ఆ ఇంట్లో బిగ్గరగా సంగీతం.. చివరికి షాకింగ్‌ ఘటన వెలుగులోకి.. | Ghaziabad Woman Tortured To Death | Sakshi
Sakshi News home page

రెండురోజులుగా ఇంట్లో బిగ్గరగా సంగీతం.. చివరికి షాకింగ్‌ ఘటన వెలుగులోకి

Published Wed, Jun 21 2023 6:56 PM | Last Updated on Wed, Jun 21 2023 7:12 PM

Ghaziabad Woman Tortured To Death - Sakshi

నిందితులు

ఢిల్లీ: ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ ఇంట్లో నగలు చోరీ చేసిందనే అనుమానంతో 23 ఏళ్ల మహిళను ఆమె బంధువులే చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. సమీనా అనే మహిళ  ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్‌ విహార్‌లో ఉన్న తన బంధువులు హీనా, రమేష్‌ల ఇంటికి బర్త్‌డే వేడుకకు వెళ్లింది. ఇంట్లో రూ.5 లక్షల విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో సమీనా చోరీ చేసిందని ఆ దంపతులు అనుమానించారు.

చేసిన తప్పు ఒపుకోవాలంటూ బ్లేడ్‌, రాడ్‌తో దాడి చేశారు. వారికి బంధువులు కూడా తోడయ్యారు. ఆ మహిళ రక్షించాలంటూ కేకలు వేయడంతో, అరుపులు వినపడకుండా అధిక సౌండ్‌తో మ్యూజిక్‌ ప్లే చేశారు. చిత్రహింసల కారణంగా సమీనా మృతిచెందగా, నిందితులు పరారయ్యారు. కానీ మ్యూజిక్‌ ఆఫ్‌ చేయడం మరిచిపోయారు.

రెండు రోజులుగా ఇంట్లో పెద్దగా సంగీతం వినిపించడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రవికుమార్‌ తెలిపారు.
చదవండి: యువకుడి బైక్‌పై మహిళ.. గమనించిన భర్త.. వారిని వెంబడించి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement