‘ఎంఐఎంతో టీఆర్‌ఎస్ రహస్య ఒప్పందం’ | trs party secret deals with aimim says by central minister bandaru dattatreya | Sakshi
Sakshi News home page

‘ఎంఐఎంతో టీఆర్‌ఎస్ రహస్య ఒప్పందం’

Published Fri, Jan 1 2016 6:24 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

‘ఎంఐఎంతో టీఆర్‌ఎస్ రహస్య ఒప్పందం’

‘ఎంఐఎంతో టీఆర్‌ఎస్ రహస్య ఒప్పందం’

కాచిగూడ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంతో టీఆర్‌ఎస్ పార్టీ  రహస్య ఒప్పందం చేసుకోవడం హైదరాబాద్ నగరానికి ప్రమాదకరమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం బర్కత్‌పురలోని బీజేపీ గ్రేటర్ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎంఐఎం కన్నుసన్నల్లో అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయాలతో మహా నగరాన్ని ఉగ్రవాద నిలయంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి అన్నారు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement