
ఇప్పటికే బోలెడన్ని రంగాల్లో ఎంతో ఉపయోగపడుతున్న డ్రోన్లను ఇళ్ల నిర్మాణానికీ వాడుకోవచ్చునని నిరూపించారు స్టెఫానీ ఛాల్‌టెయిల్ అనే టెకీ. బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్‌కు చెందిన ఛాల్‌టెయిల్ భవన నిర్మాణ పద్ధతులపై చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని పనులను డ్రోన్ల వంటి యంత్రాలు/రోబోల సాయంతో చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని స్టెఫానీ అంచనా. ఇందులో భాగంగా గత ఏడాది డ్రోన్లకు అడుసుతో కూడిన పైపులు బిగించి చిన్న చిన్న నిర్మాణాలకు ప్రయత్నించి విజయం సాధించారు.
ముందుగా తయారు చేసిన ఫ్రేమ్‌వర్క్‌పై ఈ డ్రోన్లు అడుసును చల్లుతాయి. మారుమూల ప్రాంతాల్లో చౌకగా ఆవాసాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని అంచనా. ఫ్రేమ్స్‌ను అతి తక్కువ శ్రమతో సిద్ధం చేసుకోవచ్చునని, మట్టి, సున్నం, ఇసుక, నూనెలు వంటి వాటిని వేర్వేరు మోతాదుల్లో కలుపుకోవడం ద్వారా బయోషాట్‌క్రీట్ తయారు చేసుకోవచ్చునని. త్వరగా దృఢంగా మారిపోయే వీటితో ఆవాసాల నిర్మాణం బాగా జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment