Is Actor Naga Chaitanya Built Luxury Bungalow In Hyderabad, Deets Inside - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: ఓ ఇంటివాడైన చై! నాగార్జున ఇంటికి సమీపంలోనే మకాం?

Published Fri, Mar 17 2023 3:17 PM | Last Updated on Fri, Mar 17 2023 7:36 PM

Is Naga Chaitanya Built Luxury Bungalow In Hyderabad - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య ఫలితాలతో సంబంధం లేకుండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సమంతతో విడాకుల అనంతరం కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన చై భాషతో సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్ట్స్‌కు ఒకే చెబుతున్నాడు. ఇటీవల లాల్‌ సింగ్‌ చడ్డాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన చై తాజాగా ‘కస్టడీ’తో కోలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. తమిళ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 

చదవండి: నరేష్‌తో పెళ్లి.. పవిత్ర లోకేష్‌పై మాజీ భర్త సంచలన ఆరోపణలు!

ఈ తాజా బజ్‌ ప్రకారం నాగ చైతన్య ఓ ఇంటివాడు అయినట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం సమంతతో కలిసి ఉన్న ఇంటి నుంచి బయటకు వచ్చిన చై హోటల్‌లోనే ఉంటున్నాడట. ఈ క్రమంలో చై తన టేస్ట్‌కు తగ్గట్టుగా హైదరాబాద్‌లో ఓ స్థలం కొని లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల గృహప్రవేశం కూడా చేసినట్టు ఫిలిం సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తండ్రి నాగార్జున ఇంటికి సమీపంలోనే ఈ ఇంటిని నిర్మించుకున్నాడని సమాచారం. తనకి నచ్చిన విధంగా విలాసవంతమైన సౌకర్యాలతో చై ఈ కొత్తని ఇంటిని స్పెషల్‌గా డిజైన్‌ చేయించుకున్నాడట.

చదవండి: అమెరికాలో లగ్జరీ బంగ్లా రెంట్‌కు తీసుకున్న ఉపాసన! ఎందుకంటే..

ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ ధియేటర్ కూడా ఉన్నాయట. ఇలా సకల సౌకర్యాలు ఉండేలా విలాసవంతమైన గృహాన్ని నిర్మించుకున్న చై పది రోజుల క్రితమే గృహ ప్రవేశం కూడా చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నాగ చైతన్య స్పందించేవరకు వేచి చూడాల్సిందే. కాగా గతంలో చై గచ్చిబౌలిలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి అదే స్థలంలో చై ఈ కొత్త ఇల్లు నిర్మించుకున్నట్టు సమాచారం. (చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement