house construction
-
దళిత మహిళ ఇల్లు నిర్మించుకుంటుంటే అడ్డుపడ్డ టీడీపీ నేత
-
శీతల దేశాల నేస్తం.. మార్కాపురం పలక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం అంటే.. అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది ‘పలక’. ఆ పలక మీద ఓనమాలు నేర్చుకున్న ఎన్నో చిట్టి చేతులు.. ఉన్నతస్థానాలకు చేరాయి. అలాగే ఎన్నో శీతల దేశాలు కూడా మార్కాపురం పలక(Markapuram Matti Palaka)లను అక్కున చేర్చుకున్నాయి. మన దేశంలో వీటిని అక్షరాలు దిద్దేందుకు వినియోగిస్తే.. శీతల దేశాల్లో గృహ నిర్మాణాల్లో ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల బయట గడ్డ కట్టే చలి ఉన్నా.. గదిలో మాత్రం వెచ్చగా ఉంటుంది. అందుకే వీటికి శీతల దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రాసుకునే పలకల నుంచి డిజైన్ స్లేట్స్ వైపు అడుగులు.. పలకల గనులు మార్కాపురంతో పాటు తర్లుపాడు, కొనకనమిట్ల, దొనకొండ మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో హరియాణా, రాజస్థాన్ ప్రాంతాల్లో పలకల గనులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా మార్కాపురం నుంచే పలకలు ఎగుమతి అవుతుంటాయి. 80, 90 దశకాల్లో వ్యాపారం జోరుగా సాగింది. ఆ రోజుల్లో ఏ చిన్నారి చేతిలో చూసినా మార్కాపురం పలకే ఉండేది.ఈ ప్రాంతంలో 100కి పైగా గనుల్లో కార్యకలాపాలు సాగేవి. వేలాది మంది గడ్డపారలు, సుత్తులతో పలకలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా తీసేవారు. అయితే కాలక్రమేణా రాసుకునే పలకల వినియోగం తగ్గడంతో వ్యాపారులు, తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేశారు. గృహ నిర్మాణాల్లో ఉపయోగించేలా పలకల తయారీ మొదలుపెట్టారు. వీటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. చైనాతో పోటీ.. కరోనాతో డీలా అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, వియత్నాం, మలేసియా, సింగపూర్, ఇంగ్లండ్ తదితర దేశాలకు మార్కాపురం నుంచి పలకలను ఎగుమతి చేస్తుంటారు. క్రిస్మస్ వస్తుందంటే చాలు అమెరికా, ఇంగ్లండ్, రష్యా తదితరæ దేశాల్లో పాత డిజైన్ స్లేట్లను తొలగించి కొత్త వాటిని అమర్చుకుంటూ ఉంటారు. దీంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండేది. అదే సమయంలో చైనా కూడా భారీగా ఎగుమతులు మొదలుపెట్టారు. ఈ పోటీని తట్టుకుంటున్న సమయంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఆర్థిక మాంద్యం తలెత్తడంతో ఎగుమతులకు ఆటంకాలు ఎదురయ్యాయి.కరోనా తర్వాత ఈ పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింది. చాలా పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులతో మూతపడ్డాయి. కొందరు మాత్రమే ఎగుమతులు ప్రారంభించారు. మళ్లీ పుంజుకుంటున్న సమయంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఎగుమతులపై పడింది. పలకల కంటైనర్లను సముద్రం ద్వారా పంపే ఖర్చు రెట్టింపు అయ్యింది. దీంతో ఎగుమతులు భారమయ్యాయని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కలిసొచ్చేనా.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. చైనాకు, ఆ దేశానికి మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. పోటాపోటీగా దిగుమతి సుంకాలను పెంచుకుంటున్నాయి. దీంతో అమెరికాలో చైనా పలకల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మళ్లీ మార్కాపురం పలకలకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వ భవనాలకు మార్కాపురం డిజైన్ స్లేట్స్‌ను ఉపయోగించాలి. అలాగే ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఉచితంగా పలకలు ఇవ్వాలి. దీని వల్ల వేలాది మంది కార్మి కులకు పని దొరకడంతో పాటు పరిశ్రమ పుంజుకుంటుంది. అలాగే పలకల ఫ్యాక్టరీల యజమానులకు సబ్సిడీపై రుణాలు అందించాలి. కరెంటు చార్జీలతో పాటు క్వారీ చార్జీలను తగ్గించి.. ప్రభుత్వం ఆదుకోవాలి. – బట్టగిరి తిరుపతిరెడ్డి, డిజైన్ స్లేట్ వ్యాపారి -
ఇంటికి టైల్.. యమస్టైల్!
ఇళ్లు నిర్మించుకోవడం ఒక ఎత్తయితే.. టైల్స్ ఎంపిక మరో ఎత్తు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంటి అందం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఆకర్షణీయంగా కనిపించడంలో కీలక పాత్ర పోషించేది నేలపై పరిచే టైల్స్. వాటి డిజైన్ ఎంపిక విషయంలో దాదాపు ఒక యుద్ధం చేసినంత కసరత్తు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే చాలా కంపెనీలు కస్టమర్ల అభిరుచులు, ట్రెండ్‌కు తగ్గట్టు తయారు చేస్తున్నాయి. ప్రతి ఏటా కస్టమర్ల అభిరుచుల్లో చాలా తేడా కనిపిస్తోందని పలు కంపెనీలు చెబుతున్నాయి. రంగులు, డిజైన్లు, ఆకారాల విషయంలో ప్రజలు ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని పేర్కొంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోప్రకృతి నుంచి స్ఫూర్తి టైల్స్ డిజైన్ రూపొందించే విషయంలో ప్రతి అంశం నుంచి స్ఫూర్తి పొందుతుంటారని తయారీదారులు చెబుతున్నారు. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుందని, ప్రకృతికి సంబంధించి చెట్లు, పూలు, ఆకులను మనసులో ఉంచుకుని తయారు చేస్తుంటామని పేర్కొంటున్నారు. ఇక, వివిధ రకాల ఆకారాలు కూడా ముఖ్యమని, రంగులు, విభిన్న కాన్సెప్టులతో మార్బుల్, స్టోన్స్‌తో రూపొందిస్తుంటామని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నారు.రూ.35 నుంచి ప్రారంభం.. టైల్స్‌లో కూడా ఒక్కో డిజైన్, ఒక్కో ఆకారాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంది. ప్రతి చదరపు అడుగు టైల్కు రూ.35 నుంచి రూ.500 వరకు కూడా ఉంది. సెరామిక్ టైల్స్‌కు కాస్త తక్కువ ధర ఉంటుంది. విట్రిఫైడ్, మార్బుల్ టైల్స్, గ్రానైట్ టైల్స్, వుడ్ లుక్ టైల్స్, సిమెంట్ టైల్స్ వంటి రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మార్బుల్ టైల్స్‌కు కాస్త ధర ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎక్కువగా సెరామిక్ టైల్స్‌కు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత విట్రిఫైడ్ టైల్స్‌కు, ఆ తర్వాత వేరే రకం టైల్స్‌ను వాడుతున్నారు. ఏటా భారీస్థాయిలో వృద్ధి.. టైల్స్ రంగం ఏటా భారీ స్థాయిలో వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 11.96 శాతం పెరుగుదల కనిపిస్తోందని కెన్ పరిశోధనలు తేల్చాయి. 2023లో టైల్స్ మార్కెట్ ఏకంగా 8,543.9 మిలియన్ డాలర్లు నమోదు చేయగా, 2030 నాటికి ఈ మార్కెట్ విలువ ఏకంగా 13,265.2 మిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా వేస్తున్నారు. 2024 నుంచి 2030 మధ్య ఈ రంగం ఏకంగా 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దినుసుల స్ఫూర్తిగా.. దేశంలోని మసాలా దినుసులను స్ఫూర్తిగా తీసుకుని టైల్స్ డిజైన్ రూపొందిస్తుంటాను. భారతీయత ఉట్టిపడేలా, ఇక్కడి ప్రకృతి రమణీయతను టైల్స్ డిజైన్స్‌లో ఉండేలా చూసుకుంటాను. అనేక దేశాల్లో ఇలాంటి డిజైన్స్‌కు యమ గిరాకీ ఉంది. ప్రజల అభిరుచికి తగ్గట్టు టైల్స్ డిజైన్స్ రూపొందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాను. – మారియా కాస్టిలో, రీజెన్సీ టైల్స్ చీఫ్ డిజైనర్ -
ఇల్లు కట్టుకోవాలా..? ఇదిగో ఈజీగా పర్మిషన్!
సాక్షి, సిటీబ్యూరో: మధ్యతరగతి వర్గాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకున్నా.. నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలన్నా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. భవన నిర్మాణాలకే కాకుండా నిర్మాణం పూర్తయిన ఇళ్లు, అపార్ట్మెంట్లలో నివాసానికి సైతం హెచ్ఎండీఏ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.అన్ని రకాల డాక్యుమెంట్లు, ఆధారాలు ఉంటే దరఖాస్తుదారులు ప్రత్యేకంగా హెచ్ఎండీఏ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. టీజీబీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్ణీత వ్యవధిలో ప్రొసీడింగ్స్ పొందవచ్చు. కొత్తగా అపార్ట్మెంట్ కానీ, బిల్డింగ్లు కానీ నిర్మించేందుకు చాలామంది సకాలంలో సరైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం వల్లనే ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల్లో.. పెట్ పార్క్అన్ని విధాలుగా నిర్మాణ యోగ్యత ఉన్నట్లు తేలితే వారం, పది రోజుల్లోనే ప్రొసీడింగ్స్ లభిస్తాయని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘కొద్ది రోజులుగా హెచ్ఎండీఏ ఫైళ్లకు కదలిక వచ్చింది. లేఅవుట్లు, అపార్ట్మెంట్లకు ఇచ్చే అనుమతుల్లో వేగం పెరిగింది. సమస్యలు ఉన్న స్థలాల్లో మాత్రమే ప్రతిష్టంభన నెలకొంటోందని’ అన్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే అన్ని డాక్యుమెంట్లను సరి చూసుకోవాలని చెప్పారు.మీ స్థలం జాడ తెలుసుకోండి.. » హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3,350కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి సమీపంలో ఉండే నిర్మాణ స్థలాలు బఫర్ జోన్లలో ఉన్నా, ఎఫ్టీఎస్ పరిధిలో ఉన్నా అనుమతులు లభించవు. ఇందుకోసం హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లోని చెరువుల మ్యాపులను పరిశీలించి నిర్ధారణ చేసుకొనే అవకాశం ఉంది.» టీజీబీపాస్లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది ఉండటం తప్పనిసరి. ప్రభుత్వం కొత్తగా హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తనిఖీలు చేసి ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాతే హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం దరఖాస్తులను స్వీకరించే విధంగా మార్పు చేశారు.» ఇప్పుడు ఈ అనుమతుల ప్రక్రియ రెండు అంచెలుగా మారింది. మొదట నీటి పారుదల, రెవెన్యూ అధికారులు పరిశీలించి నివేదికలు ఇచ్చిన అనంతరం ప్లానింగ్ అధికారి పరిశీలనలోకి వెళ్తుంది. అక్కడ ఏమైనా సందేహాలు ఉంటే సదరు ఫైల్‌ను వెనక్కి పంపించే అవకాశం ఉంది. అన్నీ క్లీయర్‌గా ఉంటే ప్లానింగ్ డైరెక్టర్ పరిశీలిస్తారు. అనంతరం హెచ్ఎండీఏ కమిషనర్ ఆమోదంతో నిర్మాణానికి అనుమతి పత్రాలు (ప్రొసీడింగ్స్) లభిస్తాయి.డాక్యుమెంట్లు ఇవీ..» సాధారణంగా నిర్మాణ సంస్థలు సొంతంగా కానీ లేదా కన్సల్టెంట్ సంస్థల ద్వారా కానీ టీజీబీపాస్ ద్వారా దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నాయి. సొంత ఇళ్లు నిర్మించుకొనే మధ్యతరగతి వర్గాలు సైతం ఆర్కిటెక్చర్లు, కన్సల్టెంట్ల సహాయం తీసుకుంటారు. అన్ని అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్లు స్వయంగా తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసినప్పటికీ అవసరమైన డాక్యుమెంట్లు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే.» భూమి డాక్యుమెంట్లు, లింక్‌డాక్యుమెంట్లు, పాస్‌బుక్, టైటిల్ డీడ్, ఎమ్మార్వో ప్రొసీడింగ్స్, భూమికి సంబంధించిన పహణీలు, కాస్రాపహణీ, రెవెన్యూ స్కెచ్, 13 ఏళ్ల ఈసీ పత్రాలను అప్లోడ్ చేయాలి.» మార్కెట్ వాల్యూ, నాలా చార్జీలు, ఎన్ఓసీలు, సైట్ ఫొటోలు, జియో కోఆర్టినేట్స్, సైట్ సర్వే బౌండరీలు తదితర పత్రాలన్నీ ఉంటే సకాలంలో అనుమతులు పొందవచ్చు.» భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కూడా అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం భూమి స్వభావాన్ని ధ్రువీకరించే సర్టిఫికెట్, నీటి నాణ్యత ధ్రువీకరణ, డిజైన్లు, ఫైర్, పర్యావరణ తదితర సంస్థల అనుమతులు, బిల్డింగ్ రిస్క్ ఇన్సూరెన్స్ వంటివి ఉండాలి. -
కాప్సూల్ ఇంట్లో కులాసాగా..
సాక్షి, అమరావతి: ఈ ఇంటిని చూస్తే.. సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలో ఇంటిలాగానో, అంతరిక్ష ప్రయోగానికి సిద్ధం చేసిన స్పేస్ షిప్లాగానో ఉంది కదూ! ఈ ఇంటి లోపల చూస్తే నిజానికి అదే అనుభూతి కలుగుతుంది. స్పేస్ కాప్సూల్ హౌస్‌గా పిలిచే ఈ ఇంటిని 20 ఏళ్ల క్రితం ‘నాసా’ స్పేస్ టెక్నాలజీతో తయారు చేశారు. ఈ తరహా మోడల్ హౌసెస్ సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలైన మార్వెల్ మూవీస్‌లో సైతం కన్పిస్తుంటాయి. అమెరికాలో అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని చైనా శాస్త్రవేత్తలు అందిపుచ్చుకొని విశ్వవ్యాప్తం చేశారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే సాంకేతిక, పరికరాలన్నీ చైనా నుంచే ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికాతో పాటు చైనా, యూరప్, గల్ఫ్ దేశాల్లో విస్తృతంగా వాడుకలోకి ఉన్న ఈ ఇళ్ల నిర్మాణ టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అందుబాటులోకి వచి్చంది. రాజమహేంద్రవరానికి చెందిన సీబాక్స్ హౌసెస్ కంపెనీ రాష్ట్రానికి ఈ కొత్త ఇళ్లను పరిచయం చేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ అంతా విదేశాల నుంచే దిగుమతి చేసుకున్నదే. ఇంటి అవుట్‌సైడ్ బాడీ అల్యూమినియంతోనూ, ఇన్సైడ్ బాడీ స్ట్రక్చర్ పూర్తిగా గల్వనైజ్డ్ ఐరన్తోనూ నిరి్మస్తారు. ఇక తలుపులు, కిటికీల కోసం గట్టిగా ఉండే అత్యాధునిక ప్లాస్టిక్ ఉడ్ని వాడుతున్నారు. 500 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు.. కావాల్సిన మోడల్స్‌లో సింగిల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్, ట్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని అత్యంత సులువుగా నిరి్మంచుకోవచ్చు. 45 రోజుల్లో ఇంటి నిర్మాణం ఇంటి నిర్మాణానికి కేవలం 45 రోజుల సమయం పడుతుంది. మోడల్‌ను బట్టి రూ. 25 లక్షల నుంచి రూ. 55 లక్షల వరకు అవుతుంది. ఇవి 50 ఏళ్ల వరకు చెక్కుచెదరవు. క్రేన్ సహాయంతో కంటైనర్లు తరలించే భారీ లారీలపై ఒకచోట నుంచి మరొక చోటకు అత్యంత సులభంగా తరలించుకుపోవచ్చు. మైదాన ప్రాంతాల కంటే కొండ ప్రాంతాల్లో నిరి్మంచుకుంటే ఆకర్షణీయంగా ఉంటాయి. ఫామ్ హౌసెస్, రిసార్ట్స్ నిర్మాణానికి ఇవి ఎంతగానో అనుకూలం. మడత పెట్టే ఫోల్డెడ్ హౌసెస్ మడత పెట్టే కురీ్చలు, మంచాల మాదిరిగానే దేశంలోనే తొలిసారి మడతపెట్టే పోల్డెడ్ హౌసెస్ కూడా మన రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. కేవలం గంటలోనే వీటిని ఫిక్స్ చేయవచ్చు. 1 బీహెచ్‌కే నుంచి 4 బీహెచ్‌కే ఫోల్డబుల్ హౌసెస్ నిర్మించుకోవచ్చు. వీటి నిర్మాణానికి జీఏ మెటీరియల్‌ను వినియోగించడం వలన చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కేవలం రూ. 11.5 లక్షల్లోనే ఆకర్షణీయమైన ఇల్లు అందుబాటులోకి వస్తుంది. కంటైనర్ హౌసెస్ కాదు» ఇవి కంటైనర్ హౌసెస్ లాంటివి కాదు. పూర్తి రక్షణతో కూడుకున్న గృహాలు. » ఇవి సన్ ప్రూఫ్‌తో పాటు ఫైర్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్ కూడా. నిర్మాణంలో అన్బ్రేకబుల్ డీజే గ్లాసెస్‌ను వినియోగిస్తున్నారు. » సెంట్రలైజ్డ్ ఏసీతో పాటు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా తనకు తానుగా మార్చుకునే ఆటో టెంపరేచర్ కంట్రోల్ ఫ్లోర్ ఈ ఇంటి ప్రత్యేకం. » ఆహ్లాదం గొలిపేలా అత్యంత ఆకర్షణీయమైన రీతిలో ఇంటీరియర్స్ ఉంటాయి. » అత్యంత లగ్జరీగా ఉండే లివింగ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్స్, బాత్ రూమ్స్, స్మార్ట్ టాయిలెట్, రిమోట్‌తో పనిచేసే ఆటోమేటిక్ కర్టెన్స్, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ ఇళ్ల సొంతం. దేశంలోనే తొలి ప్రయోగంఏడాది క్రితం చైనాకు వెళ్లినప్పుడు ఈ తరహా మోడల్స్ చూశాం. చాలా బాగున్నాయనిపించి వీటిని మన దేశానికి తీసుకురావాలన్న సంకల్పంతో సీబాక్స్ హోమ్స్‌ను ప్రారంభించాం. మన దేశంలో స్పేస్ టెక్నాలజీతో ఈ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టడం ఇదే తొలిసారి. మెటీరియల్ పూర్తిగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి 8 ఇళ్ల నిర్మాణానికి ఆర్డర్స్ వచ్చాయి. రాజమహేంద్రవరంలోని జేఎన్రోడ్లో మోడెల్ హౌసెస్‌ను ఏర్పాటు చేశాం. వీటితో పాటు ఫోల్డెడ్ హౌసెస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ తరహా ఇళ్ల నిర్మాణం దేశంలో మరెక్కడా అందుబాటులో లేవు. ఏడాది పాటు సరీ్వస్ పూర్తిగా ఉచితం. ఆ తర్వాత సరీ్వస్ చార్జీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణం కోసం చైనాలో శిక్షణ పొందిన 10 మంది సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉన్నారు. – ఎం.ప్రదీప్, మేనేజర్, సీబాక్స్ హోమ్స్ -
పల్లెకు 3.0 ధమాకా
కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన మోదీ 3.0 సర్కారు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు నడుం బిగించింది. కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాల (ఫ్లాగ్షిప్)కు ఈసారి బడ్జెట్లో దండిగానే నిధులు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో గ్రామీణాభివృద్ధికి (మౌలిక సదుపాయాలతో సహా) రూ. 2,38,204 కోట్లు కేటాయించగా (సవరించిన అంచనా రూ. 2,38,984 కోట్లు).. ఈ సారి బడ్జెట్లో (2024–25) దీన్ని రూ. 2,65,808 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముఖ్యంగా ఉపాధి హామీకి మళ్లీ భారీగా నిధులతో పాటు గ్రామీణ రోడ్ల కోసం నాలుగో దశ, అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం (పట్టణ, గ్రామీణ)పై ఫోకస్ చేయడం విశేషం!జోరుగా ‘ఉపాధి’..2024–25 కేటాయింపు: రూ.86,000 కోట్లు2023–24 కేటాయింపు: రూ.60,000 కోట్లు గతేడాది బడ్జెట్లో నిధుల కోతకు గురైన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ ఈజీఏ) మళ్లీ కేటాయింపులు జోరందుకున్నాయి. ముఖ్యంగా మోదీ సర్కారు ఈ పథకాన్ని నీరుగారుస్తుందన్న విమర్శల నేపథ్యంలో 2024–25 బడ్జెట్లో కేటాయింపులు 40 శాతం మేర పెరగడం విశేషం. అయితే, 2023–24 సవరించిన అంచనాల (రూ. 86,000 కోట్లు)తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో ఉన్నాయి.గ్రామీణ రోడ్లు.. నాలుగో దశ షురూ2024–25 కేటాయింపు:రూ.19,000 కోట్లు2023–24 కేటాయింపు: రూ.17,000 కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పీఎంజీఎస్‌వై)కు ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యం లభించింది. ఈ స్కీమ్ నాలుగో దశను సీతారామన్ ప్రకటించారు. ‘పీఎంజీఎస్‌వై ఫేజ్–4లో భాగంగా 25,000 పల్లె ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానం చేయనున్నాం. ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు. 2023–24 సవరించిన అంచనాలు రూ. 17,000 కోట్లతో పోలిస్తే, 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో కేటాయింపులు దాదాపు 12 శాతం పెరగడం గమనార్హం. స్కీమ్ మొదలైనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 8,15,072 కిలోమీటర్ల పొడవైన రోడ్లకు అనుమతులు మంజూరు కాగా, 7,51,163 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది.సొంతింటికి దన్ను (పీఎంఏవై)2024–25 కేటాయింపులు: రూ.80,671 కోట్లు2023–24 కేటాయింపులు: రూ.54,103 కోట్లు (సవరించిన అంచనా)ఠిపేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్లో ఈ పథకానికి నిధులు భారీగా పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద, బలహీన వర్గాలకు 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, 2023 మార్చి నాటికి 2.94 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని ఈ స్కీమ్ కింద చేపట్టనున్నట్లు తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో రెండు కోట్ల ఇళ్లను గ్రామాల్లో, కోటి ఇళ్లను పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. పీఎంఏవై (అర్బన్) 2.0 స్కీమ్ కోసం ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సీతారామన్ వివరించారు. ఇందులో భాగంగా వడ్డీ రాయితీ, చౌక రుణాల రూపంలో రూ. 2.2 లక్షల కోట్ల సాయం అందిస్తామని చెప్పారు. రుణ ఆధారిత సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) కోసం ఈ బడ్జెట్లో రూ.4,000 కోట్లను కేంద్రం కేటాయించింది. మొత్తం మీద పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.30,170 కోట్లు దక్కాయి. 2023–24తో పోలిస్తే ఇది 20.19 శాతం ఎక్కువ.స్వచ్ఛ భారత్ మిషన్..2024–25 కేటాయింపు: రూ. 12,192 కోట్లు2023–24 కేటాయింపు: రూ.9,550 కోట్లు (సవరించిన అంచనా)దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ పథకం (ఎస్బీఎం) కిందికి ఘన వ్యర్ధాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ మిషన్ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్ స్టేటస్‌ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛ భారత్ (అర్బన్) పథకానికి ఈ బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్ అంచనా (రూ.5,000 కోట్లు)తో పోలిస్తే అదే స్థాయిలో ఉన్నప్పటికీ, సవరించిన అంచనా (రూ.2,550 కోట్లు)తో పోలిస్తే నిధులు రెట్టింపయ్యాయి. ఇక స్వచ్ఛభారత్ (గ్రామీణ) స్కీమ్‌కు రూ.7,192 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనా (రూ.7,000 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.తాగునీటికి కాస్త పెంపు.. 2024–25 కేటాయింపు: రూ.69,927 కోట్లు2023–24 కేటాయింపు: రూ.69,846 కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ కుటుంబాలన్నింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. 2024 నాటికి దీన్ని సాధించాలనేది కేంద్రం లక్ష్యం. కాగా, దేశంలోని మొత్తం 19.26 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను ఇప్పటివరకు 14.22 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా.పట్టణ పేదల ఇళ్లకు.. 2.2 లక్షల కోట్లు» సరసమైన రేట్లకు రుణాలు.. వడ్డీ రాయితీ» మొత్తం రూ.10 లక్షల కోట్లతో పీఎంఏవై అర్బన్ 2.0» రెంటల్ హౌసింగ్ మార్కెట్లకు ప్రోత్సాహం» పారిశ్రామిక కార్మికుల కోసం అద్దె ఇళ్లుమహిళలు కొనే ఆస్తులపై సుంకం తగ్గింపు!న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ పథకం కింద వచ్చే ఐదేళ్లలో కోటి మంది పట్టణ పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు గృహ నిర్మాణాల నిమిత్తం రూ.2.2 లక్షల కోట్ల సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. సరసమైన రేట్లతో రుణాలు అందించేందుకు వీలుగా వడ్డీ రాయితీని కూడా ప్రతిపాదించింది. మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) కింద 3 కోట్ల అదనపు గృహాలను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ మేరకు నిధుల కేటాయింపు జరుపుతున్నామని చెప్పారు. కేంద్రసాయం రూ.2.2 లక్షల కోట్లతో కలిపి మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో పీఎంఏవై అర్బన్ 2.0 పథకాన్ని చేపడతామని తెలిపారు. రెంటల్ హౌసింగ్ మార్కెట్లను ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్రం విధానాలను రూపొందిస్తుందని చెప్పారు. అద్దె ఇళ్ల లభ్యతను పెంచడంతో పాటు నాణ్యత, పారదర్శకతకు అవసరమైన విధానాలు, నియమ నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు. పారిశ్రామిక కార్మికుల కోసం డార్మెటరీ తరహా వసతులతో అద్దె గృహాలు నిర్మిస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని చేపడతామన్నారు. రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ తగ్గించాలిమహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై సుంకాన్ని మరింత తగ్గించే అంశంపై కేంద్రం దృష్టి సారిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పట్టణాభివృద్ధి పథకాల్లో దీనినొక తప్పనిసరి అంశంగా చేయనున్నట్లు చెప్పారు. అధిక స్టాంప్ డ్యూటీ వసూలు చేసే రాష్ట్రాలు వాటిని తగ్గించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆస్తుల కొనుగోలు లావాదేవీలపై రాష్ట్రాలు విధించే పన్నును స్టాంప్ డ్యూటీగా పేర్కొంటారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో దీనిని చెల్లించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదొక ప్రధాన ఆదాయ వనరు. ఇలావుండగా పన్ను ప్రయోజనాల విషయంలో ఆధార్ నంబర్‌కు బదులుగా ఆధార్ నమోదు ఐడీ వినియోగాన్ని నిలిపివేయాలని సీతారామన్ ప్రతిపాదించారు. పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికదేశంలో 30 లక్షలకు పైగా జనాభా కలిగిన 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికను కేంద్రం ప్రతిపాదించింది. నగరాల సృజనాత్మకతో కూడిన పునర్ అభివృద్ధి కోసం ఓ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని తెలిపింది. నగరాలను అభివృద్ధి కేంద్రాలు (గ్రోత్ హబ్‌లు)గా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. టౌన్ ప్లానింగ్ పథకాల వినియోగంతో నగర చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, రవాణా ప్రణాళిక ద్వారా దీనిని సాధిస్తామని చెప్పారు. -
పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీనే నంబర్ వన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం సొంతింట్లో నివసించాలని, అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలనే తలంపుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణం రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనపరిచిందని ప్రశంసించింది. ప్రధాన మంత్రి అవాస్ యోజన (పట్టణ) కింద భారత దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపింది. పేదలందరికీ ఇళ్లు అనే విస్తృత లక్ష్యం పట్ల రాష్ట్రాలు సామూహిక నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో ఉత్తమ పనితీరు కనపరుస్తున్న పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉన్నట్లు పేర్కొంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ) కింద ఈ ఏడాది జూన్ 10 నాటికి దేశవ్యాప్తంగా 1.18 కోట్ల ఇళ్లు మంజూరు చేయగా ఇందులో 1.14 కోట్ల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని కేంద్రం పేర్కొంది. ఇందులో 83.67 లక్షల ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపింది. ఈ పథకం కింద 1,99,652 కోట్లు వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1,63,926 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో 1,51,246 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. అదనంగా మరో 16 లక్షల ఇళ్లు కొత్త సాంకేతిక పరిజాŠక్షనాన్ని ఉపయోగించి నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.రాష్ట్రంలో 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పేరుతో ఏకంగా 31 లక్షలకు పైగా స్థలాలను మహిళల పేరిట పంపిణీ చేసి, 17005 కాలనీల్లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టింది. ఇందు కోసం వేల ఎకరాల ప్రైవేటు భూములను సైతం సేకరించింది. ఈ ఏడాది మే నెలాఖరుకి 21.31 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.12,295.87 కోట్లు వ్యయం చేసింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంది. పేదల ఇళ్ల కోసం ఊర్లను తలపించేలా పెద్ద కాలనీలు అభివృద్ధి చేసింది. ఆ కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. తొలి దశలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇంత పెద్ద ఎత్తున పేదల ఇళ్ల నిర్మాణం ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. పేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఇప్పుడు రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టింది. -
గత ప్రభుత్వంలో 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం రాష్ట్రంలో 11,782 లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఐదేళ్లలో 6.8 లక్షల సాధారణ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారని, 1.05 లక్షల టిడ్కో ఇళ్లను మౌలిక సదుపాయాలతో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసినట్టు వివరించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల అంశం కోర్టులో ఉందన్నారు. వైఎస్సార్, జగనన్న కాలనీల పేరు మార్పుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇళ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తామన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలకు సేకరించిన భూములను 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించారో లేదో విచారణ జరుపుతామని, నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.లేదంటూనే.. అవునంటూఅయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూనే 11,782 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టిందని మంత్రి ఒప్పుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31 లక్షలకుపైగా లబ్ధిదారులకు స్థలాలను అందించిన విషయం తెలిసిందే. -
పేదల ఇళ్లకు పెద్దపీట
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 2024–25 రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఒకటిన్నర సెంట్ల చొప్పున 30.20 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు మహిళల పేరిట ఇచ్చిన స్థలాల్లో గృహ నిర్మాణాలను కూడా చేపట్టిందని నాబార్డు ప్రముఖంగా ప్రస్తావించింది. గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించింది. 17,005 లేఔట్లలో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, మూడు దశల్లో మొత్తం నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని పేర్కొంది. ఇప్పటికే తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిందని తెలిపింది.పేదల ఇళ్ల లబ్ధిదారుల నిర్మాణాలకు రాష్ట ప్రభుత్వం నాణ్యమైన మెటీరియల్‌ను తక్కువ ధరకే సమకూర్చడంతోపాటు కాలనీల్లో రోడ్లు, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని నాబార్డు పేర్కొంది. 2024–25లో ఇళ్ల నిర్మాణాలకు రూ.20,901 కోట్లు రుణ ఆవశ్యకత ఉందని జిల్లాల వారీగా రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. -
సిమెంట్ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు!
బెల్లం, పసుపు, మెంతి ఆకు, వేప ఆకు... ఇదంతా ఇప్పుడు కిచెన్ మెటీరియల్ మాత్రమే కాదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ నిజానికి నిదర్శనం కోసం రాజస్థాన్ కెళ్లాల్సిందే. రాజస్థాన్ లోని అల్వార్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిప్రా సింఘానియా తన మేధను రంగరించి ఇల్లు కట్టుకుంది. అందరూ సిమెంట్, ఇసుక కలిపి ఇల్లు కడుతుంటే మీరెందుకిలా కట్టుకున్నారని అడిగితే ఆమె చెప్పే సమాధానమేమిటో చూద్దాం...‘‘మాది ఎడారి రాష్ట్రం. ఉష్ణోగ్రతలు వేసవిలో 41 డిగ్రీలకు చేరుతాయి, శీతాకాలంలో ఎనిమిది డిగ్రీలకు పడిపోతాయి. ఆ వేడిని భరించడమూ కష్టమే, అంత చలిని కూడా తట్టుకోలేం. ఇంటి నిర్మాణం ఈ ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే విధంగా ఉండాలని కోరుకున్నాను. అందుకోసం బురదమట్టి, సున్నపురాయిలో వేపాకులు బెల్లం, పసుపు, మెంతి ఆకు వంటి అనేక పదార్థాలను సమ్మిళితం చేసి ఇల్లు కట్టుకున్నాను. నిజానికి ఈ ఫార్ములా నేను కొత్తగా కనిపెట్టినదేమీ కాదు.ఇంటి లోపల అధునాతన సౌకర్యాలతో..భవన నిర్మాణంలో సిమెంట్ ఉపయోగించడానికి ముందు మనదేశంలో పాటించిన విధానాన్నే పునరుద్ధరించాను. ఇది రెండువేల చదరపు అడుగుల నిర్మాణం. పైకప్పు కేంద్రభాగం 23 అడుగుల ఎత్తు ఉంది. ఇందుకోసం స్వయంగా నేనే డిజైన్ గీసుకున్నాను. వేపాకు చెద పురుగుల నుంచి రక్షణనిస్తుంది. బెల్లం, మెంతిలోని జిగురుకు నిర్మాణ ముడిసరుకులో ఇతర వస్తువులను గట్టిగా పట్టుకునేటంతటి సామర్థ్యం ఉంటుంది.ఈ నిర్మాణంలో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తాయి. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జీరో సిమెంట్ నిర్మాణం అన్నమాట’’ అని చెప్పారు శిప్రా సింఘానియా. ఈ విధమైన నిర్మాణ శైలి ఇప్పుడిప్పుడే అందరి దృష్టిలో పడుతోంది. బహుశా ఇక నుంచి ఆ ఇంటిని ‘శిప్రా సింఘానియా ఇల్లు’ అని చెప్పుకుంటారేమో. ఇంతకీ ఈ ఇల్లు ఎండను, చలిని ఎంత మేర తగ్గిస్తుందంటే వేడిని కనీసంగా ఎనిమిది డిగ్రీలు తగ్గిస్తుంది. శీతాకాలంలో పదహారు డిగ్రీలకు తగ్గకుండా కాపాడుతుంది.ఇవి చదవండి: 'నిద్ర'కూ ఓ స్టార్టప్.. సూపర్ సక్సెస్! -
పేదలకు ఇళ్లు కాలనీలు కాదు ఊళ్లు
నిన్నటి కన్నా ఈ రోజు బాగుండాలి...ఈ రోజు కన్నా రేపు బాగుండాలి...ఎవరైనా కోరుకునేది ఇదే...సగటు మనిషి కాస్తంత నీడ కోసం పరితపిస్తాడు...తన సంపాదన ఓ చిన్న గూడును కట్టుకోవడానికీ చాలకపోతే ప్రభుత్వం సాయపడుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తాడు...ప్రభుత్వం ఓట్ల కోసం తప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వస్తే మోసపోయానే...అని తనలో తానే మథనపడతాడు...మోసమనే ఇటుకతో గాలిలో మేడలు కట్టిన చంద్రబాబు ప్రభుత్వం నిరుపేదలను ఇలాగే వంచించింది... ఆ వంచనకు శాస్తిగా బాబును చిత్తుగా ఓడించింది జనసామాన్యం...ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలకు ఆచరణ రూపమిస్తే జననీరాజనం ఎలా ఉంటుందో నేడు జగన్ మేం సిద్ధం యాత్ర సాక్ష్యంగా నిరూపిస్తోంది... ఆ హామీ పేరు పేదలకు ఇళ్లు...అర్హతే ప్రాతిపదికగా దేశంలోనే రికార్డుగా...ఒక ఘనతగా చెప్పేలా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలకు గాలిలో కాదు...నేలపైనే మేడలు...ఇంకా చెప్పాలంటే ఊళ్లకు ఊళ్లను నిర్మిస్తూ...నవ్యాంధ్ర చరితను సీఎం జగన్ తిరగరాస్తున్నారు... స్థలం విలువ ఆధారంగా చూస్తే ఒక్కొక్కరికి రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల ఆస్తిని ఉచితంగా కట్టబెట్టిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని జనసామాన్యమే ఉప్పొంగిపోతోంది...ఇది కదా మాటకు కట్టుబడి...మడమ తిప్పని ప్రభుత్వానికి సార్థకత. –వడ్డే బాలశేఖర్, సాక్షి ప్రతినిధిప్రతి పేదవాడు ఏం కోరుకుంటాడు? ‘కడుపు నింపుకోవడానికి గుప్పెడు మెతుకులు, తలదాచుకోవడానికి ఓ సొంత గూడు’.. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా తమకంటూ ఓ సొంత గూడు లేని పేదలు ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందిన వేళంగిణి, దుర్గ తరహాలనే రాష్ట్రంలో తమకంటూ ఓ పక్కా ఇల్లు ఉండాలనే ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నాన్ని తోబుట్టువుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. రాష్ట్ర, దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పేదలకు పెద్ద ఎత్తున ఉచితంగా ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణానికి సాయం, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇలా ప్రతి అడుగులోనూ చేయి పట్టి అక్కచెల్లెమ్మలను ముందుకు నడిపారు. ఇదిలా ఉండగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, విజనరీ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు పేదల ఇళ్ల స్థలాలను శ్మశానాలతో పోల్చిన దుస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, విభజిత ఏపీలో ఒక పర్యాయం సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి ఏనాడు పేదల గూడు గోడును పట్టించుకోలేదు. అడ్డంకులను అధిగమిస్తూ... రాష్ట్రంలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం రూపంలో ఏకంగా కొత్తగా ఊళ్లకు ఊళ్లనే సీఎం జగన్ గడిచిన ఐదేళ్లలో నిర్మించ తలపెట్టారు. 71,811 ఎకరాల్లో 31.19 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తద్వారా 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే నెలకొల్పారు. పేదలకు పంపిణీ చేసిన ఒక్కో ప్లాట్ విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంటుంది. ఈ లెక్కన ఏకంగా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ప్లాట్ల మార్కెట్ విలువ రూ.76 వేల కోట్లకు పైమాటే. నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల సాకారానికి చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు వేస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అడుగడుగునా పథకాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ, తమ మద్దతుదారుల ద్వారా కోర్టుల్లో 1,000 కేసులను వేయించి, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలను పలు సందర్భాల్లో అడ్డుకున్నారు. ఈ అడ్డంకులేవీ జగన్ మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. దేశంలోనే తొలిసారిగా ఉచితంగా పంపిణీ చేసిన స్థలాలపై లబ్ధిదారులకు సర్వహక్కులను సీఎం జగన్ ప్రభుత్వం కల్పించింది. వారి పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించింది. 2024లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టి 15 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మిగిలిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. పేదల తరపున పెత్తందారులతో యుద్ధం అమరావతిలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు చెందిన నిరుపేదలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక అసమతుల్యత (డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్) ఏర్పడుతుందని టీడీపీ కోర్టులకు వెళ్లి స్టే తెచ్చింది. అయినా జగన్ మనోబలం సడలిపోలేదు. పేదల తరపున పెత్తందారులతో సీఎం జగన్ ప్రభుత్వం యుద్ధం చేసింది. హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లి విజయం సాధించి గత ఏడాది 50,793 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పేదలకు అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దంటూ కేంద్ర ప్రభుత్వానికీ టీడీపీ మద్దతుదారులు అనేక ఫిర్యాదులు చేశారు. ఈ అడ్డంకులను సైతం అధిగమించి అనుమతులు రాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి గత ఏడాది జూలై 24న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ టీడీపీ పేదల ఇళ్లకు అడ్డుపడుతూ తన కపటబుద్ధిని ప్రదర్శించింది. మరోమారు కోర్టుకు వెళ్లి పేదల ఇళ్ల నిర్మాణంపై స్టే తెచ్చి నిర్మాణాలను అడ్డుకుంది. కోర్టులనూ మోసం చేసిన టీడీపీ... మహిళల పేరిటే ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఎందుకివ్వాలనే అభ్యంతరాలతో హైకోర్టులో తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది పిటిషన్ వేశారు. దీనిపై విచారణæ జరిపిన న్యాయస్థానం 2021లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత తాము కోర్టులో పిటిషన్ వేయలేదంటూ వారు వెల్లడించారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ దళారులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ ఆధార్, రేషన్ కార్డులతో పాటు, వారి సంతకాలు, రూ.5 వేల నుంచి రూ.40 వేల వరకూ డబ్బు వసూళ్లు చేశారు. ఇలా మా నుంచి తీసుకున్న ధ్రువపత్రాలతో మాకే తెలియకుండా కోర్టుల్లో టీడీపీ నాయకులే కేసులు వేశారంటూ అప్పట్లో పేదలు బయటకు వచ్చి చెప్పారు. యర్రజర్ల కాల్వ సమస్యకు ఫిర్యాదు చేద్దామంటూ బల్లి ప్రభాకర్‌రావు, జాజుల హరికృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి తెల్ల కాగితంపై సంతకం, ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు తీసుకుని ఇళ్ల పట్టాల పంపిణీపైనా టీడీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారు. తమను టీడీపీ నాయకులు మోసగించినదానిపై లిఖితపూర్వకంగా వివరించారు. రికార్డు స్థాయిలో 31.19 లక్షల ఇళ్ల పట్టాలు రికార్డు సృష్టించడమే కాకుండా, కరోనా, కోర్టు కేసులు, ఇతర అడ్డంకులను ఎదురొడ్డి అనతికాలంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టి మరో సరికొత్త రికార్డును సీఎం జగన్ కైవసం చేసుకున్నారు. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాల పంపిణీ అనంతరం వివిధ దశలుగా 21.75 లక్షల ఇళ్ల (19.13 లక్షలు సాధారణ ఇళ్లు, 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు) నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో ఇప్పటికే 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలినవి శరవేగంగా నిర్మితమవుతున్నాయి. సాధారణ ఇళ్లలో 11.61 లక్షల గృహాలు వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. 2020 డిసెంబర్ 25న కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో పట్టాలను పంపిణీ చేయడంతో పాటు పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్ల నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందించారు. ఉచితంగా స్థలం... ఆపై అమిత సాయం ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేయడంతో పాటు, ఎస్‌హెచ్‌జీల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేల రుణ సాయం అందించింది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేల చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చింది. గేటెడ్ కమ్యూనిటీల తరహాలో... పేదలకు సొంత గూడు కల్పించడమే కాకుండా కాలనీలను ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీల తరహాలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. విశాలమైన రోడ్లు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, పార్కులు, ఇంటర్నెట్ సహా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్ర మంలో మౌలిక సదుపాయా ల కల్పన కోసమే ఏకంగా రూ.32,909 కోట్లను వెచ్చిస్తోంది. చంద్రబాబు రూ.8,929.81కోట్ల అవినీతి చంద్రబాబు తన అక్రమాలకు పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను ‘తాకట్టు’ పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించేందుకు 2016–17లో రాష్ట్రంలో అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పారు. 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ఇలా నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్చిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టింది. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1,000 మధ్య ఉండగా... కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ఇలా తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు చాలినంత భూమి లేదని 3.15 లక్షల ఇళ్లకే శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మించేందుకు అనుమతులిచ్చి రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.20 లక్షల భారం మోపి, 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాలని షరతు పెట్టింది. దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. ఇంకా 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది. వాళ్లిప్పుడు లక్షాధికారులుఒకప్పుడు అద్దె ఇళ్లలో, పూరిగుడిసెల్లో ఎన్నో అగచాట్లు, ఇబ్బందులు పడ్డ మహిళలు, నిరుపేద కుటుంబాలు సీఎం జగన్ చొరవతో లక్షాధికారులుగా మారారు. అది ఎలాగంటే... మహిళల పేరిట రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ విలువ చేసే స్థలాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికీ సాయం చేశారు. స్థలం, ఇంటి రూపంలో ప్రతి పేదింటి అక్కచెల్లెమ్మ పేరిట ప్రాంతాన్ని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ మార్కెట్ విలువ చేసే స్థిరాస్తి సమకూరినట్లయింది. ఇలా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపదను ప్రభుత్వం సృష్టించింది. సమాజంలో గౌరవం పెరిగింది. నా భర్త భవన నిర్మాణ కార్మికుడు. మాకు సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటిలో ఉంటున్నాము. ఓ వైపు పిల్లల చదువులు, మరోవైపు ఇంటి అద్దెలు. కుటుంబ పోషణ భారం. మా అద్దె ఇంటి కష్టాల నుంచి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఎటువంటి సిఫార్సులు లేకుండా ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి ఇంటిస్థలం రిజిస్ట్రేషన్ చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. జగనన్న దయతో సొంతింటి భాగ్యం కలిగింది. గతంలో మాకంటూ సొంతిల్లు లేదని బంధువులు, సన్నిహితుల్లో చిన్న చూపు ఉండేది. ప్రస్తుతం ఆ సమస్య లేదు. సమాజంలో మాకు గౌరవమూ పెరిగింది. – మీసాల వనజాక్షి, వైఎస్సార్ జగనన్న కాలనీ, పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా మాగోడు విన్న నేత సీఎం కావాలి నా భర్త భానుప్రసాద్ పెయింటింగ్ పని చేస్తారు. మా ఇద్దరు పిల్లలతో కలిసి మా అత్తమ్మ వాళ్లింట్లో ఉండేవాళ్లం. ఒకే ఒక గది. ఆ గదిలోనే వంట చేసుకోవాలి. ఇరుకు ఇంట్లో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డాం. మా కష్టాలను సీఎం జగన్ ప్రభుత్వం ఆలకించింది. ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల రుణమూ ఇచ్చింది. ఇప్పుడు మాకు రూ.15 లక్షలకు పైగా విలువైన సొంత ఆస్తి ఉంది. మా గూడు గోడు విని, గోడు తీర్చిన నేతనే సీఎంగా మళ్లీ కావాలి. ఆయన్ని మేం సీఎం చేసుకుని తీరుతాం. – బుడితి బాలామణి, దగ్గులూరు, పశ్చిమగోదావరి జిల్లా పథకం అమలులో కీలక ఘట్టాలు► 2020 డిసెంబర్: 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు. ► 28 ఏప్రిల్ 2022: పథకంలో రెండో దశకు శ్రీకారం. 1.24 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ. 3.53 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు. ► 27 మే 2023: సీఆర్డీఏలో రూ.3,506 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 1,402.58 ఎకరాల భూమి 50,793 మంది అక్కచెల్లెమ్మలకు పంపిణీ. ► 24 జూలై 2023: సీఆర్డీఏలో 47,071 పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన. బాబు చేతిలో దగాపడ్డ టిడ్కో లబ్ధిదారులకు అండగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో ప్రభుత్వం 2,62,212 టిడ్కో ఇళ్లను నిర్మిస్తోంది. పేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తోంది. 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ. లక్ష చొప్పున వాటా చెల్లించాలనే నిబంధనలో సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ఈ ప్రభుత్వమే చెల్లించింది. దీంతో రెండు, మూడు కేటగిరీల పేదలు గత ధరల ప్రకారం చెల్లించాల్సిన రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు ఈ సర్కారు తగ్గించింది. విద్యుత్, రోడ్లు వంటి అన్ని వసతుల కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్‌డీడ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, యూజర్ చార్జీలు భరించడంతో లబ్ధిదారులు మొత్తం రూ.5,487.32 కోట్ల మేలు పొందారు. మొత్తం ఇళ్లలో ఫేజ్–1 కింద 1,51,298 ఇళ్లను నూరు శాతం నిర్మాణం పూర్తి చేసి, 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించింది. ► ఈ ఫొటోలో సెల్ఫీ తీసుకుంటున్న టి.తిరుపతి స్వామి, వేళంగిణిలది బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామం. వీరు రెండేళ్ల క్రితం గ్రామంలోని కృష్ణా కెనాల్‌కు సంబంధించిన పిల్లకాలువ గట్టుపై పూరి గుడిసెలో నివసించేవారు. ఆ గుడిసెలోనే వేళంగిణి అమ్మ, అన్నయ్య కుటుంబాలూ ఉండేవి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ...ఈ కుటుంబం ప్రత్యక్ష నరకాన్ని అనుభవించింది. గత ప్రభుత్వంలో ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా...ఇంటి స్థలం మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద వేళంగిణికి ఇంటి స్థలం, ఇంటిని మంజూరు చేసి నిర్మించి ఇచ్చింది. 2022 సెప్టెంబర్‌లో ఈ కుటుంబం ఆ ఇంటిలోకి మారింది. ‘నా చిన్నప్పటి నుంచి కాలువ గట్టుపై మురికి కూపంలో గుడిసెల్లోనే బతికాను. దీపం వెలుతురు తప్ప కరెంటు కనెక్షన్ ఉండేది కాదు. వర్షాలు కురిస్తే మా గుడిసె వరదనీటిలో మునిగిపోయేది. మురుగు నీరు బయటకు వెళ్లిపోయి, సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ రోడ్డు పక్కనే ఉండేవాళ్లం. సాధారణ రోజుల్లోనూ మురికి నీటి కారణంగా దోమల బెడద తీవ్రంగా ఉండేది. పాములు, తేళ్లు, కీటకాలు గుడిసెల్లోకి వచ్చేసేవి. సీఎం జగన్ ప్రభుత్వం మా గోడును ఆలకించింది. ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, ఇంటినీ నిర్మించి ఇచ్చింది. గుడిసెల్లో నివాసం దినదినగండమే. కంటి నిండా నిద్రపోయిన రోజులే లేవు. ఇప్పుడు మాకంటూ ఓ సొంత ఇల్లుంది. గుడిసె కష్టాలన్నీ తొలగిపోయాయి..’ అని వేళంగిణి సంతోషం వ్యక్తం చేస్తోంది. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన మేడిశెట్టి దుర్గ భర్త సంచులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దుర్గ కూలి పనులకు వెళుతుంటారు. వారికి ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు లేదు. 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. దంపతుల అరకొర సంపాదన ఇంటి అద్దె, కుటుంబ పోషణకే సరిపోతుంది. సీఎం జగన్ ప్రభుత్వంలో దుర్గకు విస్సాకోడేరు జగనన్న లే అవుట్లో స్థలంతో పాటు ఇల్లు మంజూరయింది. ప్రభుత్వ సాయం రూ.1.80 లక్షలకు, కొంత సొంత నగదు జోడించి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు అద్దె బాధలు తప్పాయని ఆ కుటుంబం సంబరంగా చెబుతోంది. ఇక్కడ సెంటు స్థలం రూ.4 లక్షలు ఉంటుందని, జగనన్న దయతోనే తమ కల నెరవేరిందని ఈ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలైనా సొంతింటిలో జీవించాలని మాకు కోరిక. సీఎం జగన్ మా కోరికను నెరవేర్చారని భావోద్వేగానికి గురయ్యారు. -
ఇసుక లేకుండానే ఇల్లు కట్టేయొచ్చట! ఎలాగో తెలుసా..!
ఇల్లు కట్టాలంటే ముందుగా చేతినిండా దండిగా డబ్బు ఉండాలి. అప్పుడే కలల ఇంటిని నిర్మించగలం. దీనికి సిమ్మెంట్, ఇటుక, ఇసుక తదితరాలు లేకుండా ఇంటి నిర్మాణమే మొదలవ్వదు. నిజానికి ఇప్పుడు, సిమ్మెంట్, ఇటుకలు ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో మనకు తెలిసిందే. ఇక అందులో ఇసుకను కొనడం ఒక ఎత్తు తరలించేందుకు మరింత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఓ ఇంటి నిర్మాణానికి చాలా ఇసుక కావాల్సి ఉంటుంది. అలా ఇసుకు అవసరమే లేకుండా ఇల్లునే కట్టేయొచ్చట. ఎలాగంటే.. సహజ ఇసుకకు బదులుగా నిర్మాణాలకు ఉపయోగపడేలా ఓ సరికొత్త మెటీరియల్‌ను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు నిర్మాణాలకు అవసరమయ్యే సహజ ఇసుక స్థానంలో కొత్త మెటీరియల్‌ను రూపొందించారు. నిర్మాణ పరిశ్రమలో అత్యంత కీలకమైన ఇసుక కొరత కారణాల దృష్ట్యా ఈ ఆవిష్కరణ జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ (సీఎస్టీ)లోని ఒక బృందం పారిశ్రామిక వ్యర్థ వాయువులలో సేకరించిన కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉపయోగించి కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేసింది. తవ్విన మట్టి, నిర్మాణ వ్యర్థాలను కార్బన్ డయాక్సైడ్తో శుద్ధి చేసి ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని నిర్థారించారు. ఈ కొత్త మెటీరియల్ నిర్మాణాల కారణంగా ఏర్పడే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించి, నిర్మాణ నాణ్యతను మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరదీప్ గుప్తా నాయకత్వం వహిస్తున్నారు. దేశంలోని జీరో కార్బన్ లక్ష్యాలకు అనుగుణంగా తక్కువ కార్బన్ ప్రిఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని సౌరదీప్ గుప్తా పేర్కొన్నారు. సాధారణంగా నిర్మాణ రంగాల్లో మట్టికి కార్బన్ డయాక్సైడ్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇసుక బదులుగా వాడే ఈ ప్రత్యేక మెటీరియల్ సిమెంట్, సున్నం మధ్య చర్యను మెరుగుపరుస్తుంది. ఈ ఆవిష్కరణ విజయంవంతం అయితే.. ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఇసుక, కంకర, చువ్వ వీటికే లక్షలు ఖర్చు అవుతాయి.. పైగా రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించాలంటే కనీసం 30 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. ఈ ఆవిష్కరణతో ఇసుకకు ప్రత్యామ్నాయం వస్తే ఖర్చు తడిసిమోపడవ్వడం తగ్గుతుంది. ఎకో ఫ్రెండ్లీగా మంచి ఇంటిని నిర్మించుకోవచ్చు కూడా. (చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు!) -
ఊటీలో ఘోర ప్రమాదం
చెన్నై: తమిళనాడు పర్యాటక ప్రాంతం ఊటీలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. #WATCH | Six construction workers died on the spot while undergoing house construction work at Lovedale, near Ooty in Tamil Nadu "Two workers with serious injuries taken to Ooty Government Hospital, one worker missing under the debris, rescue operations underway, say Police. pic.twitter.com/NkrUFxw0TU — ANI (@ANI) February 7, 2024 -
భూకంపాలను తట్టుకొని నిలబడే ఇల్లు, కేవలం 26 గంటల్లోనే..
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. అంటే జీవితంలో ఈ రెండు పనులు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనేది దాని అర్థం. సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నది చాలామందికి కలగా ఉంటుంది. అయితే ఇదంత చిన్న విషయం కాదు. ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది. పునాది మొదలు పైకప్పు దాకా కొన్ని నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా భారత నిర్మాణ రంగంలో త్రీ డైమెన్షనల్ ప్రింటింగ్ అనే కొత్త టెక్నాలజీ వచ్చి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేదు.జస్ట్.. ఇంటి స్థలం ఒక్కటి చాలు. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు భూకంపాలను తట్టుకొని నిలబడి ఇంటి నిర్మాణాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ప్రముఖ సిమెంట్ కంపెనీ ప్రోగ్రెసో తన మొట్టమొదటి 3డీ ప్రింటింగ్ ఇంటిని నిర్మించింది. ప్రోటోటైప్ డిజైన్‌తో భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ ఇంటిని డిజైన్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే.. కేవలం 26 గంటల్లోనే ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇల్లు భూకంపాలను తట్టుకొని నిలబడగలదు. 49 స్క్వైర్ఫీట్లోనే ఈ ఇంటిని నిర్మించారు. ఇందులో COBOD ప్రింటర్‌ను ఉపయోగించారు. రీసెంట్గా బెంగళూరులో తొలి 3డి ప్రింటింగ్‌తో ఏర్పాటైన పోస్టాఫీస్ నిర్మాణంలోనూ ఇదే తరహా ప్రింటర్‌ను ఉపయోగించారు. ఇంటి పైకప్పులను రాంచో రకం తాటాకులతో నిర్మించారు. ఈ తరహా నిర్మాణం సాధారణంగా కొన్నేళ్లుగా లాటిన్ అమెరికాలో ఉపయోగిస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో పాటు ఇంటిని కాస్త వేడిగా ఉంచుతుంది. 3డీ ప్రింటింగ్ నిర్మాణం ముఖ్యంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలాకు బాగా సరిపోతుంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో 3డీ నిర్మాణం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేకుండా కేవలం ఇంటి స్థలం ఉంటే చాలు అందమైన ఇంటిని కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. రోబోల మాదిరిగా రోజుల్లోనే ఇంటిని కట్టిపడేస్తోందీ ఈ 3డీ టెక్నాలజీ. జస్ట్ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇల్లు రెడీ అవుతుంది మరి. 3డి ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి? సాధారణ ఇంటి నిర్మాణం మాదిరిగానే 3డీ ప్రింటింగ్ నిర్మాణం కూడా సాగుతుంది. అయితే, ఇందులో కార్మికులకు బదులుగా యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్ (బ్లూప్రింట్) రూపొందిస్తారు. గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్ చేసి ఇంటి బ్లూప్రింట్ మోడలింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధం చేస్తారు. అనంతరం ప్లాన్‌ను కంప్యూటర్ సాయంతో భారీస్థాయిలో ఉండే 3డీ ప్రింటర్‌కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్ ప్రారంభించే ముందు.. పేస్ట్ లాంటి బిల్డ్ మిశ్రమాన్ని (కాంక్రీట్) వేసేందుకు అనువుగా నిర్మాణ ప్రాంతం చుట్టూ యంత్రం రోబోటిక్ హ్యాండ్ కదిలేందుకు వీలుగా బిల్డింగ్ సైట్ చుట్టూ పట్టాలు అమరుస్తారు.అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్’ బటన్ ఆన్ చేయగానే ప్రింటర్ దానికదే ప్లాన్ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి గోడలు, కిటికీలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది. ఇందులో ప్రింటర్‌లోని నాజిల్ ద్వారా కాంక్రీట్ మెటీరియల్ బయటకు వస్తే.. దాన్ని మరో కాంక్రీట్ డ్రయర్ నిర్మాణ సామగ్రిని త్వరగా పటిష్టం చేస్తుంది. ఆ వెంటనే దానిపై మరో పొర కాంక్రీట్ వేస్తుంది. ఇలా పొరలు పొరలుగా ప్లాన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం పూర్తవుతుంది. ఆపై కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి పనులను కార్మికులతో పూర్తిచేస్తారు. -
సామర్లకోట బహిరంగ సభలో సీఎం జగన్ (ఫొటోలు)
-
సామర్లకోటలో జగనన్న కాలనీలో ఇళ్లు ప్రారంభం (ఫొటోలు)
-
చంద్రబాబు, పవన్, బాలకృష్ణకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Updates.. ఎల్లో బ్యాచ్‌కు స్ట్రాంగ్ కౌంటర్.. సామర్లకోటలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు కంటిన్యూగా నెలరోజులపాటు మన రాష్ట్రంలో ఉన్నారా?. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుంది. ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లకు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కోరుకునేది ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం.. హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకోవడం. వీళ్లంతా మనతో చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్. సినిమా షూటింగ్స్ లేని టైమ్‌లో ఇక్కడికి వచ్చి స్టోరీలు చెబుతాడు. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకునే ఓ వ్యాపారి పవన్. వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు. రాజకీయాలంటే విలువ, విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు. సీఎం జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకువస్తాయి.. అదే చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయి. జగన్ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుంది.. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంది. సీఎం జగన్ మాట్లాడుతూ.. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం. ►రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం. ►రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి. ►కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు. ►రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. ►రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ►ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. ►లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ►రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ►ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తున్నాం. మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ►ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ అందిస్తున్నాం. ►వేల కోట్లు ఖర్చు చేసి ఇంటి కలను సాకారం చేస్తున్నాం. ►పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ►పేదవాడికి చంద్రబాబు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. ►తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు బాబు సెంటు స్థలం ఇవ్వలేదు. ►మన ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చాం. ►సామర్లకోట లేఔట్లో వెయ్యికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ►నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నాం. ►మన ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయి. ►పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంలో ప్రభుత్వం పనిచేస్తోంది. ►గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదు. ►పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు. ►పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. ►సామర్లకోటలో బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్. ►జోతిప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ► జగనన్న కాలనీలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్. ► పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లను అందించిన సీఎం జగన్. ► జగనన్న కాలనీని పరిశీలించిన సీఎం జగన్ ► కాసేపట్లో సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో సీఎం జగన్ బహిరంగ సభ. ► సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న సీఎం జగన్ ►సీఎం జగన్ సామర్లకోటకు చేరుకున్నారు. పార్టీ నేతలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. Stunning Visuals of #YSRJaganannaColonies to be launched by CM @ysjagan today at Samarlakota in Kakinada. 🏠 ✨💫 Samarlakota YSR Jagananna Colony is one of the largest housing colonies undertaken by the government, with the completion of approximately 2,000 housing units.… pic.twitter.com/DJ1alSIPuN — YSR Congress Party (@YSRCParty) October 12, 2023 ►సామర్లకోటకు బయలుదేరిన సీఎం జగన్ ►రాష్ట్రవ్యాప్తంగా ఇలా రూపుదిద్దుకున్న ఇళ్లలో పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాలకు పేదలు సిద్ధమయ్యారు. ►కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా పాల్గొననున్నారు. ►మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరిటే ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు లో భాగంగా సామర్లకోటలో లబ్ధిదారులకు అందించనున్న ఇళ్ళ విజువల్స్. #YSRJaganannaColonies pic.twitter.com/1hb1PEI53I — YSR Congress Party (@YSRCParty) October 12, 2023 అడ్డంకులను అధిగమిస్తూ.. ►రాష్ట్రంలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే సీఎం జగన్ నిర్మిస్తున్నారు. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువ రూ.2.5 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టీ రూ.5 లక్షల పైనే ఉంది. అంటే ఈ లెక్కన కనిష్టంగా రూ.75 వేల కోట్లు నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూమిని పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. ►ఈ తరహాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి గతంలో ఏ ప్రభుత్వమూ పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. టీడీపీ, ఎల్లో మీడియా, దుష్ట పన్నాగాలను ఛేదిస్తూ కరోనా అడ్డంకులను అధిగమించి సీఎం జగన్ పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేసరికి ప్రతి మహిళకు కనిష్టంగా రూ.7 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం సమకూరుస్తోంది. 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి ►పేదలందరికీ ఇళ్ల పథకం కింద రెండు దశల్లో కలిపి 21.75 లక్షలకుపైగా (19.13 లక్షల సాధారణ ఇళ్లు + 2.62 లక్షల టిడ్కో ఇళ్లు) గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకూ సాధారణ ఇళ్లు 5,85,829, టిడ్కో ఇళ్లు 1,57,566 నిర్మాణం పూర్తయ్యాయి. మరో 13.27 లక్షల సాధారణ ఇళ్లు, 1.04 లక్షల టిడ్కో ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం లోగా నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది -
మళ్లీ మోకాలడ్డు.. రాజధానిలో పేదల ఇళ్లపై చంద్రబాబు అండ్ కో అక్కసు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానిలో పేదలు ఉండటానికి వీల్లేదంటున్న చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ పెద్దలు వారి పంతం నెగ్గించుకున్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్–5 పేరుతో ఓ జోన్‌ను సృష్టించి, ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలకు రాజధాని రైతుల ముసుగులో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోన్న చంద్రబాబు అండ్ కో తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. సీఎం జగన్.. 50 వేల మందికి పైగా పేద అక్కచెల్లెమ్మలకు అక్కడ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, వేగంగా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మరోమారు కోర్టు ద్వారా మోకాలడ్డారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు రాజధానిలో పేదల ఇళ్ల కోసం మొత్తం భూమిలో 5 శాతం కేటాయించాలని చట్టం తీసుకొచ్చి, దాన్ని తమ స్వప్రయోజనాల కోసం అమలు చేయకుండా తుంగలో తొక్కిన టీడీపీ పెద్దలు.. ఇప్పుడూ పేదలకు తీరని ద్రోహమే చేశారు. రాజధానిలో పేదలు వచ్చి చేరితే అదో పెద్ద మురికి వాడగా మారుతుందని, వారి వల్ల తమ స్థలాలకు రేట్లు పడిపోతాయంటూ పేదలను కించపరుస్తూ తమ న్యాయవాదుల ద్వారా దారుణంగా వాదనలు వినిపించిన టీడీపీ పెద్దలు.. కోర్టుల్లో తమకున్న బలాన్ని మరోసారి రుజువు చేశారు. రాజధానిలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ప్రభుత్వం చేపట్టబోతున్న ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ రైతుల ముసుగులో వారు దాఖలు చేయించిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా స్టే విధించింది. పేదల ఇళ్ల నిర్మాణానికి విస్తృత ప్రజా ప్రయోజనాలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపింది. అందువల్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతినివ్వడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. ఆర్–5 జోన్లో పేదల ఇళ్ల నిర్మాణం పూర్తయితే పూడ్చలేని నష్టం జరుగుతుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు ఫలించని కుట్ర సీఆర్డీఏలో పేదల ఇళ్లు నిర్మించకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన సృష్టించిన సంఘాలు ఆది నుంచి అడ్డుపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 2020లోనే ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వ తప్పులను సరిదిద్ది పేదలకు రాజధానిలో 5 శాతం భూమిని కేటాయించడమే కాక, ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చి, అందులో ఇళ్లు నిర్మించేందుకు వీలుగా ఆర్ 5 జోన్‌ను సృష్టిస్తూ సీఆర్డీఏ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఆ చట్టాన్ని, ఆ జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అవసరమైన భూమిని గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు అనుమతినిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేయిస్తూ టీడీపీ పలువురి చేత హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించింది. చంద్రబాబు, ఆయన సృష్టించిన సంఘాలు హైకోర్టులో 18 కేసులు, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. సీఎం జగన్ మూడేళ్లపాటు వారితో న్యాయ పోరాటం చేశారు. దీంతో అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు నిరాకరించాయి. ఇళ్ల పట్టాలు జారీ చేసుకోవచ్చంటూ ప్రభుత్వానికి అనుమతినిచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అలా పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనంతరం ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు అండ్ కో విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర మంత్రులు, అధికారులను కలిసి రకరకాల ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ వారి పాచికలు పారలేదు. మళ్లీ మరో కుట్ర దీనిపై ఓర్వలేని తెలుగుదేశం పార్టీ పెద్దలు మరో కుట్రకు తెరలేపారు. పేదల కోసం చేపట్టనున్న ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు హైకోర్టులో మళ్లీ పిటిషన్లు దాఖలు చేయించారు. ఇళ్లు కట్టకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలన్నారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తులు జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది. పిటిషనర్లు తమ వాదనల సందర్భంగా లేవనెత్తిన అంశాలన్నింటితో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం.. ప్రభుత్వం, సీఆర్డీఏ వాదనల్లో ఒక్క దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం విశేషం. ఇతర ప్రాంతాల వారికి ఇవ్వచ్చో లేదో చూడాలి రాజధాని నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇతర ప్రాంతాల వారికి రాజధానిలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చట్ట నిబంధనలు అనుమతిస్తాయా? లేదా? అన్నది లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఇళ్ల పట్టాల మంజూరు హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో, భవిష్యత్తులో తాము పట్టాల మంజూరుకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, ఇప్పుడు చేపట్టే ఇళ్ల నిర్మాణం కోసం ఖర్చు చేసిన డబ్బు మొత్తం వృథా అవుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ డబ్బంతా ప్రజా ధనమని గుర్తు చేసింది. పన్నుదారుల డబ్బు ఇలా వృథా అవుతుంటే మౌనంగా చూస్తూ ఉండలేమంది. సీఆర్డీఏ నుంచి తీసుకున్న భూములకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి డబ్బు చెల్లించలేదని, డబ్బు చెల్లించనప్పుడు ఆ భూములు ప్రభుత్వ పరం కావని తెలిపింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై నిరుపేదల పక్షాన సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏ పరిధిలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 1,402 ఎకరాల్లో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. రూ.1,829.57 కోట్ల వ్యయంతో అన్ని మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణాలకు గత నెల 24వ తేదీన సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆరు నెలల్లో తమ దశాబ్దాల సొంతింటి కల నెరవేరబోతోందని పేదింటి అక్కాచెల్లెమ్మలు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో కోర్టు తీర్పుతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తమ న్యాయవాదులకు దిశా నిర్దేశం చేసింది. వాళ్లు పెట్టరు.. పెట్టే వారిని పెట్టనివ్వరు ఎన్నో ఏళ్ల నుంచి రైల్వే స్థలాల్లో భయం భయంగా బతుకుతున్నాం. సీఎం జగన్ పుణ్యమా అంటూ ఇళ్ల స్థలం ఇచ్చారు. ఇప్పుడేమో ఇళ్లు నిర్మించవద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చిందని అంటున్నారు. టీడీపీ వాళ్లు కూడా ప్రజల్ని పరిపాలించడానికి, మంచి చేయడానికే ఉన్నామని చెబుతున్నారు. అలాంటప్పుడు ఇలా పేదల ఇళ్లపై కోర్టుకు వెళ్లడం ఏమిటో అర్థం కావడం లేదు. వాళ్లు పెట్టరు.. పెట్టే వాళ్లను పెట్టనివ్వరు. గతంలో పెన్షన్ రావాలంటే ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సివచ్చేది. జగన్ వచ్చాక ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తుదకు న్యాయం గెలుస్తుంది. – చిలక పార్వతమ్మ, సలాం హోటల్ సెంటర్ ఇది టీడీపీ నాయకుల కుట్ర అమరావతిలో చట్ట ప్రకారం కేటాయించాల్సిన పేదల ఇళ్ల స్థలాలను సైతం టీడీపీ స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఆశ్రయించి అడ్డుకోవడం దుర్మార్గం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేద ప్రజల పట్ల విశ్వాసం ఉంది కాబట్టే రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి పైగా ఇళ్లు కేటాయించారు. టీడీపీ రైతుల ముసుగులో కోర్టుకు వెళ్లి పేదలను మోసగిస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్మోహన్రెడ్డే ముందంజలో ఉన్నారు. ఆయన సాధించి తీరుతారు. – రెడ్డి నిర్మల, బాబూ జగ్జీవన్‌రామ్ కాలనీ వారి విజయం తాత్కాలికమే రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదనే ఉద్దేశంతోనే వాళ్లు వివిధ కారణాలను చూపిస్తూ కోర్టుకు వెళ్లారు. వారు అనుకున్నదే చేశారు. అమరావతిలో డబ్బున్న వాళ్లే ఉండాలని వాళ్ల ఉద్దేశం. వారు ఎన్ని చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పకుండా తుది విజయం సాధిస్తారు. ఆ నమ్మకం మాకు ఉంది. కేటాయించిన స్థలాల్లోనే ఇళ్లు నిర్మించి ఇస్తారని గట్టిగా నమ్ముతున్నాం. వాళ్ల విజయం తాత్కాలికమే. న్యాయస్థానాల్లో తుది విజయం పేద ప్రజలదే. – షేక్ మీరాబి, నులకపేట రాజధాని అంటే వాళ్లే ఉండాలా? రాజధాని అమరావతిలో చంద్రబాబు, ఆయన సామాజికవర్గం వాళ్లు మాత్రమే వుండాలా? మాలాంటి పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇస్తుంటే చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం వాళ్లు అడ్డుకోవడం దుర్మార్గం. పేదలంతా ఏకమై పోరాటం చేస్తే చంద్రబాబు ఆయన సామాజిక వర్గం రాజధాని అమరావతిలో ఉండగలరా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేదలంతా అండగా నిలుస్తాం. తుదకు మావైపే న్యాయం నిలుస్తుంది. – కొండపనేని సీత, ఇప్పటం, తాడేపల్లి మండలం రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ నాటకం రైతుల ముగుసులో టీడీపీ నాటకం ఆడుతోంది. ఈ మధ్యకాలంలో చదువుకున్న పిల్లలు చెబితే తప్ప టీడీపీ నిజ స్వరూపం మాకు తెలియలేదు. రైతుల ముసుగులో కోర్టుకు వెళ్లిన వారు రాజధాని ప్రాంతంలో పేద వాళ్లకు ఎలా నివాస స్థలాలు ఇస్తారంటూ ఫిర్యాదు రాశారని చెప్పారు. ఇలా చేయడం దుర్మార్గం. పేదల కడుపు కొట్టడం ధర్మం కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే మా అందరికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. – దాడి శాంతకుమారి, నులకపేట మా వల్లే మీరు సుఖంగా ఉంటున్నారు డబ్బున్న వాళ్ల ఇళ్లలో పని చేయాలంటే మాలాంటి వారు ఎక్కడెక్కడో గుడిసెల్లో ఉంటూ వచ్చి పోవాలి. కాబట్టి మాలాంటోళ్లం రాజధానిలో ఉండకూడదనేది వారి పంతం. పేదలకు ఇళ్లు కట్టించకూడదని టీడీపీ వాళ్లు కోర్టును ఆశ్రయించడం చాలా బాధగా ఉంది. మాలాంటి వారు ఉంటేనే మీలాంటి వారు ఇళ్లల్లో సుఖంగా ఉంటారు. ఇప్పటికైనా అది ఆలోచించి కోర్టులో వేసిన కేసును వెనక్కు తీసుకుంటే బాగుంటుంది. – కొప్పుల పద్మ, పోలకంపాడు -
‘ఇంటి’పై ఏడుపు ఇంతింత కాదయ్యా..
సాక్షి, అమరావతి: కృష్ణారామా అనుకోవాల్సిన వృద్ధాప్యంలో ఈనాడు రామోజీరావు నిత్యం కడుపుమంటతో రగిలిపోతున్నారు. సీఎంగా వైఎస్ జగన్‌ను ఒక్క నిమిషం కూడా ఊహించుకోలేకపోతున్నారు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య కథనాలను వండి వార్చడమే పనిగా పెట్టుకుని పనికిమాలిన రాతలు రాస్తున్నారు. నిరుపేదలకు ఇళ్ల కట్టించి ఇవ్వడమే మహా పాపమైనట్లు తెగ గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నీ కల్పించినా ఎల్లో ముఠా ఆటలు సాగలేదు. అయినా గాలి కబుర్లను పోగేస్తూ అసత్య కథనాలను అడ్డగోలుగా అచ్చేస్తున్నారు. ఇందులో భాగమే తాజాగా రామోజీ కక్కిన ‘సెంటు పట్టా.. అక్రమాల చిట్టా!.. కథనం. జాబితాలో భారీగా అనర్హులకు చోటు అంటున్న ఆ అబద్ధాల పుట్టలో వాస్తవాలేమిటంటే.. రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదకు పక్కా ఇల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం. అందుకోసం పేదరికమే అర్హతగా అన్ని వర్గాల్లోను ఇళ్లు లేని నిరుపేదలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా 30.65 లక్షల ఇంటి పట్టాలను మహిళల పేరు మీద ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇప్పటికే 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇందులో 6 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి కూడా. ఇప్పుడు ఈ పేదలకు ఇంతలా మేలు జరుగుతుంటే ‘ఈనాడు’ పత్రిక భరించలేకపోతోంది. కడుపు మంటతో తప్పుడు రాతలకు తెగబడింది. సీఆర్డీఏ పరిధిలో అనర్హులకు స్థలాలు ఇచ్చారంటూ ఆధారాల్లేకుండా గాలి కబుర్లను పోగేసి అచ్చేసింది. వాస్తవానికి.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. వీరెవరికీ గతంలో ఇల్లుగాని, ఇంటి స్థలంగాని లేదు. అర్హుల జాబితాను అన్ని వివరాలతో ఆన్లైన్లో పెట్టి, అనేక వడపోతల అనంతరమే ఎంపిక చేశారు. అయినా రామోజీ ఏడుపు మామూలుగా లేదు. పేదలకు ఇంటి స్థలం ఇవ్వొద్దని 26 కేసులు.. నిజానికి.. ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకంపై ఈనాడు మొదటి నుంచి అసత్య కథనాలే ప్రచురిస్తోంది. గత ప్రభుత్వంలో భూమిని సేకరించి లబ్ధిదారులకు ఒక్క పట్టా ఇచ్చిన సందర్భం లేకపోయినా ఏనాడూ ఒక్క వార్త కూడా రాయకపోగా కనీసం నాటి ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించలేదు. ఈరోజు అభూత కల్పనలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పేదలకు ఇంటి స్థలం ఇవ్వడం నేరమంటోంది. ఈ ఉద్దేశంతోనే సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని ఎల్లో గ్యాంగ్ వివిధ కోర్టుల్లో ఇప్పటివరకు 26 కేసులు వేసింది. వీటన్నిటినీ సీఎం వైఎస్ జగన్ సర్కారు అధిగమించి ఈ ప్రాంతంలో 1,402.58 ఎకరాలను ఆర్–5 జోన్‌గా చట్టప్రకారం ప్రకటించి, 25 లేఅవుట్లను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది మే 26న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 50,793 మంది నిరుపేద అర్హులకు అక్కడ పట్టాలను పంపిణీ చేశారు. వీరిలో గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మంది, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ గతంలో ఇంటి స్థలం తీసుకున్నది లేదు. వీరెవ్వరికీ సొంత ఇల్లూ లేకున్నా నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లే పనికి రామోజీ దిగజారారు. మరోసారి ‘ఈనాడు’ అక్కసు నిజానికి.. సీఆర్డీఏ పరిధిలో నిరుపేదలు ఉండకూడదన్నది పచ్చ ముఠా లక్ష్యం. అందుకోసం ముందునుంచీ ఈ విషయంలో రామోజీ తప్పుడు కథనాలు ప్రచురిస్తూనే ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చేతుల మీదుగా సోమవారం ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న తరుణంలో ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును తట్టుకోలేక మరో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. వాస్తవానికి కుల, మత, ప్రాంతం చూడకుండా ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో కేవలం అర్హతే కొలమానంగా లబ్ధిదారులను గుర్తించింది. నిర్దిష్ట అర్హతలు ఉంటేనే ఎంపిక.. ఇంటి పట్టా అర్హతలపై 2019 ఆగస్టులోనే జీఓ ఎంఎస్–367ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. అందులో ఏం పేర్కొన్నారంటే.. ♦ ఎవరైనా ప్రభుత్వం ఇచ్చే ఇల్లును పొందాలంటే గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తరువాత, ఆ జీఓలో తెలిపిన ప్రమాణాల ఆధారంగా ‘అర్జీదారు కుటుంబాన్ని’ యూనిట్‌గా తీసుకుని ధ్రువీకరిస్తారు. అర్జీదారుని ఆర్థిక స్థితి, భూమి విస్తీర్ణం, ఉద్యోగ పరిస్థితి, గృహ విద్యుత్ వాడకం, పట్టణ ప్రాంతంలో ఉన్న గృహ విస్తీర్ణం, నాలుగు చక్రాల వాహనం ఇలా.. అర్హతలను బట్టి అర్హుడా కాదా అని తేలుస్తారు. ♦ ప్రాథమికంగా వారి అర్హతను గుర్తించాక క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది దరఖాస్తుదారు పరిస్థితిని పరిశీలించి ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు. తర్వాత తహశీల్దారు పరిశీలిస్తారు. ♦ ఇలా వివిధ స్థాయిల్లో వడపోత అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ప్రదర్శిస్తారు. ఎవరైనా ఈ జాబితాపై అభ్యంతరం తెలియజేస్తే వాటిని పరిశీలించిన తర్వాత తుది జాబితా రూపొందిస్తారు. ♦ ఇప్పుడు లబ్ధిపొందిన వారి జాబితాను 2020 డిసెంబర్ నాటికి మొత్తం విచారణ ప్రక్రియ పూర్తిచేసి తుది జాబితాను రూపొందించారు. ♦ అప్పట్లో కోర్టు కేసులు ఉన్న కారణంగా కోర్టు ప్రక్రియ పూర్తయ్యాక ఇంటి పట్టా ఇస్తామని సీఎం పేరిట లబ్ధిదారులకు లేఖ కూడా ఇచ్చారు. ♦ మూడేళ్ల అనంతరం అన్ని కోర్టు చిక్కులూ అధిగమించి లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఇదేకాక.. ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులుగా గుర్తిస్తే వారందరికీ ఇదే ప్రక్రియలో ఇక్కడే ఇంటి పట్టాలనూ ఇచ్చారు. ♦ ఇక ఈ లేఅవుట్లలో రూ.385.52 కోట్లతో మౌలిక వసతులు, రూ.73.74 కోట్లతో సామాజిక వసతులు (అంగన్వాడీ, స్కూల్, ఆసుపత్రి), రూ.1,081.39 కోట్లతో ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సోమవారం ప్రారంభించనున్నారు. దీంతో రామోజీ మరోసారి దుగ్థతో విషం కక్కుతున్నారు. ఈ అర్హతలు ఉంటేనే స్థలం లేదా ఇల్లు.. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు నిర్దిష్టమైన అర్హతలు రూపొందించింది. అవి.. గ్రామీణ ప్రాంతాల్లో.. ♦లబ్ధిదారు దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉండాలి. వారి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లుగాని ఇంటి స్థలంగానీ ఉండరాదు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏ హౌసింగ్ పథకంలోను లబ్ధిపొంది ఉండకూడదు. ♦లబ్ధిదారునికి 2.5 ఎకరాల మాగాణి, లేదా ఐదెకరాల మెట్టభూమి మించి ఉండకూడదు. ♦ ఆధార్ కార్డు తప్పనిసరి. ♦ అన్ని వివరాలు లబ్ధిదారు అనుమతితోనే అధికారులు సేకరిస్తారు. పట్టణ ప్రాంతంలో.. ♦ లబ్ధిదారునికి పై అర్హతలతో పాటు కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించి ఉండకూడదు. -
జగనన్న ఇళ్లల్లో విద్యుత్ పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగమయ్యేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈసీఎల్) ముందుకొచ్చింది. గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌తో ఈఈఎస్ఎల్ సీనియర్ అధికారులు అనిమేష్మిశ్రా, నితిన్ భుట్ ఢిల్లీ నుంచి ఆదివారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. పేదల ఇళ్లలో ఇంధన సామర్థ్య చర్యల అమలుకు ఈఈఎస్ఎల్ సూత్రప్రాయంగా అంగీకరించింది. అజయ్‌జైన్ మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లుల తగ్గింపునకు ఇలాంటి వినూత్న చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ మంజూరు చేసిన 21.3 లక్షల ఇళ్లలో 20.45 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, నెలాఖరు నాటికి దాదాపు 5 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఈఈఎస్ఎల్ ద్వారా విద్యుత్ ఆదా చేసే ఎలక్ట్రికల్ ఉపకరణాలను తక్కువ ఖర్చుతో అందజేస్తామని చెప్పారు. -
అనుమతులకు అష్టకష్టాలు... ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: గ్రామాల్లో ఇంటి నిర్మాణ అనుమతులకు కష్టాలు మొదలయ్యాయి. కొత్త ఇంటి నిర్మాణం చేసుకోవాలన్నా.. పాత ఇంటిని పునర్నిర్మించుకోవాలన్నా.. అనుమతులు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంతకాలం గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం టీఎస్‌బీపాస్ పరిధిలోకి వెళ్లింది. దీంతో అనుమతులు తీసుకునే విషయంలో ప్రజలకు ఎలాంటి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. టీఎస్ బీపాస్‌లో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం మీసేవా కార్యాలయంలో గాని లేదా సిటిజన్ లాగిన్‌లో గాని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం ఇంకా గ్రామీణ స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. గతంలో ఈ పంచాయతీ ద్వారా అనుమతుల ప్రక్రియను సులువుగా నిర్వహించుకునేవారు. టీఎస్‌బీపాస్ వచ్చాక ఈ పంచాయతీ పోర్టల్ విధానాన్ని నిలిపివేశారు. దీంతో టీఎస్‌బీపాస్ విధివిధానాలపై అవగాహన లేక గ్రామాల్లో ఎక్కడికక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. తద్వారా గ్రామ పంచాయతీకి ఎలాంటి ఆదాయం రాకపోవడంతోపాటు ఆయా నిర్మాణా లకు సంబంధించి ఇంటి నంబర్లు, నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా కొత్తగా నిర్మాణం చేపట్టే ఇళ్ల విషయంలో ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నా గ్రామ పంచాయతీలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. ముడా పరిధిలో.. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులను ఎలా తీసుకోవాలో అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇళ్ల నిర్మాణాలకు తీసుకోవాల్సిన అనుమతులు సైతం టీఎస్‌బీపాస్‌లో దరఖాస్తు చేయాలి. అయితే అనుమతుల ప్రక్రియ మూడు కేటగిరీలలో జరగాల్సి ఉంది. గ్రామ పంచాయతీ, ముడా, డీటీసీపీ పరిధిలో అనుమతుల ప్రక్రియ జరుగుతుంది. ఏ కేటగిరీలో ఎన్ని గజాల వరకు అనుమతులు ఇస్తారు.. అందుకు కావాల్సిన పత్రాలు ఏమేం కావాలి.. అనేదానిపై ఎవరికీ స్పష్టత లేకపోవడం గమనార్హం. కార్యదర్శుల నిస్సహాయత టీఎస్‌బీపాస్ ద్వారా గ్రామాల్లో ఇంటి నిర్మాణ, ఇతర అనుమతుల ప్రక్రియపై గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఇప్పటి వరకు శిక్షణ ఇవ్వకపోవడంతో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీ పోర్టల్‌ను ప్రభుత్వం నిలిపివేయడం, గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే అనుమతులన్నీ టీఎస్ బీపాస్ ద్వారానే తీసుకునేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులకు దారితీస్తోంది. మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ముడాలోకి వెళ్లిన గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులు, అనుమతులు తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో మొత్తం 441 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే మహబూబ్‌నగర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 143 గ్రామ పంచాయతీలు మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లాయి. ఈ–పంచాయతీ పోర్టల్‌లో ఆప్షన్లు లేకపోవడం, టీఎస్ బీపాస్‌పై అవగాహన లేకపోవడం పంచాయతీల అభివృద్ధికి శాపంగా మారుతోంది. ముడా పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో ఇప్పటివరకు ముడా ఆధ్వర్యంలో ఎలాంటి పనులు చేపట్టలేదు. ముడా ఏర్పాటై 16 నెలలు కావొస్తున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. త్వరలో శిక్షణ ఇస్తాం ముడా పరిధిలోకి వచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు త్వరలో శిక్షణ ఇస్తాం. ఆయా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, రికార్డుల నిర్వహణ, అనుమతులు వంటి అశాలపై అవగాహన కల్పిస్తాం. ముడా సమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. – మజీద్, ముడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ -
పేదల ఇళ్ల నిర్మాణాలకు.. రోజువారీ లక్ష్యాలు
సాక్షి, అమరావతి : పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తిచేసేందుకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సగటున రూ.43 కోట్ల విలువ చేసే పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లెక్కన 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.15,810 కోట్లు ఖర్చుచేయనుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించే యజ్ఞాన్ని ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిడ్కోతో కలిపి ఇప్పటికే రెండు విడతల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులివ్వగా 20.28 ఇళ్లకు శంకుస్థాపనలు జరిగి వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లలో ఇప్పటికే 3.40 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. లక్ష్య సాధనలో భాగంగా... ప్రస్తుతం రోజుకు సగటున రూ.25 కోట్ల నుంచి రూ.28 కోట్ల పనులు చేస్తున్నారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు రూ.43 కోట్ల మేర పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బిల్లుల చెల్లింపుల్లో కాలయాపన లేకుండా చూస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.730 కోట్ల మేర గృహ నిర్మాణ సంస్థ బిల్లు చెల్లింపులు చేపట్టింది. మరోవైపు.. శనివారాన్ని హౌసింగ్ డేగా నిర్వహిస్తున్నారు. ఆ రోజు జిల్లా కలెక్టర్లు, మండల, సచివాలయాల స్థాయి అధికారులు లేఅవుట్లను సందర్శించి పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఇలా ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ ఏడు హౌసింగ్ డేలు నిర్వహించారు. అధికారులు 306 లేఅవుట్లను సందర్శించారు. ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఇందులో హౌసింగ్ డే రోజున లేఅవుట్లకు వెళ్లిన అధికారులు తనిఖీల తాలూకు ఫొటోలను అప్లోడ్ చేయడంతో పాటు, తమ దృష్టికి వచ్చిన సమస్యలు, ఇబ్బందులను టోకెన్ రైజ్ చేస్తున్నారు. అంతేకాక.. 11 మంది సీనియర్ అధికారులను ఆయా జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా గృహ నిర్మాణ శాఖ నియమించింది. వీరు ప్రతినెలా తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లి ఇళ్ల పథకం అమలు, తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. గత ఏడాది రోజూ రూ.28 కోట్ల ఖర్చు గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సగటున రూ.28 కోట్ల చొప్పున పేదల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం ఖర్చుచేసింది. పేదలకు ఖరీదైన ప్రాంతాల్లో ఉచితంగా స్థలాలిచ్చిన ప్రభుత్వం, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. దీంతోపాటు పావలా వడ్డీకి బ్యాంకు రుణం రూపంలో రూ.35 వేలు అందిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు.. సిమెంట్, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందిస్తున్నారు. ఇలా 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణ పథకం కోసం ప్రభుత్వం రూ.10,203 కోట్లు ఖర్చుచేసింది. జిల్లాలకు రోజువారీ లక్ష్యాలు ఇళ్ల నిర్మాణాల వేగాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా రోజువారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నాం. ఎక్కడైనా పనులు మందగమనంలో ఉంటే అక్కడ పర్యటించి సమీక్షించి పనులు జోరందుకునేలా చేస్తున్నాం. ప్రస్తుతం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఐదు లక్షల ఇళ్లను పూర్తిచేయనున్నాం. – లక్ష్మీశా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ -
ఆ భూములు బాగు చేయొద్దు.. క్లియరెన్స్‌ను అడ్డుకున్న టీడీపీ నేతలు..
మంగళగిరి: పేదలకు అమరావతి (సీఆర్డీఏ) పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పేదలకు ఇచ్చేందుకు సీఆర్డీఏ కేటాయించిన స్థలాలను బాగు చేయవద్దని పనులు నిర్వహిస్తున్నవారితో గొడవకు దిగారు. దీంతో శుక్రవారం కృష్ణాయపాలెంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఆర్డీఏ పరిధిలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, మందడం, ఐనవోలు ప్రాంతాలను కలిపి ప్రభుత్వం ఆర్–5 జోన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ భూములను కేటాయించింది. ఆ భూముల్లో భారీగా కంపచెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆర్–5 జోన్లో కేటాయించిన భూముల్లో ముళ్లకంపను తొలగించి మెరక చేసి లే అవుట్ వేయాలని సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇందులో భాగంగా జంగిల్ క్లియరెన్స్, మెరక చేసే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. కృష్ణాయపాలెంలో కేటాయించిన భూముల్లో శుక్రవారం జంగిల్ క్లియరెన్స్ నిర్వహించేందుకు కాంట్రాక్టర్ జేసీబీలను తీసుకువెళ్లి పనులు ప్రారంభించే సమయంలో రైతుల ముసుగులో ఉన్న పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరి రూరల్ సీఐ భూషణం, ఎస్ఐ రమేష్‌బాబు వచ్చి సర్దిచెప్పారు. సీఆర్డీఏ ఇచ్చిన వర్క్ ఆర్డర్ కాపీని కాంట్రాక్టర్ చూపించి జంగిల్ క్లియరెన్స్ పనులు చేయాలని చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: సామాజిక న్యాయమే పరమావధి -
ఐదు రోజుల్లో ఇల్లు రెడీ.. 5.50 లక్షల ఖర్చు.. 60 ఏళ్లకు పైగా మన్నిక!
ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టే స్థాయిని దాటేసి.. నచ్చిన మోడల్లో ఇంటిని ప్రింటింగ్ చేసుకునే స్థితికి వచ్చేశాడు మనిషి. నెలలు, సంవత్సరాల తరబడి కట్టే ఇళ్లను సైతం త్రీడీ ప్రింటింగ్ హౌసింగ్ టెక్నాలజీ సాయంతో గంటలు.. రోజుల్లోనే చకచకా నిర్మించేస్తున్నాడు. ఎలానో ఒకసారి తెలుసుకుందాం.. సాక్షి, అమరావతి: భారత నిర్మాణ రంగంలో కొత్త టెక్నాలజీ చేరింది. శ్రమ లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతిని వినియోగించడం ద్వారా ఇళ్లను సిద్ధం చేయడంపై మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ప్రయోగాలు ఫలించాయి. సంప్రదాయ నిర్మాణాలకు భిన్నంగా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ‘త్వస్త మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్’ పేరుతో స్టార్టప్ సంస్థను స్థాపించి 3డీ ప్రింటర్‌ను అభివృద్ధి చేశారు. ప్రయోగాత్మకంగా ఐఐటీ ప్రాంగణంలోనే కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఓ ఇంటిని నిర్మించారు. ఒకే అంతస్తులో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం రూ.5.50 లక్షల ఖర్చుతో.. ఆధునిక హంగులతో 5 రోజుల్లోనే ఇల్లు పూర్తయిపోయింది. సామగ్రి కొనుగోలు, రవాణా, లేబర్ ఖర్చులు వంటివేమీ లేకుండా నిర్మించిన ఈ ఇళ్లు 50 నుంచి 60 ఏళ్లపాటు నాణ్యతతో మన్నుతాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ‘త్వస్త’తో జత కట్టిన ఎల్ అండ్ టీ త్వస్త స్టార్టప్ అందుబాటులోకి తెచ్చిన ఈ 3డీ ఇల్లు దేశాన్ని ఆకర్షిస్తోంది. తక్కువ ఖర్చుతోనే ఆధునిక హంగులతో డబుల్ బెడ్రూమ్ ఇంటిని పూర్తిచేయగలగడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ త్వస్త మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే బెంగళూరులో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తుల 3డీ ప్రింటెడ్ భవన నిర్మాణం పూర్తి చేసింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ భవన నిర్మాణానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి సైతం మంజూరు చేయడం గమనార్హం. కొత్తగా వచ్చిన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలను ప్రభావితం చేసిందని.. ఈ టెక్నాలజీలో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడితే తక్కువ సమయంలోనే లక్షలాది మందికి సొంతింటి కలను నిజం చేయవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్లాన్.. కాంక్రీట్.. ప్రింటింగ్ సాధారణ ఇంటి నిర్మాణం మాదిరిగానే 3డీ ప్రింటింగ్ నిర్మాణం కూడా సాగుతుంది. అయితే, ఇందులో కార్మికులకు బదులుగా యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్ (బ్లూప్రింట్) రూపొందిస్తారు. గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్ చేసి ఇంటి బ్లూప్రింట్ మోడలింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధం చేస్తారు. అనంతరం ప్లాన్‌ను కంప్యూటర్ సాయంతో భారీస్థాయిలో ఉండే 3డీ ప్రింటర్‌కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్ ప్రారంభించే ముందు.. పేస్ట్ లాంటి బిల్డ్ మిశ్రమాన్ని (కాంక్రీట్) వేసేందుకు అనువుగా నిర్మాణ ప్రాంతం చుట్టూ యంత్రం రోబోటిక్ హ్యాండ్ కదిలేందుకు వీలుగా బిల్డింగ్ సైట్ చుట్టూ పట్టాలు అమరుస్తారు. అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్’ బటన్ ఆన్ చేయగానే ప్రింటర్ దానికదే ప్లాన్ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి గోడలు, కిటికీలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది. ఇందులో ప్రింటర్‌లోని నాజిల్ ద్వారా కాంక్రీట్ మెటీరియల్ బయటకు వస్తే.. దాన్ని మరో కాంక్రీట్ డ్రయర్ నిర్మాణ సామగ్రిని త్వరగా పటిష్టం చేస్తుంది. ఆ వెంటనే దానిపై మరో పొర కాంక్రీట్ వేస్తుంది. ఇలా పొరలు పొరలుగా ప్లాన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం పూర్తవుతుంది. ఆపై కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి పనులను కార్మికులతో పూర్తిచేస్తారు. Been following developments in 3D printed homes overseas. Critical for India so delighted to see home-grown tech from IIT Madras (now one of the world’s leading Tech-Incubators) I know you guys raised some seed funding, but any room for me to join in? pic.twitter.com/LXoZCMAwM8 — anand mahindra (@anandmahindra) January 31, 2022 -
మరోసారి ఓ ఇంటివాడైన నాగచైతన్య!
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఫలితాలతో సంబంధం లేకుండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సమంతతో విడాకుల అనంతరం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన చై భాషతో సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్ట్స్‌కు ఒకే చెబుతున్నాడు. ఇటీవల లాల్ సింగ్ చడ్డాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చై తాజాగా ‘కస్టడీ’తో కోలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. చదవండి: నరేష్‌తో పెళ్లి.. పవిత్ర లోకేష్‌పై మాజీ భర్త సంచలన ఆరోపణలు! ఈ తాజా బజ్ ప్రకారం నాగ చైతన్య ఓ ఇంటివాడు అయినట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం సమంతతో కలిసి ఉన్న ఇంటి నుంచి బయటకు వచ్చిన చై హోటల్లోనే ఉంటున్నాడట. ఈ క్రమంలో చై తన టేస్ట్‌కు తగ్గట్టుగా హైదరాబాద్‌లో ఓ స్థలం కొని లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల గృహప్రవేశం కూడా చేసినట్టు ఫిలిం సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తండ్రి నాగార్జున ఇంటికి సమీపంలోనే ఈ ఇంటిని నిర్మించుకున్నాడని సమాచారం. తనకి నచ్చిన విధంగా విలాసవంతమైన సౌకర్యాలతో చై ఈ కొత్తని ఇంటిని స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్నాడట. చదవండి: అమెరికాలో లగ్జరీ బంగ్లా రెంట్‌కు తీసుకున్న ఉపాసన! ఎందుకంటే.. ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ ధియేటర్ కూడా ఉన్నాయట. ఇలా సకల సౌకర్యాలు ఉండేలా విలాసవంతమైన గృహాన్ని నిర్మించుకున్న చై పది రోజుల క్రితమే గృహ ప్రవేశం కూడా చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నాగ చైతన్య స్పందించేవరకు వేచి చూడాల్సిందే. కాగా గతంలో చై గచ్చిబౌలిలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి అదే స్థలంలో చై ఈ కొత్త ఇల్లు నిర్మించుకున్నట్టు సమాచారం. (చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) -
పేదలకు ఇళ్లు.. 4.4 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి.. మరో రూ.5,600 కోట్లు..
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 2023 సంవత్సరం చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్దిదారులందరికీ అందించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 18.63 లక్షల ఇళ్లకు గాను, మొదటి దశలో 16.91 లక్షల ఇళ నిర్మాణం ప్రారంభంకాగా, వీటిలో 4.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశలలో ఉంది. వైఎస్సార్ జగనన్న కాలనీలను నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు, మురుగు కాల్వల ఏర్పాటు వంటి అన్ని మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. భారాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ, ఇ-ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా టెండర్లను ఖరారు చేసిన మార్కెట్ ధర కంటే ధరకు 20 మెట్రిక్ టన్నుల ఇసుక, 5 మెట్రిక్ టన్నుల సిమెంట్, స్టీల్, 12 ఇతర నాణ్యమైన భవన నిర్మాణ సామగ్రిని ఉచితంగా అందిస్తోంది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 5,600 కోట్ల రూపాయలను కేటాయించింది. చదవండి: ఏపీ వార్షిక బడ్జెట్.. మహిళా సాధికారతే ధ్యేయంగా.. -
Viral Video : వాటే ఐడియా.. స్కూటర్ని ఇలా కూడా వాడేయొచ్చా..!
-
Sachin Tendulkar: పొగరుబోతు తనం ఉంటే నశించిపోతారు.. కానీ సచిన్ అలా కాదు!
భారతీయ క్రికెట్ రంగంలోకి ప్రవేశిస్తున్న సమయంలో సచిన్ తెందూల్కర్‌ను పిలిచి వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారు...‘‘నువ్వు క్రికెట్ ఆడవచ్చు. జీవితంలో క్రికెట్ అంతర్భాగం. కానీ క్రికెట్లో జీవితం అంతర్భాగం కాదు. నువ్వు క్రికెట్ మహా అయితే ఎన్నాళ్ళు ఆడతావు? ఒంట్లో ఓపికున్నంత వరకేగా! అంటే మహా అయితే ఓ 10–15 ఏళ్ళు.. ఇంకా ఓపికుంటే మరో 5 ఏళ్లు. కానీ నీది నూరేళ్ళ జీవితం. దానిలో 20 ఏళ్ళు పోతే మిగిలే నీ జీవితం 80 ఏళ్ళు. నువ్వాడుతున్న క్రికెట్ వల్ల నీకు పేరుప్రతిష్ఠలు కానీ, నీ వంటి పుత్రుడిని కన్నందుకు నాకు గౌరవమర్యాదలు కానీ, నీ వంటి ఉత్తమమైన పౌరుడిని పొందినందుకు ఈ దేశానికి కానీ కీర్తి రావాలంటే వినయంతో ప్రవర్తించడం నేర్చుకో ’’ అని ఉద్బోధించాడు. తరువాతికాలంలో ఈ మాటలు సచిన్ ను ఎలా ప్రభావితం చేసాయో చెప్పడానికి ఒక ఉదాహరణ... ముంబయిలో సచిన్ ఒక వీథిలో ఇల్లుకట్టుకోవాలనుకున్నాడు. అది తెలిసి ఆ వీథిలో వాళ్ళు సంతోషంతో పొంగిపోయారు. సచిన్ ఇక ఇక్కడే ఉంటాడు. బయటికి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు చూడవచ్చు. మేం ఉండేది సచిన్ పక్కఇంట్లోనే, ఎదురింట్లోనే...ఇలా చెప్పుకోవచ్చంటూ మురిసిపోతున్నారు. ఆ వీథిలో అటువైపు, ఇటువైపున్న ఇళ్ల యజమానుల పేర్లతో సచిన్ ఒక ఉత్తరం రాసాడు. దానిలో ఏముందో తెలుసా... ‘‘నేను సచిన్ తెందూల్కర్. నేను మీ వీథిలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. ఇంటి నిర్మాణానికి ఏడాదో ఏడాదిన్నరో పట్టొచ్చు. నిర్మాణం జరిగేటప్పడు దుమ్మూధూళీ, పెద్ద శబ్దాలు, ఇతరత్రా మీ ప్రశాంత జీవనానికి భంగం కలిగించవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో నావల్ల మీకు కలుగుతున్న ఈ అసౌకర్యానికి మన్నించండి. నన్ను మీలో ఒకడిగా మీ వీథిలో ఉండడానికి అనుమతిస్తూ మీ సహకారాన్ని కోరుకుంటున్నా...’’ అని రాసి ప్రతి యజమానికీ స్వయంగా చేతికిచ్చాడు. వినయం అంటే అదీ... కీర్తిప్రతిష్ఠల పరంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తి అంతటి వినయం చూపడం అతడి వ్యక్తిత్వాన్ని, దాని సమున్నతినీ సూచిస్తుంది. ఈ సంఘటన స్వయంగా సచిన్ తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. చరిత్రలో ఎవరు అలా ఉన్నారో వారు కీర్తిమంతులయ్యారు. పెద్దల అనుగ్రహం పొందారు. భగవంతుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శాశ్వతకీర్తిని మూటగట్టుకున్నారు. ఎంత ఉన్నత శిఖరాలకు చేరుకున్నా ఈ వినయం లేకుండా పొగరుబోతు తనం ఉంటే నశించిపోతారు. ఆదర్శపురుషుడిగా నిలిచిన శ్రీరామచంద్రమూర్తినే చూడండి. భీష్మాచార్యులు, ధర్మరాజు....వీళ్లందరూ అసమాన వీరులే, అఖండ ప్రజ్ఞావంతులే, కానీ వారి బలాన్ని చూసి ఏనాడూ విర్రవీగలేదు. కనీసం ఎక్కడా గొప్పకోసం కూడా చెప్పుకోలేదు. ఆ జన్మాంతం వినయ విధేయతలతోనే జీవించారు. మరోరకంగా చెప్పాలంటే వారి విజయాలకు, వారి కీర్తిప్రతిష్ఠలకు ప్రధాన కారణం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే. వాళ్ళు పాటించిన ఈ నియమం ప్రజల హదయాల్లో వారికి శాశ్వత స్థానం దక్కేటట్లు చేసింది. ఇంతే ప్రతిభాపాటవాలు ఉన్న మరికొందరు వారి బలాన్ని చూసి గర్వాతిశయంతో ప్రవర్తించి అగాథాల్లో పడిపోయారు. ప్రజల ఈసడింపులకు గురయ్యారు. చరిత్రహీనులయ్యారు. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా ...అంటూ బద్దెన గారిస్తున్న సందేశం కూడా అదే. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: మంచి మాట: ఉత్తమ వ్యక్తిత్వం ఎలా రూపు దిద్దుకుంటుంది? -
లబ్దిదారులకు నిర్మాణసామాగ్రి అందుబాటులో ఉంచుతున్నాం: మంత్రి జోగి రమేష్
-
ఇల్లు కడుతున్నారా.. వెంటనే పర్మిషన్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతులను మరింత సులభతరం చేసినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. 75 నుంచి 240 చదరపు గజాల వరకు ఉన్న స్థలాల్లో ఇళ్లు, స్టిల్ట్+2, జీ+1 అంతస్తుల భవనాల అనుమతుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సత్వరమే అనుమతులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం భవన యజమానులు నేరుగా అధికారులను సంప్రదించాల్సిన అవసరం లేదు. టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సర్టిఫికెట్లను పరిశీలించి అనుమతులనిస్తారు. నాలుగు దశల్లో ఇది పూర్తవుతుంది. భవన నిర్మాణదారులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో ఈ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు సమర్పించిన సమాచారం సరైందేనని పేర్కొంటూ స్వీయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. మూడో దశలో ఆన్లైన్లో నిర్ణీత ఫీజు చెల్లించాలి. నాలుగో దశలో భవన యజమానులు అనుమతి పత్రాలను ఆన్లైన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీఎస్‌బీపాస్ అనుమతుల్లో సందేహాలపై టోల్‌ఫ్రీ నంబర్ 1800–5992266ను సంప్రదించవచ్చు. 040–22666666కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. వాట్సప్ ద్వారా సమాచారం కోసం ఫోన్: 9392215407ను సంప్రదించవచ్చు. (క్లిక్: సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్లోనే ఎక్కువ.. ఎందుకంటే!) -
330 చదరపు అడుగులు!
సాక్షి, హైదరాబాద్: పేదలకు సొంత గూడు కల్పిం చేందుకు ప్రారంభించిన 2 పడక గదుల గృహాల పథకంలో మార్పులు జరగబోతున్నాయి. పథకం కొనసాగిస్తూనే.. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకు నే లబ్ధిదారులకు డబ్బు సాయం అందిస్తామని ఇటీ వల బడ్జెట్లో ప్రకటించిన పథకానికి కొన్ని నిబంధనలు విధించాలని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. సొంత స్థలంలో చేపట్టే ఇళ్ల కనిష్ట, గరిష్ట విస్తీర్ణం ఎంతుండాలో నిబంధనలు రూపొందించనున్నట్టు తెలుస్తోంది. కనీస విస్తీర్ణం 330 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండకుండా చూడాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. గరిష్ట విస్తీర్ణం పరిధిని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. బడ్జెట్లో ఇళ్లకు రూ. 12 వేల కోట్లు ఇటీవలి బడ్జెట్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల కోట్లను ప్రతిపాదించింది. ఇందులో సొంత స్థలంలో లబ్ధిదారులే నిర్మించుకునే ఇళ్లకు రూ.7,350 కోట్లను, ఇంతకాలం కొనసాగుతున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.4,650 కోట్లను ప్రతిపాదించింది. సొంత జాగాలో నిర్మాణానికి నియోజకవర్గానికి 3 వేలు చొప్పున ఇళ్లను కేటాయించింది. మరో 43 వేల ఇళ్లను సీఎం విచక్షణాధికారం పరిధిలో ఉంచింది. ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలను ప్రభుత్వం సాయంగా అందిస్తుంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) పథకం కింద కేంద్రం నుంచి 4 లక్షల ఇళ్లు మంజూరవుతాయిని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందులో పట్టణ ప్రాంతాల ఇంటి యూనిట్ ధర రూ.2 లక్షలుండగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలుగా ఉంది. ఆ నిధులకు సొంత నిధులు కలిపి రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది. కేంద్రం పథకం విధి విధానాల్లో ఇంటి నిర్మాణ పరిధి 330 చదరపు అడుగులకు తగ్గకూడదన్న నిబంధన ఉంది. ఇదే నిబంధనను ‘సొంత స్థలంలో ఇళ్లకు’ విధించాలని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. తేడా వస్తే కేంద్రం నిధులు ఆగిపోతాయని భావిస్తోంది. ఇక లబ్ధిదారులెవరైనా సొంత నిధులు కలిపి పెద్దగా ఇంటిని నిర్మాణం చేపట్టి మధ్యలో నిధులు సరిపోక చేతులెత్తేస్తే కేంద్ర నిధులకు ఇబ్బంది వస్తుంది. అలాంటి ఇళ్లను పరిగణనలోకి తీసుకోకుండా అంతమేర నిధుల్లో కేంద్రం కోత పెడుతుంది. దీంతో ఖర్చు మరీ ఎక్కువయ్యేలా పెద్దగా ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా గరిష్ట పరిధిని కూడా నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జనానికి భారమే కనిష్ట పరిమితిపై నిబంధన విధిస్తే లబ్ధిదారుల జేబుపై భారం పడబోతోంది. కనీసం 330 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలంటే ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4.50 లక్షలు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వం ఇచ్చేది రూ.3 లక్షలే. అంటే దాదాపు రూ. లక్షన్నర మేర లబ్ధిదారులే సొంతంగా ఖర్చు చేయాల్సి రానుంది. కొంతమంది ప్రస్తుతమున్న ఇంటికి కొనసాగింపుగా పక్కనే ఉండే ఖాళీ స్థలంలో ఒకట్రెండు గదులు నిర్మించుకుంటుంటారు. ఈ కొత్త నిర్మాణాన్ని ప్రభుత్వ పథకం కింద చూపుతారు. అలాంటి అనుబంధ నిర్మాణాలు 330 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉంటే కొత్త నిబంధన అమలులోకి వస్తే వాటికి అనుమతి రాదు. -
ఓటీఎస్‌కు మంచి స్పందన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)కు మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందడానికి అర్హులు వడివడిగా ముందుకొస్తున్నారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 మధ్య ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు, వీటిపై వడ్డీని ఓటీఎస్ కింద మాఫీ చేసి.. నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఇళ్లపై సంపూర్ణ యాజమాన్య హక్కులను ప్రభుత్వం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటీఎస్ వినియోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా 9,18,216 మంది ఇళ్లపై హక్కులు పొందారు. వీరిలో 2,47,355 మంది తమ పేర్లపై రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1.26 లక్షల మంది.. పశ్చిమ గోదావరి జిల్లాలో 1.11 లక్షల మంది ఓటీఎస్ వినియోగించుకున్నారు. ఓటీఎస్ రూపంలో ప్రభుత్వం రూ.10 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేసింది. అంతేకాకుండా పేదలపై తలకు మించిన భారం మోపకుండా తక్కువ మొత్తం నిర్దేశించి.. వాటిని చెల్లించినవారికి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. పేదలపై ఎటువంటి రుసుములు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రూ.6 వేల కోట్ల లబ్ధి చేకూరుస్తోంది. ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర ప్రభుత్వం పేదలకు మేలు చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలు రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టుకునే అవకాశం కల్పించింది. ఉగాదికి తొలి వాయిదా, దీపావళికి రెండో వాయిదా చెల్లించేలా వెసులుబాటు ఇచ్చింది. స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.. ఓటీఎస్‌కు స్పందన బాగుంది. ఓటీఎస్ వినియోగించుకోవాలని ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల యంత్రాంగం అర్హుల ఇళ్లకు వెళ్లి ఓటీఎస్ ప్రయోజనాలను వివరిస్తున్నారు. దీంతో అర్హులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సోమవారం ఒక్కరోజే నెల్లూరు జిల్లాలో 3,761 మంది ఓటీఎస్ వినియోగించుకోవడానికి సుముఖత తెలిపారు. – నారాయణ భరత్ గుప్తా, ఎండీ, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ -
చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్
పౌరి (ఉత్తరాఖండ్): బిపిన్ రావత్ రిటైరయ్యాక ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామమైన ‘సైనా’లో ఇళ్లు కట్టుకోవాలని అనుకున్నారు. 2018 చివరిసారిగా ఆయన సొంతూరును సందర్శించారని బిపిన్ మేనమామ భరత్ తెలిపారు. పౌరి జిల్లాలోని ద్వారిఖాల్ బ్లాక్‌లో సైనీ గ్రామం ఉంది. ఈ ఊర్లో ప్రస్తుతం నివసిస్తున్న జనరల్ ఏకైక బంధువు భరత్. ‘2018లో వచ్చినపుడు కులదేవతకు పూజ చేశారు. రిటైరయ్యాక ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటానని చెప్పారు. స్వగ్రామంతో బిపిన్‌కు అనుబంధం ఎక్కువ. ఊరి జనం ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం తనను బాధిస్తోందని, రిటైరయ్యాక ఈ ప్రాంతం కోసం ఏదైనా చేస్తానని గ్రామస్తులకు చెప్పారు. బిపిన్ ఫోన్లో నాతో మాట్లాడేవారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సైనీకి వస్తానన్నారు’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పారు భరత్. (చదవండి: బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే) తన మేనల్లుడి కోరిక తీరకుండానే ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు. రావత్ సతీమణి మధులిక సొంతూరు మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని సొహాగ్‌పూర్. ప్రస్తుతం ఆమె కుటుంబం షాడోల్లో ఉన్న పూర్వీకుల ఇంట్లో నివశిస్తున్నారు. వచ్చే ఏడాది సొహాగ్‌పూర్ వచ్చి సైనిక పాఠశాల పనులు ప్రారంభిస్తానని రావత్ చెప్పినట్లు బావమరిది యశవర్ధన్ అన్నారు. చదవండి: విమాన ప్రమాదం అంటే గుర్తొచ్చేది బ్లాక్‌బాక్స్.. అసలు దానికథేంటి..? -
అన్లోడ్ చేస్తుండగా టిప్పర్‌కి విద్యుదాఘాతం..ముగ్గురు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కన్యకాపురంలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం కంకర టిప్పర్ లోడ్ ను అన్లోడ్ చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మనోజ్ కుమార్ ముందుగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతని రక్షించడానికి వెళ్లిన దొరబాబు, జ్యోతిష్కులు కూడా అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
ప్లాస్టిక్ బాటిల్స్ తో ఇల్లు నిర్మాణం
-
‘ఈ రోజు రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజు’
సాక్షి, అమరావతి: ఈ రోజు రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు. మొదటి విడత 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని కొనియాడారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 31 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు సొంత ఇంటి కలను సీఎం జగన్ నెరవేర్చబోతున్నారని తెలిపారు. పాదయాత్రలో బడుగుల కష్టాలు చూసి జగన్ విశాల హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. మహిళల పేరు మీదే ఇళ్ల పట్టా, వాళ్ళ పేరు మీదే ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు. 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలే నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. కలలో కూడా ఊహించని విషయం ఈ రోజు సాకారం కానుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీని వలను 25 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కా చెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. అసలు చంద్రబాబు వెంట ఎవరూ లేరుని రాష్ట్రమంతా మూకుమ్మడిగా జగన్ వెంట అడుగులు వేస్తున్నారని, అందుకు ఇటీవల జరిగిన ఎన్నికలే స్పష్టం చేస్తున్నాయని అన్నారు. చదవండి: సుస్థిర ఆర్థికాభివృద్ధి: టాప్-5 రాష్ట్రాల జాబితాలో ఏపీ -
‘చరిత్రలోనే ఇళ్ల నిర్మాణం సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది’
సాక్షి, విశాఖపట్నం: దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా ఇళ్ల నిర్మాణం నిలిచిపోతుందని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. పేద ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోగా.. తిరిగి ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలు గుండెల్లో నిలిచిపోయే విధంగా నిర్మాణాలు చేస్తున్నారని కొనియాడారు. వెల్లంకి గ్రామములో ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శ్రీనివాసరావు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలనీలే కాకుండా ఊర్ల నిర్మాణం చేస్తున్నారని.. రోడ్లు, డ్రైనేజీలు, ఇంటర్నెట్ సౌకర్యాలు చేస్తున్నారని తెలిపారు. పేదలు జీవితంలో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయని, పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం ఈరోజు నెరవేరుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఒక్కో ఇళ్ళ రూపంలో 15 లక్షలు విలువ చేసే ఆస్తి ఇస్తున్నారని తెలిపారు. విశాఖలో రెండు లక్షల ఇళ్లు కోర్టు వాయిదాల కారణంగా వాయిదా పడుతోందని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 50,050 ఇళ్ళు నిర్మాణం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. కోర్టు వివాదాలు కారణంగా నిలిచినా.. విశాఖ వాసుల ఇళ్ళు పూర్తి చేసి న్యాయం చేస్తామన్నారు. -
రేపు వైఎస్సార్ జగనన్న ఇళ్ల ప్రారంభోత్సవం
సాక్షి, అమరావతి: రేపు(గురువారం)వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. 28 లక్షల 30 వేల మందికి పక్కాఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. తొలి విడతగా 15 లక్షల 60 వేల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. రూ.51 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, మౌలిక వసతుల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: మాజీ సీఎం సిద్ద రామయ్యకు అస్వస్థత -
‘నీ ఇంటిని 1 మీటరు జరుపు లేదంటే రూ.1.6కోట్లు కట్టు’
ఆక్లాండ్: మనిషి జీవితంలో ఉండే అతి ముఖ్యమై కల సొంత ఇంటి నిర్మాణం. చనిపోయేలోపు తమకంటూ ఓ ఇంటిని నిర్మించుకోవాలని ఆశపడతారు చాలా మంది. ఇక న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కూడా ఇదే విధంగా అనుకుని సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. అయితే అతడి కల నెరవేరుతుందని సంతోషించేలోపల ఓ వింత సమస్య అతడి ముందుకు వచ్చింది. దాంతో అతడు తలపట్టుకున్నాడు. ఇంతకు ఆ సమస్య ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. ఆక్లాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన దీపక్ లాల్ గతతేడాది పాపాకూర్లో సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. మూడు పడక గదులతో అత్యంత సౌకర్యవంతంగా నిర్మాణం చేయబోతున్న ఆ ఇంటిని చూసుకుని తెగ మురిసిపోతున్నాడు దీపక్ లాల్. సీ94 డెవలప్మెంట్ అనే కంపెనీ వేసిన దావాతో అతడి ఆనందం ఆవిరవ్వమడమే కాకా షాక్‌తో చలిజ్వరం పట్టుకున్నట్లు అయ్యింది. దావా ఏంటంటే.. సీ94 డెవలప్మెంట్ ఫిర్యాదు ఏంటంటే మిస్టర్ లాల్ తన ఇంటిని చట్టబద్ధంగా తనకు సంక్రమించిన స్థలంలో కాకుండా ఒక మీటర్ వేరే వారి స్థలంలో నిర్మిస్తున్నాడు. దాంతో సదరు సంస్థ దీపక్ లాల్ మీద దావా వేసింది. అతడు ఇంటిని తనకు చట్టబద్ధంగా సంక్రమించిన స్థలంలోకి జరపాలి.. లేదంటే 3,15,000డాలర్ల(సుమారు 1.6 కోట్ల రూపాయలు) జరిమానా చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడు. దాంతో దీపక్ లాల్ ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఈ సందర్భంగా దీపక్ లాల్ మాట్లాడుతూ.. ‘‘ఈ సమస్య నా పాలిట ఓ పీడకలల తయారయ్యింది. దీని గురించి ఆలోచిస్తూ రాత్రుళ్లు నిద్రపోవడం మానేశాను. చివరకు ఇది ఎలా పరిష్కారం అవుతుందో అంతుపట్టడం లేదు’’ అని వాపోయాడు. ఇంటిని నిర్మించడానికి అంగీకరించిన డిజైనర్, హెచ్‌క్యూ డిజైన్స్ ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను దాఖలు చేశారని.. వాటిని ఆక్లాండ్ కౌన్సిల్ ఆమోదించింది అని తెలిపాడే లాల్. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత వారిదే అన్నాడు. ఇక ఈ సమస్యకు సంబంధించి ఒకరినొకరు నిందించకుంటున్నారు తప్ప సమస్యను పరిష్కరించే మార్గం చూడటం లేదు అన్నాడు దీపక్ లాల్. ‘‘ఇంటిని జరపడానికి నేను సిద్ధం. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పటికే ఈ కొత్త ఇంటి మీద తనఖా, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి అద్దె కోసం వారానికి 1000 డాలర్లు చెల్లిస్తున్నాను. ఈ సమస్య పరిష్కారం కాకపోతే దీన్ని అమ్మలేను.. రోజులు గడుస్తున్న కొద్ది ఇది మరింత జటిలం అవుతుందని’’ వాపోయాడు లాల్. చదవండి: పరిచయం లేని ప్రపంచంలో ఆఫీసర్ స్థాయికి.. -
వీడి తెలివి సల్లగుండ.. ఇళ్లంతా ఐరన్‌తోనే నిర్మాణం
సాక్షి, సైదాబాద్: అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే కూల్చేస్తారని అతి తెలివితో ఓ వ్యక్తి ఐరన్‌తో నిర్మాణం చేపట్టాడు. ఐఎస్‌సదన్ డివిజన్ ఆర్టీసీకాలనీలో ప్రధాన రహదారికి ఆనుకొని ఐరన్‌తో జీ–ప్లస్ వన్ను నిర్మించాడు. శ్లాబు, గోడలు, మెట్లు అంతా ఐరన్‌తోనే నిర్మించడం గమనార్హం. కింది భాగంలో నాలుగు షెట్టర్లను ఏర్పాటు చేశాడు. ఈ అక్రమ నిర్మాణాన్ని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు నిర్మాణదారుడికి నోటీసులు ఇచ్చామని టౌన్‌ప్లానింగ్ అధికారి మల్లీశ్వర్ తెలిపారు. స్పందించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మానస స్వప్నం నిరుపేదలకు ఓపాడ్ ఇళ్లు
సొంతింట్లో నివసించాలని కోరుకునే వారు మన సమాజంలో చాలామంది ఉంటారు. పేద, మధ్యతరగతి వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు 23 ఏళ్ల పేరాల మానస రెడ్డి సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. డ్రైనేజి నీటి పారుదల కోసం ఉపయోగించే.. పైపుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను అతి తక్కువ ఖర్చుకే అందించనున్నట్లు మానస ప్రకటించింది. ప్రకటించినట్లుగానే రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది మానస. తను మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో మానసను, ఆమె చెల్లిని తల్లి ఎంతో కష్టపడి పెంచింది. చిన్నప్పటి నుంచి తల్లి పడుతోన్న కష్టాలను దగ్గర నుంచి చూస్తూ పెరిగిన మానస... తల్లి ప్రోత్సాహంతో ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ అయిన తరువాత మరో ఆరు నెలలపాటు కొత్త కొత్త ఇళ్ల నిర్మాణ నమూనాలపై ఆమె పరిశోధనలు చేసింది. పరిశోధనలో భాగంగా జపాన్, హాంగ్‌కాంగ్, ఇతర ప్రదేశాల్లో అక్కడి వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా నిర్మించిన ఇళ్ల నమూనాలపై లోతుగా అధ్యయనం చేసింది. వీటి ఆధారంగా మన దేశంలోని వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇంటిని నిర్మించవచ్చో నిర్ణయించుకుని కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టడానికి రిజిస్టర్ చేసుకుంది. నిరుపేద కుటుంబాల కోసం 12 రకాల డిజైన్లు రూపొందించగా... ఇప్పుడు ఒక నమూనాతో ‘ఓపాడ్’ ఇంటిని నిర్మించింది. ఓపాడ్.. సిమెంటు తూములు (పైపు)ల్లో నిర్మించే ఈ ఇళ్లు చిన్నగా... చూడముచ్చటగా కనిపిస్తాయి. ఓపాడ్ లో ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్, వాష్‌రూమ్‌లు ఉంటాయి. వస్తువులను పెట్టుకునేందుకు అల్మారాలు, ఎలక్ట్రిసిటీæ, వాటర్, డ్రైనేజీ సదుపాయాలు ఉంటాయి. పైపు పైన లాంజ్ లాంటి బాల్కనీ కూడా ఉంది. ఈ ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు సౌకర్యంగా జీవించవచ్చు. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్ ఇళ్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నివసించడానికి వీలుగా తయారవుతుంది. ‘‘అన్ని వాతావరణ పరిస్థితుల్లో అటూ ఇటూ కదపగల ఈ ఇళ్లæజీవిత కాలం వందేళ్లు అని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని మానస చెప్పింది. సరికొత్త ఓపాడ్ ఇళ్లలో డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ..‘‘పట్టణాలు, గ్రామాలు, స్లమ్స్‌లో నివసించే వారు ఎక్కువగా పూరి గుడిసె ల్లో నివసిస్తుంటారు. వర్షం పడిందంటే ఇళ్లలోకి నీరు చేరడం, పైకప్పు నుంచి వర్షం కురవడం, కొన్నిసార్లు నీటి ప్రవాహానికి ఇళ్లు కొట్టుకుపోవడం వంటివి సంభవిస్తుంటాయి. నేను బి.టెక్ చదివేటప్పుడు ఇటువంటి సందర్భాలెన్నింటినో దగ్గరగా గమనించాను. సమస్యలు ఏవీ ఎదురుకాని ఇళ్లను నిర్మించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో తయారయ్యే ఓపాడ్ ఇళ్లను నిర్మిస్తున్నాను. ఈ ఇళ్లు ఎంతో చల్లగా ఉండడంతో పాటు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. నిరుపేదలకోసం రూపొందించిన ఈ డిజైన్లలో కొన్ని రెస్టారెంట్లు, రిసార్టులు, మొబైల్ హోమ్స్, మొబైల్ క్లినిక్‌లు, గెస్ట్ హౌస్, గార్డులు నివసించే రూములుగా కూడా ఉపయోగపడతాయి’’ అని వివరించింది. మానస తల్లి రమాదేవి మాట్లాడుతూ.. మా అమ్మాయి మానసకు వచ్చిన ఐడియాను మొదట్లో ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు ఎంతోమంది తన డిజైన్స్ గురించి మెచ్చుకోవడం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మానస నిరుపేదలు ఖర్చుచేయగల సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని రమాదేవి చెప్పారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... మానసకు వచ్చిన ఆలోచన కొత్త ఆవిష్కరణలకు పునాది వేసేదిగా ఉంది. ఇది తన విజయ ప్రస్థానంలో కేవలం ప్రారంభం మాత్రమే. ముందుముందు తను మంచి విజయాలను అందుకుంటుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. మానస చెంగిచెర్లలో డెమో కోసం నిర్మించిన ఓపాడ్ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లి రమాదేవితో మానస -
కొత్త కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు నీటి వసతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు నీటి వసతిని కల్పించే పనులు వేగవంతం అయ్యాయి. అదే వేగంతో నిర్మాణ పనులూ కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంత గూడు సమకూరనుంది. రాష్ట్రంలో మొదటి విడత 15.60 లక్షల ఇళ్లు నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇళ్లు మంజూరైన లబ్దిదారుల వివరాలతో ఈ నెల 31లోగా జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి నియోజకవర్గంలో సమీక్ష సమావేశాలు నిర్వహించి.. ఆ మేరకు పూర్తి సమాచారంతో ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచే సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పరిశీలించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా అత్యవసరంగా 8,316 చోట్ల నీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయించడంతోపాటు పైప్‌లైన్ పనులు చేస్తున్నారు. నీటి సరఫరా అవసరమని గుర్తించిన లేఅవుట్లు ఇవే.. తూర్పుగోదావరిలో 753, ప్రకాశంలో 432, కర్నూలులో 501, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో 249, వైఎస్సార్‌లో 405, చిత్తూరులో 942, శ్రీకాకుళంలో 745, విశాఖపట్నంలో 466, విజయనగరంలో 876, పశ్చిమ గోదావరిలో 890, గుంటూరులో 546, కృష్ణాలో 1,092, అనంతపురం జిల్లాలో 419 లేఅవుట్లలో బోర్లు తవ్వి పైప్లైన్లు వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే చాలాచోట్ల బోర్లు వేస్తున్నారు. ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 534 లేఅవుట్లలో నీటి వసతి ఏర్పాటు చేశారు. ఈ పనులను గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ నీటి పనుల విభాగం, పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఇంటి నిర్మాణంలో ఎక్కడా నాసిరకానికి ఆస్కారం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో ఆ మేరకు గృహనిర్మాణ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలోగా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. లబి్ధదారుల అవగాహన కోసం ప్రతి కాలనీలో మోడల్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. -
20 రోజుల్లోపే ఇంటి నిర్మాణం పూర్తి
సత్తెనపల్లి: ‘నవరత్నాలు–అందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం నుంచి స్థలం పొందిన లబ్ధిదారు కేవలం 20 రోజుల్లోపే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఆదివారం గృహప్రవేశం చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆ ఇంటిని ప్రారంభించగా.. లబ్ధిదారు సంప్రదాయబద్ధంగా ఇంట్లోకి ప్రవేశించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామానికి చెందిన నరాల రత్నకుమారి, సత్యనారాయణరెడ్డి దంపతులు కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రభుత్వం గత నెల 26న రత్నకుమారికి ఇంటిస్థలం పట్టా అందజేస్తే, అదే రోజున పక్కా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి రాష్ట ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్లలో రత్నకుమారి రెండో ఆప్షన్ (ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని లబ్ధిదారు నచ్చిన చోట కొనుక్కుని ఇల్లు నిర్మించుకోవడం) ఎంచుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలకు తోడు మరో రూ.1.20 లక్షలు వెచ్చించి రూ.3 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. నిబంధనల ప్రకారం భవనం గట్టిగా ఉండేలా కాలమ్స్ నిర్మించి.. టైల్స్‌తో పక్కా ఇల్లు పూర్తి చేశారు. -
రియల్టీకి కరోనా కాటు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ రియల్టీ రంగం మీద కరోనా వైరస్ ప్రభావం పడింది. కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న కారణంగా గృహాల అమ్మకాలు, నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని హౌజింగ్ బ్రోకరేజ్ అనరాక్ కన్సల్టెన్సీ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 15.62 లక్షలకు పైగా గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి 2013–19 మధ్య కాలంలో ప్రారంభమైన గృహాలేనని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రాజెక్ట్‌లలో నిర్మాణ పనులు జరగడం లేదని అనరాక్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. సాధారణంగా గుడిపడ్వా, అక్షయతృతీయ, నవరాత్రి, ఉగాది వంటి పర్యదినాల్లో గృహ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని.. గృహ ప్రవేశాలకు ముందస్తు ప్రణాళికలు చేస్తుంటారని కానీ, కరోనా వైరస్ కారణంగా ఈసారి విక్రయాలు సన్నగిల్లాయని, గృహ కొనుగోలుదారులు గృహ ప్రవేశం చేసే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇది డెవలపర్ల ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో 64,250 గృహాలు.. నగరాల వారీగా నిర్మాణంలో ఉన్న గృహాల సంఖ్యను చూస్తే.. హైదరాబాద్‌లో 64,250 యూనిట్లు, ఎంఎంఆర్‌లో అత్యధికంగా 4.65 లక్షల గృహాలు, ఎన్సీఆర్లో 4.25 లక్షలు, పుణేలో 2.62 లక్షలు, బెంగళూరులో 2.02 లక్షలు, కోల్‌కతాలో 90,670, చెన్నైలో 54,200 యూనిట్లు ఉన్నాయి. 8–10 శాతం ఆదాయం లాస్.. నిర్మాణ సంస్థలు ఆదాయం మీద లాక్డౌన్ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా కంపెనీల వార్షిక ఆదాయంలో నాల్గో త్రైమాసికం వాటా 30–35 శాతం వరకుంటుందని.. కానీ, ఫోర్త్ క్వాటర్లో ఆదాయం 8–10 శాతం క్షీణిస్తుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. -
కేరాఫ్ బ్లెస్సింగ్!
అల్లు అర్జున్ తన చిరునామాను మార్చాలనుకుంటున్నట్లున్నారు. అవును... బన్నీ (అల్లు అర్జున్) కొత్త ఇంటి పనులు ప్రారంభమయ్యాయి. కొత్త ఇంటి భూమిపూజ జరిగిన ఫొటోను షేర్ చేస్తూ, ఈ ఇంటికి ‘బ్లెసింగ్’ అని పేరు పెట్టినట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. భార్య స్నేహ, కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అల్లు అర్హాతో కలిసి బన్నీ భూమిపూజ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘అల... వైకుంఠపురములో...’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు బన్నీ. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్లో జరుగుతోంది. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలనుకుంటున్నారు. -
చౌక ఇళ్ల నిర్మాణానికి డ్రోన్లు...
ఇప్పటికే బోలెడన్ని రంగాల్లో ఎంతో ఉపయోగపడుతున్న డ్రోన్లను ఇళ్ల నిర్మాణానికీ వాడుకోవచ్చునని నిరూపించారు స్టెఫానీ ఛాల్టెయిల్ అనే టెకీ. బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్‌కు చెందిన ఛాల్టెయిల్ భవన నిర్మాణ పద్ధతులపై చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని పనులను డ్రోన్ల వంటి యంత్రాలు/రోబోల సాయంతో చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని స్టెఫానీ అంచనా. ఇందులో భాగంగా గత ఏడాది డ్రోన్లకు అడుసుతో కూడిన పైపులు బిగించి చిన్న చిన్న నిర్మాణాలకు ప్రయత్నించి విజయం సాధించారు. ముందుగా తయారు చేసిన ఫ్రేమ్‌వర్క్‌పై ఈ డ్రోన్లు అడుసును చల్లుతాయి. మారుమూల ప్రాంతాల్లో చౌకగా ఆవాసాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని అంచనా. ఫ్రేమ్స్‌ను అతి తక్కువ శ్రమతో సిద్ధం చేసుకోవచ్చునని, మట్టి, సున్నం, ఇసుక, నూనెలు వంటి వాటిని వేర్వేరు మోతాదుల్లో కలుపుకోవడం ద్వారా బయోషాట్క్రీట్ తయారు చేసుకోవచ్చునని. త్వరగా దృఢంగా మారిపోయే వీటితో ఆవాసాల నిర్మాణం బాగా జరుగుతుందన్నారు. -
వడ్డీ కాసుల భారం
సాక్షి, హైదరాబాద్: అవినీతి అధికారుల కక్కుర్తితో నిలువునా మునిగిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారింది. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తుండటంతో రూ.కోట్ల భారం పడుతోంది. ప్రతినెలా దీని అప్పులకే రూ.1.4 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అయినా మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం నష్టాలను మరింత పెంచేస్తోంది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో భారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. బండ్లగూడలో 2,600 అపార్ట్మెంట్లు, పోచారంలో 2,200 అపార్ట్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని అమ్ముడుపోగా మిగతావి అలాగే ఉండిపోయాయి. ఉమ్మడి ఏపీలో దీన్ని పర్యవేక్షించిన కొందరు ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇళ్ల నిర్మాణ వస్తువుల ధరలు పెరిగాయని, కూలీ రేట్లు పెరిగాయంటూ భారీగా నిధులు నొక్కేశారు. దాదాపు రూ.150 కోట్లు కొల్లగొట్టారు. నాటి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో అధికారుల ఆటలు సాగాయి. ఆ నష్టాన్ని పూడ్చే క్రమంలో ఒక్కసారిగా ఆ ఇళ్ల ధరలు విపరీతంగా పెంచారు. దీంతో జనం ఇళ్లను కొనేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా ఆ ఇళ్లు అలాగే మిగిలిపోయాయి. రూ.200 కోట్ల అప్పులు..: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులపై రూ.200 కోట్ల బ్యాంకు అప్పు ఉన్నట్లు తేలింది. దీనిపై 8.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అయితే ఆ ఇళ్ల ధర తగ్గించి మార్కెట్ ధర ప్రకారం అమ్మితే కొనుగోళ్లు పెరుగుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. వాటిని చవకగా ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇంకా తక్కువ ధరకు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అంత తక్కువకు అమ్మితే భారీ నష్టం వస్తుందని అధికారులు చెప్పినా ప్రభుత్వం చవక ధరలనే ఖరారు చేసింది. అయినా కానీ ఆ ధర మరింత తగ్గించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీంతో ఎటూ తేలక పెండింగులో పడిపోయింది. ఇదంతా బాగానే ఉన్నా అప్పులపై వడ్డీ రోజు రోజుకు కొండలా పెరిగిపోతోంది. తాజాగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు గాను రూ.4.24 కోట్ల వడ్డీ విడుదల చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
నిర్వాసితులతో పరిహాసం
►పునరావాసం కింద అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు ►ఒక్కోఇంటి నిర్మాణానికి రూ.2 లక్షల వ్యయం ►మొత్తం నిర్వాసిత కుటుంబాలు 29,545 ►పాఠశాలల్లో మరుగుదొడ్లకు రూ.1.85 నుంచి రూ. 7.5 లక్షల వ్యయం ►నిర్వాసితులకు నిర్మించే ఇళ్ల విలువ రూ.2 లక్షలే ►సర్కారు చిన్నచూపుపై విమర్శలు వేలేరుపాడు : సొంత గూడు చెదిరిపోతున్న పోలవరం నిర్వాసితులను కష్టాల పీడ కలలా వెంటాడుతూనే ఉంది. అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం నిర్వాసితులను చిన్నచూపు చూస్తోంది. ఇక్కడ ఎవరూ అడిగే వారు లేరనే ధోరణిలో వ్యవహరిస్తోంది. మెజార్టీ గిరిజనులు నిరుపేదలు, నిరక్ష్యరాస్యులు కావడంతో వారి బలహీనతలను ఆసరాగా తీసుకొని, నామమాత్రపు పరిహారాలతో చేతులు దులుపుకుంటోంది. తమకు అన్యాయం జరుగుతోందని ఒక వైపు నిర్వాసితులు అనేక సందర్భాల్లో గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాధులే కరువయ్యారు. ఇన్నాళ్ళు తమకు ఏదో రకంగా న్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నిర్వాసితులు కొండంత విశ్వాసంతో ఉన్నారు. తమకిచ్చే రెండు లక్షల విలువ చేసే ఇళ్లు చూసి, తాము నివశించబోయే ఇల్లు మరుగుదొడ్డి విలువ కూడా చేయదా అని కుమిలిపోతున్నారు. గ్రామాల్లో విశాలమైన ఇండ్లల్లో ప్రశాంతంగా బతికే నిర్వాసితులు ఆ కాస్త మనశ్శాంతి కూడా కోల్పోయో పరిస్ధితులు నెట్టుకొస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29,545 కుటుంబాలు నిర్వాసితులు కానున్నాయి. ఇందులో పదివేల గిరిజన కుటుంబాలుండగా, 19,545 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలున్నాయి. ఈ రెండు మండలాల్లో నిర్వాసితులు సర్వస్వం కోల్పోయి, ఆకస్మిక అగ్ని బాధితుల్లా కట్టుబట్టలతో బయటికొచ్చే పరిస్థితి. ముంపు మండలాల వాసులు తాము ఇక ముందు రెండులక్షల వ్యయంతో నిర్మించే ఇరుకిరుకు బందీ ఖానాల్లో ముడుచుకు పడుకోవాల్సివస్తుందనే దుస్దితి జీర్ణించుకోలేకపోతున్నారు. ముంపు మండలాల్లో ఏ గ్రామంలో చూసినా, పేద, గొప్ప అన్న తేడాలేకుండా ప్రతి ఇల్లు కనీసం పదిసెంట్ల జాగాలో కొలువుదీరి ఉంటుంది. అయితే పోలవరం ప్రాజెక్ట్ పుణ్యమా అని ఇదంతా ఒక కలలా, ఒక గతంలా మారిపోబోతోంది. ఇంత విశాలంగా జీవించిన ప్రజల్ని ప్రభుత్వం గిరిజనులకు ఐదు, గిరిజనేతరులు మూడు సెంట్ల జాగాల్లో మగ్గిపోవాలని నిర్దేశిస్తోంది. మరుగుదొడ్లకు అయ్యే ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో ఇళ్లు కట్టి æఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ళు కోల్పోయే నిర్వాసితులకు కేవలం రెండు లక్షల వ్యయంతో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పధకం కింద 22 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో చిన్న కాలనీలా ఇళ్లు నిర్మిస్తోంది. విచిత్రమేమిటంటే ప్రాధమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 18 అడుగుల 6అంగుళాల పొడవు, 8 అడుగుల 5అంగుళాల వెడల్పుతో నిర్మించే మరుగుదొడ్లకు మాత్రం లక్షా 85 వేల రూపాయల నుంచి ఏడున్నర లక్షల వరకు వెచ్చిస్తోంది. నిర్వాసితుల విషయాని కొస్తే, రెండు లక్షలు కేటాయించడం ప్రభుత్వ చిన్న చూపునకు నిదర్శనంగా నిలుస్తోంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు అక్కడి ముఖ్యమంత్రి 5లక్షల 4వేలతో నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కానుకగా ఇస్తున్నారు. 560 స్కేర్ ఫీట్ (చదరపు అడుగులు)లలో స్లాబ్ ఏరియా ఉన్న భవనం నిర్మించి, ఆ ఇంటికి మంచినీరు, రహదారి సౌకర్యం కల్పించుకోవడానికి మరో లక్షా25వేలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముంపు ప్రాంతంలో నిర్వాసితుడికి అన్యాయం చేస్తోంది. ఈ నిర్ణయంతో ఈ ప్రాంత నిర్వాసితుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పోలవరంలో 3లక్షల 15 వేలు... ఇక్కడ రెండు లక్షలే.. అంతా ఒకే ముంపు ప్రాంతమైనప్పటికీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. పోలవరం మండలంలో దేవరగొంది, తోటగొంది, రామన్నపేట, చేగుండపల్లి, పైడిపాక, మామిడిగొంది, లింగనపల్లి, దేవీపట్నం మండలంలోని అంగుళూరు గ్రామాల నిర్వాసితులకు 90 జీఓ ప్రకారం ఒక్కోఇంటికి 3లక్షల 15వేల వ్యయంతో కాలనీలు నిర్మించారు. 2015 వ సంవత్సరంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ జీఓ వచ్చేలా చేసారు. ఇక్కడ 315 స్కేర్ ఫీట్ (చదరపు అడుగులు)లలో 17 అడుగుల తొమ్మిది అంగుళాల పొడవు, 17 అడుగుల ఆరు అంగుళాల వెడల్పుతో ముందు హాలు వచ్చేలా కాలనీలు నిర్మించారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు వచ్చేటప్పటికి కేవలం రెండు లక్షలతో సరిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కనీసం 5లక్షల వ్యయంతో గదులు పెరిగేలా ఇళ్లు నిర్మించాలని నిర్వాసితులు కోరుతున్నారు. -
ఇంటి నిర్మాణం బహుభారం
పెరిగిన సిమెంటు, ఐరన్ ధరలు బెంబేలెత్తిపోతున్న నిర్మాణదారులు కలగా మారిన సామాన్యుల సొంతిల్లు భవన నిర్మాణంలో కీలక భూమిక పోషించే సిమెంటు, ఇనుము (ఐరన్) ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల కలగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయి. ధర తక్కువగా ఉన్నపుడు నిర్మాణాలు చేపట్టిన వారు తాజా పరిణామంతో కంగుతిన్నారు. ఉత్పత్తి తక్కువ.. డిమాండ్ ఎక్కువ కావడంతో సిమెంటు, ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడంతో ఐరన్ ధరలను ఆయా కంపెనీలు పెంచేశాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఇనుము, సిమెంట్, ఇతర వస్తువుల ధరలు ఇల్లు నిర్మించాలనుకునే వారిని బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటి వరకు కనిష్ట స్థాయికి పడిపోయిన ఐరన్ ధరలు మళ్లీ పుంజుకున్నాయి. 20 రోజుల వ్యవధిలోనే టన్ను ఐరన్ ధర రూ. 5వేల దాకా పెరిగింది. గతంలో టన్ను ఇనుము ధర రూ. 34 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 38 వేలకు పెరిగింది. మరికొన్ని ప్రముఖ బ్రాండ్ల ఇనుము టన్ను రూ.40 వేల దాకా విక్రయిస్తున్నారు. నెల రోజుల్లోనే సిమెంటు ధర పైపైకి.. నెలరోజుల వ్యవధిలో సిమెంటు బస్తాపై దాదాపు రూ.80 నుంచి రూ.100 దాకా పెరిగింది. పెరిగిన ధరతో బస్తా రూ. 280 నుంచి రూ.360కి చేరింది. పెరిగిన సిమెంట్ ధరల కారణంగా ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. సహజంగా ఈ సీజన్లో సిమెంట్ ధరలు స్థిరంగా ఉండొచ్చని గహæనిర్మాణదారులు భావించారు. మార్కెట్ వర్గాలు సైతం ఊహించని విధంగా సిమెంట్ ధరలు ఒక్కసారిగా పెంచేశారు. సామాన్యుడు రెండు గదుల ఇళ్లు నిర్మిచుకునే పరిస్థితి కూడాలేకుండా పోయింది. ఇంటి నిర్మాణాలు ఆగిపోతే తమ బతుకులు ఎలాగని, పూట ఎలా గడుస్తుందని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం తగ్గింది గత నెలలో రోజుకు సుమారుగా 100 మూటల సిమెంట్ అమ్మేవాళ్లం. కానీ ఈ నెలలో సిమెంట్ ధర విపరీతంగా పెరిగిపోవడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం అతి కష్టం మీద 30 నుంచి 40 మూటల సిమెంట్ అమ్మగలుగుతున్నాం. ధరలు తగ్గితేగాని గిరాకీలు వచ్చేపరిస్థితి లేదు. – నారాయణ, సిమెంట్ వ్యాపారి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు సిమెంట్, ఇనుము ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇనుము, సిమెంట్ ధరలు పెంచడమే కానీ తగ్గించేది లేదు. అప్పులు చేసి అయినా సొంత ఇంటిని కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే మధ్యలో ఇలా ధరలు పెరగడంతో ఆ అప్పు మరింత ఎక్కువవుతోంది. – రామాంజనేయులు, భవన యజమాని -
‘డబుల్’ వేగంతో పనిచేయండి
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు పద్ధతులను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో స్థలాల కొరత ఉన్నందున అపార్ట్మెంట్ పద్ధతిలో మైవాన్ పరిజ్ఞానం వినియోగించి ఇళ్లను నిర్మించాలని, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక కాంట్రాక్టర్లతో ఎక్కడివక్కడ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా ఎమ్మెల్యేలు చొరవ చూపాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక, పనుల అప్పగింత వ్యవహారాలను కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వటంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తున్నందున ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగించిన పద్ధతులకు స్వస్తిపలకాలని ఆదేశించారు. ఆది వారం సాయంత్రం ఆయన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఉన్నతస్థాయిలో సమీక్షించారు. జిల్లాల్లో 2 లక్షలు, హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని, నగరంలోని బస్తీలను కాలనీలుగా మార్చాలని చెప్పారు. ఇందుకోసం అంతర్గత రహదారులు, మంచినీటి వసతి, విద్యుత్, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులును మెరుగుపరచాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. 3 నుంచి 9 అంతస్తులతో ఇళ్లు... కొత్త ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలాలను టీఎస్ఐఐసీ, దిల్, గృహనిర్మాణ సంస్థ పరిధి నుంచి సమీకరించాలని, అవసరమైతే ప్రభుత్వ భూములూ కేటాయించేందుకు సిద్ధమని ముఖ్య మంత్రి కేసీఆర్ వెల్లడించారు. మూడు నుంచి తొమ్మిది అంతస్తులుగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మైవాన్ పరిజ్ఞానాన్ని వినియోగించాలన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ముందుకొచ్చిన సంస్థలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఇళ్ల కోసం ఉచితంగా ఇసుకను అందజేయాలని, సిమెంటు కంపెనీలతో మాట్లాడి ఫ్యాక్టరీ ధరకే అందేలా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న వాంబే, జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లనూ త్వరగా పూర్తి చేయాలన్నారు. రాజీవ్ స్వగృహ ఇళ్లను ప్రభుత్వోద్యోగులు, పోలీసులకు కేటాయించాలని నిర్ణయించినందున అందుకు అవసరమైన కసరత్తును వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్, గృహనిర్మాణశాఖ కార్యదర్శి అశోక్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
'గ్రేటర్ ఎన్నికలకు, నిధులకు ముడి పెట్టొద్దు'
ఢిల్లీ: జీహెచ్ఎంసీ ఎన్నికలకు, నిధులకు ముడి పెట్టొద్దని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి 40 వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. గృహ నిర్మాణం కింద 40వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. టీఆర్ఎస్ నేతలు తమపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని దత్తాత్రేయ మండిపడ్డారు. -
పోలీసు అధికారుల సంఘం హర్షం
సాక్షి, హైదరాబాద్: పోలీసులు, హోంగార్డులకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంపై రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపీరెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్కుమార్సింగ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి బుధవారం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో పోలీసులకు 10 శాతం కేటాయిస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు మూల వేతనంలో 30శాతం అలవెన్సు, పోలీస్ అమర వీరుల కుటుంబాలకు ఇచ్చే ఇంటి స్థలం ఉచిత రిజిస్ట్రేషన్, యూనిఫారాల అలవెన్సు రూ.7,500కు పెంచడం వల్ల పోలీసుల్లో నూతన ఉత్తేజం నింపిందని పేర్కొన్నారు. -
'అనుమతి లేకుండా చంద్రబాబు భవన నిర్మాణం'
-
'అనుమతి లేకుండా చంద్రబాబు భవన నిర్మాణం'
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైదరాబాద్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.65లో ఆయన చేపడుతున్న ఇంటి నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతి మంజూరు కాలేదు. ఈ విషయాన్ని స్వయంగా జీహెచ్ఎంసీయే ప్రకటించింది. ఇప్పటివరకు భవన నిర్మాణానికి పెట్టుకున్న దరఖాస్తును అనుమతించలేదంటూ చెబుతుండగా, తాము రెండు రోజుల క్రితమే ఆ దరఖాస్తును తిరస్కరించామని ఇప్పుడు జీహెచ్ఎంసీ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ దరఖాస్తు తమ వద్ద పెండింగులో లేదని తెలిపాయి. చంద్రబాబు, లోకేష్ మే 18వ తేదీన జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారని, అయితే లే అవుట్ ప్రకారం చూస్తే భవనం ఎత్తు, నిర్మాణ సెట్ బ్యాక్ నిబంధనలకు అనుగుణంగా లేవని జీహెచ్ఎంసీ తెలిపింది. అందుకే తాము ఈనెల 16వ తేదీన చంద్రబాబు, లోకేష్ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించామంది. అయితే.. అనుమతి లేకుండానే అక్కడ భవన నిర్మాణానికి పిల్లర్లు వేశారని, ఇప్పటివరకు దీనిపై వచ్చిన కథనాలు అవాస్తవమని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. అయితే, సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగిస్తున్న భవనాలకు ఆస్తి పన్ను కడితేనే తన ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారంటూ చంద్రబాబు నాయుడు బుధవారం నాడు కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. దాదాపు నెలన్నర నుంచి తన దరఖాస్తును అనుమతించకుండా పెండింగులో ఉంచారని ఆయన అన్నారు. సెక్షన్ 8 అమలులో లేకపోవడం వల్లే హైదరాబాద్ నగరంలో స్వయంగా తాను కూడా ఇబ్బందుల పాలవుతున్నానని చెప్పారు. అయితే ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్ ఉందన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. ఇప్పుడు నిబంధనలను అతిక్రమించడం వల్లే దరఖాస్తు తిరస్కరించినట్లు జీహెచ్ఎంసీ చెప్పడం గమనార్హం. -
గృహాలంకరణ కళాకారుడు.. ఇంటీరియర్ డిజైనర్
అప్‌కమింగ్ కెరీర్: గృహమే కదా స్వర్గసీమ! ఆనందాల పొదరిల్లును నయనానందకరంగా తీర్చిదిద్దుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. ఇంటి లోపలి అలంకరణ కనువిందుగా ఉంటే అలసిన మనసులు సేదతీరుతాయి. ఆనందం, సంతృప్తి కలుగుతాయి. అలాంటి అలంకరణ చేసిపెట్టి, గృహస్థుల మదిని దోచే నిపుణుడు... ఇంటీరియర్ డిజైనర్. మన దేశంలో క్రమంగా డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. ఇంటీరియర్ డిజైనింగ్! నగరాలతోపాటు పట్టణాల్లోనూ ఆధునిక గృహాల నిర్మాణం వేగంగా సాగుతోంది. క్లయింట్ల అభిరుచుల్లో మార్పు వస్తోంది. ఇంటి నిర్మాణంతో పాటు లోపలి అలంకరణకూ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందుకోసం నిపుణులను సంప్రదిస్తున్నారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ఇంటీరియర్ డిజైనింగ్ చేయిస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులను అభ్యసిస్తే ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదు. ఇంటీరియర్ డిజైనింగ్ రంగం నానాటికీ వృద్ధి చెందుతోంది. వ్యక్తిగత నివాస గృహాలతోపాటు కార్పొరేట్ కార్యాలయాల్లోనూ ఇంటీరియర్ డిజైనర్లకు డిమాండ్ పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా డిజైనర్లను విరివిగా నియమించుకుంటున్నాయి. అపార్టుమెంట్లు, విల్లాల్లో అలంకరణ బాధ్యతలను వారికి అప్పగిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే.. ఇంట్లో ఫర్నీచర్‌ను, వస్తువులను అటూఇటూ మార్చేయడం కాదు. ఇది సృజనాత్మకతతో కూడిన వృత్తి. ఇది ఒక కళ. ఇంటీరియర్ డిజైనర్‌గా వృత్తిలో రాణించాలంటే.. సృజనాత్మకత, కష్టపడేతత్వం తప్పనిసరిగా ఉండాలి. క్లయింట్ల అభిరుచులను, అవసరాలను గ్ర హించే నేర్పుతో పనిచేస్తే మెరుగైన ఆదాయం ఆర్జించొచ్చు. అర్హతలు: ఇంజనీరింగ్/ఆర్కిటెక్చర్ కోర్సులను చదివినవారు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సును కూడా పూర్తిచేస్తే కెరీర్ మెరుగ్గా ఉంటుంది. ఇంటర్, డిగ్రీ తర్వాత కూడా 6, 12 నెలల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇలాంటి వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజైన్ స్కూల్స్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులను, ఇంటీరియర్ డిజైనింగ్ స్పెషలైజేషన్‌గా మాస్టర్స్(ఫైన్ ఆర్ట్స్) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు: ఇంటీరియర్ డిజైనర్లకు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత సీనియారిటీని బట్టి వేతనం పెరుగుతుంది. సొంతంగా డిజైనింగ్ సంస్థను ఏర్పాటు చేసుకుంటే నెలకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల దాకా ఆదాయం కళ్లజూడొచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు 1. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.iiiddelhi.org/ 2. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.nift.ac.in/delhi/ 3. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.iiftindia.net/ సృజనాత్మకతే కెరీర్‌కు ప్రాణం ‘‘విభిన్నమైన వృత్తి ఇంటీరియర్ డిజైనర్. నిర్మాణ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదు. ఆసక్తి, సృజనాత్మకంగా ఆలోచించే నేర్పు ఉంటే చాలు. ఐదేళ్ల బీఆర్క్తో అందమైన కెరీర్‌ను నిర్మించుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ తర్వాత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు సమయంలోనే చిన్నపాటి ప్రాజెక్టులతో నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సమాజంలో పరిచయాలు, పలుకుబడి పెరిగేకొద్దీ ప్రొఫెషనల్‌గా స్థిరపడవచ్చు. ఉద్యోగిగా సీనియారిటీ ఆధారంగా వేతనాలు పెరుగుతాయి. ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం అందుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇంటీరియర్ డిజైనర్లకు మరింత డిమాండ్ ఉంటుంది’’ -ఎస్.శ్రీకర్, ఇంటీరియర్ డిజై నర్, బంజారాహిల్స్ -
సొంతింటి జీవనం.. రాజన్నతో సాకారం
మహానేత హయాంలో 3.29 లక్షల గృహ నిర్మాణాలు రూ. 990 కోట్ల వ్యయం బాబు పాలనలో ఏటా 500 గృహాలకు మించనివైనం కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : పూరిగుడిసెల్లో ఇబ్బందులు పడ్డ కుటుంబలు.. అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్న నిరుపేదల సొంతింటి కలను మహానేత వైఎస్సార్ సాకారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను గుడిసెలేని రాష్ట్రంగా చేయాలన్న లక్ష్యంతో 2004 ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా 2005-06లో ఇందిరమ్మ పథకానికి శ్రీకారం చుట్టారు. తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో గూటి వసతికి నోచుకోని లక్షలాది మందికి ఆశ్రయం కల్పించారు. జిల్లాకు సంబంధించి మొదటి మూడు విడతల్లో రూ.990,30,92,576 వ్యయంతో 3,29,567 ఇళ్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యవైఖరి కారణంగా ఇందులో వేలాది నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఫలితంగా జిల్లాలో గృహ నిర్మాణ పథకం ఆటుపోట్ల మధ్య అపసోపాలు పడుతోంది. వైఎస్ మరణం తర్వాత తారుమారు.. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇంటి నిర్మాణం ప్రారంభమై పూర్తయ్యేలోగా దశల వారీగా బిల్లుల చెల్లింపులు జరిగేవి. పునాదులు పడగానే మొదటి బిల్లు చేతికి వచ్చేది. ఆయన మరణం తర్వాత పరిస్థితి తారుమారైంది. హైదరాబాదులోని ఎండీ కార్యాలయం నుంచే అనుమతి లభించేలా చేసినా బిల్లుల మంజూరులో జాప్యం తప్పడం లేదు. ప్రస్తుతం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చెల్లింపులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతోపాటు సిమెంటు, ఐరన్ తదితర సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో ఆ మేరకు వ్యయం కూడా పెరిగి లబ్ధిదారులు మధ్యలోనే నిలిపేసిన సందర్భాలున్నాయి. చంద్రబాబు పాలనలో ఏడాదికి 500 ఇళ్లే దిక్కు.. చంద్రబాబు తన పాలనలో గృహ నిర్మాణాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఎక్కడ చూసినా గుడిసెలే కనిపించేవి. అప్పట్లో ఒక్కో నియోజకవర్గానికి 500 నుంచి 1000 గృహాలను మాత్రమే మంజూరు చేసేవారు. వీటిలో అధిక శాతం తెలుగు తమ్ముళ్లకు చెందిన వారికే దక్కేవి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసులుంటే తప్ప గృహం మంజూరు కాని పరిస్థితి ఉండడంతో ఇంటి నిర్మాణం అంటే పేదవారు భయపడేవారు. కిరణ్ పాలనలోనూ అంతంతే మహానేత మరణం తర్వాత వచ్చిన రోషయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి తూతూమంత్రంగా రచ్చబండ ద్వారా లక్షల సంఖ్యలో అర్జీలు స్వీకరించినా అధికశాతం మందికి మొండి చెయ్యి చూపించారు. కిరణ్ హయంలో మూడు విడతలుగా రచ్చబండ జరిగితే మంజూరైంది 90 వేల గృహాలు మాత్రమే. వీటిలో కూడా అధికారిక అనుమతి లభించాల్సినవి వేలల్లోనే ఉన్నాయి. బిల్లుల చెల్లింపులకు అనేక నిబంధనలు విధించడంతో లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. దీనికితోడు సిమెంటు సహా గృహ నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. సొంతింటి కల నెరవేర్చారు ఆటో తప్ప వేరే ఆధారం లేని నేను కుటుంబంతో సహా కూలేందుకు సిద్ధంగా ఉన్న మట్టి మిద్దెలో ఉంటిమి. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత గృహం మంజూరైంది. ఆయన దయ వల్ల ఇల్లు కట్టుకున్నాం. - ఎర్రన్న, సీ బెళగల్ -
ఇంటి రుణం@ 5%
అల్పాదాయ తరగతుల కోసం కేంద్రం పథకం రూ.ఐదు లక్షల రుణం వరకే ఐదుశాతం వడ్డీ పరిమితం స్థలం ఉన్నా, ఫ్లాట్ కొంటున్నా రుణమిస్తారు.. సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో సామాన్య ప్రజ లు ఎదుర్కొంటున్న సొంతగూడు ఇబ్బందులు దూరం కానున్నాయి. గృహనిర్మాణంకోసం వీరికి అతి తక్కువగా ఐదుశాతం వడ్డీకే రుణాలందజేయాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్-ఈడబ్ల్యూఎస్), అల్పాదాయవర్గ తరగతుల(లో ఇన్‌కం గ్రూప్-ఎల్ఐజీ) ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ స్కీము ఇప్పటినుంచి 2017 మార్చి వరకు అమలుకానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ వర్గాలవారు గృహ నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే.. కేంద్రం తన నోడల్ ఏజెన్సీద్వారా వడ్డీ సబ్సిడీని నేరుగా సదరు బ్యాంకులకు జమ చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఐదుశాతం వడ్డీ రూ.ఐదు లక్షల వరకే పరిమితం.. ఐదు శాతం వడ్డీ సబ్సిడీ రూ.ఐదు లక్షల రుణం వరకు మాత్రమే వర్తిస్తుంది. ఐదు లక్షలకంటే ఎక్కువ తీసుకున్నపక్షంలో.. మిగిలిన మొత్తానికి సాధారణ వడ్డీ చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రజలకు కనీసం 29 చదరపు మీటర్ల స్థలం కార్పెట్ ఏరియా ఉండాలని, అదే ఎల్ఐజీ వర్గాల గృహానికైతే 40 చదరపు మీటర్ల స్థలం కార్పెట్ ఏరియా ఉండాలని నిబంధన విధించింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వైకల్యమున్నవారికి ఈ రుణాల్లో ప్రాధాన్యమివ్వనున్నట్టు వెల్లడించింది. లబ్ధిదారులకు నేరుగా సబ్సిడీ ఇవ్వకుండా కేంద్రం ఎంపిక చేసిన జాతీయ గృహ బ్యాంకు(నేషనల్ హౌజింగ్ బ్యాంక్), హడ్కోల నుంచి ప్రతి మూడు నెలలకోమారు ఈ సబ్సిడీ వడ్డీని వాణిజ్య బ్యాంకులకు బదిలీచేస్తారు. లబ్ధిదారులు ప్రతినెలా చెల్లించే వాయిదా(ఇన్స్టాల్మెంట్)లో ఈ సొమ్మును మినహాయించి మిగతా మొత్తాన్ని వాణిజ్య బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. ఈ పథకాన్ని రాజీవ్ లోన్ స్కీమ్ లేదా రాజీవ్ రిన్ యోజన(ఆర్ఆర్వై) పథకంగా పరిగణిస్తున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ పేర్కొంది. కేంద్రప్రభుత్వం జాతీయ పట్టణ నవీకరణ పథకం, గృహనిర్మాణ పథకాలను దీనికి అనుసంధానం చేయనున్నట్టు తెలిపింది. అర్హులు వీరే... తలసరి ఆదాయం రూ.లక్ష ఉన్న ఈడబ్ల్యూఎస్ వర్గాలు, రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలలోపు ఆదాయమున్న ఎల్ఐజీ వర్గాలవారు అర్హులు. ఆయా పట్టణాలు, నగరాల్లో స్థలం ఉండి.. కుటుంబంలో ఎవరి పేరిటా ఇల్లు లేనివారు మాత్రమే అర్హులు. ఒకవేళ ఇంటిస్థలం లేనిపక్షంలో, కొనడానికి సిద్ధంగా ఫ్లాట్ ఉన్నా.. రుణం మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ వర్గాలకు రుణాలివ్వడానికి వాణిజ్య బ్యాంకులు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ సూచించిం ది. రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆ ఆస్తిని తనఖా పెట్టుకోవచ్చని, కానీ థర్డ్‌పార్టీ గ్యారంటీ అడగరాదని, కొల్లాటరల్ సెక్యూరిటీ కోరరాదని బ్యాంకులకు సూచించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని 15 ఏళ్లల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. రాష్ట్రప్రభుత్వాలు గృహ రుణాలు కోరేవారికోసం పట్టణాలు, నగరపాలక సంస్థల్లో ప్రత్యేకంగా అధికారులను నియమించి, దరఖాస్తులు స్వీకరించి వాటిని బ్యాంకులకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పట్టణాలు, నగరాల్లో గృహవసతి లేక సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ఈ పథకాన్ని ప్రోత్సహించాలని సూచించింది.