తమ భర్తలతో అక్రమ సంబంధం పెట్టుకుందని..!
మాస్కో: తన భర్తతో మరో మహిళ చనువుగా ఉండటాన్ని ఏ మహిళా సహించలేదు. అది ఇండియాలో అయినా.. రష్యాలో అయినా.. ఎక్కడయినా సరే. తమ భర్తలతో అక్రమ సంబంధం నడుపుతున్న ఓ మహిళపై ఇద్దరు మహిళలు తీవ్రంగా దాడి చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తమ భర్తలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న ఇద్దరు రష్యన్ మహిళలు.. ఆమెను చితకబాదారు. బికినీలో ఉన్న ఆ మహిళ ముఖంపై.. ఇతర శరీర భాగాలపై దాడిచేస్తూ తీవ్రంగా కొట్టారు. ఇదంతా అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. క్రిమియాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో.. ఆ మహిళను వివస్త్రను చేసి కొట్టుకుంటూ వీధుల్లో తిప్పారు. చిన్న పిల్లలు కూడా ఉన్న ఆ వీధుల్లో మహిళపై పాశవికంగా దాడి చేయటం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.