సాక్షి, అమరావతి: కృష్ణారామా అనుకోవాల్సిన వృద్ధాప్యంలో ఈనాడు రామోజీరావు నిత్యం కడుపుమంటతో రగిలిపోతున్నారు. సీఎంగా వైఎస్ జగన్‌ను ఒక్క నిమిషం కూడా ఊహించుకోలేకపోతున్నారు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య కథనాలను వండి వార్చడమే పనిగా పెట్టుకుని పనికిమాలిన రాతలు రాస్తున్నారు. నిరుపేదలకు ఇళ్ల కట్టించి ఇవ్వడమే మహా పాపమైనట్లు తెగ గగ్గోలు పెడుతున్నారు.
ఈ విషయంలో న్యాయపరంగా ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నీ కల్పించినా ఎల్లో ముఠా ఆటలు సాగలేదు. అయినా గాలి కబుర్లను పోగేస్తూ అసత్య కథనాలను అడ్డగోలుగా అచ్చేస్తున్నారు. ఇందులో భాగమే తాజాగా రామోజీ కక్కిన ‘సెంటు పట్టా.. అక్రమాల చిట్టా!.. కథనం. జాబితాలో భారీగా అనర్హులకు చోటు అంటున్న ఆ అబద్ధాల పుట్టలో వాస్తవాలేమిటంటే..
రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదకు పక్కా ఇల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం. అందుకోసం పేదరికమే అర్హతగా అన్ని వర్గాల్లోను ఇళ్లు లేని నిరుపేదలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా 30.65 లక్షల ఇంటి పట్టాలను మహిళల పేరు మీద ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇప్పటికే 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇందులో 6 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి కూడా.
ఇప్పుడు ఈ పేదలకు ఇంతలా మేలు జరుగుతుంటే ‘ఈనాడు’ పత్రిక భరించలేకపోతోంది. కడుపు మంటతో తప్పుడు రాతలకు తెగబడింది. సీఆర్డీఏ పరిధిలో అనర్హులకు స్థలాలు ఇచ్చారంటూ ఆధారాల్లేకుండా గాలి కబుర్లను పోగేసి అచ్చేసింది. వాస్తవానికి.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. వీరెవరికీ గతంలో ఇల్లుగాని, ఇంటి స్థలంగాని లేదు. అర్హుల జాబితాను అన్ని వివరాలతో ఆన్లైన్లో పెట్టి, అనేక వడపోతల అనంతరమే ఎంపిక చేశారు. అయినా రామోజీ ఏడుపు మామూలుగా లేదు.
పేదలకు ఇంటి స్థలం ఇవ్వొద్దని 26 కేసులు..
నిజానికి.. ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకంపై ఈనాడు మొదటి నుంచి అసత్య కథనాలే ప్రచురిస్తోంది. గత ప్రభుత్వంలో భూమిని సేకరించి లబ్ధిదారులకు ఒక్క పట్టా ఇచ్చిన సందర్భం లేకపోయినా ఏనాడూ ఒక్క వార్త కూడా రాయకపోగా కనీసం నాటి ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించలేదు. ఈరోజు అభూత కల్పనలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పేదలకు ఇంటి స్థలం ఇవ్వడం నేరమంటోంది.
ఈ ఉద్దేశంతోనే సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని ఎల్లో గ్యాంగ్ వివిధ కోర్టుల్లో ఇప్పటివరకు 26 కేసులు వేసింది. వీటన్నిటినీ సీఎం వైఎస్ జగన్ సర్కారు అధిగమించి ఈ ప్రాంతంలో 1,402.58 ఎకరాలను ఆర్–5 జోన్‌గా చట్టప్రకారం ప్రకటించి, 25 లేఅవుట్లను అభివృద్ధి చేసింది.
ఈ ఏడాది మే 26న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 50,793 మంది నిరుపేద అర్హులకు అక్కడ పట్టాలను పంపిణీ చేశారు. వీరిలో గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మంది, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ గతంలో ఇంటి స్థలం తీసుకున్నది లేదు. వీరెవ్వరికీ సొంత ఇల్లూ లేకున్నా నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లే పనికి రామోజీ దిగజారారు.
మరోసారి ‘ఈనాడు’ అక్కసు
నిజానికి.. సీఆర్డీఏ పరిధిలో నిరుపేదలు ఉండకూడదన్నది పచ్చ ముఠా లక్ష్యం. అందుకోసం ముందునుంచీ ఈ విషయంలో రామోజీ తప్పుడు కథనాలు ప్రచురిస్తూనే ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చేతుల మీదుగా సోమవారం ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న తరుణంలో ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును తట్టుకోలేక మరో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. వాస్తవానికి కుల, మత, ప్రాంతం చూడకుండా ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో కేవలం అర్హతే కొలమానంగా లబ్ధిదారులను గుర్తించింది.
నిర్దిష్ట అర్హతలు ఉంటేనే ఎంపిక..
ఇంటి పట్టా అర్హతలపై 2019 ఆగస్టులోనే జీఓ ఎంఎస్–367ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. అందులో ఏం పేర్కొన్నారంటే..
♦ ఎవరైనా ప్రభుత్వం ఇచ్చే ఇల్లును పొందాలంటే గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తరువాత, ఆ జీఓలో తెలిపిన ప్రమాణాల ఆధారంగా ‘అర్జీదారు కుటుంబాన్ని’ యూనిట్‌గా తీసుకుని ధ్రువీకరిస్తారు. అర్జీదారుని ఆర్థిక స్థితి, భూమి విస్తీర్ణం, ఉద్యోగ పరిస్థితి, గృహ విద్యుత్ వాడకం, పట్టణ ప్రాంతంలో ఉన్న గృహ విస్తీర్ణం, నాలుగు చక్రాల వాహనం ఇలా.. అర్హతలను బట్టి అర్హుడా కాదా అని తేలుస్తారు.
♦ ప్రాథమికంగా వారి అర్హతను గుర్తించాక క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది దరఖాస్తుదారు పరిస్థితిని పరిశీలించి ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు. తర్వాత తహశీల్దారు పరిశీలిస్తారు.
♦ ఇలా వివిధ స్థాయిల్లో వడపోత అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ప్రదర్శిస్తారు. ఎవరైనా ఈ జాబితాపై అభ్యంతరం తెలియజేస్తే వాటిని పరిశీలించిన తర్వాత తుది జాబితా రూపొందిస్తారు.
♦ ఇప్పుడు లబ్ధిపొందిన వారి జాబితాను 2020 డిసెంబర్ నాటికి మొత్తం విచారణ ప్రక్రియ పూర్తిచేసి తుది జాబితాను రూపొందించారు.
♦ అప్పట్లో కోర్టు కేసులు ఉన్న కారణంగా కోర్టు ప్రక్రియ పూర్తయ్యాక ఇంటి పట్టా ఇస్తామని సీఎం పేరిట లబ్ధిదారులకు లేఖ కూడా ఇచ్చారు.
♦ మూడేళ్ల అనంతరం అన్ని కోర్టు చిక్కులూ అధిగమించి లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ
చేశారు. ఇదేకాక.. ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులుగా గుర్తిస్తే వారందరికీ ఇదే ప్రక్రియలో ఇక్కడే ఇంటి పట్టాలనూ ఇచ్చారు.
♦ ఇక ఈ లేఅవుట్లలో రూ.385.52 కోట్లతో మౌలిక వసతులు, రూ.73.74 కోట్లతో సామాజిక వసతులు (అంగన్‌వాడీ, స్కూల్, ఆసుపత్రి), రూ.1,081.39 కోట్లతో ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సోమవారం ప్రారంభించనున్నారు. దీంతో రామోజీ మరోసారి దుగ్థతో విషం కక్కుతున్నారు.
ఈ అర్హతలు ఉంటేనే స్థలం లేదా ఇల్లు..
ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు నిర్దిష్టమైన అర్హతలు రూపొందించింది. అవి..
గ్రామీణ ప్రాంతాల్లో..
♦లబ్ధిదారు దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉండాలి. వారి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లుగాని ఇంటి స్థలంగానీ ఉండరాదు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏ హౌసింగ్ పథకంలోను లబ్ధిపొంది ఉండకూడదు.
♦లబ్ధిదారునికి 2.5 ఎకరాల మాగాణి, లేదా ఐదెకరాల మెట్టభూమి మించి ఉండకూడదు.
♦ ఆధార్ కార్డు తప్పనిసరి.
♦ అన్ని వివరాలు లబ్ధిదారు అనుమతితోనే అధికారులు సేకరిస్తారు.
పట్టణ ప్రాంతంలో..
♦ లబ్ధిదారునికి పై అర్హతలతో పాటు కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించి ఉండకూడదు.
Comments
Please login to add a commentAdd a comment