కన్నకొడుకును కాపాడుకునేందుకు వెళ్లిన తల్లిపై కొందరు వ్యక్తులు దాడి చేసి కొట్టి చంపేశారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది.
నావాడ(బీహార్): కన్నకొడుకును కాపాడుకునేందుకు వెళ్లిన తల్లిపై కొందరు వ్యక్తులు దాడి చేసి కొట్టి చంపేశారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దాడి చేసిన వాళ్లంతా కూడా ఫుల్లుగా తాగేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కావబరి అనే గ్రామంలో సుదేశ్వరీ దేవీ అనే 60 ఏళ్ల వృద్ధ మహిళ తాగుడుకు బానిస అయిన తన కుమారుడిని రక్షించుకునేందుకు గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతోంది. అతడు తాగిరావడం చుట్టుపక్కలవారితో గొడవ పడటం షరామాములైంది.
అయితే, బుధవారం కూడా తాగివచ్చిన ఆమె కుమారుడు పొరుగింటివారిని ఏదో కారణంతో తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో వారంతా ఒక్కసారిగా వచ్చి అతడిపై పడి కొట్టడం మొదలు పెట్టారు. అక్కడే ఉన్న సుదేశ్వరీ తన కుమారుడిని కాపాడుకునేందుకు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది.