సిమెంట్‌ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు! | Shipra Singhania Success Story In Building A House Without Using Cement Rajasthan | Sakshi
Sakshi News home page

Shipra Singhania: సిమెంట్‌ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు!

Published Sat, May 11 2024 10:38 AM | Last Updated on Sat, May 11 2024 10:39 AM

Shipra Singhania Success Story In Building A House Without Using Cement Rajasthan

బెల్లం, పసుపు, మెంతి ఆకు, వేప ఆకు... ఇదంతా ఇప్పుడు కిచెన్‌  మెటీరియల్‌ మాత్రమే కాదు బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ కూడా. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ నిజానికి నిదర్శనం కోసం రాజస్థాన్‌ కెళ్లాల్సిందే. రాజస్థాన్‌ లోని అల్వార్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ శిప్రా సింఘానియా తన మేధను రంగరించి ఇల్లు కట్టుకుంది. అందరూ సిమెంట్, ఇసుక కలిపి ఇల్లు కడుతుంటే మీరెందుకిలా కట్టుకున్నారని అడిగితే ఆమె చెప్పే సమాధానమేమిటో చూద్దాం...

‘‘మాది ఎడారి రాష్ట్రం. ఉష్ణోగ్రతలు వేసవిలో 41 డిగ్రీలకు చేరుతాయి, శీతాకాలంలో ఎనిమిది డిగ్రీలకు పడిపోతాయి. ఆ వేడిని భరించడమూ కష్టమే, అంత చలిని కూడా తట్టుకోలేం. ఇంటి నిర్మాణం ఈ ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే విధంగా ఉండాలని కోరుకున్నాను. అందుకోసం బురదమట్టి, సున్నపురాయిలో వేపాకులు బెల్లం, పసుపు, మెంతి ఆకు వంటి అనేక పదార్థాలను సమ్మిళితం చేసి ఇల్లు కట్టుకున్నాను. నిజానికి ఈ ఫార్ములా నేను కొత్తగా కనిపెట్టినదేమీ కాదు.

ఇంటి లోపల అధునాతన సౌకర్యాలతో..

భవన నిర్మాణంలో సిమెంట్‌ ఉపయోగించడానికి ముందు మనదేశంలో పాటించిన విధానాన్నే పునరుద్ధరించాను. ఇది రెండువేల చదరపు అడుగుల నిర్మాణం. పైకప్పు కేంద్రభాగం 23 అడుగుల ఎత్తు ఉంది. ఇందుకోసం స్వయంగా నేనే డిజైన్‌  గీసుకున్నాను. వేపాకు చెద పురుగుల నుంచి రక్షణనిస్తుంది. బెల్లం, మెంతిలోని జిగురుకు నిర్మాణ ముడిసరుకులో ఇతర వస్తువులను గట్టిగా పట్టుకునేటంతటి సామర్థ్యం ఉంటుంది.

ఈ నిర్మాణంలో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తాయి. అలాగే రెయిన్‌  వాటర్‌ హార్వెస్టింగ్, గ్రే వాటర్‌ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జీరో సిమెంట్‌ నిర్మాణం అన్నమాట’’ అని చెప్పారు శిప్రా సింఘానియా. ఈ విధమైన నిర్మాణ శైలి ఇప్పుడిప్పుడే అందరి దృష్టిలో పడుతోంది. బహుశా ఇక నుంచి ఆ ఇంటిని ‘శిప్రా సింఘానియా ఇల్లు’ అని చెప్పుకుంటారేమో. ఇంతకీ ఈ ఇల్లు ఎండను, చలిని ఎంత మేర తగ్గిస్తుందంటే వేడిని కనీసంగా ఎనిమిది డిగ్రీలు తగ్గిస్తుంది. శీతాకాలంలో పదహారు డిగ్రీలకు తగ్గకుండా కాపాడుతుంది.

ఇవి చదవండి: 'నిద్ర'కూ ఓ స్టార్టప్.. సూపర్ సక్సెస్!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement