'జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్లి..' | Mumbai Police mercilessly beats woman for trying to enter Ganpati pandal through VIP gate | Sakshi
Sakshi News home page

'జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్లి..'

Published Mon, Sep 28 2015 3:48 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

'జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్లి..'

'జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్లి..'

ముంబయి: గణేశ్ శోభాయాత్ర కార్యక్రమం ఓ మహిళకు చేదు జ్ఞాపకంగా మిగిలింది. ముంబయి పోలీసులు ఆమె చుట్టూ మూగి తమ చేతులకు పనిచెప్పారు. తీవ్రంగా కొడుతూ జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు. ఇంతకీ ఆమె చేసిన తప్పేమిటని అనుకుంటున్నారా.. గణపతి మందిరాన్ని దర్శించేందుకు వీఐపీ గేట్ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించడమే. దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

నిమజ్జనానికి ముందు జరిగే శోభాయాత్రకు కొంత సమయానికి ముందు ముంబయి నగరంలోని ఓ వీధిలో పెట్టిన గణేశ్ ప్రతిమను దర్శించుకునేందుకు ఓ మహిళ వచ్చింది. ఆమెకు తెలియక పొరపాటున వీఐపీ గేట్ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమె చెప్పే సమాధానం కూడా వినకుండా తీవ్రంగా కొట్టి ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో పలు చానెళ్లలో హల్ చల్ చేస్తోంది. పోలీసుల తీరుపై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement