రాష్ట్రంలో అందుబాటులోకి కొత్త తరహా ఇళ్ల నిర్మాణం
నాసా స్పేస్ టెక్నాలజీతో అభివృద్ధి
స్పేష్ షిప్‌లో ఉన్న అనుభూతి
ఒక చోట నుంచి మరో చోటకు తరలించే అవకాశం
సాక్షి, అమరావతి: ఈ ఇంటిని చూస్తే.. సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలో ఇంటిలాగానో, అంతరిక్ష ప్రయోగానికి సిద్ధం చేసిన స్పేస్ షిప్‌లాగానో ఉంది కదూ! ఈ ఇంటి లోపల చూస్తే నిజానికి అదే అనుభూతి కలుగుతుంది. స్పేస్ కాప్సూల్ హౌస్‌గా పిలిచే ఈ ఇంటిని 20 ఏళ్ల క్రితం ‘నాసా’ స్పేస్ టెక్నాలజీతో తయారు చేశారు. ఈ తరహా మోడల్ హౌసెస్ సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలైన మార్వెల్ మూవీస్‌లో సైతం కన్పిస్తుంటాయి. అమెరికాలో అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని చైనా శాస్త్రవేత్తలు అందిపుచ్చుకొని విశ్వవ్యాప్తం చేశారు.
ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే సాంకేతిక, పరికరాలన్నీ చైనా నుంచే ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికాతో పాటు చైనా, యూరప్, గల్ఫ్ దేశాల్లో విస్తృతంగా వాడుకలోకి ఉన్న ఈ ఇళ్ల నిర్మాణ టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అందుబాటులోకి వచి్చంది. రాజమహేంద్రవరానికి చెందిన సీబాక్స్ హౌసెస్ కంపెనీ రాష్ట్రానికి ఈ కొత్త ఇళ్లను పరిచయం చేసింది.
ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ అంతా విదేశాల నుంచే దిగుమతి చేసుకున్నదే. ఇంటి అవుట్‌సైడ్ బాడీ అల్యూమినియంతోనూ, ఇన్‌సైడ్ బాడీ స్ట్రక్చర్ పూర్తిగా గల్వనైజ్డ్ ఐరన్‌తోనూ నిరి్మస్తారు. ఇక తలుపులు, కిటికీల కోసం గట్టిగా ఉండే అత్యాధునిక ప్లాస్టిక్ ఉడ్‌ని వాడుతున్నారు. 500 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు.. కావాల్సిన మోడల్స్‌లో సింగిల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్, ట్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని అత్యంత సులువుగా నిరి్మంచుకోవచ్చు.
45 రోజుల్లో ఇంటి నిర్మాణం
ఇంటి నిర్మాణానికి కేవలం 45 రోజుల సమయం పడుతుంది. మోడల్‌ను బట్టి రూ. 25 లక్షల నుంచి రూ. 55 లక్షల వరకు అవుతుంది. ఇవి 50 ఏళ్ల వరకు చెక్కుచెదరవు. క్రేన్ సహాయంతో కంటైనర్లు తరలించే భారీ లారీలపై ఒకచోట నుంచి మరొక చోటకు అత్యంత సులభంగా తరలించుకుపోవచ్చు. మైదాన ప్రాంతాల కంటే కొండ ప్రాంతాల్లో నిరి్మంచుకుంటే ఆకర్షణీయంగా ఉంటాయి. ఫామ్ హౌసెస్, రిసార్ట్స్ నిర్మాణానికి ఇవి ఎంతగానో అనుకూలం.
మడత పెట్టే ఫోల్డెడ్ హౌసెస్
మడత పెట్టే కురీ్చలు, మంచాల మాదిరిగానే దేశంలోనే తొలిసారి మడతపెట్టే పోల్డెడ్ హౌసెస్ కూడా మన రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. కేవలం గంటలోనే వీటిని ఫిక్స్ చేయవచ్చు. 1 బీహెచ్‌కే నుంచి 4 బీహెచ్‌కే ఫోల్డబుల్ హౌసెస్ నిర్మించుకోవచ్చు. వీటి నిర్మాణానికి జీఏ మెటీరియల్‌ను వినియోగించడం వలన చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కేవలం రూ. 11.5 లక్షల్లోనే ఆకర్షణీయమైన ఇల్లు అందుబాటులోకి వస్తుంది.
కంటైనర్ హౌసెస్ కాదు
» ఇవి కంటైనర్ హౌసెస్ లాంటివి కాదు. పూర్తి రక్షణతో కూడుకున్న గృహాలు.
» ఇవి సన్ ప్రూఫ్‌తో పాటు ఫైర్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్ కూడా. నిర్మాణంలో అన్‌బ్రేకబుల్ డీజే గ్లాసెస్‌ను వినియోగిస్తున్నారు.
» సెంట్రలైజ్డ్ ఏసీతో పాటు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా తనకు తానుగా మార్చుకునే ఆటో టెంపరేచర్ కంట్రోల్ ఫ్లోర్ ఈ ఇంటి ప్రత్యేకం.
» ఆహ్లాదం గొలిపేలా అత్యంత ఆకర్షణీయమైన రీతిలో ఇంటీరియర్స్ ఉంటాయి.
» అత్యంత లగ్జరీగా ఉండే లివింగ్ రూమ్, కిచెన్, బెడ్‌రూమ్స్, బాత్ రూమ్స్, స్మార్ట్ టాయిలెట్, రిమోట్‌తో పనిచేసే ఆటోమేటిక్ కర్టెన్స్, విద్యుత్ దీపాలు, ఫ్యాన్‌లు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ ఇళ్ల సొంతం.
దేశంలోనే తొలి ప్రయోగం
ఏడాది క్రితం చైనాకు వెళ్లినప్పుడు ఈ తరహా మోడల్స్ చూశాం. చాలా బాగున్నాయనిపించి వీటిని మన దేశానికి తీసుకురావాలన్న సంకల్పంతో సీబాక్స్ హోమ్స్‌ను ప్రారంభించాం. మన దేశంలో స్పేస్ టెక్నాలజీతో ఈ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టడం ఇదే తొలిసారి. మెటీరియల్ పూర్తిగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి 8 ఇళ్ల నిర్మాణానికి ఆర్డర్స్ వచ్చాయి.
రాజమహేంద్రవరంలోని జేఎన్‌రోడ్‌లో మోడెల్ హౌసెస్‌ను ఏర్పాటు చేశాం. వీటితో పాటు ఫోల్డెడ్ హౌసెస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ తరహా ఇళ్ల నిర్మాణం దేశంలో మరెక్కడా అందుబాటులో లేవు. ఏడాది పాటు సరీ్వస్ పూర్తిగా ఉచితం. ఆ తర్వాత సరీ్వస్ చార్జీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణం కోసం చైనాలో శిక్షణ పొందిన 10 మంది సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉన్నారు. – ఎం.ప్రదీప్, మేనేజర్, సీబాక్స్ హోమ్స్
Comments
Please login to add a commentAdd a comment