సాక్షి, హైదరాబాద్: పోలీసులు, హోంగార్డులకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంపై రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపీరెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌సింగ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి బుధవారం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు.
డబుల్ బెడ్రూం ఇళ్లలో పోలీసులకు 10 శాతం కేటాయిస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు మూల వేతనంలో 30శాతం అలవెన్సు, పోలీస్ అమర వీరుల కుటుంబాలకు ఇచ్చే ఇంటి స్థలం ఉచిత రిజిస్ట్రేషన్, యూనిఫారాల అలవెన్సు రూ.7,500కు పెంచడం వల్ల పోలీసుల్లో నూతన ఉత్తేజం నింపిందని పేర్కొన్నారు.
పోలీసు అధికారుల సంఘం హర్షం
Published Thu, Oct 22 2015 1:38 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement