత్తగా బ్యాంక్ లాకర్లో భద్రపర్చే వరకు బీమా కొనసాగుతోంది. ఈ విగ్రహాన్ని మొదటి రోజే బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఈ ఆభరణాలను అలాగే ఉంచుతామని గణేశ్ ఉత్సవ మండలి సభ్యులు పేర్కొన్నారు. నిమజ్జనానికి కొన్ని గంటల ముందు బంగారు ఆభరణాలను తొలగిస్తారు. వీటిని వచ్చే ఏడాది వరకు భద్రపర్చనున్నట్లు సభ్యులు తెలిపారు. -
'మావోనేత గణపతితో లెక్చరర్ కు సంబంధాలున్నాయి'
రామ్ లాల్ ఆనంద్ కాలేజి లెక్చరర్ జీన్ సాయిబాబాకు నిషేధిత నక్సలైట్లతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై సాక్ష్యాలు సమర్పించేందుకు భద్రతా సంస్థలు ఢిల్లీ యూనివర్సిటీ వైఎస్ చాన్స్ లర్ కు నివేదిక ఇవ్వనున్నారు. సీపీఐ(మావోయిస్ట్) నాయకుడు, ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల గణపతి అలియాస్ గణపతితో ప్రత్యక్ష సంబంధాలు జరిపాడని నిఘా సంస్థలు సాక్ష్యాలను సేకరించినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. సాయిబాబా నివాసంలో ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు సోదాలు జరిపి.. కొన్ని వ్యాసాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, కొంత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీపీఐ (మావోయిస్ట్) పోలిట్ బ్యూరో సభ్యుడు కోబాడ్ గాంధీని విచారించగా.. సాయిబాబా పేరు బయటకు వచ్చిందని.. మావోయిస్ట్ పార్టీకి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ గా సాయిబాబా వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలిపారు. -
ఎక్కడ చూసినా మట్టి బొజ్జ గణపయ్యలే