ముగిసిన విత్తన వేరుశనగ పంపిణీ | groundnut seed distribution complete | Sakshi
Sakshi News home page

ముగిసిన విత్తన వేరుశనగ పంపిణీ

Published Thu, Jul 27 2017 10:33 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఎట్టకేలకు విత్తన వేరుశనగ పంపిణీకి అధికారులు ముగింపు పలికారు.

అనంతపురం అగ్రికల్చర్‌: ఎట్టకేలకు విత్తన వేరుశనగ పంపిణీకి అధికారులు ముగింపు పలికారు. పంట సాగుకు సమయం ముగుస్తున్నా విత్తన పంపిణీ  కొనసాగిస్తుండంపై విమర్శలు వెల్లువెత్తడంతో గురువారం నుంచి పంపిణీని నిలపివేశారు. అయినప్పటికీ  వ్యవసాయశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించకపోవడం విశేషం. వర్షాభావ పరిస్థితులు కారణంగా పంట సాగు పడకేయడంతో పాటు సాగు సమయం జూలై 31వ తేదీగా శాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో మే 24వ తేదీ ప్రారంభించిన విత్తన పంపిణీ 53 రోజులు పాటు కొనసాగించి 54వ రోజు గురువారం పంపిణీ నిలిపివేశారు. మొత్తమ్మీద జిల్లాకు కేటాయించిన 4.01 లక్షల క్వింటాళ్లలో 2,88,878 మంది రైతులకు 3,32,655 క్వింటాళ్లు ఇచ్చారు. 53 రోజులు పంపిణీ చేసినా ఇంకా 69 వేల క్వింటాళ్లు మిగిలిపోయాయి. కందులు, బహుధాన్యాల కిట్లు, మొక్కజొన్న పంపిణీ మరికొద్ది రోజులు కొనసాగిస్తామని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement