జిల్లా వ్యాప్తంగా విత్తన పంపిణీ
Published Thu, Jun 1 2017 12:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– వేరుశనగకు డిమాండ్ అంతంత మాత్రమే
కర్నూలు(అగ్రికల్చర్): విత్తనాల పంపిణీ బుధవారం జిల్లా వ్యాప్తంగా మొదలయింది. కందులు, మినుములు తదితర వాటికి ధరలు రావడం వల్ల అన్ని రకాల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మొదటి రోజుతో పోలిస్తే బుధవారం వేరుశనగకు కొంతమేర డిమాండ్ కనిపించింది. అయితే ఊహించిన స్థాయిలో డిమాండ్ లేదని వివిధ మండలాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. వర్షాలు లేకపోవడం వల్ల విత్తనాలు పొందేందుకు రైతులు ముందుకురావడం లేదని తెలుస్తోంది. సబ్సిడీ పోను చెల్లించాల్సిన ధర మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉండటం కూడ రైతులు సబ్సిడీ వేరుశనగ తీసుకునేందుకు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో 2838 క్వింటాళ్లు వేరుశనగ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక కర్నూలు మండలంలో 146 ప్యాకెట్ల వేరుశనగ, 50 ప్యాకెట్ల కందులు పంపిణీ చేశారు.
Advertisement