
'గ్రేటర్ ఎన్నికలకు, నిధులకు ముడి పెట్టొద్దు'
ఢిల్లీ: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు, నిధులకు ముడి పెట్టొద్దని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి 40 వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు.
గృహ నిర్మాణం కింద 40వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. టీఆర్‌ఎస్ నేతలు తమపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని దత్తాత్రేయ మండిపడ్డారు.